Tuesday, October 15, 2024

****_జీవితంలో కష్టాలు ఉండటం సహజమే.! కానీ బాధలో ఉండటం అసహజం.

 *_జీవితంలో కష్టాలు ఉండటం సహజమే.! కానీ బాధలో ఉండటం అసహజం. ఈ చరిత్రలో ఎవరిని తీసుకున్నా కష్టాలు లేని వారెవ్వరూ లేరు.!_*

*_సోక్రటీస్ నుంచి వివేకానందుడి వరకు, ఐన్ స్టీన్ నుండి అబ్దుల్ కలాం వరకు అందరూ ఎన్నో కష్టాలు పడ్డవారే.! మరి వారందరికీ కష్టాలు వుండి వుంటే వారు ఎప్పుడూ బాధలో ఉన్నట్లు కనబడరెందుకు.?!_*

*_కష్టాలు వేరు, బాధలు వేరా.? కష్టం అంటే ఏంటి, బాధ అంటే ఎంటి.? కష్టాలు ఉన్నా బాధ లేకుండా ఉండవచ్చా.?_*

*_జీవితంలో ఊహించనిది, అనుకోనిది జరిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, మన శక్తికి మించిన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని కష్టంగా భావిస్తూ వుంటాం.!_*

*_ఈ కష్టాలకు అనేక కారణాలు ఉండవచ్చు.! వాటిలో ఎన్నో మన చేతుల్లో ఉండవచ్చు, వుండకపోవచ్చు.! అది అత్యంత సహజం... అన్నీ మన చేతుల్లో లేకపోవడం.!_*

*_కానీ బాగా గమనిస్తే ఒకే కష్టం ఒక వ్యక్తికి వస్తే చాలా బాధపడుతూ కనబడితే, అదే కష్టం ఇంకో వ్యక్తికి వచ్చినప్పుడు మామూలుగా ఏ బాధ లేనట్లు కనబడుతూ వుంటాడు.!_* 

*_అంటే మనకు ఇక్కడ అర్థం అయ్యే విషయం ఏమిటంటే బాధ అన్నది కష్టాలనుంచి కాకుండా ఇంకెక్కడినుంచో వస్తోంది.! అదే మన మనస్సు.! అంటే బాధ అన్నది మనస్సు వల్ల, మనస్సు నుంచి సృష్టించబడినదే కానీ నిజంగా బాధ అన్నది లేదు.!_* 

*_అంటే మనం అనుకుంటే బాధ లేకుండా కూడా ఉండవచ్చు.! కాబట్టి కష్టాలు అన్నవి మన చేతుల్లో లేని సహజ ప్రక్రియ అయితే బాధ అన్నది మన చేతుల్లోనే వున్న అసహజ ప్రక్రియ.!_* 

*_మనం అనుకుంటే సర్వ వేళలా బాధలులేకుండా ఉండవచ్చు కూడా.!_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🫐🏵️🫐 🪷🙇‍♂️🪷 🫐🏵️🫐

No comments:

Post a Comment