హరి ఓం ,
ప్రతి వాడూ నేను సుఖంగా, ప్రశంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఆ సుఖం ఆనందం ఎక్కడ ఉందో ఎలా లభిస్తుందో వాడికి తెలియదు. వాడు బయట ప్రపంచంలో లభించే సుఖం, ఆనందం అని అనుకుంటాడు. నిజంగా సుఖం, ఆనందం కాదు అన్న విషయం వాడికి తెలియదు. సంసారమే సుఖదు:ఖాల సమ్మేళనము. సుఖదు:ఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. మనసును ప్రాపంచిక విషయముల నుండి మరలించి ఆత్మ యందు ఉంచితే అదే శాశ్వత సుఖము. దాని కోసం ఎవరూ ప్రయత్నించరు. తాత్కాలిక సుఖాల కోసం పాకులాడు తుంటారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి విషయ వాంఛల గురించి ఆలోచిస్తూ, పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైనసుఖము, ఆనందము, శాంతి ఎలా లభిస్తాయి అని పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు.
దీనికి ఒక చక్కటి
తేనెటీగ కథను ఉదాహరణలుగా తీసుకుందాము. ఒక తేనెటీగ ఓ తామర పూవుపై, దాని న్తమకరందాన్ని గ్రోలుతూ, కూర్చొని ఉంది. సూర్యుడు అస్తమించే కొలదీ, ఆ పూవు రెక్కలు మూసుకు పొసాగాయి. కానీ, ఆ తేనెటీగ తన ఇంద్రియ సుఖాలను అనుభవించటంలో ఎంత ఆసక్తితో ఉందంటే దానికి ఎగిరిపోవాలనే బుద్ధి కలగలేదు. అది ‘ఇంకా పువ్వు మూసుకు పోవటానికి ఇంకా సమయం ఉంది కదా, ఇంకొంచెం మకరందం ఆస్వాదించుదాను అని అనుకుంది.
అలాగే మరణానికి ఖచ్చితమైన సూచికగా ముసలితనం వచ్చినా, మనం ప్రాపంచిక భోగాలను అనుభవించటం లోనే నిమగ్నమై ఉంటాము.
ఈలోగా, చీకటి పడింది, తామర పూవు పూర్తిగా మూసుకు పోయింది,
అందులో ఆ తేనెటీగ చిక్కుకు పోయింది. ఎలాగో చిక్కుకు పోయాను కదా, ఈ రాత్రికి ఇష్టమైన పువ్వులోనే ఉంటాను రేప్పొద్దున్న పూరేకులు విచ్చుకున్నప్పుడు, ఎగిరిపోతానులే అని అనుకుంది తేనేటీగ.
“ సాధారణంగా ఒక తేనెటీగకి చెక్కకొయ్య తొలిచే శక్తి ఉంటుంది. కానీ, ఇంద్రియ విషయములపై ఉన్న మమకారంతో చెక్కని కూడా తొలిచే సామర్థ్యం ఉన్నాకూడా తేనెటీగ, ఈ సుకుమారమైన తామర రేకులలో చిక్కుకు పోయింది.’ కొద్దిసేపటికి ఒక ఏనుగు వచ్చి ఆ తామర కాండంం మొత్తం తెంపి దాన్ని మింగేసింది. తేనెటీగ ఆ తామర పువ్వుతో సహా కలిసి ఆ ఏనుగు కడుపులోకి వెళ్ళిపోయింది. కాని ఆ తేనెటీగ అనుకుంది, ‘నా ప్రియమైన తామర ఎలాగో పోయింది, దానితో పాటే పోవటం నాకు సంతోషమే’ అనుకుంది. కాని కాసేపటికే అది చనిపోయింది.
ఇదే విధంగా, మనం మానవులం కూడా ఇంద్రియములను తృప్తి పరచటం లోనే నిమగ్నమై ఉండి,
చిట్టచివరికి, మృత్యువు రూపంలో ప్డకాలమే మనలను కబళిస్తుంది. భౌతిక వాంఛలు ఎక్జిమా దురద వంటివి, ఎంత గోకుతుంటే అంత తీక్ష్ణమవుతాయి.
ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో, వారిని మాయ తన మూడు ప్రకారాల దుఃఖాలతో బాధిస్తూనే ఉంటుంది, అని ఇక్కడ శ్రీ కృష్ణుడు అంటున్నాడు. .............. - - 🙏🙏 ........ - వలిశెట్టి లక్ష్మిశేఖర్... - 98660 35557 .... - HYD. 26.10.24 ...
No comments:
Post a Comment