మానవత్వం..!
➖➖➖✍️
నిన్న నేను నా స్కూటీనీ ఓలేక్స్ (OLX) లో అమ్మకానికి (ఫోటో తో ) మొబైల్ లో పెట్టాను.
ధర ₹30,000.
రెండు గంటల్లో బేరానికి 25 నుండీ 29 వేల వరకు పలికింది.ఇంకో గంటలో... నాకు ఒకామే ఫోన్ చేసీ...
“సార్... మీ స్కూటీ మా బాబు (కొడుకు)కి నచ్చింది... కానీ మీరు పెట్టిన ధర చాలా ఎక్కువగా ఉందీ... మేము 24 వేలు వరకు ఇచ్చుకోగలము.ఇంతకంటే మా దగ్గర డబ్బులు లేవూ...
మా బాబు ఇంజనీరింగ్ 4 వ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ చాలా దూరం.
ఒక్కొక్క సారి సైకిల్ మీద,
బస్ మీద వెళ్తున్నాడు.
ఒక్కొక్కసారి తన స్నేహితులతో
బండి మీద వెళ్తున్నాడు.
నేను, నా భర్త గత 20 సంవత్సరాల నుండీ మోటారు బండి కొనుగోలు చేయాలని అనుకుంటూనే ఆయన(నా భర్త) కాలధర్మం చేసారు.
ఇప్పుడుబాబుపెద్దవాడయ్యాడు.కాలేజీ చదువుకే... డబ్బు కి అవస్థ పడుతున్నాడు.
మీ ప్రకటన చూసి వాడికి బండి కొనిద్దామని నాకు ఆశగా ఉంది.
దయచేసి...మీరు... మా ధరకి ఇవ్వ దలచుకుంటే మాకు ఫోను చేయండి... నేను మా బాబు వస్తాం.”అని ఆమే చెప్పింది.
ఇంకో అరగంటలో నేను ఆమెకు ఫోను చేసి“బండిని చూసుకోవడానికి ఎప్పుడు వస్తారు?” అని అడిగాను.
నాలుగైదు గంటలు తరువాత....ఆమే... ఆమె బాబు మా యింటికి వచ్చారు.
స్కూటీ ని చూస్తునే....ఆ కుర్రాడి మొఖం లో చాలా సంతోషం కనిపించింది.బండిని తడుముతూ... దాని చుట్టూ
రెండుసార్లు తిరగడం చేసాడు.
“ఏమయ్యా... నీకు బండి నచ్చిందా...?” అని అడిగాను.
“చాలా నచ్చింది సార్!” అని జవాబిచ్చాడు.
వాళ్లనీ ఇంటిలోపలకీ తీసుకొని వెళ్ళికూర్చోబెట్టాను.ఆమె తన చేతిలోనున్న సంచి నుండి
డబ్బులు తీసి టీపాయ్ మీద పెట్టీ“ఇదుగొండి సార్... మీరు ఒప్పుకున్న 24 వేలు లెక్క చూసుకోండి!” అని చెప్పింది.
అందులో... ₹.100, 50, 20, 10 నోట్లు రూపంలో... ఒకటి రెండు ₹500, 200 నోట్లు కనబడ్డాయి.
ఓ....మైగాడ్...ఇవన్ని కూడ బెట్టినడబ్బులు లాగా ఉన్నాయే...అని నేను నా భార్య శైలజ అనుకున్నాము.
నా ప్రక్కనే ఉన్న నా భార్య తో...
“వీరికీ భోజనం ఏర్పాటు చేయమ”ని చెప్పాను.
భోజనాలు అయినాక కొంత సేపటికివాళ్లు వెళ్తాం అన్నప్పుడు...
“స్కూటీ తాళాలు తో... ఒక కవర్
చేతిలో పెడుతూ... “ఈ కవర్ లో
మీరు కూడ బెట్టిన ₹.24 వేలు
ఉన్నాయి... బాబుకు పెట్రోలు కి,
చదువుకీ పనికొస్తుంద”ని నా భార్య శైలజ ఆమెతో చెప్పడం జరిగింది.వాళ్లు ఆశ్చర్యంతో...
ఆమె కళ్లనీళ్లు పెట్టుకుంటూ...
మా కారు ప్రక్కనే ఉన్న వాళ్ల స్కూటీదగ్గరకు వెళ్లారు.✍️```
*****
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
Sekarana
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏.****************
బాధపడ వలదు!
➖➖➖✍️
యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః| తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||
తా:- ```
ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం విడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు?```
ఋణానుబంధ రూపేణ. పశుపత్నిసుతాలయః| ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||
తా:- ```
గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి.
ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడమెందుకు?```
“పక్వాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా| తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||
తా:- ```
పండిన ఆకులు చెట్టునుండి ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? ```
“ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః| ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||”
తా:- ```
చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు
వెళ్ళిపోతాయి.అదేవిధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని, ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడనవసరములేదు!```
“ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః| సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||”
తా - ```
ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి.కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడుఈప్రపంచప్రవాహంలోకొంతకాలంసంయోగసుఖమును,మరికొంతకాలంవియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.✍️```
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏🌹
No comments:
Post a Comment