Tuesday, October 8, 2024

 🕉️ ఓం నమః శివాయ 🕉️

          *ఆచార్య సద్బోధన*

*మనం సరియైన మార్గంలో చూపుని స్థిరంగా నిలపగలిగితే ఎవరూ మనల్ని వెనుతిప్పలేరు.*

*దివ్యత్వానికి వేరుగా మనం ఉనికిని కలిగి మనలేం.* 

*ఎటువంటి సందేహాలు, వ్యాపార ధోరణి అవలంబించకుండా మనలను మనం భగవంతుని చేతిలో ఉపకరణాలమని భావించగలిగితే మన జీవితాలకి ఒక విలువ ఏర్పడుతుంది.*

*దాని వలన మనలో స్వార్థం, సంకుచితత్వం చోటు చేసుకోలేవు. కారణం మనకు వాటికి గల పరిమిత పరిధిని గురించిన  అవగాహన ఏర్పడుతుంది.*

*భగవత్సంకల్పంలో మనకు భాగస్వామ్యం ఉందనే భావనతో ప్రశాంతత మనలో చోటు చేసుకుంటుంది.*

*ఈ యథార్థాన్ని ధ్యానిస్తూ పోతే అది మన హృదయాన్ని నమ్రతతో నింపుతుంది.*✍️
        
🙏 *సర్వం శివమయం 🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment