*సూక్ష్మమైన కోరిక మిగిలి వున్నా దానికై జన్మ ఎత్తవలసిందే.....*
ఎంతకాలం అతి చిన్నకోరికైనా మిగిలి వుంటుందో అంతకాలము సాధకుడు భౌతిక జీవితంవైపు లాగబడుతూనే ఉంటాడు. వాసనలే మసనలను మన సహజస్థితి నుంచి మరుగు పరుచుతున్నాయి. వాటిని ఒక్క విశ్వ చైతన్య దర్శనపు మెఱుపు మాత్రమే వదలగొట్టలేదు. వాసనలు చాలా వరకు క్రితం జన్మలో వదిలిపోయి వుండవచ్చును. ఏమైనాగాని అవి సమూలంగా నశించవలసిందే,అని భగవాన్ వివరించారు.
ఈ విషయంలో శ్రీరామకృష్ణల అనుభవం:
శ్రీ రామకృష్ణలుకి ఒక సిల్క్ అంగీ వేసుకొని, చేతికి ఉంగరము పెట్టుకొని, హుక్కా పీల్చవలెనని ఒక కోరిక ఉండేదని చెప్పారు. ఒకరోజు మధునాథ్ ను పిలిచి తనకు కావలసినవి తెచ్చి పెట్టమన్నారు. మధురనాథ్ వాటిని తీసుకుని రాగా అంగీని ధరించి, వేలికి ఉంగరం పెట్టుకొని గంగ ఒడ్డున హుక్కా త్రాగుతూ కొంచెంసేపు కూర్చున్నారు. తరువాత తనకు తానిట్లా చెప్పుకున్నారు. "ఇదిగో సిల్కు అంగీ, ఇదిగో ఉంగరం,హుక్కా ఇదిగో'" అనుకొని కొంచెం సేపు వాటిని అనుభవించి, లేచి ఉంగరాన్ని గంగలో విసరివేసి,అంగీని చింపి నేలమీద వేసి త్రొక్కి దానిమీద ఉమ్మి వేశారు.హుక్కాను విరగగొట్టారు. ఇంకా వారికి ఏ విధమైన కోరికలూ మిగలలేదు.కనుక ఏ ఒక్క సూక్ష్మమైన కోరిక మిగిలి ఉన్నా దానిని తీర్చుకోవటానికి జన్మ ఎత్తుతూ వుండవలసినదేనన్నారు.

No comments:
Post a Comment