*శ్రీ గురుభ్యోనమః*
*గురువంటే .. ఈశ్వరుడే మనకి బోధించటానికి గురు రూపంలో వస్తాడు.* The highest service is teaching. బోధించటం కంటే మించిన సేవ ప్రపంచంలో లేదు. మీరు వంద కోట్లు ఖర్చుపెట్టి ఒక గుడి కట్టించటం కంటే, వందకోట్లు ఖర్చుపెట్టి ఒక ప్రోజెక్ట్ కట్టించటం కంటే, ఇవన్నీ మంచి పనులే .. కానీ teachng తోటి సమానం కాదు. పరమాత్మ గురించి బోధించటం కంటే మించిన సేవ మరొకటి లేదు. *Teaching వల్లే అజ్ఞానం అటూ ఇటూ షేక్ అవుతుంది, అది బయటికి కక్కబడుతుంది.*
ఓ అర్జునా .. ఓ ధనంజయా .. ఈ లోకంలో ఎవరు నాకు బాగా ఇష్టులు అంటే, ఈ లోకంలో చాలామంది ప్రాణికోటి ఉన్నా .. భూతకోటి ఉన్నా .. ఎవరు నాకు బాగా ఇష్టులు అంటే అర్జునా .. అని అడిగి ఆయనే సమాదానం చెప్పాడు. ఓ అర్జునా .. నీకూ నాకూ మధ్యన జరిగిన ఈ సంవాదాన్ని .. ఈ భగవద్గీతను ఎవరైతే అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, అనుభవించి, ఇతరులకి అర్థమయ్యేలా ఎవరైతే బోధిస్తున్నారో .. అటువంటి మనిషికంటే ప్రీతిపాత్రుడు నాకు ఈ సృష్టి లో లేడు అని వాసుదేవుని వాక్కు !
*Teaching is highest service.* మీరు సబ్జక్ట్ వినాలి, వినకపోతే మీకు తెలియదు. ఉపనిషత్తులలోని ఏదైనా వాక్యాన్ని మనం మననం చేయాలి. వింటేనే మనకు అర్థం కాకపోతే .. అసలు వినకుండా ఎలా తెలుస్తుంది ? మాష్టారు చెప్పిన లెక్కలు మనకు అర్ఠం కాకపోతే .. మనం సొంతంగా ఎలా చేసుకోగలం ?
*ఈశ్వరుని స్వరూపమే ఆనందం ! ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటంటే .. సత్ చిత్ ఆనందం. ఆ ఆనందమే ఒక రూపం ధరించి వస్తుంది.*
*శ్రీ నాన్నగారి అనుగ్రహ భాషణం -*
*మురమళ్ళ :* 2005 / 02 / 09
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment