Saturday, October 12, 2024

*****🔔 *సంస్కారం* 🔔

 🔔 *సంస్కారం* 🔔

1.  తాజా ఆహారం అందుబాటులో లేక,    వండుకోవడానికి సమయం కేటాయించుకో లేక,    ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ    దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద,    బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన  ఖర్మపట్టడం అమెరికా, యూరప్  వాళ్ళ నిస్సహాయత..!

 56 రకాల భోజన వంటకాలను పక్కనపెట్టి     ఎవడో ఏనాడో వండి పెట్టిన    రొట్టెని కాలవలో పారెయ్యకుండా,  ఫ్రిజ్  లో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹. 400 / - పెట్టి  మరీ తినడం, ‘మన అజ్ఞానం..!!’

*2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక,   కోట్లూ సూట్లూ వేసుకోవడం ‘వారి నిస్సహాయత..!’

వేసవి వేడిలో చెమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు       వెర్రిగా    కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం ‘మన అజ్ఞానం..!!’

*3. తాజా భోజనం    వండేవాళ్ళు లేక ఫ్రిజ్ వాడడం,   అమెరికా, యూరోప్ వాళ్ళ నిస్సహాయత..!

ప్రతిరోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజులు కూరగాయలు ఫ్రీజ్ లో     కుక్కి కుక్కి   అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, ‘మన అజ్ఞానం..!!’
     
*4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, 
వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో     ఏవేవో మందులు తయారు చేయడం,  వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి  వేరేవేరే రోగాల పాలవ్వడం ‘వారి నిస్సహాయత..!’

 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం     తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా...         కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం..   ‘మన అజ్ఞానం..!!
       
*5. సరిపడ ధాన్యం లేక    పంటలు పండక   పళ్ళూ కాయలూ  దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని, నక్కల్ని కూడా చంపి తినడం.. ‘వాళ్ళ నిస్సహాయత...!’

 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా    వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం ‘మన అజ్ఞానం..!!’

*6. కొబ్బరి నీళ్ళూ,  మామిడి రసాలు, బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం ‘వారి నిస్సహాయత...!’

 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం ‘మన అజ్ఞానం..!!’
   
*7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని (PMతో)తిరగడం, 
చలి వలన స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం.. 
 ‘వాళ్ళ నిస్సహాయత...!’

సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  తుడుచుకొని, సెంటేసుకుని (PM)తో తిరగడం … మన తెలివి తక్కువతనం

*8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం ‘వాళ్ళ బుద్దిహీనత!

 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం ‘మన అజ్ఞానం!!

*9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం ‘వాళ్ళ నిస్సహాయత...!

చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...
ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... ‘మన అజ్ఞానం!!
         
*10. చెట్లు పెంచుకోవడానికి   ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు, కేన్సర్లూ  తెచ్చుకోవడం ’వాళ్ళ నిస్సహాయత...!

 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, గేదెలు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...
వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా 
ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం ‘మన అజ్ఞానం!!

*11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం ‘వాళ్ళ నిస్సహాయత...!

హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత ‘మన అజ్ఞానం!!

12) వంటకు అల్యూమినియం పాత్రలు, కుక్కర్లు,మితిమీరి ఉప్పు,ఏసీలు వాడుట వాటి వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుట వలన బీపీ,షుగర్, కీళ్ల నొప్పులు, పక్షవాతం, స్థూల కాయం, క్యాన్సర్ తో కూడిన ప్రధానమైన రోగాలతో అర్ధాంతరంగా ప్రజలు చనిపోతున్నారు.
 
ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన
దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...
ప్రాకృతిక జీవనాన్ని  వదిలేసుకోవడం మన అజ్ఞానం!
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻

సేకరణ

No comments:

Post a Comment