*రమణులు,సాక్షాత్తు ఈశ్వరులే!*
ఒకసారి తిరువణ్నామళై నుంచి పుట్టపర్తి మీదుగా హైదరాబాద్ వస్తున్నప్పుడు, ఆ రోజున భగవాన్ సత్యసాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సుమారు గంటా నలబై నిమిషాల పాటు స్వామి మాట్లాడారు. ఆ తరువాత ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వస్తుండగా షర్ట్ పట్టుకుని లాగి, “రమణులంటే ఎవరనుకున్నావ్? సాక్షాత్తు ఈశ్వరుడు. మరవకు బంగారూ! అంటే రమణులు దేవుడా? గురువా? సాధకుడా? యోగా? ఈ విషయాల గురించి ఆలోచించడం మనపని కాదు. రమణుల్ని అడిగారు. “జ్ఞాని వలన ఈ జగత్తుకు ప్రయోజనం ఏమిటీ అంటే, ఏ అవసరమూ లేకపోయినా, మానవ దే హాన్ని ధరించి, ఈ జగత్తులోకి రావడమే ఈ జగత్తుకు వారు చేసిన మహోపకారం. ఇక వీరా ఇక్కడ ఉండి ఏం చేశారు? తమ శక్తిని తమ లోపల ఉన్న దివ్యత్వాన్ని తమకోసం వాడుకున్న సన్నివేశాలు ఏనాడూ లేవు.
ఇవ్వడం ఒక్కటే… అంతా జగ త్తుకు ఇవ్వడమే. అందుకే “దేవుడు ఎప్పుడూ ఇచ్చేవాడే తప్ప తీసుకునే వాడు కాదు.” అంటాడు బాబా. ఇది తీసుకునేది కాదు. ఎప్పుడూ ఇచ్చేదే అన్నారు. గురుస్వరూపాలు చూడండి, అవి ఇవ్వడమే తప్ప ఏమీ తీసుకోవు. ఏమి ఇస్తాయి? అంటే కర్మలను తీసుకుంటాయి. కర్మఫలాలను మనకు అందిస్తాయి. మన కర్మలను నిశ్శేషం చేస్తాయి. యోగ భూమికలోకి తీసుకువెళతాయి. షిరిడీ బాబా రెండు అణాలు తీసుకున్నారు. మరొకరు ఇంకేద న్నా తీసుకుంటారు. ఏమి తీసుకున్నా, తీసుకున్న దానికి కొన్ని కోటానుకోట్ల రెట్లు ఇస్తారు. మనమంతా కర్మమాల వేసుకుని వచ్చాం. అనేక జన్మలు ఎత్తాం. అనేక జన్మలు ఎత్తినా, “బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే.”ఆదిత్యయోగి.
ఇదీ ప్రయోజనం ఇక్కడికి వచ్చి ధ్యానమంటే ఏమిటి? యోగమంటే ఏమిటి? యోగి అంటే ఎవరు? యోగి దొరికితే ఏమి లాభం? అంటే, మహాత్ములను అశ్రయిస్తే ఏమైనా లాభం ఉందా? అంటే లాభం ఉంది. మహాత్ముని ఆవరణలోకి వెళ్లినప్పుడు నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు. ఆస్తికుడు భక్తుడవుతాడు. భక్తులు ప్రేమైక జీవి అవుతాడు. ప్రేమైక జీవనంలోంచి జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయిన తరువాత అన్ని రసాలూ అతన్ని ఆశ్రయిస్తాయి. ఆయన దేన్నీ అనుసరించడు.
వదిలేద్దామనుకుంటే…. ఒకానొక మహారాణి వెండి గ్లాసు తీసుకు వచ్చి, “భగవాన్! దీనితో మీరు ప్రతిరోజూ మంచి నీళ్లు తాగాలి. ఆ రకంగా నాకు, మీకు మధ్య బంధం ఉండాలి.” అంది. భగవాన్ వెంటనే పరిచార కుణ్ని పిలిచారు. “ఈ గ్లాసును ఆఫీసులో అప్పచెప్పి, ముట్టింది అని ఆవిడకు ఒక రసీదు ఇవ్వండి. నన్ను విముక్తం చెయ్యండి అన్నారు. ఎందుకంటే ప్రతిరోజూ ఆ గ్లాసు తోముకోవాలప్పా! ప్రతిరోజూ ఆ గ్లాసులో తాగాలప్పా! తాగినప్పుడల్లా ఆమెను గుర్తు తెచ్చుకోవాలప్పా! అన్నీ వదిలేద్దామనుకున్న నాకు ఈ గుర్తులెందుక ప్పా! అక్కర్లేదు.” అన్నారు. మనం కూడా గురువుల వలె ఇవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడూ అటునుంచి తీసుకోవడమే కాకుండా, ఇటునుంచి కూడా ఇవ్వగలగాలి. మనం ఏది ఇవ్వగలమో అది ఇవ్వాలి. గీయగలిగిన వాడు గీయాలి. చెప్పగలిగిన వాడు చెప్పాలి. ఏమి చెప్పాలి? గురుతత్వాన్ని చెప్పాలి. గురు సంకీర్తనం చేయాలి. గురు విశేష వైభవాన్ని జగత్తుకు అందించాలి...
.
*భక్తునికి మహర్షికి జరిగిన సంభాషణ *
_ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు. కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది.._
స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ? ఎలా ఉంటాడు ? అని అడిగాడు.*_
అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ.. నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన.. అంటూ ఒక మహా వృక్షం చూపించి అది ఏమిటి నాయన అన్నాడు._
*అది వృక్షం.*_
ఓహో వృక్షమా ! ఎలా వచ్చింది ?_
విత్తనం ద్వారా వచ్చింది స్వామి.*_
సరే అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు._
_m *ఎందుకు స్వామి ? మహావృక్షం కదా ! త్రవ్వితే చచ్చిపోతుంది.*_
చచ్చిపోతుంది కాని ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది !_
*అయ్యో స్వామి ! అదెలా సాధ్యం అవుతుంది ?*_
విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు. విత్తనం చూడలేమా ?_
విత్తనమే చెట్టు. చెట్టుకి విత్తనానికి తేడా లేదు. విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా !*_
ఇదే నాయన నీ సందేహానికి సమాధానం._
*అదెలా స్వామి ?*_
విత్తనం అనేది పరమాత్మ ఆ పరమాత్మే వృక్షం. అనగా సృష్టి. సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము._
* మరి విగ్రహారాధన ఎందుకు స్వామి ?*_
పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ? ఏమి అర్థం కాదు. అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. ధ్యానం నిలబడుతుంది. అంతేతప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు. అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనిగ్రహించాడు. అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు._
సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. భగవంతుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు. సాధ్యం కాదు. అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు. అది ఒక మార్గం. దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు !ఆదిత్యయోగీ.
* స్వామి ! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు ?*_
భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు. మరొకడు గుడి కట్టాడు. మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు. మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడు కోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం. పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడా లేదు. ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.. నగలు పెట్టినవాడిలో ఉన్నాడు. దోచుకెళ్ళినవాడిలోనూ ఉన్నాడు. తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు !..
.
మనకు కావలసిన దానిని మనం ఆకర్షించం. కానీ లోలోపల మనం ఏమిటో, దానినే ఆకర్షిస్తాం. మన కోరికలు, ఆకాంక్షలు, ఇష్టా యిష్టాలు అడుగడుగునా ఓటమిని చవిచూస్తాయి. అయినప్పటికీ మనలో అంతర్గతంగా దాగి ఉన్న ఆలోచనలు, *కోరికలు మాత్రం తమకు కావలసిన ఆధారాన్ని. ఆహారాన్ని - మంచైనా, చెడైనా సరే - పొందుతూనే ఉంటాయి.* మనల్ని గమ్యానికి చేర్చే *దివ్యవిధాత మనలోనే ఉన్నాడు .*
అది మనమే. *మనమే మనలను బందీలుగా చేసుకున్నాము. మన ఆలోచనలు, చేతలే మనలను నిర్బంధించే అధికారులు.*
*_ఆలోచనలు, ఆచరణలు నీచమైన వైతే మనం బందీలుగా ఉంటాం. అవి ఉదాత్తమైనవిగా ఉంటే అవే మనకు ముక్తిని, స్వేచ్ఛను ప్రధానం చేసే దైవ దూతలవుతాయి...
.
*"ఉన్నాను" అనే సహజ రూపమాత్రంగా తోచు జ్ఞానమే హృదయం. ఇతరములను తెలుసుకొనే వృత్తులు లేని ఈ హృదయానికే సత్యం తనంతట గోచరిస్తుంది. కనుక ఆ హృదయాన్ని (అంటే తనను) ఆశ్రయించియుండు ఆత్మనిష్ఠయే స్వయం ప్రకాశకమయిన ఆత్మజ్ఞానము*
*తెలుసుకొనేవన్నీ ఆ జ్ఞాన రూపామే, అవి అన్నీ జ్ఞానమైన తనలో అణగిపోతాయి. అదే ఆత్మ నిష్ఠ. ఆ దశలో భేదాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సహజ స్థితి ఏకమై వెలుగుతుంది. అదే అద్వితీయ ముక్తదశ...*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
.
No comments:
Post a Comment