రామాయణమ్. 51
...
సుమిత్రానందనుడికి పట్టరాని కోపం వచ్చింది! నేత్రాలు అశ్రుపూర్ణములయినాయి! ఎర్రబడ్డకన్నులతో అన్నను అనుసరించాడు లక్ష్మణుడు!.
.
అభిషేకసామాగ్రికి శ్రద్ధాపూర్వకమైన దృష్టితోప్రదక్షిణము చేసి మెల్లగా వెళ్ళాడు! .రాముడు
.
రాముడి సౌందర్యాన్ని, ముఖకాంతిని ఏ మాత్రం తగ్గించలేకపోయింది పినతల్లి కోరిక! సుఖదుఃఖాలకు అతీతుడయిన యోగిలాగ ఏ విధమైన చిత్తవికారము లేకుండా తల్లి మందిరం వైపుగా సాగిపోయాడు!
.
రాజలాంఛనాలన్నీ అక్కడనే వదిలివేశాడు!
మానసికంగా ఆయన అరణ్యంలోనే ఉన్నట్లుగా అయిపోయాడు!
పొంగిపొరలే దుఃఖాన్ని మనసులోనే అణిచివేశాడు! ఇంద్రియాలను పూర్తిగా తన అధీనంలో ఉంచుకొన్నాడు!
.
తనను కలువ వచ్చిన పౌరులను,మిత్రులను పంపివేశాడు!.వారెవరికీ కూడా రామునిలో ఏ విధమైన మార్పు కనపడలేదు!
.
తన సహజ సిద్ధమైన స్మితభాషణాన్ని విడువలేదు!
అదే ప్రియభాషణము!అదే మృదుత్వం ! అదే నవ్వు !
అదే ప్రశాంతవదనం ! .
.
రాముడు కౌసల్యా మందిరంలో అడుగుపెడుతున్నాడు!
ఆ మందిరమంతా కోలాహలం! సంతోషం !
.
తన మనసులోనిభావాలు రవ్వంతకూడా కనపడనీయలేదు రాముడు!
.
కౌసల్య ఆ సమయంలో మంగళకరమైన వేషధారణతో అగ్నిలో హోమం చేస్తున్నది. ఆ సమయంలో రాముడచటికి వచ్చి దేవతాస్త్రీ వలే ప్రకాశించే తల్లికి పాదాభివందనం చేశాడు!
.
అప్పుడామే రాముని కౌగలించుకొని శిరస్సుపై వాసనచూసి,నాయనా నీకు శుభమగుగాక,
నీతండ్రి మాట తప్పడు నేడే నీ పట్టాభిషేకము! నీ వంశ ధర్మమును చక్కగా పాలించు తండ్రీ అని పలికింది!
.
నాయనా రా ! భోజనము చేద్దువుగాని ! అని పలికిన తల్లి పలుకులకు రాముడు , అమ్మా నేటినుండీ నేను కందమూల ఫలములు తినవలసియున్నది ,ఈ రాజాసనములు విడిచి దర్భాసనములపై కూర్చొనవలె! ఈ రాజ ప్రాసాదాలు ,నగరాలు విడిచి జనశూన్యమైన అడవులలో తిరుగాడవలే! భరతునకు రాజ్యమీయవలే! ఇది తండ్రిగారి ఆజ్ఞ !
.
రాముని మాటలకు ..ఒకేవేటుకు నేలకూలిన సాలవృక్షంలాగ,
స్వర్గంనుండి భూపతనమయిన దేవతలాగా
ఒక్కసారిగా దబ్బున నేలపైబడింది కౌసల్య!
.
నేలపైబడిన తల్లిని లేపి పొదివిపట్టుకొని తల్లికన్నీరుతుడిచాడు రాఘవుడు!
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
No comments:
Post a Comment