రమణ మహర్షి అరుణాచలంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక యువకుడు వస్తూ ఉండేవాడు, ఎప్పుడొచ్చినా ఏదో ఒక కోరిక కోరేవాడు. రమణ మహర్షిని ఎవరైనా ఏదైనా అడిగితే అత్యంత అరుదుగా ఒక చిన్న చేష్ట చేసేవాడు.. తన చేయిని గాలిలో అట్లా గుండ్రంగా తిప్పేవాడు, దాని అర్థం "అయిపోతుంది" అని..!
భగవాన్ మాత్రం ఎప్పుడూ ఏమీ చేయక "ఊరక" అట్లా ఉండేవాడు. అదొక సంకేతం.
ఒకనాడు యువకుడు వచ్చి మహర్షిని "నేను బాగా చదువుకోవాలి" నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు. భగవాన్ చేయి గాలిలో తిప్పాడు.
మళ్ళీ కొద్ది రోజులకు ఆ యువకుడు నాకు ఉద్యోగం రావాలి "నన్ను ఆశీర్వదించండి" అని అడిగాడు. భగవాన్ చేయి గాలిలో తిప్పాడు.. ఉద్యోగం వచ్చేసింది.
ఇంకొంత కాలానికి మళ్ళీ వచ్చాడు..నాకు పెళ్లి కావాలి, చేయి గాలిలో తిప్పాడు.. పెళ్లి అయిపొయింది.
మరికొంత కాలానికి వచ్చాడు.. నాకు పిల్లలు కావాలి, చేయి గాలిలో తిప్పాడు.. సంతానం కలిగింది.
అలా కొంతకాలం గడిచింది...
ఆ కొంత కాలం తర్వాత బాధలో వచ్చాడా యువకుడు.. నా సంతానానికి ఏదో సమస్య.. నాకు మీరే దారి చూపాలి భగవాన్ అని, ఎప్పటిలాగే భగవాన్ చేయి గాలిలో తిప్పాడు.. తన సంతానంలో ఒకరు మరణించారు.
మళ్లీ తన భార్యకు ఏదో సమస్య అంటూ వచ్చాడు, రమణుడు చేయి గాలిలో తిప్పాడు.. భార్య మరణించింది.
మళ్లీ వచ్చాడు ఇంకేదో సమస్య, చేయి గాలిలో తిప్పాడు.. ఉద్యోగం పోయింది.
మళ్లీ వచ్చాడు.. తన సంతానం అంతా పోయింది, భార్య పోయింది, ఆస్తి పోయింది, ఉద్యోగం పోయింది.. ఈసారి వచ్చి అడగడానికి ఏమీ లేదు "ఊరకనే" వచ్చి కూర్చున్నాడు.
అప్పుడు భగవాన్ రమణులు ఇట్లా చెప్పాడంట..
"మొదట ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయింది" అని అన్నాడట.
కాబట్టి..
నువ్వు ఇక్కడ ఏమి కూడబెట్టుకుంటున్నావ్ కూడబెట్టుకుని ఏం సాధిస్తావ్? ఈ ప్రపంచానికి అసలు ఏం చూపించాలనుకుంటున్నావ్. అసలు నీ పని ఏమిటి?
ఒక్కసారి ఎవరికి వాళ్లు కళ్ళు మూసుకుని ఆలోచించండి, దేనికొరకు నువ్వు పడే ఈ కష్టమంతా?
నువ్వు హాయిగా, ఊరికే తిని అట్లా పడుకోవడానికి, సాదాసీదా జీవితం, ఆనందమయ జీవితం గడపడానికి కావలసిన లగ్జరీస్ నీ దగ్గర లేవా? అనుభవించే సామర్థ్యం నీ దగ్గర లేదా? ఇంత డబ్బు, ఇన్ని కార్లు, ఒక పెద్ద ఇల్లు ఉండి చాలా పెద్ద గది ఉంటేనే నీకు నిద్రపడుతుందా? దేనికీ ఈ హంగామా? కంఫర్ట్ నిచ్చే ఒక బట్ట ఉంటే సరిపోదా? ఒక లక్ష రూపాయల కోటు వేసుకుంటేనే నీకు గౌరవమా?
వస్తువులు వద్దు అనట్లే, ఆ వస్తువుల్లో చిక్కుకుపోకూడదు.. ఏది ఎంతవరకో తెలుసుకోవడమే జ్ఞానం. ప్రపంచం ఉన్నది నీకు జ్ఞానాన్ని పెంచడానికే కానీ భౌతిక సుఖాల కోసం కాదు అని తెలుసుకో..!
ఓం నమో భగవతే శ్రీరమణాయ...
🪷🙏🪷
No comments:
Post a Comment