హరి ఓం , - తాబేలు తనను తాను రక్షించుకోడానికి దాని మీద ఒక ధృఢమైన కవచం లాంటి డిప్ప ఒకటి సహజంగా అమర్చబడి ఉంది. తాబేలు తనకు బయట నుండి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని తెలిసినపుడు తన తలను మిగిలిన అంగములను ఆ డిప్పలోకి లాక్కుంటుంది. అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది. అలాగే స్థిత ప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయవాంఛల నుండి తనను తాను రక్షించుకోడానికి తన ఇంద్రియములను వెనక్కు లాక్కుంటాడు. ఇది అర్థం కావాలంటే మనము ఆచరించ వలసిన
సాధనల గురించి ముందు తెలుసుకుందామ.ముందు బయటకు కనపడే ఇంద్రియములను నియంత్రించ గలిగితే మనసును నియంత్రించడం సులభం అవుతుంది.
" ఇంద్రియ నిగ్రహముతో మొదలు పెట్టాలి....... సాధారణంగా ఇళ్లకు తలుపులు పెట్టుకుంటాము. ఎందుకు, అనవసరమైన వాళ్లు ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త. ఇంకా కొంత మంది అయితే అనుమతి లేనిదే లోపలకు రాకూడదు అని బోర్డు కూడా పెట్టుకుంటారు. అలాగే మన శరీరం తలుపులు తెరిచిపెడితే, బయట ప్రపంచంలో ఉన్న శబ్ద, స్పర్శ,రస,రూప, గంధములు అన్నీ యధేచ్ఛగా లోపలకు ప్రవేశిస్తాయి, వెళ్లిపోతాయి. కాని వాటి వాసనలు మాత్రం మనలను వదలవు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము అనే తలుపులు మనం అమర్చుకోవాలి.
" మనోనిగ్రహము " అంటే శమము. మనసును అనవసరంగా ఆలోచనలతో నింపెయ్యడం. ఎవడన్నా ఒకడు మరొకడిని ఏదో ఒక మాట అన్నాడు అనుకుందాము. రెండవ వాడు “వీడు నన్ను తిట్టాడు.” అనే నిర్ణయానికి వస్తాడు. దాంతో వదిలిపెట్టడు. ఏమేమి పదాలతో తిట్టాడు? ఎలా తిట్టాడు? దానికి నేనేం ప్రతీకారం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తుంటాడు. పొరపాటున వాడు ఎక్కడన్నా కనపడితే మెంటల్లీ అప్సెట్ కూడా అవుతాడు. ఇలా కాకుండా ఎక్కడిదక్కడ వదిలేస్తే హాయిగా ఉండవచ్చు. కొంత మంది చిన్న చిన్న విషయాలను కూడా సంవత్సరాల తరబడి మనసులో పెట్టుకొని బాధ పడుతుంటారు. మరి కొంతమందిలో కక్షలు తరతరాలు ఉండటం మనం చూస్తున్నాము. ఇదంతా మనసును నిగ్రహించుకోలేక పోవడమే. మనసు మన అధీనంలో లేకపోవడమే. ఉదాహరణకు ఎవరన్నా నీకేం తెలియదు నోరు మూసుకో అన్నాడనుకోండి. వెంటనే విపరీతంగా స్పందించకుండా కాసేపు మనసును నిగ్రహించాలి. నిజాయితీగా ఆలోచించాలి.
ఒక వేళ మీకు బాగా తెలిసిన విషయాన్ని ఎవడో “నీకేం తెలియదు" అన్నాడనుకోండి. “పాపం. నాకు ఆ విషయం తెలుసు అన్న విషయం వాడికి తెలియదు. ఏం చేస్తాం. అది వాడి అజ్ఞానం" అని అనుకుంటే సరిపోతుంది. అలా కాకుండా “ఆహా! నాకు తెలియదంటావా!" అంటూ వాడి మీదికి పోతే మాటల యుద్ధం మొదలవుతుంది. ఇదే మనోనిగ్రహం.
జ్ఞానేంద్రియములు ఎప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తుంటాయి. అప్పుడు ప్రాపంచిక విషయముల ప్రభావము వాటి మీద పడే అవకాశము ఎక్కువగా ఉంది. వీటి యొక్క తీవ్రమైన ప్రభావము తమ మీద పడినప్పుడు, బుద్ధిమంతుడు తన జ్ఞానేంద్రియములు వాటి వల్ల ప్రభావితం కాకుండా తనలోకి లాక్కోవాలి. తాబేలును ఉదాహరణగా చెప్పారు. తాబేలు చిన్నగా నడుస్తుంది. ఆపద వచ్చినపుడు పరుగెత్తలేదు. ఎవరినీ పొడవడానికి పొడుగాటి ముక్కులేదు. కరవడానికి పళ్లులేవు. అందుకని దీనికి రక్షణగా దాని శరీరం మీద ఒక ధృడమైన డిప్పను ఏర్పాటు చేసాడు పరమాత్మ. తనకు ఏదైనా ఆపద సంభవిస్తుంది అనే భావన రాగానే తన నాలుగు
కాళ్లు, తల తన డిప్పలోకి లాక్కుంటుందో అలాగే బయట నుండి ఏదైనా అనవసరమైన విషయం లోపలకు వస్తుంది అని తెలియగానే మనం కూడా మన ఐదు ఇంద్రియములను లోపలకు లాక్కోవాలి.
ఇక్కడ 'సర్వశం" అన్నారు అంటే అన్ని ఇంద్రియములను అని అర్థం. కళ్ళు, చెవులు , నోరు మూసుకొని వుంటాయి, కాని చర్మము చూసుకోలేదు. ముక్కు మూసుకుంటే ఊపిరాడక చస్తాము. అందుకని
కళ్లు, చెవులు, నోరు మూసుకుంటే బయట విషయాలు లోపలకు వచ్చే అవకాశం లేదు అని మూడుకోతుల కథ మనకు బోధిస్తుంది. అలా చేసిన వాడి జ్ఞానం ధృఢంగా ఉంటుంది. చలించదు. ప్రాపంచిక విషయాల వెంట పరుగెత్తదు. తనకు ఏం కావాలో అంతవరకే తీసుకుంటుంది. అనవసర విషయాల జోలికి పోదు.................. - - 🙏🙏 ....... - వలిశెట్టి లక్ష్మీశేఖర్... - 98660 35557 .... - HYD ...16.10.24 ...
No comments:
Post a Comment