కష్టములు కలుగుటకు ప్రథమ కారణం భ్రమ. ఏది సత్యమో, ఏది నిత్యమో తెలుసుకోకుండా దైవమును ఆశ్రయించక, ప్రపంచ సుఖములకు ఆకర్షితులమై మనసులో ఏవేవో స్వీయ ఆలోచనలు చేసుకుని భ్రమకు లోనై కష్టములను కొని తెచ్చుకుంటున్నాము.
పైగా ఈ కష్టనష్టముల గురించి భగవంతునకు పిర్యాదులు చేస్తుంటాం తప్ప భ్రమను వీడి భగవంతుని తెలుసుకుందామని ప్రయత్నం చేయడం లేదు.
ప్రపంచం, అందులో ఉన్న వస్తు విషయ సుఖములు శాశ్వతములు అనే భ్రమ నుండి బయటకు వస్తే తప్ప భగవంతుని తెలుసుకోలేము.
భ్రమ వలన బ్రహ్మ అంతటివాడే నష్టమును చవిచూశాడు. సామాన్య మానవులం మనం ఒక లెక్కనా!
No comments:
Post a Comment