ఎవరో ముత్యాలమ్మ
ఎక్కడో ఎప్పుడో
ఏమైతే నాకేమిటి
ఏమి చెస్తే నాకేమిటి
అక్కడెక్కడో ఒకడు
హాస్యంగా
సీతమ్మ వారిని
అవమానిస్తే నాకేమిటి
ఇంకెక్కడో పిచ్చి వాడు
శ్రీ రాముని విగ్రహం
ధ్వంసం చేస్తే
నాకేమిటి
మరొక ఉన్మాది
పవిత్రమైన రధాన్ని
తగుల పెడితే నాకేమిటి
అనంత కోటి బ్రహ్మాండ
నాయకుడు తిరుమలేసుని
సేవలలో అపచారాలు
జరిగితే నాకేమిటి
రోజుకొక పిచ్చోడు
వస్తూ
ధర్మాన్ని
సంస్కృతిని
అవహేళన చేస్తే నాకేమిటి
తిన్నామా
పండామా
ఉన్నామా
అంతే కదా
నీ ఘన చరిత్ర??
చీము నెత్తురు
పౌరుషం చేవ
లేని జాతి నీది
పోరాటం
ప్రతీకారం తర్వాత
కనీసం
ఖండించవు
నోరు మెదపవు
సంఘటన లేని జాతి
నీది
రేపు ఉంటుందో లేదో
నీకు తెలుసుకో
నీవు ఉండవు
మరి అమితంగా ప్రేమించే
నీ కుటుంబం?
అదన్నా ఉండాలా వద్దా??
స్వధర్మం
సంస్కృతీ
సాంప్రదాయాలు
కాపాడలేనప్పుడు
ఏవీ మిగలవు
నీ అంత తెలివి
నీ అంత లౌక్యం
నీ అంత శాంతం
నీ అంత మేధస్సు లేని
అమాయకులు
వాళ్ళ తల్లికి
అవమానం జరిగింది అని
కొట్లాడుతున్నారు
నీలా బండ రాయిలా ఉండలేదు
కనీసం వాళ్ళకి సంఘీభావం తెలుపు
ఎదో ఒక రూపంలో
నువ్వు వాళ్ళ ముందు లేకున్నా
వెనకన్నా ఉన్నావన్న
మనో ధైర్యం ఇవ్వు
తర తరాలుగా మూగబోయిన
గొంతుతో పొలి కేక పెట్టు
చచ్చుపడిన నీ పిడికిలి
ఒక్కసారన్నా బిగించు
పక్షవాతం వచ్చినట్లు
చచ్చు పడిన కాళ్ళతో
ఒక అడుగు వేయి
మరచి పోయిన
నీ తాత ముత్తాతల
వీరుల సూరుల
చరిత గుర్తు తెచ్చుకో
పోరాడితేనే మిగులుతావు
గోంతేత్తితేనే తెలుస్తావు
ఎవరికోసమో కాదు
నీ ఆస్థిత్వం కోసమే..
No comments:
Post a Comment