స్వార్థం, మమకారం, భయం కలిగి ఉన్న జీవులకు కలవరపాటు తప్పదు.
హృదయాన్ని నిష్కామప్రేమతో, మృదుత్వంతో, వినయంతో నింపమని ప్రార్థన చేయడాన్ని అలవరచుకోవాలి.
ఇవి సంతోషాన్ని కలుగజేస్తాయి. మనం కోరదగిన కోరికలు అంటూ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే.
మన హృదయం సందేహం, నిరాశ, కఠినత్వం వంటి దుర్లక్షణాల నుండి విడివడితే అప్పుడు మనలను ఆశీర్వదిస్తూ భగవంతుడు మనలో సంతోషాన్ని నింపగలడు.
మనలోని ఆలోచనలకు, ప్రార్థనలకు భగవంతుని గమ్యంగా చేస్తే, అహంకార, మమకారాలు వాటంతటవే తొలగిపోతాయి.
No comments:
Post a Comment