Friday, August 30, 2024

****ఒక పల్లెటూరు లో ఒక హోటల్ ఉంది...

 ఒక పల్లెటూరు లో ఒక  హోటల్ ఉంది...
అక్కడకి ఒక సినిమా వాళ్ళు 40మంది
వచ్చారు . అంత మంది ఒకేసారి రావడంతో  ఆ హోటల్ లో జనం అంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు.
సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయి పోతూన్నారు... 

అందరు హోటల్ లో
కూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డెరెక్టర్
గారు వచ్చారు...

అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డెరెక్టర్
గారు అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని
చూసాడు... చూడగానే ఎందుకో ఆ తాత అలా
చూస్తున్నాడు అని తెలుసుకుందాం అని తాతా 
ఇటురా అని పిలిచాడు...

ఏం తాతా భోజనం చేసావా అని అడిగాడు... తాత
చేసానయ్య అని చెప్పాడు...

మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ
కూర్చుని మా అందరిని చూస్తున్నావ్ సినిమా అంటే
నీకు ఇష్టమా అని అడిగాడు...??

అదేం లేదయ్యా అని కొంచెం దీనంగా
మొహం పెట్టి చెప్పాడు...

మరి ఏంటి ఏమైనా
డబ్బు లు కావాలా ఏమన్నా ఉంటే
చెప్పు నేను సహాయం చేస్తా అని అడిగాడు...

అదేం లేదయ్యా .. నేను ఒక్కటి అడగాలి
అనుకుంటున్నా .... అడగనా అన్నాడు ...??

సరే తాత అడుగు ఏంటో అని అన్నాడు...

మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా ఆ సినిమా
ఎవరైనా విడుదల అవ్వక ముందే పైరసీ చేస్తే
ఏం చేస్తారు ...?? అని అడిగాడు.

ఏముంది .... అలా చేసిన వాడిని జైల్లో పెడతాం.. ఇంకా లక్షలో జరిమానా వేస్తారు ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అన్నాడు ...??

అప్పుడు ఆ తాత ...
మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి
సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు...??

అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో
ఆనందం చూడటానికి అని చెప్పాడు గర్వంగా ...

అపుడు తాత అడిగాడు ...... మీరు ఇంత మంది ఇక్కడ
భోజనం చేసారు కదా దాంట్లో అక్కడ చూడు చాల
మంది సగం అన్నంలో చేతులు కడిగేసారు. అందుకే నేను అలా చూస్తున్నా మిమల్ని అని అన్నాడు...

దానికి నీకు అంత బాధ ఎందుకు తాతా ..... ఆ డబ్బులు నువ్వు ఎం కట్టట్లేదుగా.. అవి మా నిర్మాత కడతాడు అని వేలాకోలంగా అన్నాడు...

అపుడు ఆ తాత అన్నాడు... మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా
కట్టిస్తారు... 

కానీ మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా  మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని
పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అన్నాడు...??

డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని
అడిగాడు...??

ఆ తాత ఇలా చెప్పాడు ..... కోట్లు ఉన్న కోటీశ్వరుడు  అయినా, దిక్కు లేని వాడికి అయినా ఆకలి వేస్తుంది కోట్లు ఉన్న వాడు కొనుక్కు తింటాడు, దిక్కు లేని వాడు అడుక్కు తింటాడు... కానీ ప్రతి ఒక్కరు తిండి తినాలి.. ఆకలి తో ఉన్న వాడు ఏదో  ఒక్కసారి అయినా మమ్మల్ని  గుర్తు చేసుకోకపోయినా వారి కడుపు లోని పేగులు గుర్తు చేసుకుంటాయి  అని చెప్పాడు...

అందుకే బాబు .... ఇందాక మీరు సగం అన్నం లో
చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి
చూసానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు...

ఈ దేశం లో ప్రతి రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారిలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు కానీ సినిమా వాళ్ళు కాదు ...

మీరు మా చావుల్ని ఎలాగో అపలేరు కనీసం
భోజనం చేస్తున్నపుడు అయినా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు...

ఈ విషయం మీకు ఎందుకు చెపుతున్నా అంటే
మద్యపానం ఆరోగ్యానికి హానికరం...
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని
సినిమాలో వేస్తారు.. అలాగే ఎక్కడో ఒక్క చోట
అన్నం వృదా చేయటం వల్ల ఒక్క మనిషి కి
అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని
బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు...

No comments:

Post a Comment