Tuesday, October 8, 2024

 గెలుపు కోసం 🌱

🌱🌱ఒక చిన్న కథ .... అన్వేషణ 🌱🌱

🌱సమీపంలో ఏదో భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ...
నేను ప్రతిరోజూ సాయంత్రం వాకింగ్ చేస్తూ అక్కడ కాసేపు కూర్చుంటాను.🌱

🌱చాలామంది పేద కార్మికులు  అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని నివసిస్తూ పనిచేస్తుంటారు.  వారి  పిల్లలు ఒకరి చొక్కా మరొకరు  పట్టుకొని "రైలు బండి రైలు" అనే ఆట ఆడుతుంటారు.🌱

🌱ఎవరైనా ఒకరు ఇంజిన్ అవుతారు మిగిలినవారు  బోగీలు అవుతారు ..🌱

🌱ప్రతిరోజూ ఈ పిల్లలు మలుపులు తిరుగుతూ కేరింతలు కొడుతూ ఆడుతూవుండే ఈ ఆటను చూడడం నాకు ఇష్టమైన దినచర్యగా మారిపోయింది ...🌱

🌱చాలా రోజులుగా వాళ్ళ ఆటను గమనిస్తున్నాను.ఇంజన్ గా ఉన్న పిల్లవాడు మరోరోజు బోగీగా.. బోగీగా ఉన్న పిల్లలు ఇంజన్ గా ఇలా మారుతూనే ఉన్నారు.🌱

🌱కానీ, ఒక చిన్న బాలుడు,సగం నిక్కరు మాత్రమే ధరించి తన చేతిలో ఒక చిన్న ఆకుపచ్చ వస్త్రాన్ని పట్టుకుని రోజువారీ గార్డుగానే  ఉంటున్నాడు ...🌱

🌱🌱ఒకసారి నేను వెళ్ళి అడిగాను  ...🌱🌱

🌱"బాబూ ! నువ్వు కూడా ఒక ఇంజిన్ లేదా బోగీగా మారి అడుకోవచ్చు కదా! ఎప్పుడూ గార్డ్ గానే ఎందుకుంటున్నావు ?  ...🌱

🌱అతను మృదువుగా ప్రత్యుత్తరం ఇచ్చాడు ...🌱

🌱🌱"సర్, నాకు ధరించడానికి ఒక చొక్కా లేదు, కాబట్టి ఇతర పిల్లలు నన్ను పట్టుకుని రైలును ఎలా తయారుచేస్తారు?🌱🌱

🌱ఆ మాటలు చెబుతున్నప్పుడు
నేను అతని కళ్ళలో కొంచెం తేమ గమనించాను..🌱

🌱🌱నేను అతనితో మరి కాసేపు మాట్లాడిన తర్వాత జీవితానికి సంబంధించిన ఒక  గొప్ప పాఠం నేర్చుకున్నాను....!🌱🌱

🌱అతను చొక్కా కోసం ఇంట్లో  అడిగాడు,అరిచాడు,అలిగాడు, ఎంతగా ప్రయత్నించాలో అంతగా ప్రయత్నించాడు.కానీ, ఇంట్లో ఆరోగ్య పరమైన మరో అత్యవసర ఖర్చులుండడం వల్ల అతని తల్లిదండ్రులు  అతనికి చొక్కాని కొనుగోలు చేయలేకపోయారు...🌱

🌱🌱కానీ,ఆ పిల్లవాడు తన ప్రయత్నం విఫలమైనందుకు నిరాశ చెందలేదు.  బదులుగా  అతను తనను తాను ఆస్వాదించడానికి  ఆనందంగా ఉండడానికి మరొక మార్గం ఎంచుకున్నాడు...!🌱🌱


🌱🌱జీవితంలో మనం  కోరుకున్న అన్ని విషయాలను పొందలేము...🌱🌱

🌱🌱నాకు బైక్ లేదు, నాకు కారు లేదు, నాకు ఇల్లు లేదు..ఇలా రకరకాలుగా  అసంతృప్తిని అనుభవిస్తుంటాము...లేనిదాని గురించి ఆలోచిస్తూ ఆస్వాదించడాన్నీ - ఆనందంగా ఉండడాన్ని మరిచిపోతుంటాము.🌱🌱

🌱🌱జీవితంలో జీవం లేకుండా బ్రతుకుతుంటాము ....!🌱

🌱🌱ఆ పిల్లవాడితో సంభాషించిన తర్వాత నేను నేర్చుకున్న పాఠం ఇది.🌱🌱

🌱మన కోరికలు నెరవేరడం కోసం పూర్తి ప్రయత్నం చెయ్యాలి. మన కోరికలు నెరవేరవచ్చు! నెరవేరకపోవచ్చు! కానీ అంత వరకు ఉన్నవాటితోనే జీవితాన్ని 
ఆస్వాదించే మార్గాలను అన్వేషించాలి.🌱

🌱🌱మన లక్ష్యం ఆస్వాదించడం - ఆనందంగా ఉండడమే. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్న అసలు లక్ష్యాన్ని కోల్పోకూడదు.....🌱🌱

🌱సదా అందరి మంచి కోరే మీ🌱

🌱స్కై ఫౌండేషన్ 🌱
🌱 9493613555  🌱

No comments:

Post a Comment