Tuesday, August 13, 2024

****అష్ట పుష్పాలు

 *🙏🌴 శ్రీకృష్ణుని నేటి హారతి, ద్వారక-గుజరాత్🌴🙏*


🌹 *అష్ట పుష్పాలు* 🌹



శ్రీకృష్ణ భగవానుడు గీతలో తొమ్మిదవ అధ్యాయములో 26 వ శ్లోకములో ఇలా చెప్పారు....

*పత్రo పుష్పo ఫలo తోయo*
*యో మే భక్త్యా ప్రయచ్చతి*
*తదహo భక్తుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మన:*

     భక్తుడు తనకు భక్తితో ఇలా ఏదిచ్చినా స్వీకరిస్తాను అని చెప్పినాడు. 

      ముఖ్యంగా పూలతో పూజిస్తాము నిత్య తిరువారాధనలో. 
ప్రకృతిలో ఎన్నో రకాల పూలున్నాయి ~ మల్లెలు ~ మందారాలు ~ సంపెంగలు ~ గులాబీలు ~ పారిజాతాలు ~ వీటితో పూజిస్తాము దానితో మనమందరము తృప్తి పొందుతాము.

      *ఉపాసన రెండు విధాలు:*
సగుణోపాసన
నిర్గుణోపాసన
అను రెండు ఉపాసనలు.
మొదటటిది దైవాన్ని ఒక విగ్రహములోనో 
పటములోనో
శిలలోనో 
చూచుకుంటూ ధూపదీప నైవేద్య తాంబూలాదులతో అర్చించడము *సగుణోపాసన.*

     పేరు, రూపము,  ఏవీ లేవని
స్వామి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడనే ధ్యాసతో ఉపాసించడమనేది *నిర్గుణోపాసన.*

      ఇలాంటి పూలన్నీ వాడి వాసన కోల్పోయి మరుసటి రోజున నిర్మాల్యంగా పారేస్తాము.

      నిజంగా పరమాత్మకు అందించాల్సిన పుష్పాలు వేరే వున్నాయి. అందులో మొదటిది
*అహింసా పుష్పము.* అహింసాధర్మాన్ని  పాటిస్తూ
పూజిస్తే లోకములో దీన్ని మించిన
ధర్మము లేదు కనుక దీన్ని *పరమధర్మo* అని అన్నారు‌.
శారీరకంగా సాటివారిని హింసించడము
  *శారీరిక హింస.*
మానసికంగా హింసించడము 
*మానసిక హింస.* ఈ రెండూ కూడనివి.

      ఇక రెండవది కుసుమo;
దీన్ని  *ఇంద్రియ సమ్యమనము* అని అంటారు.  సమాజములో ఎన్నో దోపిళ్ళు దొంగతనాలు హత్యలు అత్యాచారాలు పగలూ
ప్రతీకారాలు పెచ్చరిల్లి పోతున్నాయి. మనోనిగ్రహముంటే 
ఇటువంటి అల్లకల్లోలాలు చాలావరకూ తగ్గుతాయి.

    ఇక మూడవది *దయాపుష్పము*
ఈ సృష్టిలో ప్రతిప్రాణికీ జీవించే హక్కు ఉంది. 
*బ్రతుకు బ్రతకనివ్వు* అని పెద్దల మాట! ఈ నాటి సమాజములో ఎందరో
వృద్దులు
అనాధలు
దివ్యాంగులు
పీడితులు
క్షుధ్భాదతో
అలమటిస్తున్నారు.
అటువంటి వారిపట్ల దయ చూపడమే కాక వారిని ఆదుకుని
చేయిని అందించడము మన కనీస ధర్మము.‌ 
ఈ దయాపుష్ఫాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు.

  ఇంకొక పుష్పము ~ 
*క్షమా పుష్ఫము*
క్షమ అనగా ఓర్పు ~ సహనము.
ఇది మానవునికి మరో అపురూప
ప్రసూనము.

     మరొకటి *తఫ:పుష్పము*
నిరంతరమూ త్రికరణ శుద్దిగా భగవన్నామ స్మరణ
చేస్తూ తన కర్తవ్య నిర్వహణలో
నిమగ్నము కావడమూ తపస్సే!
అరిషడ్వర్గాలను  దూరంగా ఉంచి
తమ విధులనే నిధులుగా భావించే వారిని భగవంతుడు ఇష్టపడుతాడు.

     ఇంకొక పుష్పము 
*ధ్యాన పుష్ఫము* శ్వాసపైన ధ్యాస ఉంచి *అహo బ్రహ్మస్మి*
అని పరిణతి పొందడమే
*ధ్యాన పుష్పము*

    చివరి పుష్పము *సత్యము*
ఈ విశ్వమంతా సత్యo మీదనే 
ఆధారపడి ఉంది. 
సత్యo 
నిత్యమయినది 
శాశ్వతమైనది.
సత్యమే దైవము.

     ఈ అష్టగుణ కుసుమాలతో చేసే ఆరాధనే తనకిష్టమన్నాడు
ఆపధ్భాంధవుడు!

*🙏🌴 ఆత్మీయులకు  శుభోదయం🌴🙏*

No comments:

Post a Comment