🌹గుడ్ మార్నింగ్ 🌹మనకు మన కుటుంబ సభ్యుల గూర్చి తెలుసు.మనకు పరిచయం ఉన్న అనేక మంది గూర్చి తెలుసు. తినే తిండి, కట్టుకునే బట్ట నుండి దేముడు వరకు అనేక విషయాలు తెలుసు. ముఖ్యముగా డబ్బు గూర్చి బాగా తెలుసు.
మనం మాట్లాడే విషయాలు, చేసే పనులు - ఇచ్చే సలహాలు, పిల్లల భవిష్యత్తు నిర్ణయాలు ఇలా ఎన్నో....అంతులేనన్ని తెలుసు అనుకుంటూ అవే సత్యముగా జీవించేస్తున్నాము..........
ఒకే... ఇదంతా నిజమే అనుకొని కాసేపు నమ్ముదాము.ఎందుకంటే ఇప్పటికే ఇలా చాలా కాలము నుండి జీవిస్తున్నాము కదా...
అన్నీ తెలుసు, అందరు తెలుసు,ఒకే........
నువ్వు నీకు తెలుసా?????????????
నీ గూర్చి నీకు తెలుసా???????????
పూర్తిగా, సంపూర్తిగా నువ్వు అనుకున్నట్లే అభిప్రాయాలు, ఆలోచనలు, పనులు - మార్చుకోకుండా నువ్వు ఒకే నిర్ణయముతో చేయగలుగుతున్నావా??????????
లేదు కదా - అన్నీ మార్చుకుంటున్నావు. నువ్వు అనుకున్నవే నువ్వు అనేకసార్లు కాదని మార్చుకుంటున్నావు............
అంటే నీ గూర్చే నీకు తెలియదు..........
కాని ఎప్పటికప్పుడు మార్చుకుంటున్న వాటినే - నాకు తెలుసు - నేనే కరెక్ట్ అనుకుంటూ మళ్ళీ అంత సత్యముగాను జీవిస్తావు..................................
ఒక్కసారి ఆలోచించు నువ్వు నీకే తెలియనప్పుడు - అంతా, అన్నీ, అందరూ తెలుసు అన్నట్టు ఇతరులతో ఉండటం సరిఅయినదేనా?????????????????
ముందు నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకో..
నీ మాటలు,చేతలు ఒకేలా ఉండేలా చేసుకో.
జీవితములో ఊసరవెల్లిలా కాక నీలా నువ్వు స్థిరముగా, స్వచ్ఛముగా ఉండటం నేర్చుకో.................
స్థిరతే ఆధ్యాత్మికము.🌹god bless you 🌹
No comments:
Post a Comment