Sunday, October 27, 2024

 *🙏శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం*  : 
*వాడపల్లి.. (తూ.గో జిల్లా)🙏*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

 🌿తిరుపతి, ద్వారకా తిరుమల క్షేత్రాల  తరువాత అత్యంత ప్రజాధరణ పొందిన వేంకటేశ్వర స్వామి  క్షేత్రం వాడపల్లి. 
గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది.

🌸 కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున - లోల్లకు ఆనుకొని ఉండుటతో లోల్లవాడపల్లిగా పిలిచేవారు. అదే నేడు వాడపల్లి గా మారింది వాడపల్లి గ్రామాన్ని పూర్వం  " నౌకాపురి "  అని కూడా పిలిచేవారు. 

🌿 ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ ఏడు వారాల శనివారం వ్రతం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెబుతారు.
 అందువల్లే ఈ క్షేత్రంలో శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు..

🌸ఇక్కడ గోదారమ్మ  రెండు పాయలుగా విడిపోయి ఒకటి వశిష్ఠ మరొకటి గౌతమి పాయలు గా పయనిస్తోంది. 

🌿పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభూ వెలిసారు. 

🌸 తూర్పుగోదావరి జిల్లా  కొనసీమలోని వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి స్వయంభు స్వయంభు.  
కలియుగంలో 4 చోట్ల మాత్రమే వెంకన్న  స్వయంభూగా వెలిశారు. 

🌿ఒకటి తిరుమల తిరుపతి. 
రెండవది ద్వారకాతిరుమల. 
మూడు విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని ఉపమాక .
ఈ మూడు చోట్ల స్వామివారు రాతి విగ్రహ రూపంలో ఉంటారు. 
నాలుగవది వాడపల్లి  ఇక్కడ స్వామివారి విగ్రహం ఎర్రచందనం లో ఉంటుంది .

🌸అందుకే స్వామివారికి పంచామృత అభిషేకంలు చేయరు. 
కర్పూర తైలంతో అభిషేకం చేస్తారు.ఇది ఇక్కడ మరో మహత్యం .
  నది ఒడ్డున వెలసిన స్వామి వారిని నారద మహర్షి వారు కనుగొని  ‘‘వేం-కట’’ అని పేరు పెట్టిన పుణ్యక్షేత్రం ..వాడపల్లి .

🌿నారదమహర్షి తన స్వహస్తాతో ఆ మూర్తికి ‘వేం' అంటే ‘పాపాలను' ‘కట' అంటే పోగొట్టేవాడు అని నామకరణ చేసి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వేంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. అటు పై అక్కడ ఉన్నవారంతా కలిసి అక్కడ ఆలయం నిర్మింపజేశారు.

🌸గోదావరి నదిలో వరద ముంచెత్తడం వలన నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. 
ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అను వారు కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి పెద్ద తుఫాన్ సంభవించడంతో ఆ పడవలు అన్ని సముద్రంలో కలిసిపోగా ఆయన స్వామి వారిని వేడుకున్నాడు. 

🌿"స్వామి నా పడవలు సముద్ర గర్భం నుండి తీయిస్తే నిన్ను గోదావరి నది నుండి వెలికి తీసి నీకు ఆలయం నిర్మించి ప్రతిష్టిస్తాను"  అని అనగా ఆ మరుసటి రోజు నౌకలు అన్ని నది ఒడ్డుకి చేరడంతో అన్న మాట ప్రకారం స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు. 

🌸ఈ ఆలయంలో స్వామి వారికి కుడి వైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలుమంగతయారు అమ్మవారు, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు వారు వారి శిష్యులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు మనకి. 
 
🌿 2000 సంవత్సరం వరకు సామాన్యంగా భక్తులు వచ్చేవారు. వచ్చిన భక్తులు మళ్ళీ మళ్ళీ వచ్చే వారు. అయితే 2000 సంవత్సరంలో ప్రతి శనివారం వచ్చే ఓ భక్తుడును చూసి ఆలయంలో పనిచేసే సూపరిండెంట్ రాధాకృష్ణ అతడిని ప్రతివారం ఎందుకు వస్తున్నారు అని ప్రశ్నించగా.. 

🌸పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 
ఓ సిద్ధాంతి ఉన్నారు...ఆయన దగ్గరికి వెడితే ఈతి బాధలు పోవడానికి  కోనసీమలో వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఏడు శనివారాలు దర్శించుకుని ,ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు చేయాలని చెప్పారని దానితో తన బాధలు తీరి పోవడంతో ప్రతివారం వస్తున్నట్లు వెల్లడించారు. 

🌿ఈ విషయం ఆ గ్రామస్తులు అందరికి తెలిసింది. గ్రామస్థులు కూడా ప్రతి శనివారం  ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామి దర్శనం చేసుకునేవారు. 
వారి కోరికలు నెరవేరాయి. 

🌸దీంతో ఆనోటా ఈనోటా ప్రపంచవ్యాప్తంగా వాడపల్లి వెంకన్న మహత్యం అందరికీ తెలిసింది. 
 తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంగమాంబ నిత్యాన్నదాన భవనం లో ఎలా అన్నదానం నిర్వహిస్తారో అదే స్థాయిలో ఇక్కడ ఒకేసారి 15వేల మందికి అన్నదానం జరపడం విశేషం. 

 🌿స్వామి వారి ఆలయం చెంతనే గోదావరి నది ఉంది. భక్తులు అక్కడ స్నానం చేసి ,మరి కొందరు అక్కడే తలనీలాలు సమర్పించి స్వామివారి ప్రదక్షిణ లో పాల్గొంటారు. ప్రదక్షిణలు పూర్తయ్యాక స్వామి దర్శనం చేసుకుని, అన్నదానం స్వీకరించి నిండుమనసుతో తిరిగి వెళతారు. 

🌸కొందరైతే శుక్రవారం సాయంత్రానికి అక్కడకు చేరుకుని ఆలయ ప్రాంగణంలో నిద్రపోయి తెల్లవారుజామునే లేచి గోదావరి స్నాన మాచరించి ప్రదక్షిణలు ప్రారంభిస్తారు. 
ఏడు శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ మార్మోగి పోవడంతో లక్షలాదిగా భక్తులు వాడపల్లికి వస్తున్నారు ఈ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల గా ప్రసిద్ధి గాంచింది... స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment