23-10-2024-బుధవారము - శుభమస్తు🌹
ఆధ్యాత్మిక సాధనలన్నీ జీవితాన్ని సక్రమముగా నడుపుకోటానికి మాత్రమే. నిత్య జీవితములో ప్రతి రోజు అనేక పనులు చేయవలసి ఉంటుంది. అనేకం పొందవలసి ఉంటుంది. అనేకమంది మనుషుల మధ్యే ఈ కార్యకలాపాలు అన్నీ చేయవలసి ఉంటుంది. అందులో సొంత కుటుంబ సభ్యులు వుంటారు, బయట అనేక మంది వుంటారు.అవసరాలు, కోరికలు, ప్రయత్నాలు, పొందటాలు, అనుభవాలు, సుఖదుఖాలు - అన్నీ నావి నాకు మాత్రమే తెలుస్తున్నప్పుడు - ఎలాగైనా సుఖాన్ని మాత్రమే పొందాలని అనిపిస్తుంది. వ్యతిరేకతలు, బాధలు, దుఖాలు వద్దనిపిస్తుంది.
ఈ ప్రయత్నములో మన సొంతవారి నుండి మనకు తారసపడే అందరి నుండి ఎలాగోలా అనుకూలతనే సాధించుకోవాలనిపిస్తుంది.
ఈ ప్రయత్నములో ఎదుటివారిని ఇబ్బంది పెట్టి అయినా పొందాలనిపిస్తుంది.
అలా ఇతరులకు మన వలన కలిగే ఇబ్బందులు తిరిగి వారి ద్వారా మనకు ఇబ్బందులుగా మారతాయి....
వద్దనుకున్న వ్యతిరేకతలు, బాధలు, దుఖాలు వచ్చి మీద పడుతూ ఉంటాయి...
ఇక్కడే ఆధ్యాత్మికత - చుట్టూ ఉన్న మనుషులు అందరూ మనలాంటి వారే అని చెబుతూ - మనము మంచిగా ఎలా జీవించాలో అనేక విధములుగా జ్ఞానాన్ని అందిస్తుంది................ఎంత జ్ఞానము తెలుసుకుంటున్నా అవసరాల, కోరికల, భయాల మనసు పాత తప్పు మార్గాలలోకి అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది...
అందువలన మంచి జ్ఞానాన్ని నిరంతరం తెలుసుకుంటూ - మనసును కొంత అదుపుచేసి మనము అనుకున్నట్టుగా మంచిగా మాత్రమే సాగేలా దానిని నెమ్మదింపచేసే ప్రక్రియే ధ్యానము...........
ధ్యానము కొత్త ఊహలు ఊహించుకోవటము కాదు - మనసులోని చెడును తొలగించుకుంటూ - మనోవేగాన్ని నెమ్మదింప చేయటం ద్వారా పొందే శాంతి, విశ్రాంతి.............................
ధ్యానమంటే కేవలం నాలో నేను - నాతో నేను - నన్ను నేను సంపూర్ణముగా తెలుసుకుంటూ - నన్ను గమనించుకుంటున్న నేను - నన్ను సరి చేసుకునే నేను - నన్ను శాంతిగా ఉంచుకునే నేను. నేనే నా సర్వానికి కర్తగా మారే నేను...
ధ్యానమంటే కాసేపు సంపూర్ణ విశ్రాంతి......
మరి కాసేపు నా గూర్చిన సంపూర్ణ ఎరుక.....
🌹🌹🌹🌹god bless you. 🌹🌹🌹🌹
No comments:
Post a Comment