Tuesday, September 10, 2024

 *_నదిలోని నీరు తియ్యగా ఉంటుంది... ఎందుకంటే నది అందరికీ నీటిని ఇస్తుంది..._*

*_సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుంది... ఎందుకంటే సముద్రము నీటిని తీసుకుంటుంది..._*
 
*_ఎటువైపు ప్రవహించకుండా ఉండే నీటికి దుర్గంధం ఉంటుంది... ఎందుకంటే నీరు నిల్వ ఉంటుంది..._*

*_జీవితం కూడా అంతే... నదిలాగా అందరికీ సాయం చేస్తూ ఉంటే మధురంగా ఉంటుంది._* 

*_సముద్రంలా కేవలం తీసుకుంటూనే ఉంటే (ఉప్పగా) కొద్దిరోజులకే అందరితో దూరం పెరుగుతుంది..._*

*_అలాగే నిల్వ నీరులా అసలు ఎవరికీ ఏది ఇవ్వకుండా ఉంటే జీవితం నిరర్థకంగా మారిపోతుంది..._*

*_పక్కవాడి ఆనందంలో పరమాత్ముని చూడగలిగిన వాడు మాత్రమే ఆ భగవంతుడి ప్రేమకు పాత్రుడవుతాడు._*

*_ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకొని ఆనందంగా జీవించండి, అందరినీ ఆనందపరచండి..._*
 _- సదా మీ శ్రేయోభిలాషి... 👏_*
🙏🙏🙏 🪷🙇‍♂️🪷 🙏🙏🙏

No comments:

Post a Comment