*ఓంకారం విశిష్టత.*
*మనలో చాలామంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు.*
*పంచభూతాల్లో శబ్దం అన్నింటికంటే ముందు ఉంటుందని పండితులు చెబుతారు. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారం.*
*నిజానికి ఓంకారం ప్రతి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితం అవుతుంది.*
*‘ఓం’ అన్నది మంత్రం కాదు..! మత సంబంధమైనది అసలే కాదు.. వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.*
*ప్రాచీన కాలంలో ఋషులు వాతవారణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతంగా ఉండటం వెనుక ఓంకార నాదమే రహస్యం.*
*విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో జరిపిన పరిశోధనల్లో సైతం ఓంకారం మృత్యుంజయ జపం అని బయటపడింది.*
*ఓంకారాన్ని, మతాన్ని ముడిపెట్టడం వల్ల ఓంకారం చేసే మేలు పరిమితం అవుతుంది.*
*ఓంకారం ఉచ్ఛరించడం వల్ల కలిగే ప్రయోజనాలు…*
*నాభిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.*
*ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది.*
*రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.*
*మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది.*
*ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.*
*జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది.*
*కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది.*
*థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే.*
No comments:
Post a Comment