Friday, September 20, 2024

 🌹గుడ్ మార్నింగ్ 🌹మన ఆలోచనలే ప్రస్తుత మనం. ఈ ఆలోచనలు మనకు ఎవరో ఇచ్చినవి కాదు, ఎవరో మనలోకి పంపుతున్నవి కాదు.
మనలో పుట్టే ప్రతి ఆలోచన - ప్రతి భావము - మనం కావాలని ప్రపంచమునుంచి తెచ్చుకొని మన లోపల వేసుకున్నదే.. ఇప్పుడు కూడా ఆలోచన పుట్టగానే - దానిని పట్టుకొని వేలాడటం, ఎలాగోలా దానిని అనుభవించటం నేర్చుకుంటున్నాము కాని - అనవసరపు చెత్తను వదిలించుకోవాలి అనుకోవటము లేదు. ఆలోచనలకు మనం బానిసలము కాదు - కాని తోచక, కాలక్షేపానికి, సరదాలకి చేసిన, చూసిన, విన్న, తిన్న, గ్రహించిన అన్నీ మన లోపల చేరాయి.
రోడ్డునపోయే సంభంధం లేని అందరిని మీ కాలక్షేపానికి పిలిచి - ఇది మీ ఇల్లే అనుకోండి అని వాళ్ళతో గడిపి - వాళ్ళు మీ ఇంటిని వాడుకుంటూ, మీతో తిరిగి వాళ్ళు గడపాలనుకుంటున్నప్పుడు..........
అసలు వీళ్లెవరు? వీళ్ళతో నాకేమి సంభంధం? వీళ్లేందుకు నా ఇంట్లో వున్నారు? బయటకి పోక నన్నెందుకు బాధపెడుతున్నారు అనుకుంటే - ఎవరేమి చేయగలరు? వాళ్లను పిలిచి, వాళ్లతో సరదా కాలక్షేపం చేసింది మీరే కనుక - మీరే ఎలాగోలా వారిని బయటకు పంపుకోవాలి.
ఆలోచనలు కూడా ఇంతే....
ఈ విషయం అర్ధమవ్వటం - చెత్తను - చెడును ఏరి పారెయ్యగలగటమే ఆధ్యాత్మిక సాధన. మన ఇంటి చెత్తతో - మనలోని చెడుతో ఎవరకేమి పని? 🌹god bless you 🌹

No comments:

Post a Comment