Tuesday, October 8, 2024

 *_ఉత్తముడి కోపం — క్షణంలో మాయమవుతుంది.!_*

*_మధ్యముడి కోపం — ఓ ఘడియ వరకు.!_*

*_అధముడి కోపం — ఒక రాత్రి పగలు వరకు._*

*_పాపిష్ఠివాడి కోపం మాత్రం, జీవితాంతం ఉంటుందన్నది పెద్దల మాట._*

*_మనసులో పుట్టిన క్రోధాన్ని పాము కుబుసం లా వదిలిపెట్టాలి._*
 
*_భగభగ మండే క్రోధాగ్నిని ఓర్పు అనే నీళ్లు చల్లి చల్లార్చాలి._*

*_అది చెప్పినంత సులువుగా అబ్బే లక్షణం మాత్రం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు. సాధనతో ఓర్పును అలవరచుకోవాలి._*

*_ధార్మిక ప్రవర్తనతో నమ్మకంతో ఓర్పును సాధించవచ్చు._*

*_తన ధర్మ ప్రవర్తనతో సహనశీలిగా ఉన్న వ్యక్తి కాబట్టే రాముడి కథ ఇన్ని యుగాల తరవాత మనకు ప్రాతఃస్మరణీయమైంది._*

*_భారత రామాయణాల్లోని ఎన్నో పాత్రలను పరిశీలించడం ద్వారా సహనం, సంయమనం వంటి లక్షణాలను అలవరచుకోవడాన్ని సాధన చేయవచ్చు._*

*_విత్తు నాటిన మరునాటి నుంచే ఫలసాయం కోసం ఎదురు చూడటం ఎంత వరకు సమంజసం.?_* 

*_దానికి నీరు అందించి, చీడపీడల నుంచి రక్షించి ఓర్పుగా సంరక్షిస్తేనే ఫలసాయం చేతికొస్తుంది._*

*_సాధారణంగా మానవులు అలంకారంగా ఆభరణాలను ధరిస్తారు. కానీ,_*

*_లోకంలో ఉత్తములైనవారు ఓర్పును భూషణంగా ధరిస్తారని మహాభారతంలో విదురుడు చెబుతాడు._*

*_కొంత సమయం ఓర్పుతో నిగ్రహంతో వేచి చూస్తే ఎన్నో యుద్ధాలను, నష్టాలను అరికట్టవచ్చు._*
 
*_పడ్డవాడు చెడ్డవాడు కాదు అనే లోకోక్తి కూడా ఉంది._*

*_ఇదే విషయాన్ని బోధించే విధంగా ‘దాంతునికైనా వేదాంతునికైనా దార, సుతులు, ధన ధాన్యములుండినా, సారకు జపతప, సంపద కలిగినా శాంతమూ లేక సౌఖ్యము లేదు’ అంటాడు త్యాగయ్య._*

*_అందుకనే ఈ లోకంలో ఉన్నత స్థాయికి చేరుకునే వ్యక్తికి ఉండాల్సిన ఉత్తమ భూషణం- ఓర్పు. 👍_*

    *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🌷🙇‍♂️🌷 🌹🌹🌹

No comments:

Post a Comment