Wednesday, September 18, 2024

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                      *దైవేశ్చ* 
                 ➖➖➖✍️
           
*ఒక వీధులు ఊడ్చే వ్యక్తికి రోజూ పని చేసి చేసి ఆ పని మీద విసుగొచ్చింది. ఊడ్చే చోట రోడ్డు పక్కన ఓ గుడి ఉంటే ఆ మెట్లపైన కూర్చుండి ప్రతి రోజూ “ఓ దేవుడా....*
*"నువు రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు. నా బతుకు చూడు ఎంత కష్టమో... ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా!" అని దేవుడితో మొరపెట్టుకునేవాడు.*

*అయినా దేవుడు ఏమీ స్పందించలేదు రోజూ ఇలాగే అంటూ కొన్నాళ్ళకి  విసిగిపోయి, నా పని చేయటం ఆ దేవుని వల్ల కూడా కాదు అంత శక్తి ఆయనకుంటే గనక ఈపాటికి ఎప్పుడో స్పందించేవాడు అని సవాలు విసిరాడు.*

*దేవుడు కూడా ఇతని మాటలు వినీ వినీ ఓ రోజు సరేనన్నాడు, “నా పని నువ్ చెయ్ నీ పని నేను చేస్తా, కానీ ఒక్క షరతు!” అన్నాడు దేవుడు.*

*”షరతు ఏమిటంటే నీ ముందుకొచ్చిన భక్తులు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించ కూడదు, నోరు మెదపకూడదు." అన్నాడు దేవుడు.*

*"సరే" అన్నాడు మనోడు.*

*తెల్లారే సరికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.*

*కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.*

*"దేవుడా... నేను మరో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు!" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. దాంతో ధనవంతుని ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్లిపోయాడు.*

*మనోడు.."ఒరేయ్...పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.*

*ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు. "దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అది నీకు సమర్పించు కుంటున్నాను. దయచూడు తండ్రీ!" అంటూ మోకరిల్లాడు.*

*కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. "ఇలా దయ చూపించావా తండ్రీ!" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.*

 *"ఒరేయ్ దొంగా ఆ పర్స్ నీది కాదురా.... " అని అరుద్దామనుకున్నాడు మనోడు.*

*కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు.*

*ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.*
*"దేవుడా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ" అన్నాడు.*

*అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు.*

*"నా పర్సు ఈ గదిలోనే పోయింది, నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును తీసుకుని ఉంటాడు, పట్టుకోండి!" అన్నాడు.* 

*పోలీసులు అతడిని అరెస్టు చేసి తీసుకెళ్తుంటే, మనోడు సహించలేక పోయాడు, ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనుకున్నాడు, దాంతో ఉండబట్టలేక పోయాడు. దేవుడు పెట్టిన షరతు మర్చిపోయాడు, వెంటనే "ఒరేయ్ ఆగండ్రా... ఈ నావికుడు నిర్దోషి. పర్సు తీసుకున్న అసలు వ్యక్తి ఇంకొకడు. వాడు(పేదోడు) పర్సును తీసుకెళ్లాడు!" అని అరిచేశాడు.*

*దేవుడే చెబుతుంటే, ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.*

*సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు కూడా వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.*

*"దేవుడా... ఇవ్వాల నేను ఎంత మంచి పని చేశానో తెలుసా..? నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను. ఒక దోషిని అరెస్టు చేయించాను!" అన్నాడు మనోడు పెద్ద తోపులా.*

 *"ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నాను కదా... ఎందుకలా చేశావు?" అన్నాడు దేవుడు నిష్ఠూరంగా.*

*"అదేమిటి దేవుడా, మంచిపని చేసిన నన్ను నువ్వు మెచ్చుకుంటావను కున్నాను" అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా....*

*అప్పుడు దేవుడు మాట్లాడుతూ… "ధనవంతుడు వ్యాపారంలో మోసాలు చేసిన మహా పాపాత్ముడు! వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే ధనవంతుడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. అలాగే ఆ పర్స్ లోని డబ్బులతో పేదోడి కష్టాలు కొన్నైనా తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు.* 
*ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. విధి లిఖితం ప్రకారం రేపు సముద్రంలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు, అదే నావికుడు అరెస్టై జైల్లో ఉంటే సముద్రయానం ఆగిపోయేది. వాడితో బాటు ఇంకొందరు ప్రయాణీకులు కూడా బతికిపోయేవారు.*

*ఇప్పుడు చూడు...*
*పేదోడు జైల్లో ఉన్నాడు.*

*ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు.*

*నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావయ్యా నువ్వు..!” అన్నాడు దేవుడు.*

*దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు.*

*కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు.*

*తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండవచ్చు.*

*ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం మానవ మాత్రులకు సాధ్యం కాదు.*

*అందుకే ఏది జరిగినా మనమంచికే అనుకుంటూ*
*భారమంతా భగవంతునికే అప్పగించి ఆయన స్మరణలో ఉండాలి అంతే....*

*జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద 🌷ఒకసారి చెప్పి*

      *"హరే కృష్ణ హరే కృష్ణ* 
      *కృష్ణ కృష్ణ హరే హరే* 
      *హరే రామ హరే రామ* 
      *రామ రామ హరే హరే"      కనీసం* *108 సార్లు జపిస్తే ఒక మాల* *అంటారు హరే కృష్ణ సదా జపించండి సంతోషంగా ఉండండి!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment