*అమ్మ పడే తపన…!*
*అమ్మ పాత్ర లో…!*
*భార్య పాత్ర లో…!!*
```
ఒకరోజు ఆఫీస్ లో పని ముగించుకుని ఇంటికి బయల్దేరాను. వర్షం మొదలయింది.
వేడి వేడి పకోడీలపై మనసు మళ్లింది.
ఇంటికి వెళ్ళగానే భార్య నిర్మలను పిలిచి... “నిమ్మీ! వేడిగా పకోడీలు, కాఫీ ఇవ్వవా” అని అడిగాను.
అంతే! ఒక్కటే అరుపు...“అసలేమనుకుంటున్నారు, ఉదయం లేచినప్పటి నుండి ఇంట్లో చాకిరీ మొత్తం నేనే చేసి,చస్తున్నాను..! అయ్యగారు ఇప్పుడొచ్చి పకోడీలంటారు. వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చుగా!”
సీమటపాకాయలా చిటపట లాడింది, భయపడ్డట్టు బయట వర్షం కూడా ఆగింది...
ఇంకేమయినా అంటే గొడవవుతుందని ఊరుకున్నాను.
నిరాశతో... ప్రక్క వీధిలో వేరుగా ఉంటున్న అమ్మానాన్నలు మనస్సులో మెదిలారు...
నిర్మల చిరాకు పరాకులతో, మా అమ్మానాన్నలు బాధపడటం చూడలేక, వేరేగా ఉంచి చూసుకుంటున్నాను...
అమ్మ అయితే అడిగిన వెంటనే అల్లం,పచ్చిమిర్చితో వేడి వేడిగా చేసి పెడుతుంది.
’తిని పిల్లలకు తేవచ్చు!’ అనే ఆలోచన రాగానే, అడుగులు అమ్మానాన్న ఉండే ఇంటి వైపు వెళ్లాయి...
గేటు తీసి లోపలికి అడుగు పెడుతుండగా... నాన్న గొంతు వినిపిస్తోంది...”చలిగా ఉంది, కాస్త వేడిగా రవ్వఉప్మా తినాలనుంది, చేసివ్వవూ...!”
అంతలో అమ్మ నాన్నపై అరుస్తోంది.. ఎలా అంటే ఇందాక, నిర్మల నాపై, మా ఇంట్లో జరిగిన అదే సీన్ రిపీట్ అయినట్టుగా!
నాన్న అడుగుతుంటే.. నేను ఖాళీగా లేను, ఇప్పడు చెయ్యలేనని చెబుతోంది అమ్మ...!
నాన్న పరిస్థితి చూసి జాలేసింది...
నన్ను చూడగానే, అమ్మ “రారా! ఏరి పిల్లలు? ఒక్కడే వచ్చావు... వాళ్లను తీసుకురాలేదా!” అని అమ్మ అడిగింది.
నాన్న నన్ను చూడగానే, ఆనందంతో చెయ్యి పట్టుకుని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు...
అమ్మ అంది… “నాన్నా! నీకిష్టమైన పకోడీలు చేస్తాను, తిని పిల్లలకు పట్టుకునివెల్దువు గాని” అని అమ్మ వంటగదిలోకి వెళ్లబోతోంది.
ఇందాక నాన్న అడిగితే కుదరదన్న అమ్మ, ఇప్పుడు నాకోసం అడగకుండానే పకోడిలా! అనుకుని నాన్న మొఖం చూసాను.
”అమ్మా! నాకు పకోడీలు తినాలని లేదు లేవే...రవ్వ ఉప్మా తినాలని ఉంది, చేసివ్వు!” అన్నాను ..
”ఇందాక మీ నాన్న అడిగారురా,” అని చెప్పి… వెంటనే అమ్మ చేసుకువచ్చింది.
నాన్న తనలో తను నవ్వుకోవడం చూసి, చాలా ఆనందం కలిగింది. ఉప్మా తిని, ఇంటికి బయల్దేరి వెళ్ళాను...
ఇంట్లోకి అడుగుపెడుతుంటే..నిమ్మీ బజ్జిలు వేసి పిల్లలకు పెడుతుండగా,.
```
*పిల్లల సంతోషం కోసం…, ‘అమ్మ పడే తపన’ కనిపించింది ...*
*పిల్లలు కనిపించగానే తనలో లేని శక్తి , హుషారు పిల్లలకోసం వచ్చేస్తుంది అమ్మలకు!*```
పిల్లలు అడగకుండానే వారికిష్టమైనవి చేసివ్వాలని అనుకుంటారు అందరు అమ్మలు...
మా అమ్మ కూడా అడక్కుండానే చేస్తుంది ..లవ్ యూ అమ్మా..!అందుకనే అమ్మలందరూ దేవతలే!!
No comments:
Post a Comment