*తప్పక తెలుసుకోవలసిన విషయం*
ప్రస్తుత ప్రపంచ పటంలో పాతాల లోకాలు 7. అవి...
అతల... వితల.... సుతల.... తలాతల... మహాతల... రసాతల... పాతాల లోకాలు.
అతలలోకం----యూరప్
వితలలోకం----ఆసియా
సుతలలోకం----ఆస్ట్రేలియా
తలాతలలోకం---అంటార్కిటికా
మహాతలలోకం---నార్త్ అమెరికా
రసాతలలోకం----ఆఫ్రికా
పాతాలలోకం---సౌత్ అమెరికా
అంటే పాతాల లోకం మన దేశం నుండి దూరం 15000 కిలోమీటర్లు అన్నమాట.
పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం.
దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది.
భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. ఇందుకు శ్రీమద్ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం.
సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి #పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియాగా పిలువబడుతోందని నడిచే దేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935లో ఒక ఉపన్యాసంలో చెప్పారు.
కాలిఫోర్నియాకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland) (సగర పుత్రులు బూడిద కుప్పలుగా మారిన ప్రదేశం) మరియు హార్స్ల్యాండ్ (Horseland) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీనదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.
వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం మహాబలి భూమి అని, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు.
ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలిమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు.
అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలీ అనే వాదన కూడా లేకపోలేదు. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ అమెరికా ఖండం ఉంది. అక్కడి నుంచే వామనమూర్తి బలి చక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలి చక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖ సంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.
ఇంకో ఆశక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామ లక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు.
ఇంతక ముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము.
మహిరావణుడు రామ లక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఓడిపోవడం, ఆ తర్వాత ఆంజనేయస్వామి వారు పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామ లక్ష్మణులను కాపాడుతారు.
రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, హోండురస్ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించేలోపే మరణించారు.
*హిందువులకు మెక్సికన్లకు సంబంధం వున్నదా? అమెరికా అంటే పాతాళమా?*
“సురాసురాణం అన్యోన్యం దివా రాత్రౌ విపర్యాయ:” – అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. దేవతలకు మన మానం ప్రకారం వారి పగలు ఆరు నెలలు, రాత్రి ఆరు నెలలు. వారి ఒక దినం మన ఒక సంవత్సరం. అలాగే మానవులకు పగలయినప్పుడు పాతాళంలో అది రాత్రి. (ఇప్పుడు మనకు పగలయితే వారికి రాత్రి అవుతుంది, సరిగ్గా 12 గంటలు ఆ పైనే మనకు వారికి సమయ వ్యత్యాసం) రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు 60వేల మంది కూడా ఎలా భూమిని వెదుకుతూ వెళ్ళారో, భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు. వారు అలా పాతాళంలో కపిల ముని ధ్యానభంగం చెయ్యడం, ఆయన ఆగ్రహం చవిచూసి భస్మమై పోవడం, వారి భస్మాలపైన భూమి నుండి గంగను అవతరింపచేసి పారించి పాతాళంలో వారి భస్మరాశులపై ప్రవహింప చేసి వారిని తరింపచేస్తాడు భగీరధుడు. మన భూమి నుండి 50000 యోజనాల దూరంలో పాతాళం వున్నట్టు చెబుతారు. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం.
మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్కవేస్తే సరిగ్గా లెక్క సరిపోతుంది. అహిరావణుని వృత్తాంతంలో కూడా హనుమంతుడు పాతాళానికి ప్రయాణించి అక్కడ అతడిని మట్టుపెట్టి రామలక్ష్మణులను విడిపించినట్టు ఐతీహాస్యం. అలాగ మరెన్నో కధలు భూ-పాతాళ రాకపోకల గురించి వున్నాయి. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, ఉన్నాయి.
No comments:
Post a Comment