ago
🌹గుడ్ మార్నింగ్ 🌹ప్రతి మనిషికి తన లోపల జరిగే అన్నీ తెలుసు.ఆలోచన పుట్టగానే - అది మంచిదా - చెడ్డదా, దానిని చేయవచ్చా - చేయకూడదా అనే యంత్రాంగం మన లోపలే వున్నది. దానిని గమనించి - తప్పు, చెడు, అనిపించిన వాటిని చేయకుండా ఉండగలగటమే అత్యుత్తమ ఆధ్యాత్మిక సాధన.దీనికి మనను మనం గమనించుకోవటం - కాసేపు అంతరంగములో స్థిరముగా ఉండి ఆలోచనలు గమనించటం - ప్రతి రోజు వీలయినంతసేపు ఏకాంతముగా కూర్చొని మనలో మనం - మనతో మనం ఉండటం చేస్తూ ఉంటే - మన శరీర, మనసు, బుద్ది, ప్రాణ శక్తి - అంటే మొత్తముగా మన గూర్చి మనకు అర్ధమవుతుంది. మన గూర్చి మనకు సంపూర్ణముగా తెలియటము - మనను మనం సంపూర్ణ మంచిలో నిలుపుకోగలగటం ఇదే ఆధ్యాత్మికము. ఇది చాలా తేలిక. ఎందుకంటే అంతా నీతో నువ్వు, నీలో నువ్వు చేసుకునేది. నీ మీద నీ అదుపు. ఆధ్యాత్మికతలో మొత్తం పని అంతా నీతో నీకే... కొంచెం శ్రద్ద పెడితే చాలు - ఎందుకంటే నీవేప్పుడు నీతోనే వున్నావు, ఉంటావు కనుక. మహిమలు, మాయల వెంటపడకు. నిరంతరం నీ వెంట నువ్వు పడు సమస్తం దొరుకుతుంది.🌹god bless you 🌹
No comments:
Post a Comment