🍂 🍂బ్రహ్మ విద్య🍂🍂
::"రాజయోగం పై శ్రీ సనారీ విశ్వేశ్వర అవధూత వివరణ"::
శిష్యుడు : గురుదేవా! మీరు వివాహమాడి రాజయోగియై గృహస్థాశ్రమ ధర్మమును
స్వీకరించమంటున్నారు. భార్యతోనే అన్ని బంధములు ఆరంభమగుననుచున్నారు.
యిందలి మర్మము నాకు బోధపడుటలేదు స్వామీ.
సనారీ ఉవాచ:
గీ॥ ఆడదానికి మగడైనవాడుజనుడు, మీసముండినశాక్తేయోపాసకుండు,
నోరుగల్గిన వాదంబు బారుయగును. యిహపరంబంత జూరువాడెందునున్న
సనారీ ఉవాచ:
శిష్యా బ్రహ్మచర్య వ్రతమాచరించుట చాలా కష్టము. స్త్రీ సంపర్కము లేక గ
పోయిననూ, మనసు చంచలమైన వ్రతభంగమగును. కావున రాజయోగియైయూ
తామరాకు మీద నీటి చందాన సంసారమునంటీ అంటక జీవించుచూ, శక్తిని ఉపాసించి -
యోగసాధన చేసి తరించమన్నారు పెద్దలు. అంటే జనజీవనానికి ధనం కావాలి.
ధనాన్ని న్యాయమార్గమున కష్టించి ఆర్జించాలి . కానీ నేరాలు , ఘోరాలు , మోసాలు చేసి జీవించరాదు . భార్యను సహధర్మచారిణిగా స్వీకరించి ఆమెకై తపించరాదు . పిల్లలను -సం ప్రేమతో పెంచి పెద్దచేసి ఒక యింటివారిని చేయాలిగానీ , వారిపై ఆశలు , అతిప్రేమను పెంచుకోరాదు . భవసాగరం దాటుటకు శరీరం కావాలి . కానీ దానిపై మమకారం పెంచుకోరాదు . అన్ని విషయములందు తామరాకు నీటిలో ఉండియూ , నీరంటుకోనట్లు ప్రతీవారు సంసారమందుండి , అదే శాశ్వతమని భ్రమించరాదు . ఈ సంసారమనెడు అడవిలో భార్యయే పెద్దవలగాను , పుత్రులే శత్రువులుగాను ధనమే అగ్నిజ్వాలలుగా యున్నది . ఈ ధనమువలన భార్యా , భర్తలు , తండ్రీ కుమారులు , తోడబుట్టినవారు , -సి స్నేహితులు , బంధువులు విరోధులగుచున్నారు . అజ్ఞానులు అశాశ్వతమగు ధనముకై తాపత్రయ పడుచున్నారు కానీ సత్యము శాశ్వతమగు పరమాత్మను పొందగోరకున్నారు . జ్ఞాని తన స్వజన సౌఖ్యముకై పాటుబడక తన ప్రాణ ప్రయాణమునకు ముక్తి పొందు గుర సాధనలు చేయుచూ , ఈ క్షణమో , కొంతసేపటికో , నేడో రేపో , శరీరము నశించుట తథ్యమని తలంచి మోక్షసాధనకై నిరంతరం యోగసాధనలో ఉండాలి .
శిష్యుడు : మానవజీవితములో మానవులెట్లు ప్రవర్తించిన శ్రేష్టులగుదురు గురుదేవా !
సనారీ ఉవాచ:
ఆహార నిద్ర మైధునాదులతో నాలుగు కాళ్ళ జంతువులవలే జీవించువారికంటే , విగ్రహారాధన చేయువారు శ్రేష్టులు . వీరికంటే నిర్మల బుద్ధిచే పరమాత్మయనెడు మును పరబ్రహ్మమును మనోవాక్కులచే ఆరాధించువారు శ్రేష్టులు , వీరికంటే అంతరాత్మలోగల భగవంతుని తెలుసుకొని ధ్యానించువారు శ్రేష్టులు , వీరికంటే సత్తు చిత్తూ ఆనందమనెడు స్నారు యోగము నెరిగి శరీర స్పృహలేక పరమాత్మలో లీనమైయుండువారు శ్రేష్టులు . వీరికంటే తన్ను తాను మరచి బ్రహ్మానందసాగరమున దేలుచూ భావోన్మతులై శీతోష్ణములనుగానీ , రాత్రింబవళ్ళను , ఎండ వానలను గమనించక ఉండిన చోటునే యుండు మహనీయులను గమనించి , వారికి ఆహారాదులను సమకూర్చి సంరక్షించువారే శ్రేష్టులు .
శిష్యుడు గురుదేవా ! యిట్టివారికి స్నాన సంధ్యాదులతో పనిలేదా స్వామీ .
సనారీ ఉవాచ:
ఏ జ్ఞానముచే జనన మరణాదులనెడు సముద్రమును దాటి మోక్షమనెడి దరిచేరుచున్నారో , . ఆ జ్ఞానమే వారికి తీర్ధము . జ్ఞానులకు గంగాజలము తీర్థము కాజాలదు . 5 లే సింగ్ జనులెల్లరు జలముచే దేహశుద్ధిచేసుకొనుచున్ననూ , వారి మనసు , బుద్ధి , జీవాత్మ ఈ జలముతో శుద్ధి కాజాలవు . జ్ఞానులకు జ్ఞానతీర్థస్నానము ఆత్మను పరమాత్మ
అందు ఉంచుట.
No comments:
Post a Comment