Tuesday, October 15, 2024

Before & after damage of Hindu god on temple

 


****_జీవితంలో కష్టాలు ఉండటం సహజమే.! కానీ బాధలో ఉండటం అసహజం.

 *_జీవితంలో కష్టాలు ఉండటం సహజమే.! కానీ బాధలో ఉండటం అసహజం. ఈ చరిత్రలో ఎవరిని తీసుకున్నా కష్టాలు లేని వారెవ్వరూ లేరు.!_*

*_సోక్రటీస్ నుంచి వివేకానందుడి వరకు, ఐన్ స్టీన్ నుండి అబ్దుల్ కలాం వరకు అందరూ ఎన్నో కష్టాలు పడ్డవారే.! మరి వారందరికీ కష్టాలు వుండి వుంటే వారు ఎప్పుడూ బాధలో ఉన్నట్లు కనబడరెందుకు.?!_*

*_కష్టాలు వేరు, బాధలు వేరా.? కష్టం అంటే ఏంటి, బాధ అంటే ఎంటి.? కష్టాలు ఉన్నా బాధ లేకుండా ఉండవచ్చా.?_*

*_జీవితంలో ఊహించనిది, అనుకోనిది జరిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, మన శక్తికి మించిన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని కష్టంగా భావిస్తూ వుంటాం.!_*

*_ఈ కష్టాలకు అనేక కారణాలు ఉండవచ్చు.! వాటిలో ఎన్నో మన చేతుల్లో ఉండవచ్చు, వుండకపోవచ్చు.! అది అత్యంత సహజం... అన్నీ మన చేతుల్లో లేకపోవడం.!_*

*_కానీ బాగా గమనిస్తే ఒకే కష్టం ఒక వ్యక్తికి వస్తే చాలా బాధపడుతూ కనబడితే, అదే కష్టం ఇంకో వ్యక్తికి వచ్చినప్పుడు మామూలుగా ఏ బాధ లేనట్లు కనబడుతూ వుంటాడు.!_* 

*_అంటే మనకు ఇక్కడ అర్థం అయ్యే విషయం ఏమిటంటే బాధ అన్నది కష్టాలనుంచి కాకుండా ఇంకెక్కడినుంచో వస్తోంది.! అదే మన మనస్సు.! అంటే బాధ అన్నది మనస్సు వల్ల, మనస్సు నుంచి సృష్టించబడినదే కానీ నిజంగా బాధ అన్నది లేదు.!_* 

*_అంటే మనం అనుకుంటే బాధ లేకుండా కూడా ఉండవచ్చు.! కాబట్టి కష్టాలు అన్నవి మన చేతుల్లో లేని సహజ ప్రక్రియ అయితే బాధ అన్నది మన చేతుల్లోనే వున్న అసహజ ప్రక్రియ.!_* 

*_మనం అనుకుంటే సర్వ వేళలా బాధలులేకుండా ఉండవచ్చు కూడా.!_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🫐🏵️🫐 🪷🙇‍♂️🪷 🫐🏵️🫐

పాదాభివందనం ఎందుకు చేయాలి....!! 🙏పాదాభివందనం వలన… ప్రయోజనం ఏమిటి🪷

 🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏 శివాయ గురవే నమః 🙏

🙏 పాదాభివందనం ఎందుకు చేయాలి....!!

🙏పాదాభివందనం వలన…
             ప్రయోజనం ఏమిటి🪷
🌺🌺☘☘🌺🌺☘☘🌺🌺☘☘   

🌺శుభ కార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.

☘కేవలం శుభకార్యాల లోనే కాక, పెద్దవారు కనిపించనప్పుడు కూడా చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. 

🌺అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి!🌷

☘భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతన పద్దతి. 

🌺అయితే కొందరు, 
అడుగులను అపరిశుభ్రంగా  భావిస్తారు.

☘పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలు, ఉన్నాయి.

🌺పెద్దవారి పాదాలను తాకాలంటే, మన అహంకారం వదిలి తల వంచాలి. 
అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.

☘సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు, వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు, చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి ఎన్నో ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా లాభాలు చేకూరుతాయి!

🌺పెద్దవారి పాదాలను తాకడానికి 
మన నడుము వంచి,  
మన కుడి చేతిని పెద్దవారి ఎడమ కాలిమీద పెట్టాలి.  

☘అలాగే మన ఎడమ చేతిని పెద్దవారి కుడి కాలిమీద ఉంచాలి. 
అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. 

☘ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. 
ఆ సమయంలో పెద్దవారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవుతాయి.

🌺ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే  దీవెనలు ఫలిస్తాయి.

☘పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల, వారి పాద ధూళిలో కూడా, ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. 

🌺"మేము కూడా మీ మార్గంలో  నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంపాదించడానికి ఆశీర్వదించండి", 
అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా, 
చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.

☘మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు,
ఆ ఇంటిలో ఉన్న పెద్దవారికి
పాదాభివందనం చేసి, పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.

🌺అలాగే  ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా,
వారికి పాదాభివందనం  చేసి,
పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.

☘🙌 సాధారణంగా పెద్దవారి ఆశీర్వచనాలు ఈవిధంగా ఉంటాయి! 🙌🌹

🌺పెళ్లయిన జంటని :
అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు.

☘పెళ్లి అయిన ఆడవారిని :
దీర్ఘసుమంగళీభవ

🌺చిన్న పిల్లల్ని :
🙌చిరంజీవ - చిరంజీవ

☘చదువుకుంటున్నవారిని :
🙌బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి.

🌺పెద్ద చదువులు చదువుకునేవాళ్ళని :
🙌ఉన్నతవిద్యా ప్రాప్తిరస్తు.

☘పెళ్లికావసలసిన వాళ్ళని :
🙌శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.

🌺ఉద్యోగం చేస్తున్నవాళ్ళని :
🙌ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు.

☘ఏమని ఆశీర్వదించాలో తెలియనప్పుడు 
ఒక్క మాటలో ఆశీర్వదించాలంటే 

🌺🙌"మనోవాంఛా ఫలసిద్దిరస్తు"🙌

☘(నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి)
ఈవిధంగా పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు!

🌺(పెద్దలకు, తల్లి దండ్రులకు, పూజ్యులకు, గురువులకు, పాదాభివందనం చేసి, ఆశీర్వచనాలు పొందేలా, మనం మన పిల్లలకు చిన్నప్పటినుంచీ నేర్పాలి.)
మన సంస్కృతిని మర్చిపోకూడదు...

🙏 సర్వేజనాః సుఖినో భవంతు🙏

****హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే.!!

 తెలుగు రాష్ట్రాల్లో  73% హిందువులు హిందు వ్యతిరేక శక్తులకే మద్ధతు ఇస్తున్నారు.

భారత్ టుడే సర్వేలో వెల్లడి

అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే.!!

ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు :-

1. అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.

2. అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో  వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.

3. అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని  బోధనలు చేస్తారు...  వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.

4. వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద  వేదాంతుల్లాగా. 

5. వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.

6. క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు. మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.

7. క్రైస్తవుల ఇంటికి ప్రార్దనకు వెళ్లి కేకులు, బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.

8. హిందువులను, హిందు గ్రంధాలను, హిందూ దేవుళ్లను దూషించేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.

9. హిందూ ధర్మం గొప్పతనాన్ని  ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.

10. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా: కృష్టుడికి 16 వేలమంది భార్యలు).

11. స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.

12. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.

13). ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

ఈ సెక్యులర్ హిందువులు 
(హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి నిజం తెలుసుకోండి 

గొప్పదైన నీ ధర్మాన్ని నీ దేశాన్ని కాపాడుకో. మేలుకోండి హిందువులారా! లేకపోతే కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళ తర్వాత మీ పిల్లలకి పూర్వం హిందూమతం ఉండేది అనిచెప్పే దుస్థితి వస్తుంది. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ తమ పిల్లలను సైతం హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటించేలా పెంచాలని విజ్ఞప్తి. ధన్యవాదాలు 🙏

****ప్రస్తుత పరిస్థితి* ------------------------------------------------ *కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్...

 *ప్రస్తుత  పరిస్థితి*
------------------------------------------------
 *కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్...అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు!! కొడుకు కు ముప్ఫై ఏళ్ల లోపు పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మా చారిగా ఉంటాడనే బెంగ తల్లి దండ్రులను పట్టి పీడిస్తుంది...ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్ఫై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం వెలగ బెడుతుండంతో పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ళ పెత్తనం పెరిగిపోయి *పెళ్లి కాని ప్రసాదు* లు తాళి బొట్టు పట్టుకొని అమ్మాయి కోసం వెంపర్లాడం తో  ఈ తరం అమ్మాయిలు చెట్టు ఎక్కి మరి పిల్లవాడి రేజ్యూం చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పదిమంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూనే ఉంది!! అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరి పోతున్న పెళ్లి జాడ లేక విలవిల లాడి పోతున్నారు...అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడం తో పెళ్ళి కొడుకులు క్యూ కడుతున్నారు...వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి ఒక ఐదెకరాల పొలం ఉండాలి...హైదరాబాద్ లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి...అమ్మాయి మెళ్ళో ఇరవై ఐదు తులాల బంగారం వేయాలి...పెద్ద వివాహ వేదిక లో వెయ్యి మందికి భోజనం పెట్టాలి... ఆన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్లి అయ్యాకా కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లి దండ్రులకు చెందాలి  ఆన్న ప్రధాన డిమాండ్ల ను తలవోగ్గి పెళ్లి పీటల మీద కు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లి వారి బాధలు ఏ పగ వాడికి కూడా వద్దు! ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలు అయి పరిగెడుతుంటే భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక *సహాజీవన వ్యవస్థ* గా మారిపోతుందా అనే భయం విద్యాధికులు, సంప్రదాయ వాదులు పట్టుకుంది..ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్ళకే అమ్మాయిలకు ముప్ఫై వేల ఉద్యోగం దొరకడం...మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు...కావాల్సిన కాస్మెటిక్స్...మాడ్రన్ దుస్తులతో కార్పోరేట్టు కల్చర్ లోకి వెళ్లి పోతున్న అమ్మాయిలు...పెళ్లి ధ్యాస మరిచి రంగుల ప్రపంచం లో విహరిస్తూ *ఆడింది ఆట పాడింది పాట* జీవితం కొనసాగుతుంటే, పెళ్లి మీద ద్యాస ఎందుకుంటుంది?!...దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్ లలో ఇద్దరో  ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి, "పెళ్లి  చేసుకొని వాడి చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫ్ బెటర్" అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మొగవారికి ఇటు ఆడవారికి సరియైన వయసులో జరగపోవడం, దానికి తోడు అబ్బాయి *మంచి వాడా చెద్దవాడ* అని  తెలుసుకోవడానికి ఆర్నెళ్ళు *సహజీవన యాత్రలు* చేసి రావడంతో మోజు తీరి మరో *ఎర్నర్* కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది...*కులం చెడ్డ సుఖం దక్కాలనే* పెద్దల మాట పెడచెవిన పెట్టీ, రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని వాడు *సకల కళా వల్లభుడు* అని తెలుసుకొని అమ్మ గారి ఇంటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా?! ఇలా ముప్ఫై ఏళ్లు గడిచాకా డబ్బున్న ఏజ్ బార్ వాడు దొరికితే వాడితో నైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అదీ లేదు! పిల్లలు పుడితే అందం ఎక్కడ మసి బారుతుందో అని ముప్ఫై ఐదేళ్ల వరకు పిల్లలు కనకుండా టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు - మనవరాళ్లు కావాలనుకునే  పేరెంట్స్ ఆశలు అడియాశలు అయి పోతున్నాయి...2024 లో యువతుల *పెళ్లి సందడి* ముప్ఫై ఏళ్ళు దాటుతుంది అంటే అమ్మాయిల్లో పెళ్లి ద్యాస కన్నా సంపాదన ద్యాస ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది...! ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అనలేదు...అది లేకే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి...ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు మూడు నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కా రణం కాగా *పిల్లవాడు సెటిల్* కాలేదు...అని అబ్బాయి ఆదాయం పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం! ముప్ఫై ఏళ్ల వరకు మహా అయితే అదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు *కోటి* ఆశలు తల్లి దండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడి పోతూ లేక...చిక్కి శల్యమైన *పోరన్ని* ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది?...ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి...ఆయన లా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో  తప్పులేదు.... కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపిక అయ్యే సరికి ఈడు పోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడి యాశలు అయి పెళ్లయిన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు!🌷🌷🌷🌷🌷🌷🌷ఇక పవిత్ర భారత దేశంలో ఇప్పుడు అత్తలా ఆరళ్ళ కన్నా కోడళ్ళ ఆరాళ్ళు ఎక్కువవుతున్నాయి...   పెళ్లయిన ఆర్నేళ్ళకే వేరు కాపురం పెట్టీ, అత్త మామలు రాకుండా సూటి పోటి మాటలు అంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయింది...వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు శునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ సెట్ లో ఓల్డ్ ఏజ్    పేరంట్స్ ఉంటున్నారు...పొరపాటున ఆడపిల్లల కన్నా తల్లి దండ్రులు కూడా అటు అల్లున్ని పంచన చేరలేక...చేరినా కూడా అక్కడ అడ్జెస్ట్ కాలేక మానసిక వేదన తో కుమిలి  పోతున్నారు...ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్న ఇంట్లో.... పేరెంట్స్ బాధ వర్ణనాతీతం...ఆస్తుల పంచాయతీలు ఒక వైపు ఆదరణ లేక *వృద్ధ పక్షులు* ఒకరికి ఒకరై ఓదార్చు కుంటు దేవుడు ఎప్పుడు తీసుకు వెళ్తాడా? అని ఎదిరి చూస్తున్నారు! పదేళ్లు ఎత్తుకొని కాలికి ముల్లు అంటకుండా పెంచిన పిల్లలు...సంపాదన పరులు అయ్యాకా తల్లి దండ్రులకు మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనబడుతుంది...! నాలుగు రోజులు పెద్ద కొడుకు...నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్లకేం తోడి పెడుతున్నారని కొడుకు - కోడళ్ళ వేధింపులతో ఒంటరి జీవనంలో ఇమడలేక....అటు పిల్లలు ఆదరణ కోల్పోయి  కళ్ళ   వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరూ ముందు పోయినా మరొకరికి కష్టం అని *భార్యభర్తలు* ఒకరికొకరం ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్ళ బోస్తున్నారు...! చాలా మంది అత్తమామలు కొడుకు కోడలు నుండి ఆదరణ -  ఆప్యాయతతో కోరుకుంటారు. చాలా సందర్భాలు వాళ్లకు అది దూరం అవుతుంది..
మన 'ఆధునిక సమాజంలో అత్త మామలు అడ్జెస్ట్ కాలేక పోతున్నారు...ఇదీ చాదస్తం అనే కన్నా *ప్రేమ* ఎక్కువవడం అంటే కరెక్ట్!
భారతదేశంలోని కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక సమస్యలు దీని వల్లే తలెత్తుతున్నాయి...అత్త పెత్తనం కోడలు సహించదు...తన కోడలు తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్న తల్లి తన కూతురు మాత్రం *స్వేచ్ఛ* లేదు అని ఆరాట పడుతుంది...మహిళల్లో ఈ ద్వంద వైఖరి వల్లే కోడళ్ళు శాడిస్ట్ లుగా తయారవుతున్నారు...
అత్తమామలతో జీవించడం వాళ్లకు పెద్ద సవాళ్లు గా అనిపిస్తుంది.
ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి..*కోడలు బిడ్డ కాదు...అల్లుడు కొడుకు కాదు* అనే  మైండ్ సెట్ ఇంకా వందేళ్లు అయినా మారేట్టు లేదు!  అత్తగారు - కోడలు మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి... కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం, ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది..ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి. బహుశా, అత్తమామల జోక్యం, కొడుకు పై పెత్తనం వల్ల తాను *స్వాతంత్ర్యం* కొల్పోతున్నాననే అభద్రత భావం లో కోడలు ఉంటుంది.. ఆ భయాలను ఆమె తల్లి దండ్రులు ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అశాంతి ఎక్కువవుతుంది.. తన కుమార్తె  తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లి దండ్రులు ఉంటే ఇలాంటి అపశృతులు రావు...కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే ఈ అశాంతి!!
  ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు 'పోటీ' పడుతుంటాయి!  ఇది వివాహా వ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది!  తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగి పోతాడు...తల్లి కన్నా పెళ్ళమే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటి వైపు తల్లి చూడదు!!  అటు తల్లి ఇటు పెళ్ళాం మధ్య మానసిక వేదనకు గురయ్యే పుత్ర *రత్నాలు* కూడా కోకొల్లలు!!🌷🙏🌷🌷🙏🙏🌷🙏🌷🙏🙏
ఈ ఇంటికి నేను మొదటి కోడలు ను అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది..
 35 సంవత్సరాలకు క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టాను...అలా నువ్వు అణిగి మణిగి ఉండాలని అత్తా కోరుకోవడంలో తప్పు లేదు కానీ  ఆనాటి అత్తలు వేరు ఈ  నాటి కోడళ్ళు వేరు! ఆనాటి అత్తలకు కావాల్సిన అస్తి ఉండేది...దానికి చూసుకోవడానికి కోడలు కు ఇంటి బాధ్యత అప్పగిం చేది. అయిన ఆనాటి అత్త కోడళ్ళు మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉండేవి...ఇంటి నిండా పనిమనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు  బయట పడలేదు... ఇప్పుడు అలా కాదు కోడళ్ళు సంపాదన పరులు అయ్యారు. అత్త కొంగు పట్టుకు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు!   ఇప్పుడు కట్నా కానుకల కన్నా *స్వేచ్ఛ జీవితం*, కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసి పోయాయి...మనవలతో అడుకొనివ్వని కోడళ్ళు...ఆతి గారాబం చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవలు ఆత్మీయత మసి బారి పోయింది!
కొత్తగా పెళ్లయిన వధువులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి,  లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గరకు వచ్చి పోతుండాలి అని కోరుకుంటుంది తప్పా అత్తా మామలను ఆదరించాలని అనుకోక  పోవడం వల్లే అత్త కోడళ్ళ మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది! ఒక వేళ కొడుకు ఇంటికి వెళితే   ఆలస్యంగా నిద్ర లేచిన  కోడలు... చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగే కోడలు...పూజలు పునస్కారాలు  లేకుండా, స్నానం ఆచరించకుండానే వంటింట్లో దోసెలు వేసే కోడళ్ళ *పనితీరు* వంట బట్టలేక ఏదైనా మాట అత్త గారు అంటే తాను స్వేచ్చలేని పంజరంలో చిలుకను అయ్యాయని ఏడుస్తూ బెడ్ రూం లో అలక పాన్పు ఎక్కుతున్న సుందరాంగి మాటలు విని తల్లి పై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది!! అత్తమామలు కొడుకు ఇంటికి వస్తె *హై-సెక్యూరిటీ జైలు* లో బంధించి నట్టు కోడలు ఫీలు అవుతుంది.. అత్త 'నియమాలు' కొడలు కు నచ్చవు...కోడలు తీరు అత్తకు నచ్చదు...
పిల్లల యొక్క ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుందో 
అత్తమామలతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ!  
వృద్ధ అత్తమామలతో కలిసి జీవించడం ప్రతి కోడలికి ఎంతో విజ్ఞాన దాయకం., ఎందుకంటే వారి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించడం వాళ్ళు చేస్తారు...తెలివైన కోడలు అయితే అత్తా మామలతో ప్రేమ గా ఉంటే సగం పనిభారం తగ్గినట్టే! అత్త గారే వంట చేస్తుంది...మామ గారే పిల్లలను బడికి పంపే బాధ్యత తీసుకుంటారు...కానీ వంటింట్లో ఏదో *దోచుకుపోతుంది* అని భయపడి కిచెన్లోకి రానివ్వని కోడళ్ళు...కోడలు ఇంట్లో సమకూర్చిన ప్రతి వస్తువు తన కూతురు ఇంట్లో ఉండాలని అనుకునే అత్తల వల్ల ఈ గ్యాప్ ఎక్కువవుతూనే ఉంది! భారతదేశంలో పవిత్రమైన కర్తవ్యంగా అత్త కోడళ్ళు ఉండాలి... కానీ ఈ తరం కోడళ్ళ లో మార్పు వస్తేనే కుటుంబ వ్యవస్థ మళ్ళీ చిగురిస్తుంది...
 *పెళ్ళిళ్లలో వింత పోకడలు*
1. *కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం (పిలిచిన వారు ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్లామని కూడా గుర్తుండదు)*
2. *ప్రొద్దున పెళ్లి అయితే, స్నానం కూడా చెయ్యని, చెమట కంపుతో, అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు, అర్థరాత్రి వంట చేసి, దానికి విందు అని పేరు పెట్టి, ప్రొదున వడ్డించడం... రాత్రి పెళ్లి అయితే సీన్ రివర్స్ అంతే.* 
3. *ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం. (కాబోయే వధూవరులను, పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు  అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం)*
4. *పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు photos కి pose. ఇంకా ఆ photos(కొన్ని intimate వి) కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం. పనికిమాలిన మంగళ స్థానం పేరున అమ్మాయిని నడి బజారులో కూర్చోబెట్టి అందరి ముందు తల స్నానం చేయించడం ఏమిటి నీతిమాలిన సంస్కృతి. ఈ మధ్య చిన్న పిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడి బజార్లో మంగళ స్థానాలు చేయడం, స్టేజీల పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటి నుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా  భావించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడలేని ఈ వింత సంస్కృతి ఈమధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది. దీన్ని రాబోవు తరాలు తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.*
5. *పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.*
6. *Photos Natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి  ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది. (photographer bill కూడా లక్షల రూపాయలు)*
7. *పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధా చేయడం*.
8. *భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల డిసెర్ట్స్ (ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు, ఆహుతులు, అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత. భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు)*
9. *పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి, photos కి pose ఇవ్వడం ఆ (photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), అనే ప్రక్రియ కూడా ఆక్షేపనీయం.*
10. *పెళ్లి జరిపించే పంతుళ్ళు మాటలను, శ్లోకాలను పట్టించుకోకుండా, కెమెరామాన్లు, వీడియో గ్రాఫర్ల భంగిమల కోసం జరుగుతున్న తంతు ఒక చిత్రాతి విచిత్రం.*
11. *DJ MUSIC అనే పేరుతో, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో, అర్థం పర్థం లేని సినిమా పాటలు.*
12. *కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం (వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).*
13. *ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని , పనికిమాలిన ఈవెంట్స్.*
14. *మద్యంతో కూడిన విందైతే, హాజరు 110%(బందు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు)*
15. *ఒక పెగ్గు కెపాసిటీ  వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు.*
16. *తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ పూజ పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం రిపీట్.*
17. *ఇంకా హనీమూన్ అనే  కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్ (ఇది కూడా లక్షల్లో)*
18. *ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే పనికిమాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు.*
19. *అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం.*
*పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతుకి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తు, అప్పుల పాలవుతున్నారు*.
*ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పులు చేసి బంధువర్గాలకు మొక్కుబడిగా ఫోన్చేసి మేము పిలిచాము అని చాటింపు చేసుకొని, ఇతర ముఖ్యమైన పనుల వల్ల ఫంక్షన్ కి వెళ్ళని వారితో కక్షలు పెంచుకోవడం ఎక్కడి సంస్కృతి. అందుకే మన ఆడంబరాలకు ఇతరులను ఇబ్బంది పెట్టడం మానుకుందాం ముఖ్యమైన ఫంక్షన్లకు మాత్రమే బంధువులందరిని ఆహ్వానిద్దాం చిన్న చిన్న ఫంక్షన్లను కుటుంబంలోనే చేసుకుందాం.*
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
*🧘🏻‍♂️ఈ పోస్ట్ చదివి కొంతమందన్నా మారుతారని ఆశిద్దాం🧘🏻*
😞🥺😞 😱🙇‍♂️😱 😞🥺😞
సేకరణ
 *నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు*✊✊

*బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు*

రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,
కానీ
నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.

*చేదు నిజం ఏమంటే*, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ  పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్,  మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,
టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. *ఆలోచించండి*.

రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి  తీరాలన్న నిబంధన పెడితే,
దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.

*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు  చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు*.
కానీ,
ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం *జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.
ఇలా ఎందుకు ఇవ్వాలి? 

నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.
కానీ,
భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?

రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.
కాని,
మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.
*రైతు తినేది దొంగ సొమ్మా?*
 *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం.

*విద్యలో రాజకీయం 100%*
*రాజకీయంలో విద్య 00%*
ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.
ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది*.

దేశంలోని ప్రతిభావంతులేమో
వలస పక్షులు అవుతున్నారు.

దేశంలోని  ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలకు 
వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.
అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.

*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*

*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*
అందరూ ఆలోచించాలి. మతం గురించి రాజకీయ నాయకులు రెచ్చగొడితే పేద వర్ణ ప్రజలు రెచ్చిపోయి సాటి మనిషిని దూరం పెట్టి, మతంలో మృగాలా మారిపోతున్నారు. కానీ అది రాజకీయ ఎత్తుగడ తెలుసుకోలేకపోతున్నాడు.

దయచేసి మన దేశంలోని ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
 తండ్రి ఆలోచన ☘☘  ప్రగతికి పునాది ☘☘

☘☘ "ఓయ్..రూమ్ లో నుండి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలీదా..?" కరకుగా ఉన్న నాన్న గొంతు విని..స్విచ్చాఫ్ చేసి వచ్చా.☘☘

☘"డ్రాయింగ్ రూమ్ లో ఎవరూ లేకపోతే టీవీ దేనికి..అది కూడా ఆఫ్ చేయమని చెప్పాలా ప్రత్యేకంగా..?" మళ్ళీ అదే గొంతు.☘

☘☘ విసురుగా టీవీ ఆఫ్ చేసి టేబుల్ పై ఉన్న ఫైల్ తీసుకుని..బైటకి నడిచా..☘☘

☘☘ఎందుకిలా అవుతున్నాడు నాన్న..ప్రతిదానికి కోప్పడటం,చిరాకు.,అసహనం..ఇంత చిన్న విషయాలక్కూడా పెద్దగా అరవడం.తానే ఫ్యాన్,టీవీ స్విచ్చాఫ్ చేయొచ్చుగా..నన్నే పురామయించడం దేనికి..చాదస్తం ఎక్కువౌతుంది ఈమధ్య.☘☘

☘☘ఇక నా వల్ల కాదు..ఈ అసహనం భరించడం..ఎలా అయినా ఇల్లు వదిలి పోవాల్సిందే..ఈయన గారి బాధ నుండి విముక్తి పొందాల్సిందే.☘☘

☘☘ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది..లేటౌతున్నా అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా తిట్టి పోస్తున్నాడు..☘☘

☘☘దేవుడా..ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడు..ఎలాగోలా ఇంటి నుండి బైటపడాలి.లేపోతే ఇంకా నాన్న విసుగు,కోపం,చిరాకు ఇంకొన్నాళ్లు భరిస్తే..పిచ్చెక్కక తప్పదు..మనసులో ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చేస్తుంది నాకు.☘☘

☘☘అంతలా టార్చర్ చేస్తున్నాడు నాన్న.సంపాదన లేదు.,ఇల్లు వదిలి బైటకు పోలేనని అలుసు.
ఎదడిగినా..ఇప్పుడొద్దు,తర్వాత చూద్దాం..నాన్చడం తప్ప ఇంకేం తెలీదు.ఏదో ఈరోజు ఓ 500 ఇచ్చాడు ఇంటర్వ్యూ అని.☘☘

☘☘బస్ కోసం వెయిట్ చేశా..రావట్లే..ఇక లాభం లేదని ఆటోలో బయల్దేరి..సరైన సమయానికే చేరుకున్నా.☘☘

☘☘పెద్ద భవనం..గేట్ దగ్గర ఎవరూ లేరు అడ్డదిడ్డంగా ఉన్న గేట్ ను దాటి పొందిగ్గా మళ్ళీ చేరవేసా..లోన భవనం వరకు మంచి రహదారి..దారి చుట్టూ పూల మొక్కలు..డీసెంట్ గా ఉంది..మొక్కలకు నీళ్లుపోసే పైపు రహదారిపై పడి నీళ్ళన్ని పోతున్నాయి..మాలి ఎక్కడ చచ్చాడో..చుట్టుపక్కల లేదు..చిరాగ్గా పైపుని తీసి మొక్కల పక్క పెట్టి ముందుకి నడిచా..☘☘

☘☘రిసెప్షన్ లో ఎవరూ లేరు..ఒక బోర్డ్ తప్ప.అందులో 3వ అంతస్తులో ఇంటర్వ్యూ అని రాసుంది.తడిగా ఉన్న బూటుకాళ్ల ప్రింట్స్ చూస్తూ మీదకి వెళ్లబోయి ఆగా..డోర్ మేట్ పక్కనే తిరగేసి పడుంది..ఆప్రయత్నం గా దాన్ని సరిచేసి బూట్లు దానిపై తుడిచి..పై అంతస్థులకి వెళ్ళా.☘☘

☘☘ఇంటర్వ్యూ రూమ్ హడావిడిగా ఉంది.చాలా మంది వచ్చారు..రెండు సెక్షన్లలో కూచున్నారు..ఒక సెక్షన్ ఖాళీ అయింది..రెండో సెక్షన్లో కూర్చున్న నాకు..ఖాళీ అయిన సెక్షన్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపించాయి..చెవిలో జోరీగలా..నాన్న సౌండ్..☘☘

☘☘చిరాగ్గా ఫ్యాన్ల స్విచ్ఛాఫ్ చేసి కూర్చున్నా.☘☘

☘☘ఒక్కొక్కరే బాస్ రూమ్ లోనికెళ్లి అటునుంచి ఆటే వెళ్తున్నారు..ఇంటమందిలో నేను సెలెక్ట్ కావడం కల్ల అని ముందే డిసైడ్ అయిపోయానేమో..టెన్షన్ లేదు..చిరాకు తప్ప.☘☘

☘☘ఇంతలో నా టర్న్ రానే వచ్చింది..లోపల సూట్లలో నలుగురు కూర్చుని లాప్టాప్ లో ఏదో సీరియస్ గా చూసుకుంటున్నారు..☘☘

☘☘నన్ను కూర్చోమని కూడా అసలే..సర్టిఫికెట్స్ ఫైల్ అందించినా తీస్కోలే..ఒకాయన పేరడిగాడు అంతే..ముక్తసరిగా చెప్పా..రెండో ఆయన చెప్పాడు.."యువర్ ఇంటర్వ్యూ ఈస్ ఓవర్..యూ కెన్ గో"☘☘

☘☘కోపం నషాలానికి అంటుతున్న వేళ..మూడోవ్యక్తి ఒక కవర్ అందించి చెప్పాడు.."కంగ్రాట్స్..యూ ఆర్ ఇన్..ఇది మీ అపోయింట్మెంట్ ఆర్డర్."
నిష్చేస్తుడైన నేను.. ఆప్రయత్నం గా ఆడిగేసా.."కానీ..మీరు నన్నేమీ అడగలేదు.."☘☘

☘☘నాలుగో వ్యక్తి తనముందున్న లాప్టాప్ నావైపు తిప్పి చూడన్నట్లు సైగ చేసాడు..అందులో ఉన్నది..నేనే..గేట్ ను పొందిగ్గా పెట్టడం నుంచి..పైప్.,డోర్ మాట్.,ఫాన్స్ స్విచ్ ఆఫ్ చేయడం..అన్నీ..సీసీకెమెరా రికార్డింగ్..☘☘

☘☘మొదటి వ్యక్తి చెప్తున్నాడు నెమ్మదిగా "మాకు qualifications తో పాటు మనిషికి ఉండాల్సిన కనీస బాధ్యతలు కూడా కావాలి..ఇవన్నీ ఇంటర్వ్యూలో ఒక భాగమే.అందులో మీరు నెగ్గారు."☘☘

☘☘ఆనందంతో నోట మాట రాలేదు..☘☘
☘☘బైటకొచ్చాక కాస్త తేరుకున్నా.☘☘

☘☘సడెన్ గా చెళ్లున కొట్టినట్టు ...నాన్న.,తన మాటలు గుర్తొచ్చాయి.అంటే ..నాన్న నన్ను బాధ్యతాయుతంగా ఉండడానికి ఇలా అంటుండేవాడా..ఎంత అపార్ధం చేసుకున్నా నాన్నా నిన్ను..కళ్ళంట నీళ్లు తిరిగాయి.☘☘

☘☘రాయిలాంటి నన్ను..అందమైన శిల్పంగా మార్చడానికి ఉలితో కొట్టిన దెబ్బలే అవి..నొప్పి ఫీల్ అయ్యానే తప్ప..నాలో వచ్చిన అందమైన మార్పు గమనించలేకపోయా.☘☘

☘☘అమ్మ తన ప్రేమతో లాలించి పెద్ద చేసి అమృత హృదయురాలుగా మదిలో నిలిస్తే..నాన్న తన ప్రేమని గుండెలో దాచుకుని కరకుగా నా భవిష్యత్తుని షేప్ చేస్తూ..తను మాత్రం నా దృష్టిలో గుండేలేని పాషాణంగానే గుర్తించబడుతున్నాడు.☘

☘☘అమ్మ ప్రేమను గ్రహించగలుగుతున్నాం..నాన్న ప్రేమ వేరెవరో చెప్తే.. గుర్తుచేస్తే గాని గ్రహించలేం.☘☘

☘☘బాల్యం లో నాన్నప్రేమ అనిర్వచనీయంగా..యవ్వనంలో విలన్ గా,శాడిస్ట్ గా..పోయిన తర్వాత గాని..మనల్ని మలచిన ఒక గైడ్ గా భావించగలమే తప్ప...నిజంగా అర్థం చేసుకోడానికి ఎప్పుడూ ప్రయత్నించం.☘☘

☘☘తండ్రి లేకపోతే కూతురు వద్ద నైనా తల్లి ఉండగలదు..కానీ తల్లి లేకపోతే తండ్రికి కూతురి వద్ద కూడా ఉండడానికి వీల్లేని దుస్థితి.☘☘

☘☘ఒంటరిగానే ఉండి...పో..వా..లి.☘☘

☘☘చనిపోయిన తర్వాత ఫోటోకి దండేసి..నమస్కారం పెట్టే బదులు..బ్రతికుండగానే తండ్రిని అర్థం చేసుకుని అతనిని నొప్పించ కుండా ఉండే 
మహానుభావులందరికీ....హృదయ పూర్వక అభినందనలు....☘☘

☘☘ఒక క్షణం అర్థం చేసుకుంటే ఎనో ఎన్నెనో సమస్యలకి పరిస్కారం కనిపిస్తుంది..☘☘

☘☘అందరు బాగుండాలి అని స్కై ఫౌండేషన్ మనస్పార్తి గా కోరుకుంటుంది...☘☘

☘☘సదా అందరి మంచి కోరే మీ ☘☘

డాక్టర్ వై. సంజీవ కుమార్, 
ఫౌండర్ & ప్రెసిడెంట్, 
స్కై ఫౌండేషన్.
☘☘ 9493613555☘☘
☘☘ 9393613555☘☘
 

#ప్రదీప్‌_మెహ్రా 2022 మార్చి 
ఇతని గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. 
ఈ ప్రదీప్ మెహ్రా నుండి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

స్కూల్‌కు ఏసి బస్‌..
అడిగిన వెంటనే షూస్‌..
కోరిన సీట్‌ రాకపోయినా డొనేషన్‌ సీట్‌..
ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమండేషన్‌..

పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి?
కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి ?
కష్టాలను ఎదుర్కొనడమూ, ప్రతికూలతను జయించడమూ జీవితమే" అని ఎప్పుడు తెలుసుకోవాలి?
పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా?

నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్‌ మెహ్రా నుంచి.. మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?
ముందు ప్రదీప్‌ మెహ్రా గురించి తెలుసుకొని మళ్లీ మన పిల్లల దగ్గరకు వద్దాం.

మొన్నటి శనివారం రోజు.
 అర్ధరాత్రి.. ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా. సినిమా దర్శకుడు వినోద్‌ కాప్రి తన కారులో వెళుతుంటే ఒక యువకుడు బ్యాక్‌ప్యాక్‌తో పరిగెడుతూ వెళుతున్నాడు. 
అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు. ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు. 
వినోద్‌ కాప్రికి ఆశ్చర్యం వేసింది... ఈ టైమ్‌లో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని. 
కారులో అతణ్ణే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్‌ చేశాడు.

👉 *'ఎందుకు పరిగెడుతున్నావ్‌?'*
*'వ్యాయామం కోసం'*
 *'ఈ టైమ్‌లోనే ఎందుకు?'*
 *'నేను మెక్‌డోనాల్డ్స్‌లో పని చేస్తాను. వ్యాయామానికి టైం ఉండదు. అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్‌కు చేరుకుంటాను'*
 *'నీ రూమ్‌ ఎంతదూరం?'*
 *'10 కిలోమీటర్లు ఉంటుంది'*
 *'అంత దూరమా? కారెక్కు. దింపుతాను'*
 *'వద్దు. నా ప్రాక్టీసు పోతుంది'*
 *ఇంతకీ ఎందుకు వ్యాయామం?'*
 *'ఆర్మీలో చేరడానికి'*

ఆ సమాధానంతో వినోద్‌ కాప్రి ఎంతో ఇంప్రెస్‌ అయ్యాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్‌ మెహ్రా. వయసు 19. ఊరు ఉత్తరాఖండ్‌ అల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊరిలో జబ్బు పడి ఆస్పత్రిలో ఉంది. తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్‌కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్‌ 16లో ఉండే మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ డ్యూటీ. మళ్లీ వంట పని. వీటి వల్ల వ్యాయామానికి టైమ్‌ ఉండదు. అందువల్ల ప్రతిరోజూ డ్యూటీ అయ్యాక (రాత్రి 10.40కి) బ్యాక్‌ప్యాక్‌ తగిలించుకుని బరోలా వరకు పరుగు మొదలెడతాడు. 'కనీసం కలిసి భోం చేద్దాం రా' అని వినోద్‌ కాప్రి అడిగితే ప్రదీప్‌ మెహ్రా చెప్పిన జవాబు 'వద్దు. రూమ్‌లో అన్నయ్య ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్లి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది. వాడికి నైట్‌ డ్యూటీ' అన్నాడు.

వినోద్‌ కాప్రి ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే గంటల వ్యవధి లో 40 లక్షల మంది చూశారు. ప్రదీప్‌ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రైటర్‌ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్‌ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్‌ ఇప్పిస్తానన్నాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్‌ పంపించాడు. ఆనంద్‌ మహీంద్ర అయితే 'ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిస్తారు' అని ట్వీట్‌ చేశాడు. 'ఈ కాలపు పిల్లలు ఇతణ్ణి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అన్నారు ఎందరో. నిజం. తప్పక నేర్చుకోవాల్సింది ఉంది.
                 
👉 ప్రదీప్‌ మెహ్రా నుంచి పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి...?

🎁 1. లక్ష్యం కలిగి ఉండటం: ప్రదీప్‌ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు. కాని అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.

🎁 2. చిత్తశుద్ధి: లక్ష్యం కలిగి ఉండటమే కాదు. దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్‌ తన రొటీన్‌ను ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్లీ రాత్రి రూమ్‌కు వెళ్లి వంట, మధ్యలో డ్యూటీ... ఇవన్నీ చేస్తూ పరుగు. రోజూ రాత్రిళ్లు అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్‌ ఇస్తామని అడుగుతారు. ఈ ఒక్కరోజు బండెక్కుదాం అని అనుకోకుండా పరుగెడుతున్నాడు. దర్శకుడు వినోద్‌ కాప్రి అడిగినా అతడు కారు ఎక్కలేదు.

🎁 3. కుటుంబం ముఖ్యం: ప్రదీప్‌కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్లి వంట చేయాలని ఉంది. ఆర్మిలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దృష్టి ముఖ్యం.

🎁 4. ఆకర్షణలకు లొంగకపోవడం: గత 24 గంటల్లో ప్రదీప్‌ స్టార్‌ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. మీడియా వెంటపడుతోంది. ప్రదీప్‌ వయసున్న కుర్రాళ్లు తబ్బిబ్బయ్యి ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు. కాని 'నన్ను డిస్ట్రబ్‌ చేయకండి. పని చేసుకోనివ్వండి' అన్నాడు ప్రదీప్‌.

🎁 5. కష్టేఫలీ: 'మిడ్‌నైట్‌ రన్నర్‌'గా కొత్త హోదా పొందాక 'నువ్వు ఇచ్చే సందేశం' అని అడిగితే 'కష్టపడాలి. కష్టపడితే లోకం తల వొంచుతుంది' అని జవాబు చెప్పాడు.

👉 పిల్లలను పూర్తి కంఫర్ట్‌ జోన్‌లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడటంలో తప్పు లేదు. కాని సవాళ్లను ఎదుర్కొని, ఎదురుదెబ్బలకు తట్టుకుని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్‌ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు.
 @ ఎంపిక @

Two roads 
diverged in a wood, 

and I—
I took the one 
less traveled by,

And that 
has made all the difference.

అంటాడు రాబిట్ ఫ్రాస్ట్ 

కళ్ళెదుట 
రెండు దారులు 

ఒకటే ....
ఎంచుకోగలను నేను 

గుంపులు పయనించని దారిని ఎంచుకున్నాను 
 
అదిగో ....
అదే మార్చింది జీవితం 

******

ఎంపిక
అతి ప్రధానమైన సమస్య 

ఆర్థిక శాస్త్రం లోనూ... 
జీవ శాస్త్రంలోనూ కూడా 

పరిసరాలలో 
సర్దుబాటు చేసుకోగల జీవులనే 
ఎంపిక చేసుకుంటుంది ప్రకృతి
బలమైనవీ తెలివైనవీ కూడా అంతరించిపోతాయి....

ద్రవ్యం పరిమితం ...
అవసరాలు అపరిమితం ....
అలాంటప్పుడు అత్యవసరమైన వాటినే 
గుర్తించి ఎంపిక చేసుకోవాలంటుంది ఆర్థిక శాస్త్రం 
మిగిలిన వాటిని వృథా ఖర్చుగానే పరిగణించమంటుంది 

*********

ఇప్పుడు ... 
ఈ చర్చ అంతా ఎందుకూ అంటే

విత్తం ... 
పరిమితం.
జ్ఞానం అపరిమితం 
కాలమూ బహు స్వల్పం.
చదవాల్సిందీ తెలుసుకోవాల్సిందీ అనంతం ...

కాబట్టి...
ఎంపిక ఒక కీలకమైన అంశం 
చదువరికీ... 

ఎటువంటి పుస్తకాలు చదవాలి
అసలు ఏ ఏ  పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి
ఒక అవగాహన ఉండాలి 

లేకపోతే ....
ధనమూ... సమయమూ... 
కడకూ జీవితమూ వృథా వృథా ....

*********

ఏంటీ ... 
ఒక పుస్తకం చదివి ఉండక పోతేనే 
జీవితం వృథానా... అంటారా 

అవును ... వృథానే ....
ఒక పుస్తకం... లేదా జీవితంలో సంభవించే ఒకానొక ఘటన.... మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది తెలుసా....

*********

శారీరకంగా దుర్భలుడూ 
మానసికంగా బిడియస్తుడూ 
నలుగురిలో కలవక ఏకాంతాన్ని ఇష్టపడేవాడూ 
అయిన గాంథీ....

ఒక వేళ 
సత్య హరిశ్చంద్ర నాటకాన్ని
చూసి ఉండకపోతే 

ఒక వేళ 
ఓ అర్థ రాత్రి 
ఫస్ట్ క్లాస్ కోచ్ నుండి
అతనిని మెడ బట్టి గెంటి ఉండకపోతే 

ఒక వేళ 
దక్షిణాఫ్రికాలో 
భారతీయుల దుస్థితిని 
అతను కాంచి ఉండకపోతే

ఏమై ఉండేది చెప్పండి... 

************

ప్రపంచాన్నీ 
దాని దృక్పథాన్ని 
మలచినా.... మలుపు తిప్పినా 
కారల్ మార్క్స్.... అంబేద్కర్.....
జ్యోతిబా..... పెరియార్.... లెనిన్....
వంటి మహనీయులందరూ మంచి చదువరులే తెలుసా 

ఒకానొక... 
లేదా కొన్ని పుస్తకాల చేతా 
ఒకానొక ... లేదా కొన్ని సంఘటనల చేతా
వాళ్ళంతా ప్రభావితులైన వాళ్ళే తెలుసా

*********

చివరిగా ఒక మాట 
మనం ఎటు వైపు నిలబడాలి.
మనం ఎవరి పక్షం వహించాలి.
అసలు మనం ఎలా జీవించాలి.
అన్నది కూడా ఒక ఎంపికే 

సత్యం వైపా
లేక అసత్యం వైపా ....

మానవత్వం వైపా 
లేక మతం వైపా ....

మూఢత్వం వైపా 
లేక శాస్త్రీయత వైపా ....

ఉన్మాదుల వైపా 
లేక సంయమనం వైపా ...

కపటం వంచన వైపా 
లేక స్నేహం ప్రేమా సుహృద్భావం వైపా ....

పురోగమనం వైపా 
లేక తిరోగమనం వైపా ....

ఎంపిక ఎటువైపు
అన్నది కూడా ఐచ్చికమే సుమా ....

స్వార్థంతో బతికామన్న వేదనతో కాక
అర్థవంతంగా జీవించామన్న ఆత్మతృప్తితో...
అనంత శూన్యంలోకి లయమైపోవాలి మనం.

- రత్నాజేయ్ (పెద్దాపురం)

*****సానుభూతి ఒక "అనుభూతి" !!

 *సానుభూతి ఒక "అనుభూతి" !!* (బండారు రాం ప్రసాద్ రావు)🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷గాయపడ్డ శునకాన్ని లేదా పక్షుల్ని, పావులరాలిని, జంతువులను దరిచేర్చుకొని నిమిరి కాస్తా మందు పెట్టీ ఉపశమనం కలిగిస్తే అవి ఎంతో కృతజ్ఞత భావంతో ఉంటాయి...అయితే భౌతిక స్పర్శ వల్ల జంతువులే అంత ఆరాధన భావంతో ఉంటే అస్వస్థత తో లేదా కాలో చెయ్యే విరిగి, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆత్మీయ మిత్రులను పలకరించి ఆయన చేరిన ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చుని కాసేపు ఆయన చెయ్యి దగ్గరి కి తీసికొని ధైర్యం చెబితే ఆ వ్యక్తికి కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఆ చేతిని గుండెల మీద పెట్టుకుంటాడు...అలాగే ఎవరైనా మరణించిన మనిషి తాలూకూ బంధు వుల ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించి కాసేపు ఉపశమనం మాటలు నాలుగు చెబితే వారిలో ఎంతో ఆప్యాయత అనురాగం ఏర్పడుతుంది...ఖర్మ కాలి నేటి పలకరింపులు కూడా ఓటు బ్యాంక్  రాజకీయం కోసమో లేక ఏదో ప్రయోజనం కోసమో చేస్తున్నట్టు అనిపిస్తుంది...సానుభూతి అంటే అదొక భావోద్వేగ సన్నివేశంగా భావించాలి...కపట నాటకం కాకుండా ఉండాలి! ఇటీవల హఠాత్తుగా భార్య చనిపోయి భాధలో ఉన్న వ్యక్తి తన బాధను అంత దిగమింగుకుని  తనను పరామర్శించడానికి వచ్చిన వారిని పలకరిస్తుంటే...ఒక ఆవిడ "చిన్న వయసులో భార్య పోయింది...పిల్లలు చిన్నవాళ్ళు...మీకు ఆడదిక్కు" అవసరం అని వాళ్ళ బందువులు ఆమె అనడం విని అదే టైం లో వెళ్ళన నన్ను పలకరించి నట్టే పలకరించి, తన బెడ్ రూం లోకి వెళ్లి బోరున ఏడుస్తున్నాడు..."ఏమైంది బాబు అంటే "భార్య పోయి నేను దుఃఖం లో ఉంటే పది రోజులు కాక ముందే ఆడదిక్కు కావాలి అని అనడం ఇదీ సానుభూతా బాబాయ్" అని రోదించాడు! సమాజం ఎంత దిగజారింది అంటే ఒకడు ఎలా బ్రతకాలి అన్నది కూడా సమాజమే నిర్ణయిస్తుంది.. అలా ఉంటాయి లోకం మాటలు !! ఇటీవల ఒక వ్యక్తి చనిపోయి ఆ కుటుంబం దుఃఖంలో ఉంది...శవాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో ఎక్కడ దహనం చేయాలో అనే మీమాంస ఆ కుటుంబంలో ఉంది అదే సమయంలో దగ్గరగా ఉన్న శ్మశాన వాటిక కు వెళ్లి అంత్యక్రియలకు అయ్యే ఏర్పాట్లు చేసి ఇంటి దగ్గర టెంట్ వేయించి ఒక పాతిక కుర్చీలు వేయించి, వచ్చే బంధువులకు తాగడానికి నీళ్ళు, ఇంటి ముందు శవ సంస్కారం చేసే ఏర్పాట్లు,  అనంతరం అంతిమ యాత్ర కు వాహనం సిద్ధం చేయడమే కాకుండా శవ  దహనం అయ్యాకా స్నానాలకు ఏర్పాట్లు, తరువాత ఇంటి కుటుంబ సభ్యులకు బంధువులకు ఇంత ఆన్న పానీయాలు ఇప్పించే వ్యక్తిని ఆ కుటుంబం జీవితాంతం మరవదు!! అది అసలైన ఆత్మీయ పరామర్శ!!🌷🌷🌷🌷🌷🌷🌷 మంచి 
 లేదా చెడు ఆయా  వ్యక్తులపై వారి శ్రేయస్సుపై దృష్టి సారించి వారినీ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. భావోద్వేగ దుఃఖంలో ఉన్న వ్యక్తి కి ఉపశమనం కలిగించే విధంగా మాటలు ఉండాలి...పోయినోళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉన్నోళ్ళు వారి తీపి గుర్తులు అనే విధంగా బంధువులకు రీసీవ్ చేసుకుంటే కుటుంభానికి గౌరవ మర్యాదలు దక్కుతాయి....అందరూ సమాజంలో స్వార్థ పరులు ఉండరు...ఇంకా మంచి బ్రతికి ఉంది... ఎందుకంటే ప్రజలందరికీ భావోద్వేగాలపై సాధారణ అవగాహన ఉంటుంది. ఆ అవగాహన శ్రుతి మించకుండా ఉండాలి... 
అటువంటి ప్రవర్తన స్వీయ-సంతృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే మీతో కనెక్ట్ అయిన వ్యక్తికి ఏదో ఒక మార్గంలో (కుటుంబం, సామాజికం,  ఆర్థికంగా) సహాయం చేసిన వాళ్ళు పట్ల ఆ  కుటుంబం మీరు కనబడగానే బోరున విలపిస్తారు. నిస్వార్థత వ్యక్తులకు ఆ ఆప్యాయత లభిస్తుంది. సానుభూతి క్రియాత్మక సమాజాన్ని నిర్వహించడానికి అవసరమైన ఇవ్వడం మరియు తీసుకోవడం యొక్క చక్రాన్ని సులభతరం చేస్తుంది!! అదే అసలైన మానవత్వం! కేవలం ప్రయోజనం ఆశించి ఏ పని చేయకూడదు!!
 *✍🏼 నేటి కథ ✍🏼*


*తగిన శాస్తి*


 పూర్వము గుర్రాల వ్యాపారులు ప్రతి నగరంలోనూ ఉండేవారు. విజయ నగర సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని గుర్రాల వ్యాపారి ప్రజలను మోసం చేస్తూ గుర్రాలను అమ్మేవాడు, కొనేవాడు. ఇది గమనించిన మంత్రి కుమారుడు ఆ గుర్రాల వ్యాపారికి గుణపాఠం చెప్పాలని వేషం మార్చి ఒకరోజు మేలుజాతి అరేబియా గుర్రం ఎక్కి ఆ పట్టణానికి చేరాడు. ఆ పట్టణంలో అశ్వప్రదర్శన జరుగుతుంది. ఆ గుర్రాల వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు. మంత్రి కుమారున్నీ, గుర్రాన్నీ చూశాడు. దానిని కొంటానని తక్కువ ఖరీదు చెప్పాడు. మంత్రి కుమారుడు అంగీకరించలేదు. కొంచెం కొంచెం పెంచుతూ ఆఖరి ఖరీదు చెప్పాడు వ్యాపారి.

     "ఇంత విలివైన గురాన్ని అంత తక్కువకు అడగటం నిజంగా మోసం చెయ్యటమే అవుతుంది. పోనీ నువ్వు దీన్ని కావాలనుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద ఈ గుర్రాన్ని అమ్ముతాను సరేనా?" అన్నాడు మంత్రి కొడుకు. గుర్రం మీద ఉన్న మోజుతో అంగీకరించి షరతు చెప్పమన్నాడు వ్యాపారి. "ఏమీలేదు. మూడు కొరడా దెబ్బలు తింటే గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు యిస్తా"నన్నాడు.

    వ్యాపారికి కోపం వచ్చింది. అయినా పేరాశకు లొంగిపోయాడు. మంత్రి కుమారుడు కొరడా ఎత్తి 'చెళ్' మని కొట్టాడు. "అబ్బా"... అని మూల్గి "ఇంకా రెండు... కానీ..." మళ్ళీ కొరడా 'చెళ్' మంది.
"ఆ! తర్వాత మూడోది కూడా కానీ" అన్నాడు వ్యాపారి. మంత్రి కొడుకు కొరడాను మడిచి "మూడో దెబ్బ నువ్వు తింటే కదా గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు ఇచ్చేది. నీవు మోసపూరిత వ్యాపారం చేస్తున్నావు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో" అంటూ వెళ్ళిపోయాడు. వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు. వ్యాపారికి తగిన శాస్తి జరిగిందని అక్కడి వారందరూ సంబరపడ్డారు.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

శ్రీ రమణీయం - 41, ఇంద్రియాల నియంత్రణతోనే ఆత్మశాంతి

 🌹 శ్రీ రమణీయం - 41 🌹
👌 ఇంద్రియాల నియంత్రణతోనే ఆత్మశాంతి👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

✳️ *కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక.... అనేవి ఐదు బాహ్యేంద్రియాలు. ఇవి మనకు రూపాన్ని, వాసనను, శబ్దాన్ని, స్పర్శను, రుచిని అందించే పరికరాలుగా ఉన్నాయి. మన శరీరానికి కష్టసుఖాలు, మనసుకు సంతోష, దుఃఖాలు కలిగేది ఈ ఇంద్రియాల వల్లనే. మనలోని ఆత్మ పరిపూర్ణ శాంతితోనే ఉంది. కానీ మన మనసు ఆ ఆత్మ శాంతిని పొందలేకపోతుంది. అందుకు కారణం ఇంద్రియాలు అందించే అనుభవాలు. అవే మనసు ఆత్మభావన నుండి దూరం చేసి శరీర భావనను కలిగిస్తున్నాయి. మనం నిద్రించేటప్పుడు ముందుగా బాహ్యేంద్రియాలు సద్దుమణిగి ఇంద్రియాల భావన (అంతరేంద్రి యాలు) మిగిలి ఉంటుంది. అదే కొంతసేపు స్వప్నంగా నిలిచి ఉంటుంది. ఆ తర్వాత గాఢనిద్రలో ఇంద్రియాలు పూర్తిగా అణిగి ఉంటాయి. అక్కడ ఏ భావనా లేని శాంతి స్థితి మాత్రమే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవం లోనిదే. ఈ శాంతిని నిత్యజీవితంలో కూడా సాధించడమే ఆధ్యాత్మిక జీవనం.*

✳️ నిద్రలో సద్దుమణిగిన ఇంద్రియాలు నిత్యజీవితంలో తిరిగి విజృంభించటం వల్లనే ఆ శాంతి దూరం అవుతుంది. స్విచ్ ఆపిన టి.వి. అప్పటికి తన కార్యకలాపాలను ఆపినా మళ్లీ స్విచ్ వేస్తే తిరిగి తన పనులన్నింటినీ యధాతథంగా కొనసాగిస్తుంది. మన నిద్రకూడా అలాంటిదే. నిద్రలో ఇంద్రియాలు లేవు కనుక, నేను అనే భావన లేదు. కానీ అక్కడ మనం శాంతిగా ఆత్మస్వరూపంలో ఉన్నాం. మనలో శాంతిగా ఉన్న ఆత్మ భావనే అసలైన ‘నేను'. ఇంద్రియానుభవంతో మనకికలిగే శరీర భావనే దొంగ 'నేను'. మనకి ఆ లోపల ఉన్న అసలు 'నేను' తెలియకపోయినా బయట కనిపించే దొంగ 'నేను' తెలుస్తూనే ఉంది. మనకి తెలిసిన బయటి నేనుతో చేసే ఆధ్యాత్మిక సాధనతోనే తెలియని లోపలి నేను అనుభవంలోకి వస్తుంది.

✳️ మనప్రతి అనుభవానికి ఇంద్రియాలు కారణం. ఇంద్రియాలు లేని సుఖాన్ని, దుఃఖాన్ని మనం ఊహించలేము. శాంతిగా ఉన్న లోపలి నేను గురించి మనకి ఏ దిగులు లేదు. ఆ శాంతిని మనం అనుభవించకుండా చేస్తున్న ఇంద్రియాలే సమస్యగా ఉన్నాయి. కనుక ఇంద్రియాలనే జాగ్రత్తగా వాడుకోవాలి. దుఃఖం కలుగుతుంది బయటి నేనుకే. కనుక, పరిష్కారం కూడా దాని విషయంలోనే అవసరం. ఇంద్రియాలు ఏ అనుభవాన్ని అందించని నిద్రలో అసలు నేను తాలూకూ శాంతిని మనం అనుభవిస్తున్నాం. ఈ శాంతి మనకు నిరంతరం అందాలంటే ఇంద్రియాల పనులను ఆపాలి. 

✳️ జీవనంలో ఇంద్రియాలను పూర్తిగా ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. కనుక, వాటి కార్యకలాపాలను వీలైనంతగా తగ్గిస్తే మనలోని శాంతి క్రమేణా వ్యక్తమౌతుంది. అంటే అనవసర విషయాల్లో ఇంద్రియాల వ్యాపారం, వ్యాపకం తగ్గిస్తే సరిపోతుంది. ఆత్మానుభవం జరగాలన్నా, దైవదర్శనం కావాలన్నా మనం ఇంద్రియాల ద్వారా జరిగే పనులను నియంత్రించాలి. ఆధ్యాత్మికత వైపు ఇష్టం బలపడితే మన మనసు తెలియకుండానే ఇంద్రియ వ్యాపారం తగ్గించు కుంటుంది. ఆ స్థితి కలిగే వరకూ మనమే ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాల పనులను నియంత్రించుకోవాలి.

✳️ ఇంద్రియాలను నియంత్రించుకోవాలంటే మనకు ఏది అవసరమో, ఏది అనవసరమో గుర్తించి, మసలుకునే వివేకం కావాలి. అంటే మన బుద్ధి సక్రమంగా పనిచేయాలి. నిజానికి ఆత్మానుభవం బుద్ధిస్థాయికి మించిందే అయినా ఆ బుద్ధిని బుద్ధి కుశలతతోనే దాటగలం. కనుక బుద్ధిని బాగుచేసుకోవడం చాలా ముఖ్యం. బుద్ధి అంటే మంచి చెడుల వివేచన. అది కలిగిన రోజు చెడును వదిలి మంచిని మాత్రమే స్వీకరించగలుగుతాము. 

✳️ మనకి ఆత్మ గురించి ఏ జాగ్రత్తలూ అవసరం లేదు. కానీ ఆ ఆత్మ తెలియాలంటే బుద్ధి విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన సచ్ఛీలమంతా బుద్ధిపైనే ఆధారపడి ఉంది. ఇంద్రియాల ద్వారా ఏ చెడు జరక్కూడదన్న సూచననే మన పెద్దలు చెడుఅనకు, చెడుకనకు, చెడువినకు, చెడు తినకు, చెడునుఆనకు (అంటుకోకు) అనిచెప్పారు. మనం మనకి అసాధ్యమైన విషయాల్లో దేవుడ్ని, గురువుని ఆశ్రయిస్తాము. అలానే మంచి బుద్ధిని ప్రసాదించమని అడుగుతూ ఉంటాం. గురువైనా సరేనేరుగా మన బుద్ధిని మార్చరు. బుద్ధిని మార్చుకునేందుకు మనం చేసే దుర్గుణాల విషయంలో కూడా అంత దూరంగా ఉండాలి. ఉదయం నిద్రలేచేటప్పుడే మన బలహీనతలు దాటాలన్న దృఢ సంకల్పంతో ఉండాలి. శాంతి జీవనానికైనా, ఆత్మ దర్శనానికైనా సుగుణమే అవసరం. *మితమైన ఆలోచనలు, మంచి తలపులు మనశ్శాంతిని ఇస్తాయి.* మనసుని కలుషితం చేసే క్రియల జోలికి వెళ్లకూడదు. అందుకు తరుణోపాయమే భగవన్నామస్మరణం, నామజపం చేస్తున్నప్పుడు మన వ్యాపకాలు తగ్గటం వల్ల మనకి శాంతి కలుగుతుంది. అదే రకంగా వ్యాపకాలను తగ్గించి నిత్యజీవితంలో శాంతిని కొనసాగించాలి.

✳️ భక్తుని పారవశ్యానికి ప్రతిఫలంగా రూపంతో దర్శనమిచ్చే దైవం ఆత్మాన్వేషికి అణువు అణువులో కనిపిస్తాడు. భగవంతుడ్ని తత్వరూపంలో దర్శించే జ్ఞానాభిలాషికి జరిగే ప్రతి క్రియలోనూ, ఆ క్రియ ఫలంగా జరిగే 'ప్రతిక్రియ’ (ఫలం) లోనూ దైవమే ఉన్నాడని తెలుస్తుంది. దైవం ఈ సృష్టి అంతటా అన్ని పనులుగా, ఆ పనులకు లభించే ఫలం గానూ ఉన్నాడు. అందుకే మనకి అనుకూలమైన 'ఫలాల కోసం దైవాన్ని ప్రార్థిస్తాము.

మన క్రియకు జరిగే ప్రతిక్రియే (రియాక్షన్) అనుభవాన్నిస్తుంది. ప్రతిక్రియ దైవమే కనుక ప్రతీ అనుభవము దైవమే. ఉప్పు తింటే బి.పి. పెరగటం, మందువాడగానే బి.పి. తగ్గటం అనే రెండు ప్రతిక్రియల్లోనూ దాగి ఉన్నది దైవమే. మన గుండె స్పందన మనకి తెలుస్తుంది గానీ మన కాలేయం ఉనికి మనకి తెలియదు. అయినా కాలేయం ద్వారా మనలో ఎంతో పని జరుగుతూనే ఉంది. ఈ విధంగా మనలో తెలిసినవి, తెలియనివి అనేక క్రియలు దైవానికి ప్రతిరూపంగా జరుగుతున్నాయి. ఆ దైవాన్ని దర్శించే సూక్ష్మదృష్టిని సాధించడమే సాధనలో పరమార్థం.

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

****మంచిని పెంచండి!

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


         *మంచిని పెంచండి!*
              ➖➖➖✍️

```
ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఉన్న చిన్న పిల్లలు అందరికీ పుచ్చకాయలు తినే పండగ చేసేవాడు.

దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలిమి రకం పుచ్చకాయలని ఎన్నుకునేవాడు. పిల్లలకి ఒక కండీషన్ పెట్టేవాడు, పుచ్చకాయ తినేటప్పుడు గింజలని కొరకకూడదు, వాటిని తీసి ఆ రైతుకి ఇవ్వాలి. ఎన్ని వాటర్ మెలన్స్ అయినా తినొచ్చు. చిన్న పిల్లలు కూడా ప్రతి సంవత్సరం పుచ్చకాయల పండగ కోసం ఎదురు చూసేవారు. నిజానికి ఇదొక స్ట్రాటజీ.

వారం రోజుల పుచ్చకాయల పండగ అయ్యాక ఆ గింజలని వచ్చే సంవత్సరం కోసం విత్తనాలుగా దాచేవాడు. ఆ తర్వాత సంవత్సరం మరింత మేలైన పుచ్చకాయలు కాసేవి. వాటిల్లో అత్యంత మేలిరకం వాటిని మళ్ళీ వారం రోజులు వాటర్ మెలన్ తినే ఫెస్టివల్ జరిపి మళ్ళీ మరుసటి సంవత్సరం కోసం దాచేవాడు.

దీనివల్ల ప్రతి ఏటా మేలిమిరకం విత్తనాలు, నాణ్యత కలిగిన కాయలను ఇచ్చే విత్తనాలను డెవలప్ చేసుకుంటూ పోయాడు తను… కాలక్రమంలో ఆ రైతు కాలం చేశాడు. ఆ రైతు కొడుకు పుచ్చకాయలని పండించేవాడు. అయితే మా ఫాదర్ వెర్రిబాగులోడు, మంచి పుచ్చకాయలని తినే ఫెస్టివల్ కోసం ఉంచటం ఏంటి , నాన్సెన్స్ అని మేలు రకం పుచ్చకాయలని ఎక్కువ రేటుకి అమ్మి చిన్న సైజు వాటిని, నాణ్యత లేని వాటిని పుచ్చకాయలు తినే పండగ కోసం ఉంచేవాడు.

దాంతో ఏం జరిగింది..? మేలిమిరకం విత్తనాలు ఎక్కడో పడిపోయేవి… పిల్లలు తిన్న నాసిరకం పుచ్చకాయల విత్తనాలే ఈ రైతుకు మిగిలేవి… తద్వారా ఏటేటా దిగుబడి తగ్గింది, రాబడి తగ్గింది. అన్నింటికీ మించి కాయల క్వాలిటీ తగ్గింది…

ఉన్న వాటిలో మేలురకం వాటిని ఎక్కువ ధరకి అమ్మి, నాణ్యత లేని తక్కువ రకం వాటిని పుచ్చకాయలు తినే ఫెస్టివల్ కి ఉంచటం వలన సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పుచ్చకాయల నాణ్యతతోపాటు సైజు కూడా తగ్గుతూ చివరికి అన్నీ నాణ్యత లేని పుచ్చకాయలే కాసేవి. దీంతో జనాలకి కూడా ఆ రైతు పండించే వాటి మీద ఆసక్తి తగ్గింది, చివరకి ఆ రైతు దగ్గర ఒక్క మంచి విత్తనం కూడా మిగలలేదు

జీవితం చిన్నదే కానీ దీర్ఘకాలిక ప్రణాళిక ఎందుకు ముఖ్యమో గోవా మాజీ ముఖ్యమంత్రి, మాజీ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పర్రీకర్ గారు చెప్పిన వాటర్ మెలన్ స్టోరీ అటూఇటూగా తర్జుమా చేసి రాసిన పోస్ట్ ఇది.✍️```
      
         -సేకరణ.

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…       
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


            *ఒక ఔన్సు జలం !*
               ➖➖➖✍️
```
ఒకసారి శంకర జయంతి రోజు జలతరంగం నిర్వహించడానికి ఒక కళాకారుడు ఉద్యుక్తుడయ్యాడు. 

జలతరంగం అనేది మన సనాతన భారతీయ సంగీత కళ. 

నీరు నింపిన పింగాణి లేదా లోహపు 
గిన్నెల అంచులను చిన్న కర్రలచేత రెండు చేతులతో రాపాడించి చేసే ఒక కచేరి. 

ఆనాటి కచేరిని ‘వాతాపి గణపతింభజే హం’ అనే కీర్తనతో మొదలుపెట్టాలని అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. 

అతను ఈ కళలో బాగా ఆరితేరిన సంగీతజ్ఞుడే అయినా ఆరోజెందుకో ఎంత ప్రయత్నించినా శృతి కుదరటం లేదు. చాలా సార్లు ఏదేదో ప్రయత్నించాడు కాని అన్నీ నిష్పలమయ్యాయి. 

పరమాచార్య స్వామివారి ముందు ఇలా జరగడంతో అతనికి చాలా బాధ వేసింది. ఆవేదనని మనస్సులోనే అణచుకొని శృతి సరిచెయ్యడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 

మహాస్వామివారు ఆ సంగీతకారుని అవస్థను గమనించారు. శిష్యుడొకరిని దగ్గరకు పిలిచి అతనివద్దకు ఒక వార్తను చేరవేశారు. 

“ఆ అయిదవ గిన్నెలో నుండి ఒక ఔన్సు జలం తీసెయ్యమని అతనికి చెప్పు” 
స్వామివారి ఆదేశం ప్రకారం అతను చెయ్యగానే శృతి సరిగ్గా సరిపోయింది. 

ఆ విద్వాంసుడు దిగ్గున లేచివచ్చి 
ఒక్కసారిగా నేలపై పడి స్వామివారికి 
సాష్టాంగ నమస్కారం చేశాడు. 

క్షమాపణ పూర్వకంగా చిన్న స్వరంతో “ఈ విషయాలన్నీ మహాస్వామికి ఎలా తెలుసు? 
నాకు కూడా ఈ విషయం తెలియదు” 
అని కృతజ్ఞతలు తెలియజేశాడు. ✍️```

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥
 "కంచిపరమాచార్యవైభవం"!!!🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

****జీవిత రహస్యం

 *🌹🌹🌹    జీవిత రహస్యం    🌹🌹🌹*

            *మానవుడు తాను ఖర్చు చేసే ధనములో తృణమో పణమో ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ శరీర నిర్మాణంలో దానం చేసే సుగుణముంది. భగవంతుడు ఒకరికిచే దాన పద్ధతిలోనే చేతిని నిర్మించాడు. చేతులు కిందికి వాలి ఉన్నప్పుడు వాటి తీరు గమనిస్తే ఈ సత్యం బోధపడుతుంది. ఇమ్ము శ్రద్ధతో ఇమ్ము నిశ్చయముగా ఇమ్ము. ఇదే జీవిత రహస్యం అని నీతిశాస్త్ర కోవిదులు అంటున్నారు.*

              *మనిషి దాన గుణంతోనే ధర్మాత్ముడు అవుతాడు.ఇతరులకు ఆదర్శంగా జీవించగలుగుతాడు. మంచి వారసత్వానికి వారసుడు అవుతాడు. సమాజ క్షేమాన్ని కాంక్షించ గలుగుతాడు.*

            *మన చేతికి అలంకారం దానం చేయడం అది ఒక గొప్ప సౌశీల్యం దానధర్మాలు విశేషంగా చేయాలి. తన కోసం తన ధనాన్ని ఎంత తక్కువ ఖర్చు చేసుకుంటే అంత గొప్పవాడు అవుతాడు మానవుడు. మనిషి జీవితం దానధర్మాలతోనే ముడిపడి ఉంది అదే అతడు దాచుకున్న సంపద. అదే సద్గతిని కలిగిస్తుంది అనుకున్నప్పుడే వెంటనే దానం చేయాలని మహర్షులు చెబుతారు. జీవితం ఏ క్షణములో ఏమి జరుగుతుందో తెలియదు, అది గుర్తించిన వారు ఈ జీవన రహస్యాన్ని మర్చిపోరు.*

           *పిసినిగొట్టుతనము మహా ప్రమాదకరమైన అవలక్షణం. కొందర్ని మనం అంటూ ఉంటాం పిల్లికి కూడా బిచ్చం వేయడు... కామక్రోధ, లోభాలు నరకానికి ద్వారాలని అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు.*

               *అవి ఆత్మ వినాశనానికి దారులని వాటిని త్యాగం చేయలని మహాత్ములు అన్నారు. మనిషి త్యాగశీలి జీవించాలి దానం అనేది మన కర్తవ్యంగా భావించాలి. లోకంలో ఎందరో దరిద్రులను చూస్తున్నాము కూటికి గుడ్డకు విద్యకు నోచుకోని నానా బాధలు పడుతూ వీధుల్లో తిరుగుతున్నారు . ఈ దీన స్థితి నుంచి వీరిని ఉద్ధరించాలి.*

          *మన సంపాదనలో, కనీసం 5 శాతం నుండి 10 శాతం వరకు, ధనాన్ని ఇతరులకు దానం చేద్దాము . అది తిరిగి రెట్టింపై 10 రెట్లు మనకు తిరిగి వస్తుంది. ఒక కేజీ ధాన్యం మనము పొలములో చల్లితే, దాదాపు రెండు మూడు బస్తాల ధాన్యం వస్తుంది, అసలు ఏమి చల్లకపోతే ఏమీ రాదు.*

               *అదే విధముగా మనము ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకుంటే, మనకు అది తిరిగి ఏదో విధముగా  చేరుతుంది. ఇది అక్షర సత్యం... మన చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉంటే, మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఇది పకృతి రహస్యం. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మన వారే ఎవరు పరాయి వారు కాదు ఎవరితోనూ విరోధం వద్దు.*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

నాటి సినిమా హాలుల కబుర్లు

 నాటి సినిమా  హాలుల కబుర్లు 

అప్పట్లో టికెట్లు ధర నేల 25, బెంచి 40, కుర్చీ 75 పైస‌లు.  థియేట‌ర్ల ప్ర‌త్యేక‌త ఏమంటే టికెట్లు ఇస్తూనే వుంటారు. 

నేల ఫుల్‌గా నిండి ఒక‌రి భుజాల మీద ఇంకొక‌రు కూచున్నా బుకింగ్ ఆగ‌దు. లోప‌ల భీక‌ర యుద్ధాలు జ‌రుగుతున్నా గేట్ కీప‌ర్ చ‌లించ‌డు. బెంచ్ క్లాస్‌లో అయితే ఎగ‌స్ట్రా బెంచీలు, బాల్క‌నీలో ఇనుప కుర్చీలు వేస్తారు. నేల‌కి ఆ సౌక‌ర్యం లేదు. ఒక‌రి మీద ఇంకొక‌రు , ఎవ‌రి మీద ఎవ‌రు కూచున్నారో వాళ్ల‌కు కూడా తెలియ‌దు. కొంద‌రైతే స్క్రీన్ ముంద‌రున్న అరుగు మీద కూచుని కొండ‌ల్లా క‌నిపించే హీరో ముఖాన్ని చూసి జ‌డుసుకునే వాళ్లు. ఆడ‌వాళ్ల నేల‌క్లాస్‌లైతే కుళాయి నీళ్ల‌లా ధారాపాతంగా బూతులు, కొంద‌రైతే జుత్తు ప‌ట్టుకుని ఉండ‌ల్లా దొర్లేవాళ్లు. ఫ‌స్ట్ షోకి వ‌చ్చిన ఆడవాళ్లు సెకెండ్ షో వ‌ర‌కూ తిట్టుకునే వాళ్లు.

ఈ ఉత్పాతంలో సినిమా స్టార్ట్ అయ్యేది. ఊపిరాడ‌ని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగ‌రెట్లు ముట్టించి "బుస్‌"మ‌ని పొగ వ‌దిలేవాళ్లు. తాగిన వాళ్ల‌కి, తాగ‌ని వాళ్ల‌కి స‌మానంగా ద‌గ్గొచ్చేది. సినిమా మాంచి ర‌సప‌ట్టులో అంటే ఎన్టీఆర్ క‌త్తిని ముద్దు పెట్టుకుని ఒంటిచేత్తో తిప్పుతున్న‌ప్పుడు రెండు ఈల‌లు, ఆయ‌న డూప్ రెండు చేతుల‌తో తిప్పుతున్న‌ప్పుడు ప‌ది ఈలలు వినిపిస్తూ వుండ‌గా అంద‌రినీ తొక్కుతూ కొంద‌రు ప్ర‌వేశించేవాళ్లు.

"ఎవ‌రిక‌యా నిమ్మ‌సోడా" అని ఒకడు, "వేయించిన శ‌న‌క్కాయ‌లూ" అని ఇంకొక‌డు, "చ‌క్కిలం, చ‌క్కిలం" ఇలా రాగ‌యుక్తంగా పాడుతూ అడిగిన వాళ్ల‌కి కుయ్యిమ‌ని సౌండ్‌తో సోడా, తుప్పు ప‌ట్టిన పావుతో శ‌న‌క్కాయ‌లు కొలిచి ఇచ్చేవారు. ఇంత ఇరుకులో కూడా ప‌ద్మ‌నాభం, రాజ‌బాబు వ‌స్తే జ‌నం ప‌కప‌క న‌వ్వేవాళ్లు. అంజ‌లిదేవిని చూసి ఏడ్చేవాళ్లు.

ఇక బెంచిల్లోకి వెళ్దాం. థియేట‌ర్ పుట్టిన‌పుడు కొన్ని వేల న‌ల్లులు బెంచిల్లోకి వ‌ల‌స వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల రాక కోసం ఎదురు చూస్తూ, వ‌చ్చిన వెంట‌నే కుటుంబ స‌మేతంగా దాడి చేస్తాయి. మొద‌టిసారి కుట్టిన‌పుడు ఉలిక్కిప‌డ‌తాం. రెండోసారి ప‌డ‌తాం. త‌ర్వాత అల‌వాటు ప‌డ‌తాం. ఆ దుర‌ద‌కు త‌ట్టుకోలేక కొంద‌రు లేచి నిల‌బ‌డి గీరుకుంటారు. వెనుక ఉన్న వాళ్లు కూచోమ‌ని అరుస్తూ వుంటారు.

కొంద‌రు సీనియ‌ర్ ప్రేక్ష‌కులు ఉంటారు. వాళ్ల‌కి న‌ల్లుల‌తో అనుభ‌వంతో పాటు శాశ్వ‌త శ‌త్రుత్వం వుంటుంది. అందుక‌ని అగ్గిపుల్ల గీచి బెంచి సందుల్లో తిప్పుతారు. దీంతో ప్ర‌యోజ‌నం ఏమంటే కొన్ని న‌ల్లులు వీర‌మ‌ర‌ణం పొందుతాయి. అయితే క‌సి, ప‌గ‌, ప్ర‌తీకారంతో మిగిలిన‌వ‌న్నీ కుట్ట‌డం ప్రారంభిస్తాయి. ఈ కుట్ల‌కి ప్రేక్ష‌కులు బెంచీల మీద ఎగిరెగిరి ప‌డుతూ వుంటారు. ఈ క్లాస్‌లో కూడా పొగ ఉచితం. బీడీల కంపు త‌క్కువ‌, సిగ‌రెట్ల కంపు ఎక్కువ‌.

బాల్క‌నీలో కుర్చీలు ఉంటాయి. వాటి చ‌ర్మం చిరిగిపోయి లోప‌లున్న కొబ్బ‌రి పీచు, దూది పొట్ట‌పేగుల్లా క‌నిపిస్తూ వుంటాయి. కుర్చీల్లో పెద్ద‌గా న‌ల్లులుండ‌వు. కానీ మేకులుంటాయి. అవి మ‌న బ‌ట్ట‌ల మీద ఇష్టం పెంచుకుంటూ అజాగ్ర‌త్త‌గా లేస్తే ప‌ర్‌మ‌ని సౌండ్. బాల్క‌నీలో ప్రొజ‌క్ట‌ర్ రూమ్ కూడా వుంటుంది. సోడాలు, శ‌న‌క్కాయ‌ల ట్రాఫిక్ పెరిగిన‌ప్పుడు వాళ్ల త‌ల‌కాయ‌లు స్క్రీన్ మీద క‌నిపిస్తూ వుంటాయి.

అన్ని క్లాస్‌ల్లోనూ ఫ్యాన్లు వుంటాయి. అయితే ఫ్యాన్ కింద సీటు సంపాయించ‌డం చాలా క‌ష్టం. సంపాయించినా అది స‌వ్యంగా తిరిగే ఫ్యాన్ అయి వుండ‌డం మ‌రీ క‌ష్టం. ఎందుకంటే చాలా ఫ్యాన్లు పూనకం వ‌చ్చిన‌ట్టు గీక్ గీక్ అని అరుస్తూ వుంటాయి. అవి ఊడి మీద ప‌డ‌క‌పోవ‌డం మ‌న అదృష్టం.

ఇక్క‌డితో మ‌న క‌ష్టాలు ఆగ‌వు. క‌రెంట్ వాళ్ల ద‌య ఉండాలి. ప‌వ‌ర్‌క‌ట్‌. జ‌న‌మంతా పిచ్చెక్కిన‌ట్టు ఈల‌లేస్తారు. జ‌న‌రేట‌ర్లు లేని కాలం కాబ‌ట్టి క‌రెంట్ కోసం ఎదురు చూడాల్సిందే. రాక‌పోతే పాస్‌లు ఇచ్చి పంపుతారు. మ‌రుస‌టి రోజు వ‌చ్చి చూడాలి.

రిలీజైన ఏడాదికి ఆంధ్రదేశ‌మంతా ఆడిన త‌ర్వాత మాకు వ‌చ్చేది. పాత ప్రింట్లు కావ‌డంతో సినిమా అంతా గీత‌లు గీత‌లు వ‌చ్చి క‌ట్ అయ్యేది. ఇన్ని విప‌త్క‌ర ప‌రిస్థితుల మ‌ధ్య కూడా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్లం.ఇపుడు ఇన్ని సౌక‌ర్యాల మ‌ధ్య సినిమా చూస్తున్నా ఆ ఉత్సాహం, ఆనందం రావ‌డం లేదు. అమాయ‌క‌త్వంలోని ర‌హ‌స్యం అదేనేమో!.సేకరణ..సురేష్ శర్మ ఆమంచి
 *🌹విక్రమార్కుని కథ:🍁*

విక్రమాదిత్య మహారాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది.
నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టి వుంటారు.
కానీ వాళ్ళంతా రాజులు కాలేదు.
నేనే ఎందుకయ్యాను ?
ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ? 
మరుసటి రోజు సభ లో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు. 
అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా! ఈ నగరానికి తూర్పున  బయట వున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. 
ఆయనను కలవండి. 
జవాబు దొరుకుతుంది'' అన్నాడు. 
రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు
అది చూసి రాజు ఆశ్చర్యపోయి
తన ప్రశ్న ఆయన ముందు పెడితే....
 ఆయన అన్నాడు : ''ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''
నిరాశపడినా, 
రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. 
రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి 
తింటున్నాడు
రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.
కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.
కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు
 రాజుకూ కోపం వచ్చినా, సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. 
తిరిగి వెళ్ళి పోతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : ''ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది.
అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు. వెంటనే అతన్ని కలవండి.'
రాజుకంతా గందరగోళంగా వుంది. అయినా అక్కడికెళతాడు. 
చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. 
అపుడు ఆ అబ్బాయి అన్నాడు
''గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పివుంటారు. 
ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు క్రింద ఆగివుంటారు.
తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి, నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటివాడు కోపంతో 
''నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా?'' అని కసురుకొంటాడు.
రెండవ వ్యక్తిని అడిగితే..
''నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే'' అని వెటకారంగా అంటాడు.
మూడవ వాడు 
''రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ?'' అని నీచంగా మాట్లాడాడు. 
కానీ నాల్గవ వ్యక్తి మాత్రం ''తాతా! నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను.'' అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు.
ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా'' అని అన్నాడు. 
రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. 
రాజా నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమయిన మీమాంసలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు అని చెప్పి కనులు మూసినాడు.
మంచిమాట-
దానం సంపద వంటిది. అందరికీ పంచండి. ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది.
ఓ చెడ్డ మాట అప్పులాంటిది. ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది

****_తగ్గిపోతున్న హిందువుల సంఖ్య_

 *_తగ్గిపోతున్న  హిందువుల సంఖ్య_*

*_కుటుంబ కారణాలు_:*

_1.ఆలస్యంగా పెళ్లిళ్లు_.

_2.fertility అవకాశం తక్కువ._

_3.ఒక్కరు చాలనడం లేదా ఇద్దరు._
_ఒంటరి కుటుంబాలు కావడంతో సహాయం చేసేవారు లేక పిల్లలే వద్దనుకుకోవడం._

_4.కొందరు పెళ్లే వద్దనుకొని బ్రహ్మచారిగా ఉండడం._

_5.చేసుకుందామనుకున్న వారికి సంబంధం దొరకక ఒంటరిగానే ఉండడం._

_6.కొందరు ఆశ్రమాల్లో చేరి బ్రహ్మచారిణులుగా ఉండడం._ 

_7.కొందరు యువకులు పని చేయకపోవడం ఎవరూ అమ్మాయిని ఇవ్వకపోవడం._

*_సామాజిక కారణాలు_:*

_1.కలహాలు కలతలు మనస్థాపం అని అనేకమంది ముఖ్యంగా యువత ఆత్మహత్యలు._

_2.ప్రమాదాలు అజాగ్రత్తలు._

_3.సైన్యంమరియు ఇతర భద్రతా సిబ్బంది మరణాలు._

_4.నక్సలైటులు అందరూ హిందువులే._
 
*_మతమార్పిడిలు_:*

_1.విదేశీ మతాలమతమార్పిడులు_.

_2.హిందూ అమ్మాయిలు ఇతర మతాలవారిని వివాహం చేసుకోవడం_.

_3.బహుభార్యత్వం తో వారికి అధికసంతానము._

*_ఆర్థిక కారణాలు - అలసత్వం_ :*

_1.హిందువుల యువత కొన్ని పనులు చేయడానికి ఇష్టపడక నిరు ద్యోగులుగా ఉండడం._

_2.అన్ని పనులలో ఇతర మతాలవారు నిండిపోవడం_.

_3.ఇతరమతాల వారిని రాజకీయ కారణాలతో భారత దేశంలోకి ఆహ్వానించడం._
 
_4.హిందువుల జనాభా పెరుగుదల సున్నా శాతం. అంతకన్నా తక్కువ.  ఒక కుటుంబంలో ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు. అంటే పెరుగుదల లేదు. ఒక్కరు ఉంటే - 50 శాతం. ఇద్దరు 0 శాతం  ముగ్గురు ఉంటే 50 శాతం నలుగురు ఉంటే 100 శాతం._ 

_5.హిందువులపై దాడి జరిగినా హిందూ పెద్దలలో గాని రాజకీయ నాయకులలో గాని స్పందన లేకపోవడం_.         

_6.హిందువులు కులాల వారీగా విడిపోవడం._

_7.ఒకప్పుడు తీవ్రంగా ఉన్న కులవివక్షను భూతద్ధంలో చూపిస్తూ వివక్షకు గురి అయినవారిని మతంమార్చడం._

*_విద్యావ్యవస్థ_:*    

_1.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యాభైసంవత్సరాలు కేంద్రవిద్యాశాఖమంత్రులు ముస్లింలు._     

_2.వీరు హిందువులకు చెందిన కథలను తీసివేశారు._

_3.హిందువుల వైభవం ఎవ్వరికీ తెలియకుండా అప్పటి పాలకులు జాగ్రత్తపడ్డారు._

_4.పనిగట్టుకుని ఎవ్వరికీ తెలియని మనుధర్మ శాస్త్రాన్ని అందులో కొన్ని అంశాల్ని మాత్రమే degree సిలబస్ లో ఉంచారు. తద్వారా విద్యార్థుల్లో కుల విభజన ఏర్పడింది._

*_ప్రభుత్వాలు_:* 

_1.ప్రభుత్వాలు అన్నీ హిందువులకు అనుకూలంగా ఎలాంటి చట్టాలు చేయలేదు._  
 
*_2.ప్రజలు తమకు ఇష్టమైన దేవుడిని ఎవరినైనా పూజించవచ్చు అనడంతో మతం మారిన వారుకూడా హిందువుగా చెలామణి అవుతూ హిందువుల రాయితీలు రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారు._*
 
*_3.హిందువులు మతవిద్య బోధించకూడదు. దానితో విద్యార్థులకు కాబోయే పౌరులకు తమ మతం గురించి తమకే తెలియడం లేదు._*

*_4.ఇతర మతాలవారికి అవకాశం ఇవ్వడంతో వారు తమ మతవిద్యను బోధిస్తున్నారు._*

 *_5.దేవాలయాల నుండి ధనాన్ని ప్రభుత్వం తీసుకుని ఇతర మతాల వారి అవసరాలు తీరుస్తుంది._*

Monday, October 14, 2024

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           *పుష్పదంతుని కథ:*
                ➖➖➖✍️

```
గంగాతీరంలో ‘బహుసువర్ణకమ’నే అగ్రహారముంది. అచట బహుశాస్త్రవేత్తయైన ‘గోవిందదత్తుడ’నే బ్రాహ్మణుడున్నాడు. ఆతని భార్య ‘అగ్నిదత్త.’ వారికి సుందరులైనా గాని- మూర్ఖత్వం నిండుగానున్న ఐదుగురు పుత్రులు పుట్టారు.

ఒకనాడు గోవిందదత్తుడింట లేని సమయంలో వారింటికి ‘వైశ్వానరుడ’నే విప్రుడు అతిథిగా వచ్చాడు. అతడు కుమారులకు అభివాదం చేయగా –తిరిగి ప్రతినమస్కారం చేయటం కూడా తెలియని వారు నమస్కారానికి బదులుగా నవ్వారు.

ఇట్టి కుసంస్కారుల ఇంటిలో భోజనం చేయకూడదని నిర్ణయించుకొని ‘వైశ్వానరుడు’ వెళ్లి పోవటానికి సిద్ధపడుతున్న సమయంలో ‘గోవిందదత్తుడు’ వచ్చాడు.

తన కుమారులు పరమ మూర్ఖులని అందుచే వారినింతవరకు తాను తాకలేదని చెప్పాడు.

తండ్రి మాటలు విన్న కుమారులలో నొకడగు ‘దేవదత్తుడ’ను వాడు తండ్రి మాటలకు బాధపడి ఇంక తన జీవితం వ్యర్థమని తలచి తపం చేయటానికి బదరికాశ్రమానికి  వెళ్లాడు.

అతడు చిరకాలం శివుని గూర్చి తపస్సు చేసాడు. దాని  ఫలంగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు శివుని-తాను శివునకు   అనుచరునిగా నుండునట్లు వరాన్ని  కోరుకొన్నాడు. శివుడాతనికి 'సకల విద్యలను గడించి భోగాలనుభవించిన తరువాత శివానుచరుడవు కాగల'వనే వరాన్నిచ్చాడు.

’దేవదత్తుడు  పాటలీపుత్రానికి చేరుకొని ‘వేదకుంభుడ’నే ఉపాధ్యాయునాశ్రయించాడు. ఆతని విద్యార్థి దశలో గురుపత్ని  హఠాత్తుగా ఆతనిని వరించింది. అతడా పాపానికి వెరచి అటనుండి పారిపోయి ప్రతిష్ఠాననగరానికేగి ‘మంత్రస్వామి’ అనే గురువు నాశ్రయించి సకల విద్యలను పొందాడు.

ఒకరోజు ఆ నగర పాలకుడగు సుశర్మ కూతురు శ్రీ అను నామెను దేవదత్తుడు కిటికీగుండా చూచాడు. ఆమె కూడా ఈతనిని చూసింది. పరస్పరం మోహితులయ్యారు. ఆమె దంతంతో ఒక పుష్పాన్ని గ్రహించి ఆతనిపై విసరి వేసింది.

రాకుమార్తె చేసిన ఈ సంకేతాన్ని విప్పలేక దేవదత్తుడు తన గురువు మంత్రస్వామిని అడిగాడు.

అప్పుడు గురువు “దంతముచే పుష్పాన్ని ఆమె విసిరింది కాబట్టి పూలు విరివిగా నున్న పుష్పదంత దేవాలయానికి రమ్మని తానక్కడ అతనికోసం నిరీక్షిస్తానని సంకేతితంగా చెప్పిం”దని ఆమె అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు.

దేవదత్తుడు పుష్పదంత దేవాలయానికి వెళ్లి ఆమె రాకకై తలుపు చాటున దాక్కొన్నాడు. ఆమె రాగానే ఆమెను కౌగిలించుకొన్నాడు. ఆమె తన సంకేతాన్ని ఎట్లా తెలుసుకున్నావని అడుగగా తన గురువు తనకది చెప్పాడన్నాడు.

అపుడామె కోపించి “నీవు విదగ్ధుడవు (చతురుడు) కావంటూ వెళ్లి పోయింది.

అప్పుడతడు చేసేదేమీ లేక ప్రాణాలను విడవటానికి సిద్ధమయ్యాడు. శివుడు తానిచ్చిన వరం వ్యర్థమౌతుందనే ఉద్దేశ్యంతో తన ప్రమథగణాల్లో ఒకడైన పంచశిఖుడనే వానినతని వద్దకు పంపాడు. పంచశిఖుడాతని వద్దకు వచ్చాడు. దేవదత్తుని శ్రీ తో కలపటానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. దానిప్రకారంగా అతడొక వృద్ధ బ్రాహ్మణుని వేషం వేసుకొని దేవదత్తునకు స్త్రీ వేషం వేసి సుశర్మ కొలువు దీరియుండగా ఆతని వద్దకు వెళ్లి “రాజా! నాకుమారుడెక్కడకో వెళ్లి పోయాడు. వానిని  వెదకటానికి నేను పోతున్నాను. ఈమె నా కోడలు. నా కొడుకు దొరికే వరకు ఈమెను నీ అంతఃపురంలో దాచియుంచమని కోరాడు.

రాజామెను తన కుమార్తె అంతికానికి పంపాడు. స్త్రీ రూప వేషధారియైన ఆతడు నెమ్మది నెమ్మదిగా శ్రీ కి దగ్గరై –తానెవరో తెలుపుకొన్నాడు.

ఇద్దరూ గాంధర్వ విధించే పెండ్లాడారు. రాకుమార్తె గర్భం ధరించగా దేవదత్తుడు పంచశిఖుని తలవగా ఆతడు వచ్చి దేవదత్తుని అంతఃపురంనుండి తప్పించాడు.

పంచశిఖుడు మరునాడు బ్రాహ్మణ వేషంతో రాజు వద్దకు పోయి తన కుమారుడు దొరికాడని తన కోడలిని తన కప్పగిస్తే తాను వెళ్ళి పోతానన్నాడు.

రాజు అంతంపురంలో వెదికించగా ఆమె ఎక్కడా కనబడ లేదు. బ్రాహ్మణశాప భయంతో రాజు తన మంత్రులతో విచారింపగా వారు 'ఇతడు నిజమైన బ్రాహ్మణుడు కాడని నిన్ను మోసం చేయటానికి వచ్చిన దేవుడని చెప్పారు.

పూర్వం ఇంద్రుడు, యముడు  శిబి చక్రవర్తిని ఏ విధంగా పరీక్షించటానికి వచ్చారో ఆ విధంగానే నిన్ను పరీక్షించటానికి వచ్చా'రన్నారు.

ఇక చేసేదేమీ లేక రాజా ప్రమథగణంతో “ఓ పూజ్యుడా! నన్ను రక్షించు. రాత్రింవబవళ్లు శ్రద్ధతో కావలి కాస్తున్నా నీ కోడలినెవరో రాత్రి అపహరించారు. ఇది చాలా మాయగా ఉన్నద”న్నాడు. అపుడా దేవగణం రాజుతో అట్లయితే 'నాకొడుకునకు నీ కూతునిచ్చి పెండ్లి చేసి నాకు కోడలు లేని లోటును తీర్చ'మన్నాడు.

రాజు దానికంగీకరించి దేవదత్తునకు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసాడు. ఈ విధంగా దేవదత్తుడు శివుడు చెప్పిన ప్రకారంగా చాలాకాలం భోగభాగ్యాలనుభవించాడు. 

సుశర్మ వానప్రస్థానికై మహీధరమనే వనానికి వెళ్లాడు.   తిరిగి  దేవదత్తుడు శివుని ఆరాధించి మనుష్య శరీరాన్ని వదలి ప్రమథగణమయ్యాడు.

ప్రియురాలు ఉదంతముతో పుష్పాన్ని విసరుటయందలి సంజ్ఞను తెలియని వాడగుటచేత ఆతడు ప్రమథగణాల్లో పుష్పదంతునిగా ప్రసిద్దుడయ్యాడు.

ఇతడే తరువాత వరరుచిగా ప్రసిద్ధుడయ్యాడు. ఆతని భార్య శ్రీ- జయ అనే పేరుతో పార్వతీదేవికి ప్రతీహారి అయింది. శివుడు పార్వతీదేవికి చెప్పిన బృహత్కథను దొంగచాటుగా విని తన భర్తకు చెప్పి కథావ్యాప్తికి దోహదపడిందీమెయే.✍️```
(కథాసరిత్సాగరం-మొదటిలంబకం-ఏడవ తరంగం)

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Sunday, October 13, 2024

 *కోపానికి విరుగుడు శాంతమే…!*

                 *పురానీతి!* 
              
```
ఒకనాటి సాయంత్రం శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వనవిహారానికి వెళ్లారు.

కబుర్లాడుకుంటూ వెళుతుండటంతో కాలం తెలియలేదు. చీకటి ముసురుకునే వేళకు ముగ్గురూ ఒక కీకారణ్యంలోకి చేరుకున్నారు. ముందుకు సాగడానికైనా, వెనక్కు మళ్లడానికైనా ఏ మాత్రం అనువుకాని సమయం. ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి ఎలాగోలా కీకారణ్యంలోనే గడపాలని నిశ్చయించుకున్నారు.

అడవిలో ముగ్గురూ ఒకేసారి ఆదమరచి నిద్రపోవడం క్షేమం కాదని, అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మిగిలిన వారు కాపలా ఉండాలని, ఇలా వంతుల వారీగా మేలుకొని కాపలా ఉంటూ రాత్రి పొద్దుపుచ్చాలని అనుకున్నారు.

ముందుగా శ్రీకృష్ణుడు, బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు. సాత్యకి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడు. ఒళ్లంతా కళ్లు చేసుకుని, చుట్టూ గస్తీ తిరగసాగాడు. అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ,బలరాముల వైపు వడివడిగా రావడం కనిపించింది.

సాత్యకి వెంటనే ఆ రాక్షసుడిని అడ్డగించాడు.

రాక్షసుడు సాత్యకిపై దాడికి దిగాడు. సాత్యకి క్రోధావేశాలతో తన గదాయుధంతో అతడిని ఎదుర్కొన్నాడు. సాత్యకిలో క్రోధం మొదలైన మరుక్షణమే రాక్షసుడి శరీరం రెట్టింపైంది. సాత్యకికి కోపం మరింత పెరిగింది. రాక్షసుడి శరీరం కూడా పెరిగింది. సాత్యకి కోపం చల్లారకపోగా, అంతకంతకూ పెరగడంతో రాక్షసుడి శరీరం విపరీతంగా పెరిగింది. రాక్షసుడి శరీరం ముందు సాత్యకి ఆటబొమ్మలా కనిపించసాగాడు. రాక్షసుడు సాత్యకిని ఎత్తిపట్టుకుని, గిరగిరా తిప్పి కింద పడేసి వెళ్లిపోయాడు. 

గాయాలపాలైన సాత్యకి కొద్దిసేపటికి శక్తి కూడదీసుకుని తెప్పరిల్లాడు. అదే సమయానికి మేలుకున్న బలరాముడు ఇక తాను కాపలాగా ఉంటానని చెప్పి, సాత్యకిని నిద్రపొమ్మన్నాడు.

రాక్షసుడితో పోరులో అలసి సొలసిన సాత్యకి నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకుని, ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు.

బలరాముడు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాయసాగాడు. సాత్యకికి ఎదురైన రాక్షసుడే బలరాముడికీ ఎదురయ్యాడు. యుద్ధానికి కవ్వించాడు. బలరాముడు అసలే ప్రథమకోపి. కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపై దాడి చేశాడు.

రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ తన శరీరాన్ని పెంచాడు. బలరాముడి కోపం మరింత పెరిగింది. బలరాముడి కోపంతో పాటే రాక్షసుడి శరీరం పెరుగుతూ రాసాగింది. చివరకు భీకరాకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టికరిపించి, వెనుదిరిగాడు. 

ఇంతలోగా తనవంతు కాపలా కాయడానికి శ్రీకృష్ణుడు మేలుకున్నాడు. ఇంకా తెల్లారలేదు కదా, ఓ కునుకు తీయమన్నాడు బలరాముడిని.

రాక్షసుడి ధాటికి ఒళ్లు హూనమైన బలరాముడు నెమ్మదిగా చెట్టుకిందకు చేరుకుని నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు.

శ్రీకృష్ణుడు అటూ ఇటూ కలియ దిరుగుతూ కాపలా కాయసాగాడు.

కొద్దిసేపటికి సాత్యకిని, బలరాముడిని మట్టికరిపించిన రాక్షసుడు శ్రీకృష్ణుడి ఎదుటికి వచ్చాడు. యుద్ధం చేయమంటూ కవ్వించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ సై అన్నాడు. 

రాక్షసుడు కృష్ణుడి మీదకు లంఘించాడు. కృష్ణుడు ఒడుపుగా తప్పించుకున్నాడు. ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్లయుద్ధానికి చెయ్యి కలిపాడు. రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది. అతడు ఎంతగా కవ్విస్తున్నా, కృష్ణుడు చెక్కుచెదరని చిరునవ్వుతో అతడిని ఎదుర్కోసాగాడు.

శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంతకంతకూ తగ్గిపోసాగింది. చివరకు గుప్పిట్లో పట్టేంత చిన్నగా తయారయ్యాడు ఆ రాక్షసుడు.

శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని అరచేత పట్టుకుని, తన ఉత్తరీయం అంచుకు మూటలా కట్టేశాడు.

కొద్దిసేపటికి తెల్లవారింది. అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి. సాత్యకి, బలరాముడు మేలుకున్నారు. తమ దగ్గరే ఉన్న కృష్ణుడిని చూశారు. తమ ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకున్నారు. రాత్రి తమకు కనిపించిన రాక్షసుడి గురించి చెప్పారు.

‘అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా?’అని అడిగారు.

’వీడేనా ఆ రాక్షసుడు’ అంటూ తన ఉత్తరీయం అంచున కట్టిన మూటను విప్పాడు కృష్ణుడు.

అందులోంచి బయటపడ్డాడు గుప్పెండంత పరిమాణంలో ఉన్న రాక్షసుడు.

బలరాముడు,సాత్యకి ఆశ్చర్యపోయారు. ‘నిన్న మాకు కనిపించింది వీడే. అయితే, అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు. కోపంగా అతడితో పోరు సాగించే కొద్దీ మరింతగా పెరిగిపోసాగాడు’ అని చెప్పారు.

‘ఈ రాక్షసుడు మూర్తీభవించిన క్రోధం. క్రోధానికి విరుగుడు క్రోధం కాదు, శాంతం. మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు. అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు’ అని చెప్పాడు కృష్ణుడు.

అప్పుడు జ్ఞానోదయమైంది సాత్యకీ బలరాములకు.✍️```

*నీతి:      క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు.        కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే, క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు.* 
 *తాపత్రయం!*
                  

*ప్రతి రోజూ లేవగానే మనిషి దేనికోసమో తాపత్రయపడుతుంటాడు. అసలు తాపత్రయం అంటే ఏమిటి? ఎందుకు అతనలా తాపత్రయపడుతుంటాడు?*

*మనిషి తాపత్రయాలకు అంతు ఉండదు. ఆ తాపత్రయంతోనే జీవితంలో పరుగులు పెడుతుంటారు.* 

*ఈ వయసులో కూడా కొడుకులకు సంపాదించి పెట్టాలనే తాపత్రయం ఎందుకు?..*

*’నా తాపత్రయం అంతా వాడి గురించే..!’ లాంటి మాటల్ని మనం వింటుంటాం. అసలు తాపత్రయం అంటే ఏమిటో తెలుసుకుందాం…* 

*హిందూ ధర్మం ప్రకారం మనిషికి కలిగే ఆటంకాలు లేదా కష్టనష్టాలు మూడు రకాలు.* 

*అవి భౌతికమైనవి, దైవికమైనవి, అంతర్గతమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి.*

*భౌతిక ప్రపంచంలో ఉండే క్రూర జంతువులు, సాటి మనుషులు, ప్రకృతి వైపరీత్యాలు.. అంటే భూకంపం, వరదలు, అగ్ని ప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు తదితరమైన వాటిని భౌతికమైనవిగా చెబుతారు.* 

*దైవికమైన వాటికి వస్తే మనకు మనకి కనిపించని ప్రపంచం ద్వారా వచ్ఛే కష్టనష్టాలు. అంటే దైవ దోషాలు, రాక్షసులు, భూతాలు, దయ్యాలు, ఆత్మలు మొదలైన వాటి ద్వారా సంక్రమిస్తుంటాయి.* 

*ఆధ్యాత్మికమైన కష్టాల గురించి చెప్పాల్సి వస్తే తన గురించి లేదా ఇతరుల గురించి బాధ పడడం, శరీరం, బుధ్ది అదుపులో లేక పోవడం, వ్యాధి, శారీరక లేదా మానసిక రుగ్మతలతో సతమతమవడం మొదలైనవి.*

*తాపత్రయం అనే పదానికి ఉన్న అర్థం ఏమిటో చూద్దాం… తాపం అంటే వేడి, త్రయం అంటే మూడు.. మూడు రకాల కష్టాలని అనుకోవాలి.* 

*ఈ తాపాలు ఆధ్యాత్మిక తాపం, ఆధిభౌతిక తాపం, ఆధిదైవిక తాపం అని మూడు రకాలుగా విభజించారు పెద్దలు.* 

*సామాన్యులు మాత్రం తాపత్రయ పడటం అంటే ఎత్తలేని బరువును మోయడం, పెట్టలేని పరుగుకు ప్రయత్నించడంగా భావిస్తారు.* 

*ఆధ్యాత్మిక తాపం గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ నశించనిది, శరీరం నశించేది. ఈ శరీరంలో ఆత్మ నివసిస్తుంది. మనసు, దాని ఇతర స్థాయిలలో చేసే అన్ని చర్యలను సాక్షీభూతంగా శరీరం అనుభవిస్తుంది.* 

*మనసుకు సంబంధించింది పురుషార్ధసాధన. ఇందులో మూడో పురుషార్ధమే కామం. కామమంటే కోరిక, లేదా ఇంకేదైనా కావచ్చు. స్త్రీ పురుష సంబంధమొక్కటే కామం కాదు. ధర్మం దాటినపుడు మాత్రమే మనసు చేసే చిత్రంతో చిక్కులు కలుగుతాయి. వీటినే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు గాను, అంతఃశత్రువులుగానూ చెబుతుంటారు. ఇవి బయటికి కనిపించవుగానీ చాలా కష్టాన్నే కలగచేస్తాయి.* 

*ఏదో ఒక కోరిక లేనివారు ఉండరు. నాకే కోరికా లేదన్నవారినెవరినీ నమ్మకూడదు. ఈ పురుషార్ధ సాధనలో కలిగే తాపమే ఆధ్యాత్మిక తాపం. శరీరానికి సంబంధించిన కోరికలు ఆరు. అవి ఆకలి, దప్పిక, జర, రుజ, శోకం, మోహం. ఆకలికి, ముఖ్యంగా దప్పికకి అసలు ఓర్చుకోలేం.‘గోచీ కంటే దరిద్రం, ప్రాణహాని కంటే ఎక్కువ కష్టం’ లేదని నానుడి. జర అంటే ముసలితనం, రుజ అంటే వ్యాధి బారినపడటం.. ఇవి రెండూ తప్పించుకోలేనివి. ఈ రెండూ పెద్ద కష్టాలే.* 

*చివరివి శోకం, మోహం నుంచి తప్పించుకోవాలని తంటాలైతే పడతాం కాని సాధ్యం కాదు. ఎవరికి వారు మాత్రమే అనుభవించవలసినవి ఈ కోరికలు. ఇవే అధ్యాత్మిక తాపాలు.*

*అధి భౌతిక తాపం గురించి తెలుసుకుందాం. ఈసృష్టిలో ఎవరిమటుకు వారొకరే కాదు, చాలా ప్రాణులు, ప్రాణం కానివీ ఉన్నాయి, ఈ సృష్టితో సహజీవనం తప్పదు. అప్పుడపుడు మనతో జీవించే ఇతర జంతువుల వలన, మనుషుల వలన కలిగే కష్టాలే అధిభౌతిక తాపాలు. ఉదాహరణకి నల్లులు, దోమలు కుట్టడం, తేలు, పాము లాటివి కాటేయడం లాంటివి. వీటికంటే చాలా ముఖ్యం సాటి మనిషి నుంచి కలిగే కష్టం కూడా. ఇతరజీవులను హింసించడం, వధించడం ఆధిభౌతికతాపమే.* 

*భగవంతుడు కలగచేసే కష్టాలను అధిదైవిక తాపాలన్నారు. భగవంతుడు చేశాడనే కంటే మానవుడు తన నెత్తిన తనే దుమ్ముపోసుకుని అధిదైవిక తాపాలంటున్నాడనడం బాగుంటుందేమో.*

*పంచభూతాలెప్పుడూ వాటివాటి హద్దులు దాటవు. కాని వాటి సమతుల్యతను మానవుడు చెడగొట్టినపుడు విజృంభిస్తాయి. అప్పుడు మానవుడు బలహీనుడే. హంసమంత్రం సర్వకాల సర్వావస్థలలో తిరుగుతుండవలసిందే. హంసమంత్రం అంటే గాలి పీల్చేటపుడు కలిగే శబ్దమే హం, గాలి వదిలేటపుడు కలిగే శబ్దం స, ఈ రెండూ కలిస్తే జీవితం, లేకుంటే మరణం. చూశారు కదా తాపత్రయాలు ఎన్ని విధాలుగా ఉంటాయో. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలలో చిక్కుకుని మనిషి మనుగడ సాగిస్తుంటాడు. ఇలాంటి తాపత్రయాలతో కుంగిపోకుండా స్థతప్రజ్నతతో ప్రతి మనిషీ జివించాలి.*.     
 *సత్పురుషుల సాంగత్యం*
                 

*”సత్పురుషుడు ఎక్కడ ఉంటాడో   ఆ ప్రదేశం ఇతర విషయాల్లో ఎలాంటిదైనా స్వర్గం కంటే అధికమైనదవుతుంది. అది జ్ఞానవంతులకు నివాసయోగ్యం.*

*"సత్పురుషుడు, వృక్షము లేని చోటు.. సర్వవస్తు సమృద్ధమైనా అది మరుభూమి (శ్మశానం)తో సమానం!” అని జ్ఞానవాసిష్ఠ బోధ.*

*జీవితంపై సందేహ, సంకటాలు కలిగినవారు మహాత్ములైన సజ్జనుల చెంత చేరాలి.*

*దుఃఖితులైన వారికి సత్పురుషులు.. ధైర్యాన్ని, దైవాలంబనోపాయాన్ని బోధిస్తారు. ధర్మ, తత్వ రహస్యాలను తెలియపరచి శాంతహృదయులు చేస్తారు.*

*ఇంతకీ సజ్జనులంటే, సత్పురుషులంటే ఎవరు? అంతర్యామియైన భగవంతుని కనుగొనడానికి ప్రయత్నించే     సాధనా- పరులే సజ్జనులు, సత్పురుషులు.* 

*సజ్జనులైన మానవులు మానవ ధర్మ సారాన్ని ఎరిగి ఉంటారు. వారికి చిత్త చలనం ఉండదు. తాపత్రయాలను పొందరు. ఎన్ని కష్టాలు వచ్చినా.. పర్వతం వలె  చలించక స్థిరచిత్తులై ఉంటారు.*
 
*మనస్సునందున్న మాలిన్యాన్ని దైవనియమ సాధనలచే పోగొట్టుకొని స్థిరమతితో యత్నించిన మానవులు పరమేశ్వరుని కనుగొనగలుగుతారు. ఆత్మవేత్తలైనవారు దేని మీదా ఇచ్ఛ లేనివారై ఉంటారు. ఆత్మదర్శనం చేతనే తృప్తి చెంది ఉంటారు. అటువంటి వారి దర్శనం లభించినవారే ధన్యులు.*

*పద్మాకరం దినకరో వికచం కరోతి.                           చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్‌                   నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి                   సంతః స్వయం పరహితే విహితాభియోగాః* 

*తామరలు ప్రార్థించకుండానే సూర్యుడు పద్మాలను వికసింపజేస్తున్నాడు.* *కలువలు అడగకుండానే చంద్రుడు వాటిని వికసింపజేస్తున్నాడు.* *అడగకుండానే మేఘుడు వర్షోదకధారలు కురిపించి జీవనదానం చేస్తున్నాడు.*

*ఇలా సత్పురుషులు తమంత తామే పరహితాసక్తులై ఉంటారని.. ఎవరూ అడగకుండానే సాయం చేస్తారని భర్తృహరి చెప్పాడు.*

*ఆత్మోద్ధరణకు ధనం, స్నేహితులు, శాస్త్రాలు, బంధువులు చేయగలిగిన ఉపకారమేదీ లేదు. ఆ విషయంలో సహాయం చేయగలిగినది సత్పురుషులే !*

*సత్పురుష సమాగమమనే చక్కని నావలో సంసారం నుంచి ముక్తిని పొందడమే ఉత్తమ మార్గం.*

*సత్పురుషుల తోడి సాంగత్యం పూర్వపుణ్య వశానే లభిస్తుంది. అది గంగలా పాపాలను పోగొడుతుంది. వెన్నెలలా అందరి మనస్సులకూ ఆనందం కలిగిస్తుంది. సూర్యుని ప్రభలవలె అజ్ఞానాంధకారాన్ని నిర్మూలిస్తుంది. చల్లని చెట్టు నీడవలె తాపమును పోగొడుతుంది.*

*బహుదుర్లభమైన సజ్జన సాంగత్యం వల్లనే పాప, తాప, దైన్యాలు నశిస్తాయి!*

****భ్రమ

 కష్టములు కలుగుటకు ప్రథమ కారణం భ్రమ. ఏది సత్యమో, ఏది నిత్యమో తెలుసుకోకుండా దైవమును ఆశ్రయించక, ప్రపంచ సుఖములకు ఆకర్షితులమై మనసులో ఏవేవో స్వీయ ఆలోచనలు చేసుకుని భ్రమకు లోనై కష్టములను కొని తెచ్చుకుంటున్నాము.

పైగా    ఈ  కష్టనష్టముల   గురించి భగవంతునకు పిర్యాదులు చేస్తుంటాం తప్ప భ్రమను వీడి భగవంతుని తెలుసుకుందామని ప్రయత్నం చేయడం లేదు.

ప్రపంచం, అందులో ఉన్న వస్తు విషయ సుఖములు శాశ్వతములు అనే భ్రమ నుండి బయటకు వస్తే తప్ప భగవంతుని తెలుసుకోలేము.

భ్రమ వలన బ్రహ్మ అంతటివాడే నష్టమును చవిచూశాడు. సామాన్య మానవులం మనం ఒక లెక్కనా!       
 *_జీవితంలో మనం 10 మందిని బాధ పెట్టి ఎదగాలి అని అనుకోవడం పాపం అవుతుంది. మూర్ఖత్వం అవుతుంది స్నేహితులారా..._*

*_అదే పదిమందికి మనము ప్రేమతత్వంతో, కరుణాతత్వంతో, సేవా తత్వంతో, నిస్వార్థంతో సేవ చేసి వారిని సన్మార్గంలోకి తీసుకురావడమే గొప్ప స్థితి. ఇదే అసలైన సేవ..._*

*_కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం... జాగ్రత్త సుమా... కావున ఏ ఒక్కరిని అతిగా నమ్మకండి... మిమ్మల్ని మీరు నమ్మండి... మానసికంగా దృఢ పడండి..._*

*_నాది కానీ జీవితంలో నేను జీవిస్తున్నాను అన్నదే సత్యం గుర్తుంచుకోండి..._*

*_మీ ఎదుగుదల కొరకు జీవించండి. జన్మ రహస్యాన్ని గ్రహించండి. ధ్యానం చేయండి... మానసికంగా ఎదగండి. మీ నిర్ణయానికి ఎదురు లేదు. ఆకాశంలో ఎగిరే పావురములా స్వేచ్ఛగా జీవించండి..._*

*_ఆరోగ్యమైన ఆనందమైన జీవితాన్ని పొందండి..._*
          
*_🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏_*
🪷🪷🪷 🌺🙇‍♂️🌺 🪷🪷🪷
 *అహంకారం.....*

*మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి"దాహంగా ఉంది నీళ్లు ఇవ్వండి".. అని అడిగాడు. గుడిసె లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి  ‘మీరెవరు.. ఎక్కడ నుండి వస్తున్నారు..' అని అడిగింది.*

*కాళిదాసు "నేను ఎవరో తెలియకపోవడం ఏంటి.. నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు" అని సమాదానం ఇచ్చాడు. ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి.. 'మీరు అసత్యమాడుతున్నారు. మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’ అంది. కాళిదాసు కాసేపు ఆలోచించి" నాకు తెలియదు గొంతు ఎండి పోతుంది ముందు నీళ్లు ఇవ్వండి" అని బతిమాలుకున్నాడు. "ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు.. "అని మళ్ళీ అడిగింది ముసలావిడ.*

*ఈసారి ‘నేను బాటసారిని' అన్నాడు కాళిదాసు. అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిచింది ఆ ముసలావిడ. తెల్ల ముఖం పెట్టి మాతా.. "నీళ్ళు ఇవ్వండి. లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడ్డాడు కాళీదాసు. వాళ్ళు 'సూర్యచంద్రులు’ అని తెలిపి.. "మరి మీరెవరో సెలవివ్వండి నీళ్లిస్తాను".. అంది ముసలావిడ. కాళిదాసు దీనంగా "నేను అతిథిని".. అని బదులిచ్చాడు.*

*"మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే. ఒకటి ధనం, రెండోది యవ్వనం. అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు" అంది ముసలావిడ. కాళిదాసు "నా సహన పరీక్ష తరువాత చేద్దురు. ముందు నీళ్లు ఇవ్వండి".. అని వేడుకున్నాడు. "ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు. వారెవరో శెలవివ్వ గలరా" అంటూ.. బిక్కమొహం వేసిన కాళీదాసుతో.. "ఒకటి భూమి, రెండోది వృక్షం" అని భోద పరచి.. "ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు..." అని మళ్ళీ అడిగింది ఆ ముసలావిడ.*

*ఓపిక నశించిన కాళిదాసు "నేను మూర్ఖుడను. ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి".. అని సాగిల పడ్డాడు. ఆ అవ్వ నవ్వుతూ.. "ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు వెనుక వుండి మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పేవాడు" అని అంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరాడు.*

*ఆ అవ్వ సరస్వతీ దేవిగా సాక్షాత్కరించి ‘నాయనా.. విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు. కీర్తి, ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీర్చింది.*

*మానవునికి విద్య, అధికారం, ధన బలము తో ఎప్పుడూ అహంకారం పెరగకుండా చూసుకోవాలి...*

    *🪷|| ఓం శ్రీ మాత్రే నమః ||🪷*
🙏🙏🙏 👣🙇‍♂️👣 🙏🙏🙏

Saturday, October 12, 2024

 *🌹. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌷. విజయదశమి పండుగ విశిష్టత /  The specialty of Vijayadashami festival 🌷*

*దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయ బడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే  'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.*

*విజయదశమి పండుగ అపరాజిత పేరు మీద వస్తుంది.   పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి,  విజయదశమి అయింది.  పాండవులు శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. విజయదశమి రోజు పరాజయం లేని అపరాజితాదేవిని .. శ్రీచక్ర అధిష్టాన దేవత... షోడశ మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ విజయదుర్గను ... శ్రీ రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది.  అమ్మవారు పరమశాంత స్వరూపంతో,  సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా,  మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని,  ఆది పరాశక్తి... రాజరాజేశ్వరి దేవిగా శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ,  చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి,  ఒక చేతితో అభయ ముద్రతో  దర్శనమిస్తుంది.   మణిద్వీప వర్ణనలో "శ్రీపురంలో చింతామణి "అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది.  చెడుపై సాధించే విజయమే విజయదశమి.  ముఖ్యంగా మన మనసులో ఉన్న చెడు ప్రవర్తన మార్చుకుని (చెడుపై సాధించిన విజయంగా..) విజయదేవిని, విజయదశమి రోజు పూజిస్తే సర్వ శుభాలూ కలుగుతాయి.   ఈమె ఆది ప్రకృతి స్వరూపిణి. దుర్గాదేవి వివిధ కల్పాలలో,  వివిధ రూపాలు ధరించి నానా దుష్టజనులని సహకరించి, లోకాలకి ఆనందం కలిగించింది.   మహిమాన్విత అయిన శ్రీచక్ర అధిష్టాన దేవతయే... లలితా దేవతయే... శ్రీరాజరాజేశ్వరీ దేవి.   ఈ తల్లి నివాసం "శ్రీమణిద్వీప -- శ్రీనగర స్థిత -- చింతామణి గృహం".   ఈ తల్లి ఎక్కడ నివసిస్తుందో! అక్కడ అన్నీ శుభాలే!!!*

*🍀. దసరా సాధనాపర విశిష్టత 🍀*

*దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే ’’దశ హర‘’ అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా. పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకోవాలి.*

*🙏. చదువుకోవలసిన స్తోత్రాలు 🙏*

*రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం, కవచం, సహస్రనామ స్తోత్రం, శ్రీ విజయదుర్గా స్తోత్రం ఇత్యాదివి చదువుకోవాలి.   లలితా సహస్రనామాల్లో "రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా" అనే శ్లోకం అత్యంత ఫలదాయకం.   "ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః"  అనే మంత్రం జపించుకోవచ్చు.   రాజరాజేశ్వరి దేవి గాయత్రి మంత్రం "ఓం రాజరాజేశ్వరి రూపాయ విద్మహే! అంబికాయై ధీమ హి తన్నోమాతః ప్రచోదయాత్ "అనే మంత్రాన్ని జపించుకోవాలి.*

*🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం  🍀*
*నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |*
*నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్*
*రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |*
*జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః*

*🍀. శ్రీ విజయ దుర్గా స్తోత్రము 🍀*
*దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ*
*దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమ జ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా* 
🌹 🌹 🌹 🌹  
 *🎻🌹🙏 పాలపిట్ట దర్శనం ఎందుకు..!!*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి చివ‌రి రోజున ఉత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే.

 అయితే ద‌స‌రా రోజు రావ‌ణ‌ద‌హ‌నంతోపాటు చేయాల్సిన కార్య‌క్ర‌మాల్లో మ‌రొక‌టి.. పాల‌పిట్ట ద‌ర్శ‌నం. ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను దర్శించుకోవ‌డం వ‌ల్ల‌ అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. 

🌷అయితే అస‌లు పాల‌పిట్ట‌ను ఎందుకు ద‌ర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.🌷

పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించాక విజ‌య‌ద‌శ‌మి రోజున శ‌మీ వృక్షంపై ఉన్న త‌మ ఆయుధాలను తీసుకుని హ‌స్తినాపురం వైపు ప్ర‌యాణ‌మ‌వుతారు. 

అదే స‌మ‌యంలో వారు పాల‌పిట్ట‌ను చూస్తారు. దీంతో వారికి ఆ త‌రువాత అన్నీ శుభాలే క‌లుగుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌర‌వుల‌పై వారు విజ‌యం సాధిస్తారు. 

అప్ప‌టి నుంచి ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను చూడ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయిని, అది ఉత్త‌ర దిక్కు నుంచి వ‌స్తే ఇంకా మంచిద‌ని, శుభాలు, విజ‌యాలు క‌లుగుతాయని పండితులు చెబుతున్నారు ఏమైనా విజ‌యదశమి రోజున పాలపిట్టను చూడండి..🚩🌞🙏🌹
 *🌹. శమీ వృక్ష పూజ అంతరార్థం - పరమార్థం / Inner Meaning of Shami Vriksha Puja - Paramarth 🌹*
*✍️.  ప్రసాద్‌ భరధ్వాజ*

*మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంతో విరాట నగరానికి వచ్చి నగర పొలిమేరలలో ఉన్న శమీవృక్షం మీద తమ ఆయుధాల నుంచి ఆరాధించి, నమస్కరించి మా ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాల వలె మిత్రులకు పుష్పమాలలు వలె తమకు మాత్రం ఆయుధాలుగా కనబడాలని అపరాజితా దేవిని (దుర్గాదేవిని) ప్రార్థించారు. అజ్ఞాతవాసం అనంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకుని బయలుదేరిన రోజు ‘విజయదశమి’. సాధారణంగా శమీ వృక్షం గ్రామానికి దూరంగా ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించే ఈనాటికి కూడా విజయదశమి నాడు శమీవృక్షాన్ని దర్శించి, పూజిస్తారు.*

*శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. పాండవులు  శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.*

*విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి . పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి . ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.*

*ఇంటికి వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి పెట్టి, వారి దీవెనలందు కోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక. మీరు కూడా ఈరోజు సాయంత్రం శమీపూజ చేసి అపరాజితా దేవి అనుగ్రహాన్ని పొందండి.*

*శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌*
*శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్*‌

*అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని లేదా శమీ వృక్ష పార్ధనా స్తోత్రం శమీ వృక్షం వద్ద పఠించాలి.*

*🌴.  శమీ వృక్ష  ప్రార్థనా స్తోత్రం 🌴 *

*శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ*
*అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని ॥*

*శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం*
*ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీం ॥*

*నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే*
*త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ ॥*

*ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది*
*పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిమ్ ॥*

*అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం*
*దుస్స్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభాం ॥*

*🪷. మంత్రార్థం 🪷*
*శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.*

*🍀. శమీ వృక్ష పార్థనకు సాధనాపర విశిష్టత 🍀*

*పంచ పాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు, తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీవృక్షం మీద పెట్టాలి. ‘శమీ’ అనగా శాంతింప చేసేది లేదా నిగ్రహింప చేసేదని అర్థం. మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికయినా బుద్ధి ప్రేరణతోనే జరగాలి. కావున ‘శమీ’ అనగా బుద్ధి, అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. ‘బుద్ధి’కి నిజమైన ఆయుధాలు ‘ఆలోచనలు’. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాలులాగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి, భూతాలు వలె భయపెడతాయి కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెపుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో ‘శమీ’ అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మయే కావున అమ్మబుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి.*

*విజయదశమిని దశహరా అని అన్నాము అనగా పది పాపాలు తొలగించేది . పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది, ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమి నాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైన ‘శమీ వృక్షా’న్ని దుష్ట ఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి.*

*శమీ వృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సంకేతం. అందరికి మంచి బుద్ధి కలిగి తద్వారా లోకకళ్యాణం జరగాలని శమీపూజ అంతరార్థం.*
🌹 🌹 🌹🌹   
 *_కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని సందర్భాలలో సమస్యలు ఎక్కువై ఇబ్బందులు పడవచ్చు... బ్రతుకు దుర్భరం కావచ్చు..._* 

*_మన చుట్టూ వున్న వారు హేళన చేయవచ్చు... మన దగ్గర వాళ్ళు, మన మిత్రులు అవసరానికి అనేక విధాలుగా సాయం పొంది, ఇప్పుడు మనల్ని గుర్తించక పోవచ్చుగాక..._*

*_కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన ఉంటారు, ఎవరు మనల్ని ప్రక్కకు నెట్టేస్తారు..._*

*_మన సంతోషం చూసి ఎవరు కుళ్ళుకుంటారు... మన బాధను చూసి ఎవరు ఆప్యాయంగా పలకరిస్తారు అని తెలుసుకోవడమే విజ్ఞత..._*

*_ఎందుకంటే... కొందరు మనల్ని ఊబిలోకి నెట్టేయ్యడానికి మన పక్కనే ఉంటూ గోతులు తీస్తారు అలాంటి వారితో జాగ్రత్త._*

*_క్లిష్టమైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా, నా అనేవారు నీకు సహాయం చేయకపోయినా దిగులు పడకు... భయపడకు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు..._*

*_పసిప్రాయములో నిలబడడానికి ఎన్నోసార్లు కింద పడుతూ లేస్తూ దెబ్బలు తిన్నావు కదా.! అయితేనే ఈరోజు నిలబడి పరిగెత్తుతున్నావు..._*

*_ప్రయత్నం అనేది పసితనం నుండే మొదలైంది... ఇప్పుడెందుకు నిలబడడానికి చతికిలబడుతున్నావు.?_*

*_కష్టాలు, లాభనష్టాలు, అవమానాల గురించి ఎప్పుడు ఆలోచించవద్దు, నువ్వు చేయాల్సింది ప్రయత్నం చేస్తూపోవడమే..._*

*_నీతోని కాని పక్షంలో అంతా కాలానికి వదిలేయ్... అంతా సవ్యంగా సాగుతుంది భయమెందులకు.?_*

*_ప్రయత్నం చేయడమే సమర్ధుల లక్షణం... ప్రయత్నం చేయకపోవడం అసమర్థుల లక్షణం..._*

*_నీ సమర్థతను నిరూపించుకుంటావా... లేదా... అసమర్ధునిగా మిగిలిపోతావా... అంతా... నీ చేతుల్లోనే ఉంది...☝️_*

     *_- సదా మీ శ్రేయోభిలాషి 🙏_*
🌺🌺🌺 🌸🙇‍♂️🌸 🌺🌺🌺