11-10-2024-శుక్రవారము - శుభమస్తు.
🌹గుడ్ మార్నింగ్ 🌹
ఆధ్యాత్మికత అన్నా ఆత్మజ్ఞానము అన్నా అది రోజువారి సహజ జీవితానికి సంబంధించినదే. అది మనము ఏదో ప్రత్యేకముగా చేయవలసిన సాధన కాదు. నిత్య జీవితములో ప్రతి చోట, ప్రతి వారితో, ప్రతి సందర్భములో, ప్రతి విషయములో మంచిగా ఉండటమే...........
అలా మంచిగా ఉండగలగాలంటే మనలోపల చెడు వుండకూడదు. నిత్యము లోపల పుట్టే చెడును గమనించుకొని - దానిని మనమే ప్రయత్నించి పోగొట్టుకొని - కేవలం మంచిని మాత్రమే లోపల నింపుకొని - ఆ మంచిని మాత్రమే వ్యక్తీకరించటమే ఆధ్యాత్మిక లేక ఆత్మజ్ఞాన జీవిత ప్రయత్నం.
ఇదే ఆధ్యాత్మిక సాధన. నాలో నేను - నాతో నేను మాత్రమే చేయగలిగిన అంతరంగ సాధన. సమాజము మధ్యలో కుటుంబ జీవితం జీవిస్తూ మాత్రమే చేయవలసిన సాధన..🌹god bless you 🌹
No comments:
Post a Comment