Thursday, October 10, 2024

****చదువులు చెప్పే ప్రతి గురువుకు ఈ యదార్ధ ఘటన అంకితం.

 🔔 *అనగనగా* 🔔

శాతవాహన ఎక్స్ ప్రెస్   స్టేషన్లో  వచ్చి ఆగింది. ఖమ్మంలో అది ఎక్కువసేపు  ఆగదు. వేగంగా కదిలి ఆఖరి  బోగి ఎక్కింది చిత్ర.  ఇంటర్మీడియట్ స్పాట్ కి  అందుకోవాలంటే,    ఆ ట్రైన్ లో  వెళితేనే టైంకి  స్పాట్ సెంటరుకి  చేరు కోగలదు. ఆ బోగి లో కూడా సీట్స్ ఏమి ఖాళీగా లేవు.  ఇంత లో ఎవరో 
"మాడం" అన్న మాట వినిపించింది.
"మీరు ఇక్కడ కూర్చోండి" సీట్ ఆఫర్ చేసిన ఆ వ్యక్తి కేసి చూసింది. 

ఇరవై ఏళ్ళు ఉంటాయేమో. సన్నగా, ఎండుపుల్లలా వున్నాడు.
అంత సన్నటి మనిషిని చిత్ర ఎప్పుడు చూసి వుండలేదు.

చిత్ర వెంటనే తేరుకొని,        వెళ్లి  కిటికీ ప్రక్కన సీట్లో కూర్చొని, "నిలబడ్డావెందుకు,

 నువ్వు కూడా వచ్చికూర్చో" అన్నది   సీట్ ఆఫర్ చేసిన అతని కేసి చూస్తూ.  
మామూలువాళ్ళు అంత ఈజీగా తేరుకునేవాళ్ళు కాదు. చిత్ర టీనేజ్ పిల్లల టీచర్.   అందుకే అతనిని  చూడగానే కలిగిన భావాలను దాచుకోగలిగింది. 

ఆ  అబ్బాయి, "ఫర్వా లేదు మాడం, మీరు కూర్చోండి" అన్నాడు నమ్రతగా. 

“సీట్ వున్నప్పుడు నువ్వు నిల్చోవడం దేనికి?  వచ్చి కూర్చో"

ఆ అబ్బాయి సంకోచంగా వచ్చి తనకు  తగలకుండ కూర్చున్నాడు మేడం నన్ను ఎవరు పక్కన కూర్చోనివ్వరు కూర్చోరు మేడం మా నాన్న తప్ప అతన్ని చూస్తూ, ఎదుట కూర్చున్న వ్యక్తికేసి చూసింది.
ఏదో జుగుప్స లాంటి భావం   అతని మొహంలో  కదలాడింది. మనిషి బాహ్య రూపానికి  ఎంత ప్రాధాన్యం ఈ లోకంలో !  అనుకొన్నది చిత్ర. 

“నీపేరేమిటి?"
"నిశాంత్   మేడమ్"
“ఎవరైనా ఏమయినా అడిగినప్పుడు వాళ్ళకేసి చూస్తూ మాట్లాడాలి!" నవ్వుతూ అన్నది....

     సరే మేడం

ఆతను తలెత్తి ఆమె కేసి చూశాడు. అతని కళ్ళల్లో  యేదో తెలియని బాధ.

చిత్ర అతన్ని పరీక్ష గా చూసింది. ఎండుపుల్లలాంటి, నల్లటి శరీరం లోతైన కాంతి లేని కళ్ళు,  సన్నని ఎముకలాంటి ముక్కు.  ముందుకు పొడుచుకు వచ్చిన చెవులు, ఏ కోశాన ఇరవైఏళ్ళ యవ్వనపు ఛాయలేని , మెరుపు లేని శరీరం.  జాలేసింది చిత్రకు.
ఎటువంటి  భావాలు  తన మొహం లో కనపడనీయకుండా, "డిగ్రీ చేస్తున్నావా?” అని అడిగింది.
"అవునండి,  బి.ఏ ఇంగ్లీష్ లిటరేచర్"
“గుడ్, తెలుగు సాహిత్యం చదువుతావా,! ఇంగ్లీష్ ఒక్కటేనా ?"    
 "అప్పుడప్పుడు తెలుగు సాహిత్యం చదువుతుం టానండి."
'అలా కాదు, మాతృ భాష రానివారు పర భాషలో ప్రావీణ్యం సాధించలేరు" అంటూ ఏ ఏ రైటర్స్ సాహిత్యం చదవాలో అతనికి సజెస్ట్ చేసింది. అతను ఎంతో శ్రద్దగా ఆమె చెప్పిన పేర్లన్నీ నోటుబుక్ లో  నోట్ చేసుకొన్నాడు.
అతను వరంగల్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. హాస్టల్లో తోటి విద్యార్థులెవరూ అతనితో స్నేహం చేయటానికి సుముఖత చూపించే వారు కాదు. ఇంట్లో కూడా అంతే.  అక్క , అన్న తనని దగ్గరకు రానివ్వరని, తమ్ముడని చెప్పుకోవటానికి సిగ్గుపడతారని చెప్పాడు. ఆ మాట చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు!
చాల బాధ అనిపించింది చిత్రకు "మీ అమ్మా, నాన్న ఎలా వుంటారు నీతో?” అడిగింది.
“అమ్మ తరచూ తిట్టిపోస్తుంది.  నన్నెక్కడికీ తీసుకు పోయేదికాదు. తిట్టినందుకు మళ్లీ ఏడుస్తుంది."
"నాన్న ఎలా వుంటారు నీతో?"
“మా నాన్నకి  చాలా ప్రేమ నేనంటే   నాన్న నన్ను బాగా చదువుకోమని చెబుతారు.” తండ్రి గురించి చెబుతున్నప్పుడు అతని  కళ్ళల్లో వెలుగు.  “అసలు నేను పుట్టగానే పాలివ్వకుంటే, వాడే పోతాడు అని  ఇరుగు,పొరుగు వారు అందరూ మా అమ్మకు సలహా    ఇచ్చారట కానీ నాన్న అందుకు ఒప్పుకోలేదు ‘వాడలా పుట్టడానికి వాడు కారణం కాదు’ అంటూ  నన్ను మా అమ్మ దగ్గిర పడుకోబెట్టారట.  అసలు నేను బ్రతుకుతానని ఎవరూ అనుకోలేదట మేడం, అంత బలహీనంగా వుండేవాడినట.”



"మాడం, అన్నీ ఉన్న పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారు, నాన్న ప్రేమే లేకపోతే నేనెప్పుడో చనిపోయేవాడినండి. మా నాన్న ఇంట్లో వున్నప్పుడు నన్ను ఎవరూ ఏమీ అనరు మేడమ్. నాన్న మాత్రం నన్ను చాలా ప్రేమగా చూస్తారు."
"మొదట నన్ను నాన్న హాస్టల్ లో జాయిన్ చేసారు, కాని నాతో ఎవ్వరూ ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. నా రూమ్మేట్ గా ఉండటానికి ఎవరూ ఇష్ట పడలేదండి. నాన్న నా బాధ చూడలేక ఆయన ఫ్రెండ్ ఇంట్లో ఒక రూమ్ రెంట్ కి  తీసుకొన్నారు. నన్ను బాధపడవద్దని, బాగా చదువుకోమని చెబుతారండి. నాకు చాలా సార్లు నేను బ్రతికి ఏమి సాధించాలి ఈ శరీరంతో  అని అనిపిస్తుందండి."

"అలా అనకూడదు”, చిన్నగా మందలించింది.

వరంగల్ వచ్చేదాకా ఆ అబ్బాయి యేదో ఒకటి చెబుతూనే వున్నాడు. చిత్ర  స్టేషన్ దాటి ఆటో ఎక్కుతుండగా అడిగాడు, 
“సాయంత్రం మళ్ళీ ఇదే ట్రైన్ కి వెళతారా  మేడమ్" అని!

"అవును", ఒక నిమిషం ఆలోచించి "సాయంత్రం కలుద్దాం", అన్నది.    నిశాంత్ మొహం పువ్వులా విచ్చింది. 
                     ******                                                                              

సాయంత్రం అతను నిజంగానే ఆమెకోసం ఎదురుచూస్తూ కనిపించాడు. 
చిత్ర “ట్రైన్ లేట్  అట కదా" అన్నది.
“అవును, మేడం”
"కాంటీన్ కి వెళదామా?"
"నేనా ! మీతోనా ?"
“ఏం?     వెళదాం  పద!"   
కాంటీన్లో అందరూ ఆమెకేసి విచిత్రంగా చూడసాగేరు స్నాక్స్, కాఫీ  కి  ఆర్డరుచేసి బిల్  పే చేసింది.
"ఈ స్కెలిటన్ ఫ్రెండ్ ఎక్కడ దొరికాడు నీకు" అంటూ తోటి లెక్చరర్స్ ఎగతాళి చేసినా చిత్ర పట్టించుకోలేదు.


ఆమెతో స్పాట్ పూర్తయ్యేవరకు  నిశాంత్ ఆమెతో రోజూ ట్రావెల్ చేసాడు.
ఓ రోజు ఒక సుభాషితాన్ని ఆమెకి చూపించి దాని  అర్ధం అడిగాడు.
"వ స్స్త్రేణ  వపుషా వాచ
విద్యయా వినయేనచ
వ కారః  పంచభిర్యుక్తః
నారో భవతి పూజితః"
చిత్ర ఆ ఐదు ‘వ’ కారాలు  గురించి చెప్పింది అతనికి. పరిశుభ్రమైన వస్రాలు, ఆరోగ్యవంతమైన మంచి శరీరాకృతి, మంచి మాట, వినయము తో కూడిన విద్య , ఈ ఐదు ‘వ’ కారాలు  కలిగిన వ్యక్తి ఈ సమాజంలో గౌరవింపబడతాడు అని వివరించి చెప్పింది.
ఆమె వివరిస్తున్నప్పుడు నిశాంత్ ఆమెకేసి తదేకంగా చూడసాగేడు .
"ఏమిటి, అలా చూస్తున్నావు?"
"మీరు ఈ సుభాషితానికి బాగా సరిపోతారు మేడమ్!”
చిత్ర అతని లోని ఆత్మన్యూనతా భావాన్ని పసిగట్టింది."మీ స్కూల్ లో, కాలేజీ టీచర్స్ అంతా చాలా అందంగా వున్నారా?” అడిగింది.
 "లేదు” అన్నట్టు తలూపాడు.
"అందంగా లేకపోయినా, వాళ్ళ లోని విద్వత్తు ను  కదా మనం గౌరవించేది, నువ్వు ఇంతవరకు డిస్టింక్షన్ స్టూడెంట్ వి. వినయము, వివేకం తో కూడిన జ్ఞానం  ప్రపంచాన్ని జయింపచేస్తుంది నిశాంత్,   నిన్ను నువ్వు   తక్కువ చేసుకొని బ్రతకకు, అందరికీ అన్ని లభించవు, ఆ అయిదు ‘వ’ కారాల్లో నీకు  లేనిది 
ఆ రెండోది.  అని నువ్వు బాధపడుతున్నావు, నీ చుట్టూ వున్న ప్రపంచం ఆ ఒక్క లోపాన్నికూడా విస్మరించేలా ఎదగాలి నువ్వు." అన్ని వున్నా ప్రేమ ఫలించలేదనో, యేవో చిన్న అపజయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతోమంది. నీ కింకా నీ మీద నీకు కోపం కానీ, సమాజం పట్ల వ్యతిరేకత కానీ లేదు. ఈ ప్రపంచాన్ని నీ దారికి తెచ్చుకోవాలంటే నువ్వు బాగా చదువుకోవాలి. అందగాళ్ళకే ఈ సమాజంలో స్థానం అనుకొంటే అంతకంటే పిచ్చి ఆలోచన ఇంకొకటి ఉండదు. అలెగ్జాన్డర్ పొప్ , నియో  క్లాసికల్ ఏజ్ పోయెట్, మూడు అడుగులు  కూడా ఉండేవాడు కాదు, కాని ఎంత గొప్ప కవి అతడు! మన చుట్టూ మనకు స్ఫూర్తినిచ్చేవాళ్ళు చాలా మంది వుంటారు నిశాంత్, నువ్వు గమనించాలి, ఆ స్ఫూర్తి నీ గమనాన్ని నిర్దేశిస్తుంది "
నిశాంత్ కాసేపు తలవంచుకుని ఆలోచిస్తూ   కూర్చున్నాడు
నిశాంత్ ఆమెతో అలా పదిహేను రోజులు ట్రావెల్ చేసాడు. ఎన్నో విషయాలు షేర్ చేసుకొన్నాడు. ఒక తల్లి చుట్టూ తిరిగే పసివాడిలా ఆమె చెప్పే ప్రతి మాటను శ్రద్దగా వినేవాడు.
                ********               
    
నిశాంత్, " రేపటినుండి నేను రాను, త్వరలో నాపెళ్లి , తను   ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో   పని చేస్తారు." ఈ రోజే ఆఖరి  రోజు అని చెప్పింది.

ఆమె ఇంక తనకు కనపడదని అర్ధమయ్యింది నిశాంత్ కు కళ్ళలో నీరు చాలా బాదేసింది...

"మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అమ్మా " మేడం
“అమ్మా” అనడం లో అతనిలోని ఆర్తి అర్ధమై, "వై నాట్'" అంటూ సెల్ఫీ దిగింది. ఆమె రైల్ దిగి వెళ్లిపోతుంటే, నీళ్లు నిండిన కళ్ళతో  చూస్తూ ఉండి పోయాడు నిశాంత్. .
                     *******

పదేళ్ల కాలగమనంలో చిత్ర ఇద్దరు బిడ్డల తల్లి అయ్యింది. భర్త తోపాటు దేశంలో ఎక్కడ పోస్టింగ్స్ వస్తే అక్కడ ఉండాల్సి వచ్చేది.     నేవీ స్కూల్స్ లో ఉద్యోగం చేసేది.   భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చారు.   ఆ రోజు ఆడబిడ్డ కొడుకు రాహుల్ వచ్చి, 
"మంచి మోటివేషనల్ స్పీచ్ వుంది వస్తారా " అంటూ వచ్చాడు.

ఆ రోజు భర్తతో కలిసి ఆ ప్రోగ్రాముకి వెళ్ళింది. హాల్ అప్పటికే దాదాపు నిండిపోయింది. లాస్ట్ రోలో సీట్స్ దొరకాయి, వక్త అప్పటికే స్టేజీమీద ఉన్నాడు. పరిచయ  కార్యక్రమంలో యువత హోరులో అతనిపేరు సరిగ్గా వినబడలేదు. యధాలాపంగా తలెత్తిన చిత్ర వక్త ని చూసి ఆశ్చర్య పోయింది.
కాషాయ  దుస్తుల్లో నిశాంత్!  సందేహ నివృత్తికోసం "అతని పే రేమిటి?”
“నిశాంత్ కృష్ణ ప్రభు!" చెప్పాడు రాహుల్. 

సందేహం లేదు, ఆతను నిశాంత్, ఆహార్యం మారింది, అతని శరీరం మారలేదు. ఇస్కాన్ సభ్యుడయ్యాడు. తన జీవితాన్ని సవ్య దిశలో మళ్ళించాడు. దేశ,  విదేశాల్లో మోటివేషనల్ స్పీకర్ గా పేరుతెచ్చుకొన్నాడు.  

అతని స్పీచ్ మొదలయ్యింది. ఒక్కొక్క పరిచయం, మాట, జీవిత గమనాన్ని  ఎలా  మారుస్తాయో చెబుతూ అన్నాడు, "ఆ తల్లి పేరు ముఖ్యం కాదు,  పదేళ్ల క్రితం,  ఒక్క పదిహేను రోజుల ప్రయాణంలో నాలోని ఇన్ఫిరియారిటీ  కాంప్లెక్స్ ని  తొలగి పోయేలా  చేసి ,  దిశా నిర్దేశం చేసిన తల్లికి వందనం”ఆమె నాపాలిట దేవత,నా మొదటి గురువు చిత్ర మేడం అంటూ,తల్లి తండ్రులకు ఇంకా ఇస్కాన్ గురువు కు   కూడా నమస్కరించుతూ   ప్రోగ్రాం ఆరంభించాడు. ఆద్యంతం సభ నవ్వులతో ముంచెత్తుతోనే , యువతరానికి కావాల్సిన మార్గదర్శకాలు సూచించాడు. నైతిక విలువలు పాటించడం ఎంత  ముఖ్యమో చెప్పాడు. . సామాజిక బాద్యతలు ఏమిటో అవి ఎందుకు, ఎలా స్వీకరించాలో తెలియచేసారు.   
చిత్ర కన్నీళ్లు బయటపడకుండా ఆపు కొని, అనుకొన్నది  అతన్ని కలవాల్సిన అవసరమే ఇంక లేదు. ఆతడు తనకి గొప్పతనమంతా ఆపాదించాడు కానీ తాను చేసింది అణువంత.  అతను  ఆకాశమంత ఎత్తు ఎదిగాడు, ఇప్పుడా సుభాషితం లోని బాహ్య స్వరూపానికంటే అతని  అంతర్ స్వరూపం   విశ్వ  విఖ్యాత మై,  అతన్ని విశ్వ విజేతను  చేసింది.
సభలోనుంచి బయటకు వెలుతున్నది నిశాంత్ చూసి మేడం అన్నాడు ఆగిపోయింది చిత్ర !మేడం మీకోసం ఎప్పుడు నా మనస్సు వెతుకుతూనే ఉన్నది మేడం ఒక్కసారి మీ పాదాభివందనం తీసుకుంటాను మేడం నేను ఈ స్థాయికి రావడం మీరే కళ్ళలో నీరు తిరిగాయి చిత్రకు ! మేడం మీలాంటి వారు సమాజం లో వేళల్లో ఒక్కరు ఉన్న అవిటి వాళ్ళు ఎవరు వుండరు మేడం,అవిటి అనేవి శరీరానికి కానీ మనస్సుకు కాదని మీరు నిరూపించారు  మేడం 🙏🙏🙏🙏🙏
చదువులు చెప్పే ప్రతి గురువుకు ఈ యదార్ధ ఘటన అంకితం.

No comments:

Post a Comment