Wednesday, October 16, 2024

 పరమగమ్యాన్ని చేర్చే మార్గంలో ప్రయాణించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 

మనస్సు కామలోభాలకు లొంగిపోయి ఆధ్యాత్మిక సాధకుడు దిగజారిపోయే ప్రమాదం నిరంతరం ఉంటుంది. 

ఎంతో పురోగతి సాధించిన వారికి తప్ప నిజమైన రక్షణ లభించదు.

ఆత్మసాక్షాత్కారం లభించే లోపల ఎంత గొప్ప భక్తుడైనా అధఃపతనం చెంది, వేదనలో మునిగిపోవచ్చు. 

కాబట్టి తగిన పురోగతి సాధించకుండా మన సామర్ధ్యం గురించి ఎక్కువగా అంచనా వేసుకుని సాహసాలు చేయకూడదు.

ఆధ్యాత్మిక సాధనను, ప్రార్థనలను ఉధృతం చేయాలి. రాత్రింబవళ్ళూ  నిరంతర ప్రార్థన, నిరంతర ధ్యానం, గాఢమైన సద్విచారణ చేస్తే అపారమైన  మంచి జరుగుతుంది.

సాధన ప్రారంభదశలో ఉన్నవారు తన మనస్సును భగవంతునికి సంబంధించిన ఆలోచనలతో నింపుతూ, వాటిని ఒక అలవాటుగా మార్చుకోవాలి.

ఒకసారి బలమైన అలవాట్లు ఏర్పడ్డాక మార్గం సుగమం అవుతుంది. అప్పుడు శ్రమ కొంత తగ్గుతుంది.   

No comments:

Post a Comment