Saturday, October 26, 2024

 *" భక్తుల కొరకు  భగవంతుడు రచించే ప్రణాళికలు చాలా గొప్పవి.  అవి భక్తులకు కాస్త బాధను కలిగించేవిగా కనిపిస్తుంటాయి కానీ వాటితోనే భక్తులకు నిజమైన ఉపయోగము. వాటి వలనే అసలైన ఆనందము లభిస్తుంది.* 

.*కొన్నిసార్లు మీరు చేసే ప్రార్థనలకు సమాధానం త్వరగా కనిపించకపోవచ్చును. అంత మాత్రమున దైవము మీ ప్రార్థనలను విననట్లు, మిమ్ములను నిర్లక్ష్యం చేస్తున్నట్లు భావించరాదు!*

*తల్లి తమ పిల్లల కొరకు వంట చేసేటపుడు, పిల్లలు ఆకలి, ఆకలి అని అంటుంటే వంట చేయడంలోనే నిమగ్నం అవుతుంది. ఇక్కడ తమ పిల్లల కేకలు తనకు వినబడక కాదు! పట్టించుకోక అనికూడా కాదు! ఎంత వేగంగా వంట చేసి తమ పిల్లల ఆకలి తీర్చుదామా అనే తాపత్రయంతో ఉంటుంది.*

*భగవంతుడు తల్లులకే తల్లివంటివాడు. మీరంతా భగవంతుని పిల్లలే! మీ బాధలు, కష్టాలు అన్నీ దైవమునకు తెలుసు. ప్రార్థించండి!  సహనం వహించండి! విశ్వాసం విడువకండి! తను మీ కోసం పెద్ద ప్రణాళికే సిద్ధం చేసి ఉండవచ్చును. మీ ప్రార్థనలన్నింటికీ సమాధానం లభించే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు. నమ్మకం విడువకండి. "*.        అలాగే,
*మానవుడు మహా మేధావి.* అంతరిక్షయానం సహితం చేస్తున్నాడు, సూక్ష్మాతి సూక్ష్మములను సహితం చూస్తున్నాడు కానీ తన అంతరాత్మలోకి మాత్రం చూడలేక పోతున్నాడు.

భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన లేని చోటు లేదు. కానీ  ఆయనను గుడి వరకే పరిమితం చేస్తున్నాడు.

భగవంతుడు నిరాకారుడు. కానీ  ఆయనకు ఓ రూపం కల్పించి,  ఓ చట్రంలో బిగించి గోడకు మేకు కొట్టి,  తగిలించి అదే భగవంతుని అసలైన రూపంగా భావించి పూజిస్తున్నాడు.

భగవంతుడు అనామకుడు. అనగా ఆయనకు ప్రత్యేకమైన పేరు ఏదీ లేదు. కానీ ఆయనను పలానా పేరు గలవాడే దేవుడని,  ఆ పేరుతో  పిలుస్తేనే పలుకుతాడని భావిస్తున్నాడు.

ఎంత మేధావి అయితే మాత్రం ఏం ప్రయోజనం? భగవంతుని అసలైన ఉనికి, నిజతత్త్వం తెలుసుకోలేనపుడు ఎంత తెలివుండి ఏం లాభం? ఇదంతా అక్షరాలు నేర్చుకునే స్థాయి. జీవితమంతా అక్షరాలు నేర్చుకుంటూనే ఉంటుంటే ఇంకా డిగ్రీలు ఎపుడు సంపాదిస్తాం? ఉద్యోగం ఎపుడు చేస్తాం??!            

No comments:

Post a Comment