🌹గుడ్ మార్నింగ్ 🌹మన ఆలోచన మన ఆరోగ్యముపై ప్రభావము చూపుతుంది. మన ఆరోగ్యము మన ఆలోచనపై ప్రభావము చూపుతుంది. ఇక్కడ ఆలోచన మొదటిది కనుక ముందు అన్నిటికి భయపడకుండా ఉండటం అలవాటుచేసుకోవాలి. భయం ఒక మానసిక కల్పన. ఎంత భావించుకుంటే అంత పెరుగుతుంది. ఈ భూమిపై పుట్టి సమస్యలు ఎదుర్కొకుండా శరీరం వదలిన వారు ఒక్కరు కూడా వుండరు. సమస్య అనేది ప్రతి జీవికి ఉంటుంది.అది సమస్య కాదు. జీవించవలసిన క్షణం. ప్రయత్నించ వలసిన క్షణం.ఎదుర్కోవలసిన క్షణం. భరించవలసిన క్షణం. అనుభవించవలసిన క్షణం. మనిషికి వుండే అనేక రకాలలో అది ఏదైనా కావచ్చు. మనిషికి జరిగేవి మాత్రమే జరుగుతాయి..................
మనిషి సమస్యను వ్యతిరేకించినప్పుడు - లేక వద్దనుకున్నపుడు - అది భయంకరముగా, పెద్దగా కనపడుతుంది. సమస్య అనేది జీవితంలో భాగమైనప్పుడు - దానితో కలిసి ఎలా జీవించాలో ఆలోచిస్తే - సమస్యే మనను ముందుకు నడిపిస్తుంది. నిరంతర సమస్యలకు స్పందించడమే జీవితం. అది సమస్య కాదు - కాల నడక. దానికి తగ్గ శరీర,మనో స్పందన జీవితం. ఆహారము తిన్న తరువాత - మల, మూత్ర విసర్జనలు - మల మూత్ర విసర్జనల తరువాత ఆహారము తీసుకోవటం అనే ప్రక్రియలు ఎలాంటివో - జీవించటానికి సమస్యలు అలాంటివి. నిరంతర సమస్య పరిష్కారమే జీవితం. నేను సమస్యను పరిష్కరించలేని చోట - సమస్యే దారి చేసుకు వెళ్ళిపోతుంది. కాలం ఆగదు. జీవితము ఆగదు. సమస్య భయం కాదు, వత్తిడి కాదు - జీవితం. సమస్యలో రెండు జరుగుతూ ఉంటాయి. 1) నేను సమస్యను నాకు తగ్గట్టుగా ఎదుర్కోవటం లేక పరిష్కరించుకోవటం. 2) సమస్యే దాని విధానములో పరిష్కరించుకుంటూ సాగిపోవటం....................
మనము పరిష్కరించుకో గలిగినా సమస్య - సమస్యకాదు. జరిగేది అంగీకరించగలిగినా సమస్య సమస్య కాదు. జీవితము సమస్య వేరు వేరు కాదు. ఇది అర్ధమవ్వటమే ఆధ్యాత్మికము. మన స్థితులకు, పరిస్థితులకు ఎవరూ కారణం కాదు. జీవితం ఇలాగే సాగుతుంది. అది మన ఇష్ట ప్రకారము కాదు - సృష్టి విధానము ప్రకారము సాగుతుంది.. 🌹god bless you 🌹
No comments:
Post a Comment