🌹గుడ్ మార్నింగ్ 🌹 మనము ఒక అద్భుత సృష్టిలో కలిసి ఉన్న భాగస్తులము. మన జీవన ఆధారత అంతా ఆ సృష్టి లోని వాటిపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. మొత్తం నేను అనే మన భావన నుండి మన సమస్త పని తీరు సృష్టి డిజైన్ చేసిన విధముగానే సాగుతుంది. ఇక్కడ మనము శరీర పరిమిత భావనలో - నేను ఈ శరీరము మాత్రమే అనుకుంటూ - సృష్టిలోని మిగిలిన సమస్తాన్ని అదే భావనలో వేరుగా చూస్తున్నాము. ఈ వేరు భావన వల్ల మనకు అన్నీ ఒక దానితో ఒకటి సంభంధం లేనట్లుగా అనిపిస్తున్నది. దాని వలన మన స్వలాభం కొరకు ప్రయత్నించుకుంటూ - ఇతరమైన అన్నిటికి హాని చేసే వరకు వెళుతున్నాము. శరీర పరిమిత భావన ఎప్పటికి ఇలాగే ఉంటుంది. ఇక్కడే కొంచెం ఆలోచించగలిగి - సృష్టికి, సృష్టిలోని అన్నిటికి మూల కారణం ఏమిటి అన్న ప్రశ్న వేసుకొని, సమాధానం పొందగలిగితే - విభిన్నముగా ఉన్న సృష్టి ఏకమైనదే - విభిన్నత కేవలం పరిమిత తప్పు భావన వల్ల అనిపిస్తున్నది అని తెలుస్తుంది. ఆ ఏకత ఏమిటి - ఈ విభిన్నతలో అది ఎలా వున్నది అనే జ్ఞాన ప్రయత్నం చేసినప్పుడు - అది శక్తి స్వరూపముగా మహాత్ములకు అనుభవమైనది. శక్తి సృష్టి కలిసే ఉన్న ఏక స్వరూపము - సృష్టి ఆధారతతో శక్తిని కనుగొనాలి. కనుగొంటే నేను సృష్టిలోని అంశాన్నే కనుక నేను శక్తిని అన్న ఎరుక కలుగుతుంది.ఇదే ఆధ్యాత్మిక, స్వీయ, ఆత్మజ్ఞాన చదువు. చదువుగా దీనిని ఎప్పుడైనా చదువుకోవచ్చు - కానీ ఇక్కడే గుర్తు పెట్టుకోవలసిన ఒక విషయము వున్నది - శక్తి పరముగాను - సృష్టి పరముగాను అంతా ఒకటే అయినప్పుడు - మనము పరిమిత భావనలో, వేరు భావనలో - ఎవరికి ఏ హాని చేసినా, ఏ బాధ లేక ఇబ్బంది కలిగించినా - అది సత్య స్థితిలో ఏక సృష్టిలోనే జరుగుతుంది కనుక - గోడకు కొట్టిన బంతిలా తిరిగి దానిని మనమే అనుభవించవలసి వస్తున్నది.
ఆధ్యాత్మిక చదువు, ఆత్మ జ్ఞాన చదువు చదువుకుంటే - ఈ తప్పులు చేయకుండా ఉంటాము. ఇబ్బందులు పడకుండా ఉంటాము. మన సొంత జీవితము ప్రశాంతముగా సాగుతుంది.ఆలోచించండి. 🌹god bless you 🌹
No comments:
Post a Comment