Tuesday, October 8, 2024

 మనందరిలో నిబిడీకృతమై ఉన్న దివ్యత్వమనే మూలాన్ని మనం కనుకొనగలిగితే, ఇంక విచారానికి తావు ఉండదు.

ఆనందం మహాత్ములందరి లక్షణం. మనిషి నిరంతరం పైకి చూస్తూ ఉంటాడు. ఉన్నతమైన దానినేదో పొందాలని తపిస్తూ అశాంతిగా ఉంటాడు.

అయితే ఉన్నతమైనది తప్ప వేరేదీ తనను ఆనందింప చేయలేదనే సహజ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. భౌతిక వస్తువుల కంటే కూడా గొప్పదైన వస్తువునే మనస్సు కోరుకొంటుంది.

ఈ విషయాన్ని త్వరగానో, ఆలస్యంగానో మనమందరం తెలుసుకుంటాం. ఉన్నతమైనది, పవిత్రమైనది మన వద్దకు వచ్చినప్పుడు దాన్ని గ్రహించడానికి ఇష్టపడాలి.

మన అంతరంగం సారవంతమైన భూమిగా పరివర్తన చెందినప్పుడే జీవితం ఆనందంగాను, ఫలవంతంగాను ఉంటుంది...............

No comments:

Post a Comment