శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక అర్జునుడు ద్వారకలో ఉన్న ఆడవాళ్ళని, పిల్లల్ని, వృద్ధుల్ని తీసుకొని వస్తూ ఉండగా బందిపోటు దొంగలు దాడులు చేసి ఆడవాళ్ళని కొందరిని చెరబట్టి ఎత్తుకుపోయారు, కొందరు ఆడవాళ్లు ఎం చేసేది లేక ఇష్టపూర్వకంగానే బందిపోటులతో వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళకి ఉన్న నగలు, ధనం అంతా దోచుకుపోతుంటే అర్జునుడు గాండీవం తో బాణాలు వేస్తాడు బందిపోట్లు మీదకి.. కాని అవి ఏవో పుల్లలు విసిరినట్లు వెళ్లి తగుల్తాయి.. అర్జునుడు ఆశ్చర్యపోయి, శస్త్రాలు వేద్దాం అని మంత్ర ప్రయోగం చేయబోతే మంత్రం స్పురణలోకి రాదు. కొందరిని మాత్రమే రక్షించి తీసుకేల్లగలుగుతాడు. తరువాత వ్యాసుడి దగ్గరికి వెళ్లి భోరున విలపిస్తాడు. వ్యాసుడు ఆర్జునుడిని చూసి ఏంటి గుర్తుపట్టలేకుండా అయిపోయావ్.. ఏమైంది నాయన అని అడిగితె! శ్రీకృష్ణుడు శరీరం వదిలేశాడు. అయన లేని జీవితం నేను జీవించలేను అని ఏడిస్తే ఓదారుస్తాడు వ్యాసుడు. తేరుకొని జరిగింది చెప్పి, గాండీవం ఎందుకు పనిచేయలేదు? అని అడిగితే ఆశ్చర్యపోతే మాట చెప్తాడు వ్యాసుడు.. ఇన్నాళ్ళు గాండీవం ధరించి నువ్వు ప్రతాపం చుపించావని అనుకుంటున్నావా! భగవద్గీత విని ఏమి నేర్చుకున్నావ్?చేసింది, చేయించింది అంతా ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడే.. నువ్వు నామ మాత్రంగా ముందు నిలబడ్డావ్.. వెనుకనుండి నడిపింది అంతా ఆయనే.. ఇంతవరకు యుద్ధం లో చూపించిన ప్రతాపం గాని, సమర్ధత గాని నీది కాదు. పరమాత్మ నీద్వారా ఇచ్చాడు గాని నీవల్ల జరగలేదని తెలుసుకో.. సంపదలు, జ్ఞానం, శరీరానికి పటుత్వం, ఇవన్ని భగవంతుడు మనద్వార ప్రకటిస్తున్నాడు తప్ప మనవి కావు. తెలుసుకో.. ఇప్పుడెం చేయాలి? ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అంతే. అవే పరికరాలు, అదే బుద్ది, అదే శరీరం ఉంటుంది. కాలం అనుకూలించినప్పుడు అవన్నీ రాణిస్తాయి. కాలం ప్రతికూలించినప్పుడు ఇవే పరికరాలు, ఇదే మనసు, ఇవే సంపదలు దేనికి పనికిరావు. తెలుసుకొని అని చెప్పగానే.. శ్రీకృష్ణుడిని తలచుకుంటూ అర్జునుడు హస్తినకి వెళ్లి, ధర్మరాజుకి విషయం తెలియజేసి స్వర్గారోహణకి వెళ్ళిపోతారు.
No comments:
Post a Comment