Transcript:
ఈరోజు భగవద్గీత రెండవ అధ్యాయం 62 63 శ్లోకాలు 62 63 శ్లోకాలు వాటి గురించి తెలుసుకుందాం నేను చెప్తా మీరు అనండి అమ్మ
ధ్యాయతో విషయాన్ పుంసః జాయతో విషయాన్ పుంసః
సంఘస్తేషు పజాయతే సంఘస్తేషు పజాయతే
సంఘ సంజాయతే కామః సంఘ సంజాయతే
కామః కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే
క్రోధాత్ భవతి సమ్మోహ క్రోధాత్ భవతి సమ్మోహః
సమ్మోహ స్మృతి విభ్రమః సమ్మోహ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో
బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి
మనుజుడు శబ్దాది విషయములను చింతించుచుండుట వలన ఆ విషయము విషయముల యందు ఆసక్తి జనించుచున్నది అట్టి ఆసక్తిని అట్టి ఆసక్తిచే దాని యందు అతనికి కోరిక ఉదయించుచున్నది ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది కోపము వలన అవివేకము అవివేకము వలన మరుపు మరుపు వలన బుద్ధి నాశము క్రమముగా సంభవించుచున్నది బుద్ధి నాశముచే తుదకు పూర్తిగా చెడిన వాడగుచున్నాడు ఈరోజు పరమాత్మ రెండవ అధ్యాయంలో 62 63 శ్లోకాల్లో కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు వాటిని తెలుసుకొని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఇవి అంటే ప్రతిదీ మనకి ముఖ్యం లాగే అనిపిస్తది కానీ ఇది చాలా స్పెసిఫిక్ ఇంపార్టెంట్ మనం నోట్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ లో వెరీ ఇంపార్టెంట్ అని ఇంకా పెట్టుకుంటాం కదా వి అని పక్కన పెట్టుకుంటాం కదా వెరీ ఇంపార్టెంట్ అని అట్లాంటిది అన్నమాట ఇది ఎందుకంటే మన లోపలికి అసలు మనకు శత్రువులు ఎవరు వాళ్ళు లోపలికి ఎలా ప్రవేశిస్తున్నారు మళ్ళా లోపలికి ప్రవేశించిన తర్వాత ఆ ప్రవేశించినటువంటి వాళ్ళు ఎలా బలపడుతున్నారు ఆ బలపడినటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి జీవుడ్ని ఎలా పడగొడుతున్నారు అంటే పడేస్తున్నారు అనేటువంటి విషయాలను ఇందులో సూచించడం అనేటువంటిది చాలా మందికి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉంటారని కూడా తెలియదు చాలా తక్కువ మంది ఉంటారు అజాత శత్రువు అని పేరు వినే ఉంటారు మీరు ధర్మరాజుకి ఉందన్నమాట అజాత శత్రువు అని పేరు ధర్మరాజు అంటే పుట్టుకతోనే అతనికి శత్రువు లేరు ఇంకా మరణించిన దాకా కూడా జీవితాంతం దుర్యోధనుడు లేదా కౌరవులు అంత మంది వచ్చి యుద్ధం చేసినా గాని వాళ్ళని శత్రువులా భావించలేదు అన్నమాట అజాత శత్రువు అంటారు పుట్టిన కాడి నుంచి మరణించే వరకు కూడా శత్రువు అనేటువంటి వాళ్ళు లేకుండా పెరిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ మనకి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ చెప్పబడినటువంటి శత్రువులు ఎవరు మనం ఈ లోకం ఇక్కడ ఏమని చెప్తున్నాను అంటే ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది ఒక మనిషి పతనం అనేటువంటిది ఊరికినే ఉండదు మనిషి ఊరికినే పతనం అయిపోడు ఆ పతనం వెనక బలమైనటువంటి కారణం ఉంటది ఇప్పుడు ఉదాహరణకు ఉన్నట్టుండి ఒకాయనకు షుగర్ ఊరికనే రాదు ఒకాయనకి బిపి ఊరికనే రాదు ఒకాయన క్యాన్సర్ ఊరికనే రాదు చాలా మంది పొద్దుటే వచ్చింది అంటాడు ప్రొద్దుటే రావడానికి అదేమి ఇది కాదు కదా అర్థమైందా దాని వెనక చాలా బ్యాక్ గ్రౌండ్ ఎప్పటినుంచో అది ఆ లోపలికి ప్రవేశించి దానికి సంబంధించినటువంటి సింప్టమ్స్ అన్నీ కూడా మన శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాకపోతే మనం అవి గుర్తించము అన్నమాట ఎప్పుడు గుర్తిస్తాము లాస్ట్ పీక్ స్టేజ్ కి వచ్చినప్పుడు ఇక మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్తారు నీకు షుగర్ వచ్చింది బిపి వచ్చింది థైరాయిడ్ వచ్చింది క్యాన్సర్ వచ్చింది ఇట్లా రకరకాలుగా ఆయన చెప్తారు కిడ్నీ ప్రాబ్లం అని ఎవరి ప్రాబ్లం అని ఆ రోజు చెప్తారు అది ఆ రోజు ఒక్క రోజే అంతకు ముందు రోజే స్టార్ట్ అయిందా అది కాదు అది ఎప్పటినుంచో స్టార్ట్ అవుతుంటది అది ఎప్పటినుంచో స్టార్ట్ అయింది అంటే ఇలా అనారోగ్యం కావడానికి కారణాలు మన యొక్క ఆహారపు అలవాట్లు మన యొక్క ఆహారపు అలవాట్లే మన యొక్క అనారోగ్యానికి కారణం కాకపోతే ఆ రోజు తెలియలేదు మనకి మనం అలాంటి ఆహారాన్ని అలవాటు చేసుకున్నటువంటి రోజున మనకి అలాంటి ప్రాబ్లం వస్తది అనేటువంటి విషయం తెలియదు అన్నమాట అప్పుడు హ్యాపీగానే ఉన్నది అప్పుడు హ్యాపీగానే ఉన్నది ఇప్పుడు మంచి ఇష్టమైనటువంటివి అన్ని తింటూ ఉంటే ఎవరికీ హ్యాపీగా ఉండదు హ్యాపీగా పండగ రోజు పండగ లాగానే ఉందన్నమాట వాళ్ళకి మంచి ఇష్టమైనవన్నీ తింటుంటే రోజు పండగ లానే ఉన్నది అన్నమాట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అన్నమాట అవి ఎంత దుఃఖాన్ని కలిగించినాయి అనేటువంటిది అతను రోజు తినేటువంటి ఆహారం తనకు ఎంత దుఃఖాన్ని కలిగించినాయి ఎంత ఇబ్బందిని కలిగించినాయి అనేటువంటివి తెలిసిందన్నమాట పీక్ స్టేజ్ కి వెళ్ళింది లివర్ ప్రాబ్లం వచ్చింది పీక్ స్టేజ్ కి వెళ్ళింది అన్నమాట లివర్ తీసివేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఎవరు కారణం దానికి తన యొక్క ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ జీవన విధానమే తనకు దుఃఖాన్ని కలిగించింది అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నాను అంటే ఒక మనిషి ఇక్కడ బుద్ధి నాశ ప్రణశ్యతే అని చెప్పారు బుద్ధి పూర్తిగా నశించిపోయినప్పుడు మనిషి పూర్తి స్థాయిలో పతనమై వినాశాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు అంటే ఒక మనిషి పూర్తి స్థాయిలో వినాశనాన్ని పొందినప్పటికీ కూడా తనకి జ్ఞానోదయం కలగట్లేదు కనీసం రియలైజేషన్ ఉండాలి కదా ఇప్పుడు మిస్టేక్ తెలియక తెలియక చేశాడు తెలియక ఒకప్పుడు తప్పు చేశాడు ఇప్పుడు దాన్ని తెలియజేసినారు ఒక డాక్టరో లేకపోతే ఒక సద్గురువో లేకపోతే ఒక శాస్త్రమో ఒక మహాత్ముడో లేకపోతే మన ఇంటి కుటుంబానికి సంబంధించిన పెద్దవాళ్ళో మనకు సూచన చేశారు అలా సూచన చేసినప్పుడైనా గాని మనలో మార్పు రావాలి కదా ఇంకా అప్పుడు కూడా మారకపోతే అప్పుడు కూడా మారకపోతే పోతే పూర్తి స్థాయిలో వినాశాన్ని పొందుతాడు తర్వాత ఇంకెవరు అతన్ని బాగు చేయలేరు బాగు చేయలేనటువంటి వినాశనాన్ని బాగులేనటువంటి స్థితిలో నాశాన్ని పొందుతాడు అని చెప్పి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది అయితే ఇది ఎలా జరుగుతుంది ఈ వినాశం అనేటువంటిది ఒక మనిషి దుర్గతిని ఎందుకు పొందుతాడు ఎలా పొందుతాడు అంటే అతను ఏర్పరచుకున్నటువంటి ఆలోచనలు సంకల్పాలు భావాలు ఏవైతే ఉన్నాయో అవే అతన్ని పడేస్తున్నాయి అని చెప్తున్నారు ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మనిషి పతనం ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని ఒక ఆర్డర్ ప్రకారం చెప్పారు ఒక ఆర్డర్ ప్రకారం చెప్పారు దాన్ని మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా మొదటే సరిచేసుకోవచ్చు మనం మొదటే సరిచేసుకోవచ్చు అవునా కాదా ఇక్కడ ఏమంటున్నారు ధ్యాయతో విషయాన్ పుంసః సంఘ స్తేచుపజాయతే సంఘా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి బ్రంశాత్ బుద్ధి నాశో స్మృతి బ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశత్ ప్రణశ్యతి ఏమని చెప్తున్నారు ఒక మనిషి పతనం ఇలా జరుగుతుందని ఒక ఆర్డర్ చెప్పారు ఏమిటి ఆర్డర్ ఒకసారి గుర్తు చేసుకుందాం ఇప్పుడు చెప్తే మాత్రం మనం నమ్మాలమ్మ ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు అనుకో ఎవరైనా అడిగితే మేము ఎందుకు నమ్ము సార్ అని అంటాడు ఏ నాయనా అన్నాడు అనుకో అది నాకు కాదుగా చెప్పింది అంటాడు మరి ఎవరికి చెప్పారంటే అది అర్జునుడికి చెప్పాడు అంటాడు మామూలుగా జనరల్ గా ఎవరైనా ఏమనుకుంటారు అంటే తెలియనప్పుడు ఏమనుకుంటారు అంటే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు కాబట్టి దానిని నేను పాటించవలసిన అవసరం లేదు అది నాకు సంబంధం లేని విషయము అంటాడు అన్నమాట కానీ ఇక్కడ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఈ లోకం మొత్తానికి జ్ఞానాన్ని అందించాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా భగవద్గీతను ఆశ్రయించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం సూచనల ప్రకారం జీవించినట్లయితే నిత్యము ఆనందాన్నే పొందగలుగుతాడు నిత్యానంద భరితుడు అంటారు నిత్యము నిరంతరం కూడా ఆనందంగా జీవించేటువంటి ఛాన్స్ మనిషికి ఉంటుంది ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి సూచన చేశారో దాని ప్రకారం నడుచుకోవాలి ఆ ఆర్డర్ ఫాలో అవ్వాలి ఆర్డర్ ఫాలో అవ్వాలి అన్నమాట ఎట్లా అంటే ఒకాయన కారు కొనుక్కుంటున్నాడు వెళ్తూ ఉన్నాడు ఆయన చెప్పాడు అన్నమాట ఆ కారు కొన్నప్పుడే దాన్ని ఎలా డ్రైవ్ చేయాలా ఎలా డ్రైవ్ చేస్తే దాని ద్వారా ఆనందాన్ని పొందొచ్చో దాంట్లో రాశారు ఆ బుక్లెట్ ఉంటది కదా మాన్యువల్ అంటారు కదా అది ఇచ్చారన్నమాట అది ఇచ్చేప్పుడు ఏమన్నారు నాయనా ఈ కారు ద్వారా ఈ కారును నువ్వు వినియోగించుకొని ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి దాన్ని ఎలా నడపాలో రూల్స్ చెప్పారు దాన్ని ఎలా నడిపితే నువ్వు ఆనందాన్ని పొందుతావో రూల్స్ చెప్పారు రూల్స్ చెప్పినప్పుడు మరి ఫాలో అవ్వాలా వద్దా ఈయన ఏమంటాడు నా కారు నా ఇష్టం నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న ఎవరో చెప్పినట్టు నేను ఎందుకు వింటా నేను కష్టపడి 30 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే ఎవరో చెప్పినట్టు నేను ఎందుకు వింటా అన్నాడు మరి వినవకపోతే ఎవరికి నష్టం ఫాస్ట్ గా వెళ్తున్నాడు దాంట్లో ఏమని రాశారు స్పీడ్ బ్రేకర్ వచ్చినా గుంటలు ఉన్నా గాని రాళ్లు వచ్చినా గాని బ్రేక్ మీద కాలు వేయాలా యాక్సిలేటర్ తగ్గియాల అని దాంట్లో రాసి ఉంది మరి తగ్గియాలా వద్దా నేను అది విన అని చెప్పి బ్రేక్ వేయలేదు యాక్సిలేటర్ పెంచాడు ఏమవుద్ది అది గుంటలో దూకి అది కొంచెం ఎత్తేసినట్టయి బ్యాక్ డిస్క్ ప్రాబ్లం ఏర్పడింది చాలా ఇబ్బంది అంటే ఏంటి అర్థం నువ్వు కారు కొనుక్కుంటే మాత్రం దాన్ని తయారు చేసినోడు ఎలా చెప్పాడో అలా వినాలా వద్దా అంటే ఒక కారు నువ్వు కొనుక్కున్నప్పుడు ఎందుకు కొన్నాడు కారు సుఖంగా జీవించాలని ఆనందాన్ని పొందటం కోసమే కదా బస్సుల్లో పోతే ఇబ్బంది అవుతుంది కార్లో వెళ్తే హ్యాపీగా వెళ్లొచ్చు అని చెప్పి కారు కొనుక్కున్నాడు మరి కారు కొనుక్కొని ఓకే నువ్వు హ్యాపీగా వెళ్ళాలనే కదా ఆఫీస్ కి హ్యాపీగా వెళ్ళాలా ఏటన్నా అత్తగారి ఇంటికి వెళ్ళిన హ్యాపీగా వెళ్ళాలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన హ్యాపీగా వెళ్ళాలా బస్సుల్లో వెళ్ళలేకపోతున్నాను అనే కదా కారు కారు కొనుక్కొని కూడా నువ్వు ఆనందాన్ని పొందలేకపోతే హ్యాపీగా వెళ్ళలేకపోతే ఇక ఆర్డినరీ బస్సులో ఇప్పుడు మళ్ళా ఫ్రీ బస్సు కదా కిక్కిరిసిపోయినట్టు పోతే ఏం పోతారు వాడి జర్నీ ఏం చేస్తారు అర్థం అంటే కారు కొనుక్కున్నటువంటి వాడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక నియమబద్ధంగా దాన్ని అనుసరించినప్పుడు సుఖాన్ని పొందుతాడు ఓకే కార్ అంటే అర్థమైంది గురువుగారు బాగానే ఉంది ఇప్పుడు ఈ కారు గురించి మాకెందుకు మాకేం అందరూ కార్లు ఉన్నాయా మా అందరి కార్లు ఉన్నాయమని మాకు ఎందుకు చెబుతున్నారు అంటే మనకు కూడా భగవంతుడు జీవించడానికి ఒక వెహికల్ ప్రొవైడ్ చేశారు మాకు ఎప్పుడు ఇచ్చారండి మాకు ఎప్పుడు ఇవ్వలేదుగా వస్తా వస్తా మధ్యలో ఏమైనా ఆగిందేమో అని అనుకుంటారేమో ఆగా ఏం లేదు పరమాత్మ ప్రొవైడ్ చేసినటువంటి వెహికల్ ఈ శరీరమే అర్థమైందా అమ్మ పరమాత్మ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వెహికల్ ఏంటి శరీరమే అమ్మయ్య ఓకే బాగానే ఉంది ఈ శరీరాన్ని ఇచ్చేప్పుడు పరమాత్మ ఏమన్నారంటే శతమానం భవతి శతా పురుషేంద్రియేత్ ప్రతిష్టతి 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పారు శరీరాన్ని ఇచ్చినప్పుడు ఏమని చెప్పారు 100 సంవత్సరాలు నువ్వు ఈ శరీరంతో 100 సంవత్సరాలు నువ్వు ఆనందాన్ని పొందాలి అని చెప్పారు ఆనందాన్ని పొందాలి ఇప్పుడు మరి శరీరం ద్వారా 100 సంవత్సరాలు ఆనందంగా ఉండగలుగుతున్నామా 30 ఏళ్ళు దాటిన తర్వాత 40 ఏళ్ల తర్వాత 50 ఏళ్ళు కొంతమందికి ఒక్కొక్క టైం లో ఎటాక్ అవుతుంటది పరిస్థితి అది కుటుంబ పరిస్థితులు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు ఏవైతే కొన్ని కారణాల చేత మనిషి దుఃఖాన్ని పొందుతూనే ఉన్నాడు ఎంతమంది పండితుల చేత ఆశీస్సులు పొందినప్పటికీ కూడా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు మనకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు మీరు వినే ఉంటాడు కాలు తడవకుండా సముద్రాన్ని అయినా దాటొచ్చు సముద్రాన్ని చూసిన ఎంత పెద్దగా ఉంటదో సముద్రం సముద్రానికి ఇవతల వడ్డు నుండి అవతలకు చూస్తే అవతల వడ్డు కనపడదు ఇవతల వడ్డు నుండి చూస్తే అవతల వడ్డుకి కనపడదు అన్నమాట అంటే అంతటి పెద్ద సముద్రాన్ని అయినా గాని కాలు తడవకుండా సముద్రాన్ని దాటగలరు గాని కన్ను తడవకుండా సంసారాన్ని దాటలేరు అన్నారు అంటే కళ్ళు తడవడం ఏంటి గురువుగారు అంటే బాధ కలగకుండా ఇబ్బంది పడకుండా కష్టాన్ని పొందకుండా ఈ సంసారాన్ని దాటడం అనేటువంటిది చాలా కష్టం అని చెప్పారు మనం పుట్టిన కాడి నుంచి లాస్ట్ మినిట్ వరకు తుది శ్వాస విడిచిపెట్టేటువంటి చివరి క్షణం లోపల ఎప్పుడో ఒకసారి కంట్లో నుంచి ఒక్క డ్రాప్ అయినా గాని రావాల్సిందే అది అలా రాకుండా జీవించడం అనేటువంటిది లేదు అని చెప్పారు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మనిషికి ఇచ్చినటువంటి మాన్యువల్ ఒక మనిషికి ఇచ్చినటువంటి ఒక బుక్ లో ఇట్లాంటివి అంటే ఒక మనిషి ఎలా జీవిస్తే ఆనందాన్ని పొందుతాడో ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది ఎలా జీవించకపోతే దుఃఖాన్ని పొందుతారో కూడా ఇందులో సూచించడం అనేటువంటిది జరిగింది కాకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే ఏం చేస్తే దుఃఖం కలుగుతుందో చెప్తున్నారు కాబట్టి అది తెలుసుకొని ఆ పద్ధతిగా మనం మార్చుకొని నడుచుకుంటే చాలు ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఒకడు ఐఏఎస్ అయ్యాడు ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ గా సెలెక్ట్ అయ్యాడు కలెక్టర్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు ఉదయం పూట ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్ళు వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్ళు వచ్చారన్నమాట ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగారు ఓ వాళ్ళ తండ్రి పెద్ద తాగుబోతుండి అని చెప్పి వాళ్ళు రకరకాలుగా చెప్పారన్నమాట తర్వాత సరే సరే మరి తండ్రి తాగుబోతు అయిన తర్వాత ఆయన్ని అడిగి ఏం ప్రయోజనం అని చెప్పి ఆయనకి ఇద్దరు పిల్లలు అన్నమాట ఒకటి కలెక్టర్ అయిండు ఒకడు తాగుబోతు అయిండు కొడుకు ఒకడు తాగుబోతు అయిండు ఒకడు కలెక్టర్ అయిండు ఇద్దరిని పిలిచి ఇంటర్వ్యూ చేద్దాం అనుకోని మీడియా వాళ్ళు వెళ్లి పిలిచారు అన్నమాట ఇంటర్వ్యూ చేశారు ఫస్ట్ తాగుబోతు అయినోడిని పిలిచారు అన్నమాట ఏరా నువ్వు ఎందుకు ఇలా అయ్యావు ఏంటి అని అడిగారు నేను మా నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానండి అన్నాడు నేను మా నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను ఇక మాకు ఎవరున్నారండి మా నాన్నే కదా లేవగానే ఆయన ఎలా లేచేవాడు లేవగానే బ్రష్ చేయకుండా ఎలా డ్రింక్ తీసుకునేవాడు ఎంత తీసుకునేవాడు తీసుకున్నాక ఒక మమ్మల్ని ఎలా తిట్టేవాడు ఇవన్నీ నేను బాగా చూసి నేర్చుకున్నా నేను కూడా అలాగే అనుకున్నాను అన్నమాట నేను కూడా పెద్ద అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత లేవగానే ఇలా డ్రింక్ తీసుకొని ఇలా మా భార్యను తిట్టొచ్చు మా అమ్మని తిట్టొచ్చు మా నాన్నని తిట్టొచ్చు పిల్లల్ని తిట్టొచ్చు ఇలా ఎలా తిట్టాలా ఎలా కొట్టాలా ఇవన్నీ నేను డిజైన్ చేసుకున్నాను ఇవన్నీ నేను ఇలా డిజైన్ చేసుకున్నాను చిన్నోడు చెప్పిండు తర్వాత పెద్దోడిని పిలిచారు నాయనా మరి నువ్వు నీకు కలెక్టర్ కావడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మా నాన్నే నాకు ఇన్స్పిరేషన్ అన్నాడు మా నాన్న నాకు అంటే ఏం చేస్తే మనిషి చెడిపోతాడో మా నాన్న ద్వారా నేను నేర్చుకున్నా కాబట్టి నేను అవి చేయకుండా ఉన్నా మా నాన్నని నేను ఫాలో అవ్వలేదు మా తమ్ముడు మా నాన్నని ఫాలో అయ్యిండు వాడు అలా ఉంది వాడి పరిస్థితి దుర్భరంగా ఉంది కడు విచారకరంగా ఉంది వాడి పరిస్థితి నాకే బాధ అనిపిస్తది మా తమ్ముడిని చూస్తే ఎందుకంటే మా నాన్నే ఫాలో అయ్యాడు నేను కూడా మా నాన్ననే ఫాలో అయ్యి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా కానీ ఒక్కటే ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే నేను మా నాన్న ఫాలో అయింది ఒక్కడు కూడా ఫాలో అవ్వలేదు నా సక్సెస్ కి కారణం ఏంటి మా నాన్ననే మా వాడు ఫెయిల్యూర్ కి కారణం మా నాన్ననే అంటే ఒక మనిషి ఏం చేయాలి అంటే ఏ ఒక వివేకాన్ని కోల్పోకూడదు దీంట్లో అదే చెప్తారు అన్నమాట శ్రీకృష్ణ మనకి తెలుస్తుంది అన్నమాట మనిషి వివేకాన్ని కోల్పోకూడదు సమయస్ఫూర్తి అనేటువంటిది చాలా మస్ట్ అండ్ షుడ్ అన్నమాట సందర్భోచితంగా నిర్ణయం తీసుకునేటువంటి స్టెబిలిటీ రావాలి అంటే ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మనం సక్సెస్ అవుతాము అనేటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి ఆ నాలెడ్జ్ అందరికీ రాదన్నమాట భగవద్గీతలోనే పరమాత్మ సూచిస్తారు అన్నమాట తేశాం సతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తమేనాము అని చెప్తారు ఎవరైతే ప్రీతిపూర్వకంగా నన్నే నిరంతరం భజిస్తారో వాళ్ళకి అలాంటి డిసిషన్ పవర్ ఇస్తా బుద్ధి బలాన్ని నేను ఇస్తా అని చెప్పారు మనకి మంచి బుద్ధి రావాలి అంటే నిరంతరం దైవ నామస్మరణ చేయాలి దైవానికి సంబంధించినటువంటి మంత్ర జపం చేయాలి నామస్మరణ మంత్ర జపం అనుష్టానం ఎవరైతే నిరంతరం చేస్తూ ఉంటారో వాళ్లకు మంచి బుద్ధి బలాన్ని పరమాత్మ ఇస్తారు అలాంటి మంచి బుద్ధి బలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు ఇక్కడ అందరూ ఒక మనిషి ఫెయిల్యూర్ కావడానికైనా ఒక మనిషి సక్సెస్ కావడానికైనా కారణం వాళ్ళు తీసుకునేటువంటి డిసిషన్స్ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలే వాళ్ళని సక్సెస్ చేస్తాయి అర్థమైందా అమ్మా పెళ్లి విషయంలో గాని చదువుకునే విషయంలో గాని ఉద్యోగం విషయంలో గాని వ్యాపారం విషయంలో గాని ప్రతి ప్రతి సందర్భంలో కూడా మనం తీసుకునేటువంటి నిర్ణయం మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే మంచి బుద్ధి కావాలి మంచి బుద్ధి కావాలి అంటే దైవానుగ్రహం కావాలి ఎవరికి వస్తది దైవ నామస్మరణ చేసినటువంటి వాళ్ళకి దైవాన్ని అనుసరించి ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అలాంటి బుద్ధి బలం అనేటువంటిది ఏర్పడుతుంది ఓకే అర్థమైందిగా ఒక మనిషి వినాశాన్ని పొందాలన్నా గాని ఒక మనిషి విజయాన్ని సాధించాలి అన్నా గాని కారణం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళ యొక్క ఆలోచనల మీదే ఆధారపడుతుంది అన్నారు అంటే ఒక మనిషి యొక్క వినాశం ఎలా ఉంటుంది అనేటువంటి ఆర్డర్ చెప్పినప్పుడు ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నాడు అంటే ధ్యాయతో విషయాన్పుంసః సంఘశుపజాయతే ఒక మనిషి నిరంతరం ధ్యానం చేయడం వల్ల దుఃఖాన్ని పొందుతుంది అని చెప్పారు అర్థమైందా అమ్మ ఈ మాట వింటే మెడిటేషన్ చేసే వాళ్ళు ఊరుకుంటారా అమ్మ ఒక మనిషి ధ్యానం చేయడం వల్ల మాత్రమే వినాశాన్ని పొందుతున్నారు అని ఇక్కడ చెప్పారు ఎవరు చెప్పారు నేను చెప్పాను నేను చెప్పలేగా ఎవరు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఒక మనిషి ధ్యానం చేయటం వల్ల వినాశాన్ని పొందుతున్నాడు అయితే దేన్ని ధ్యానం చేయడం వల్ల వినాశాన్ని పొందుతున్నాడు అనేటువంటిది తర్వాత కూడా చెప్పారు అది కూడా తెలుసుకోవాలి ఓకే అర్థమైందా అమ్మా ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ధ్యాయతో అంటే నిరంతరం కూడా చింతన చేయటం వలన దేన్ని చింతన చేయటం వల్ల విషయాన్ అంటే విషయాలను చింతన చేయటం వలన మనిషి దుఃఖాన్ని పొందడానికి కారణం ఏమిటి అంటే విషయాలను చింతించడం వలన విషయాలను నిరంతరం చింతించడం వలన ఏమవుతుంది అంటే దానితో సాంగత్యం ఏర్పడుతుంది అటాచ్మెంట్ ఏర్పడుతుంది ఏం ఏర్పడుతుంది అటాచ్మెంట్ అంటే ఒక బంధం అనేటువంటిది ఒక బాండింగ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది అన్నమాట ఎప్పుడు నిరంతరం ఒక విషయాన్ని మనం నిరంతరం స్మరణ చేస్తూ ఉన్నప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిరంతరం చూస్తూ ఉన్నప్పుడు అర్థమైందా అమ్మా వింటూ ఉన్నప్పుడు గాని చూస్తూ ఉన్నప్పుడు గాని ఆలోచిస్తూ ఉన్నప్పుడు గాని తింటూ ఉన్నప్పుడు గాని తింటూ ఉన్నప్పుడు గాని ఇంకా వాసన స్పర్శలు కూడా చెప్తారు అవంతా మనకి అర్థం కాకపోయినా గాని ఇప్పుడు ఈ మూడు అయితే మనకు అర్థమైద్ది ఎక్కువ దేని గూర్చి అయితే వింటారు ఎక్కువ దేన్ని గూర్చి అయితే మీరు చూస్తారో ఎక్కువ మీరు దేన్ని తింటారో దేన్ని మీరు రుచిగా భావించి అనుభవిస్తూ ఉంటారో వాటితో మీకు నిరంతరం బాండింగ్ ఏర్పడుతుంది అంటే అవి మీకు బంధంగా పరిణమిస్తాయి బంధంగా పరిణమిస్తాయి అంటే నిరంతరం అదే చేయటం వల్ల నిరంతరం ఒకే పని ఎక్కువ సార్లు చేయటం వల్ల ఒకే పని ఎక్కువ సార్లు చేయటం వల్ల మనకు అలాంటి ఫీలింగ్స్ ఏ వస్తాయి అలాంటి ఫీలింగ్స్ ఏ వస్తాయి అంటే దానితో మనకు ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పారు ఓకే అర్థమైందా అమ్మా అంటే ఇది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు కాకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నాను అంటే విషయాలు అని చెప్పారన్నమాట ధ్యాయతో విషయాన్ పుంసః సంఘస్తేషుపజాయతే అని చెప్పారు అంటే విషయాలతో సాంగత్యం ఏర్పడుతుంది నిరంతరం విషయాలను చింతన చేయటం ద్వారా మనకు దానితో సాంగత్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది అని చెప్పారు ఎట్లా అంటే రోజు అతను ఆఫీస్ కి వెళ్తూ ఉన్నాడు రోజు ఆయన ఆఫీస్ కు వెళ్తూ ఉన్నాడు ఆఫీస్ కి వెళ్తూ ఉంటే ఆయనకి ఒక ప్లేస్ ఒక ప్లాట్ మంచిగా అనిపించింది ఆయనకు ఒక ప్లాట్ మంచిగా అనిపించింది ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ముందే బయలుదేరి ఒక ఐదు నిమిషాలు ముందే బయలుదేరి ఆయనకు మంచిగా అనిపించిన ప్లాట్ గాడు ఒక నిల్చొని ఒక ఐదు నిమిషాలు దాన్ని గూర్చి చూసి చూసి చూసి బయలుదేరి వెళ్ళాడు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కనిపించిన ఫ్రెండ్ కల్లా చెప్పేవాడు అక్కడ ప్లాట్ ఉంది బాగుంది ప్లాట్ ఉంది బాగుంది ఇంటికి వచ్చాక భార్యకి చెప్పిండు వాళ్ళ అత్తగారు ఫోన్ చేస్తే అత్తగారు గారు చెప్పిండు మొత్తం మాట్లాడిన తర్వాత అత్తగారు ఒక ప్లాట్ బాగుంది అక్కడ ఆ షాపూర్ వెళ్ళే కార్నర్ లో ఉంది ఎంత ఎక్సలెంట్ గా ఉంది అనుకుంటున్నాను అత్తగారు చెప్పిండు మామగారికి చెప్పిండు బామ్మర్దికి చెప్పిండు ఫ్రెండ్స్ వస్తే చెప్పిండు చుట్టాలు వస్తే ఎవరు హాస్పిటల్ కి పోయిండు డాక్టర్ గారు ట్రీట్మెంట్ కోసం వెళ్ళిండు అన్నమాట డాక్టర్ గారి ట్రీట్మెంట్ మొత్తం అయిన తర్వాత డాక్టర్ గారికి కూడా ఇదే చెప్తున్నాడు ఆయనకి ప్లాట్ నచ్చింది అని చెప్తూ ఉన్నాడు అవసరమా అది లేదు అంటే రోజు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నిరంతరం దాన్ని చూడటం వల్ల ఏమైంది అది లోపల ఒక బంధం ఏర్పడింది దానితోటి ఆ ప్లాట్ తో ఒక అటాచ్మెంట్ ఏర్పడింది ఇప్పుడు అటాచ్మెంట్ ఎప్పుడైతే ఏర్పడిందో ఏర్పడిన తర్వాత ఏం చేసిండు అంటే ఒక కోరికగా బలపడింది అది ఆ సంబంధం ఒక కోరికగా బలపడింది ఏమని కోరిక కలిగింది ఎట్లైనా గాని ఆ ప్లాట్ నేను కొనాలి ఎట్లైనా నేను ఆ ప్లాట్ కొనాల ఇది కోరిక కలిగింది ఫస్ట్ ఫస్ట్ ఉత్తగా ఆ చింతన చేసిండు ఆ చింతన చేసింది ఏమైంది అందరికీ చెప్పిండు అన్నమాట అది ఒక బంధం ఏర్పడింది దానితోటి తర్వాత ఆ బంధం ఎప్పుడు ఒక కోరికగా పరిణమించింది ఇప్పుడు ఆ కోరికగా పరిణమించడం ఓకే ఇంతవరకు బాగానే ఉంది కోరికగా పరిణమించడం బాగానే ఉంది కామాత్ క్రోధోభిజాయతే ఆ కోరిక గనుక తీరకపోతే ఆ కోరిక తీరకపోతే ఏమవుతది ఇప్పుడు ఆయన ప్లాట్ కొనాలని అనుకుంటుండు ఇప్పుడు సంవత్సరం అయింది ఆయన యొక్క కోరిక కలిగక ఫిక్స్ అయిండు అన్నమాట ఏమైంది ఫిక్స్ అయిండు ఎట్లైనా ఆ ప్లాట్ కొనాలని ఫిక్స్ అయిండు ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ ప్లాట్ కొనటానికి ఎవరైతే అడ్డుగా ఉంటారో వాళ్ళందరి మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అలాంటి సందర్భంలో ఇక్కడ ఇంకో మాట ఏమని చెప్తుంది క్రోధాత్మతి సమ్మోహః సమ్మోహ కృతి విభ్రమః వివేకాన్ని కోల్పోతున్నాడు వాళ్ళు పెద్దోళ్ళు అరే నువ్వేనారా మాట్లాడేది ఎట్లా అసలు నువ్వు ఎంత తెలివిగల వాడివి ఎంత చదువుకున్నటువంటి వాడివి ఎంత బుద్ధిమంతుడివి రోజు గుడికి వెళ్లేటువంటి వాడివి ఇలాంటి వాడివి ఇలాంటి పరిస్థితి దాపురించింది ఏంటి నీకు ఏమైపోతున్నావ్ ముందుకు పోతున్నావా వెనక్కి పోతున్నావా స్మృతి బ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి వికలత్వాన్ని పొందింది బుద్ధి నాశత్ ప్రణశ్యతి అప్పుడు ఎవరిని నిందించడానికైనా గాని ఎవరిని మోసం చేయడానికి అయినా గాని ఎవరిని కొట్టడానికి అయినా గాని దేనికి కూడా వెనకాడనటువంటి దుస్థితి వాడికి ఏర్పడింది ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు గుర్తుకు రావట్లేదు ఆయన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి మంచి మాటలు గుర్తుకు రావట్లేదు తల్లిదండ్రులు మాస్టారు చెప్పినటువంటి మంచి మాటలు గుర్తు రావట్లేదు భగవద్గీత సత్సంగాలు వినడు లలితా సహస్రనామాలు చదువుకున్నాడు విష్ణు సహస్రనామాలు రామాయణం భారతం భాగవతం ఏవి స్మృతిలోకి గుర్తుకు రావట్లేదు ఒక్కటి కూడా అతనికి గుర్తు రావట్లేదు ఏం గుర్తొస్తుంది ఇప్పుడు ఒక్కటే కోపం ఎవడెవడైతే దానికి అడ్డుగా ఉన్నాడో వాళ్ళందరి మీద కోపండు కొట్టడానికి కూడా వెనకాడట్లేదు వాళ్ళని మోసం చేయడానికి గాని అబద్ధాలు ఆడటానికి దేనికైనా గాని తెగించడానికి సిద్ధంగా ఉన్నాడు మెయిన్ ఇంత దుస్థితి కలగడానికి కారణం ప్లాటు చూడటం ఉత్తగా చూడటం ఉత్తగా చూడటం ఎందుకంటే అంటే వాళ్ళ చుట్టాలు ఈవిడ పెద్ద మనిషి అనుకోని బంగారపు కొట్టుకాడికి తీసుకెళ్లేవాళ్ళు అందరూ ఈవిడనే పిలిచేవాళ్ళు అన్నమాట అందరూ ఈవిడనే పిలిచేవాళ్ళు వెళ్ళినప్పుడు అలా గాని అక్కడ సిల్వర్ ప్లేట్ ఒకటి మంచిగా అనిపించింది సిల్వర్ ప్లేటు మంచిగా అనిపించింది అన్నమాట అందరూ తీసుకెళ్తారు కదా దిద్దులు కొనటానికి ఈవిడే వెళ్ళాలా నెక్లెస్ కొనటానికి ఈవిడే వెళ్ళాలా వడ్డానం కొనటానికి ఈవిడే వెళ్ళాలా బ్యాంగిల్స్ కొనడానికి ఈవిలే దేనికైనా గాని ఈవిడనే తీసుకెళ్లాలి ఈవిడ వెళ్ళినప్పుడల్లా ఆ సిల్వర్ ప్లేటే చూస్తున్నాడు బాగుంది మేము పూజా మందిరంలో ఇది పెట్టుకోవాలి అది చూస్తే కేజీ ఉంది అది చూస్తే కేజీ ఉంది ఆయన అసలు రూపాయి కూడా ఇవ్వడు ఇట్లాంటి వాటికి ఆ ఇంటి పెద్దాయన ఇట్లాంటి వాడికి అస్సలు ఇవ్వడు అన్నమాట కావాలంటే స్టీల్ కంచాలు ఎన్నైనా కొనుక్కోమని వాడుకోవచ్చు దేవుడి దగ్గర ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పూజ చేసేదానికి అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకని ఆయన వడ్డీకి ఇస్తే అవి దేనికి ఉపయోగపడుతున్నాయి ఆయన ప్లానింగ్స్ ఆయనకు ఉన్నాయి అన్నమాట ఆయన అసలు ఒప్పుకోడు ఈవిడకి అదే కొనాలని ఆలోచన పడింది అన్నమాట ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా అదే చూస్తుంది నెలలో రెండు సార్లు వెళ్తే వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఆయన్ని అడుగుద్ది అది ఎంత ఉంటది వెయిట్ అది ఎంత బరువు ఉంటది ఎంత కాస్ట్ అవుద్ది ఇవన్నీ లెక్కలు అడుగుతుంటది తీసుకోదు అన్నమాట వెళ్ళినప్పుడల్లా అడుగుతుంటది ఎంక్వయిరీ చేస్తుంటది వెళ్ళగానే ముందు ఏమి చూడదు దానికెళ్లే అంటే నిరంతరం దాన్నే చింతన చేయటం వలన నిరంతరం ఆ వస్తువునే చూడటం వలన దాన్ని మనం దానితో ఒక బంధం ఏర్పడుతుంది అప్పుడప్పుడు కూడా ఈ ఎక్కడైనా చుట్టాలి ఇంటికి వెళ్ళాము అనుకోండి వాళ్ళు పూజ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ ఇంట్లో ప్లేట్ ఉందనుకోండి వెంటనే అదే చెప్తాను మేము మొన్న జ్యువెలరీ కి వెళ్ళాం అక్కడ కూడా ఇట్లాంటి ప్లేటే ఉంది ఎంత బాగుందో అదే గుర్తుకొస్తుంటది ఇది ఒక బంధం ఏర్పడింది తర్వాత అది కోరికగా బలపడుతుంది కోరికగా బలపడినప్పుడు ఎలా ఉంటది బిహేవియర్ తెలుసా ఏవండీ దసరా పండగ నవరాత్రులు గనుక ఆ ప్లేట్ కొనకపోతే నేను పుట్టింటికి పోతా నేను పుట్టింటికి పోతా ఏమనుకుంటున్నారు ఈసారి లేకపోతే అబ్బాయిని అడుగుతారు అబ్బాయి ఓకే అంటాడు కానీ ఈయన ఒప్పుకోవడాన్ని ఆలోచిస్తుంది అన్నమాట అబ్బాయికి చెప్పడానికి ఎప్పుడు వాళ్ళు 50 ఏళ్ళు అయినా గాని పిల్లలని ఒక్కటి కూడా అడగలేదు అన్నమాట భర్త ఆయన్ని హెచ్చస్తూ ఉంటాడు అన్నమాట పిల్లల్ని అడిగితే ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు కానీ అడగటానికి ఆయన ఒప్పుకోడు అన్నమాట మనకి సరిపోని పెన్షన్ మనకు వస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి మనం మనకి సరిపోకపోతే కదా భగవంతుడు మనకి ఇచ్చాక మళ్ళా వాళ్ళని అడగటం ఎందుకు అని ఆయన ఆలోచన అన్నమాట ఎప్పుడైతే ఈవిడ కచ్చితంగా కొనాలన్నదో ఆయనకి మైండ్ బ్లాంక్ అన్నమాట ఎప్పుడూ అనలేదు అన్నమాట ఇంతవరకు పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఇది కొను అది కొను అనలేదు ఇవాళ గట్టిగా వచ్చే దసరా కల్లా కచ్చితంగా అది నువ్వు కొనకపోతే ఊరుకోను అనేసరికి ఒక ఆలోచన పడుతుంది మరి అంత బలంగా అంటే కొనంటే కుదరదు కొందాం అంటే ఈయనకి సెల్ఫిష్ గా ఒప్పుకునే పరిస్థితి లోపల యుద్ధం జరుగుతుంది అన్నమాట ఆయనకి ఎప్పుడూ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకోలేదు అన్నమాట ఏందంటే యూస్ అండ్ త్రో టైం అన్నమాట టెంపరరీ టైపే ఉంటది కానీ ఇంత చేయటం ఆయనకి ఇష్టం లేదన్నమాట అప్పుడు ఆయన చెప్తారు కొనటం కుదరదు నువ్వు పుట్టింటివి పోతే పో ఇంకా ఆ రోజు నుంచి సరిగ్గా అన్నం ఉండట్లేదు అన్నం పలుకు పలుకు ఉంటుంది కూరలో ఉప్పు ఉండలేదు కారం ఉండట్లేదు ఏ సరిగ్గా లేదు ఆవిడ సరిగ్గా తినటం లేదు సరిగ్గా పడుకుంటే రాత్రి ఈయన లేచినప్పుడు ఆవిడ కూర్చొని ఉంటుంది ఆ నిద్ర పడట్లేదు ఆవిడ ఎందుకు నిద్ర పడలేదు ఓకే అంటే లోపల కోరిక కోరిక బలపడినప్పుడు దాని యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంటుంది చిన్న చిన్న ఎగ్జామ్పుల్స్ చెప్పుకుంటున్నాం మనం అర్థమైందా అమ్మా చిన్న సిల్వర్ ప్లేట్ కొనకపోతేనే రాత్రి నీకు నిద్ర పట్టంగా లేచి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నామంటే ఏమనుకోవాలా అర్థమైందా అమ్మా ఇలా కొన్ని రోజులు నడిచిన తర్వాత ఆయనతో ఎదురించి మాట్లాడటానికి కూడా వెనకాడరు ఇప్పుడు ఆవిడ చదువుకున్నటువంటి పురాణాలు అర్థమైందా అమ్మా రుక్మిణి కళ్యాణం గాని భద్ర కళ్యాణం గాని ఏం గుర్తు రావట్లా ఒకప్పుడు భర్త అంటే ఎంత ఒబిడియన్స్ తో ఉండేదో సతి సావిత్రి సతుకు అంటే గుర్తు రావు ఇప్పుడు అర్థమైందా అమ్మా కోరిక బలపడినప్పుడు ఆ కోరిక కోసం మనుషులు అడుగులు వేసేప్పుడు క్రోధం ఏర్పడుతుంది క్రోధాత్వతి సమ్మోహః బలంగా ఆ కోరిక బలమైనప్పుడు అది తీరనటువంటి పరిస్థితిలో బుద్ధి యొక్క విచక్షణను కోల్పోతాం మనకు ఎంత జ్ఞానం ఉన్నా గాని జ్ఞానం అప్పుడు గుర్తు రాదు ఆ క్షణంలో మనకి జ్ఞానం గుర్తు రాదు అన్నమాట అలా జ్ఞానం గుర్తు రాకుండా ఉన్న క్షణంలో మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన వల్ల మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు అర్థమైందా ఎంత హర్ట్ అవుతారు ఎగ్జామ్పుల్స్ చెప్తారన్నమాట కోపం వచ్చినటువంటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతుంది అన్నమాట ఎంత వైబ్రేట్ అవుతుందో మనకి ఆరా చూడటం రాదు కానీ వాళ్ళు ఆరా చూస్తే ఎంత డిస్టర్బ్డ్ గా ఉంటుందో ఆ కోపం వచ్చినటువంటి టైం లో కళ్ళు ఎర్రగా ఉంటాయి అన్నమాట కొంతమందికి అయితే సినిమాల్లో మీరు చూసే ఉంటారు మనకి కూడా లోపల అలా ఉంటది కనపడదు అన్నమాట సినిమాల్లో మనకి చూపిస్తారు అన్నమాట నరాలు ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట వాళ్ళకి కోపం వచ్చినప్పుడు న్యూరో సిస్టం ఉబ్బుద్ది అన్నమాట నెర్వస్ సిస్టం ఉబ్బుద్ది అంటే అంత టెంప్ట్ అవుతారు బీపి పెరుగుద్ది అన్నమాట బ్లడ్ ప్రెజర్ పెరిగి నెర్వస్ చిట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటారు బ్రెయిన్ లో న్యూరోస్ చాలా సన్నగా ఉంటాయి కదా నరాలు చిట్లి బ్లడ్ మొత్తం బయటికి వచ్చి బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలిసిస్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు ఎందుకు సిల్వర్ ప్లేట్ కొనందుకు ఇప్పుడు సిల్వర్ ప్లేట్ లేకపోతే భగవంతుడు ఏమైనా అడిగిండా భగవంతుడు ఏమన్నాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి నువ్వు నాకు ఏం చేయక్క ఒక చిన్న పత్రం తులసి దళం మారేడు దళం చాలు పుష్పం నీ చేతిలో అందుబాటులో ఉన్న ఏ దగ్గరలో ఉన్న చెట్టుకి ఏ పుష్పం మందార పుష్పం ఉంటే మందార పుష్పం గన్నేరు పుష్పం ఏ పుష్పాన్ని సమర్పించిన యాక్సెప్టెడ్ ఏమీ దొరకలేదు ఓ పండు దొరకలేదు కాస్త తాగటానికి ఇచ్చిన నీళ్లు ఉంటాయి కదా అయ్యే ఒక చుక్క అక్కడే సమర్పించు పూజా మందిరం నాకు కూడా అక్కర్లే నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఒక చుక్క నీళ్లు నాకు సమర్పించు ఐ యాక్సెప్టెడ్ నువ్వు భక్తితో సమర్పిస్తే నేను దేన్నైనా గాని ఆమోదించి నిన్ను అనుగ్రహిస్తే ఇవన్నీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో ఘనంగా చేశారని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు నేను మీరు అర్పించే వస్తువుల కంటే కూడా ఆ వస్తువుల వెనకాతల దాగి ఉన్నటువంటి మనసులో మీకు ఎంత భక్తి ఉందో ఎంత నిర్మలత్వం ఉందో ఎంత పవిత్రత ఉందో దాన్ని నేను పరిగణలోకి తీసుకుంటాను తప్ప వస్తువుతో నాకు సంబంధం లేదు వస్తువు నాకెందుకు నేనేం చేసుకుంటా అమ్మ ఇప్పుడు కేజీ లడ్డులు తీసుకొచ్చి పెట్టినవు అనుకో అమ్మ ఆ ఇక్కడ ఈ వీధిలో ఉన్నటువంటి స్వీట్ షాప్ లో తీసుకొచ్చి పెట్టిన యాక్సెప్టెడ్ పరమాత్మ లేకపోతే ఎక్కడో పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకొచ్చి పెట్టిన యాక్సెప్టెడ్ పరమాత్మకి అవి టేస్ట్ గా ఉంటాయా ఇవి టేస్ట్ గా ఉంటాయా నీ ఇష్టం నువ్వు పెట్టేటువంటి దాని వెనక ఎంత భక్తి ఉందో అది మాత్రమే ప్రధానంగా తప్ప ఆయన నువ్వు పుల్లారెడ్డి స్వీట్ లో తెచ్చినవా వెంకట్ రెడ్డి గారి స్వీట్ లో తెచ్చినవా ఇంకెక్కడో ఆలివ్ స్వీట్స్ లో తెచ్చినవా ఇవన్నీ చూడరు అర్థమైందా భక్తితో ఇచ్చామా లేదా అనేటువంటిదే ప్రధానం మనం భక్తితో ఇస్తున్నామా లేదా అనేటువంటిది మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే చాలు మరి అలాంటప్పుడు నువ్వు సిల్వర్ ప్లేట్ తో నాకేం పని నువ్వు అందరూ ఇక సిల్వర్ ప్లేట్ లో తెచ్చి నైవేద్యం పెడితేనే నేను స్వీకరిస్తాను సిల్వర్ ప్లేట్ లో పెట్టి నన్ను పూజ చేస్తేనే నేను ఒప్పుకుంటాను అన్నట్టయితే ఈ ప్రపంచంలో ఇక భక్తులు ఏముంటారు అమ్మ ఎంతమంది అలా చేయగలుగుతారు అందుకని ఇక్కడ ఏమంటున్నారు అంటే ధ్యాయతో విషయాన్పుంసః సంఘ స్తేషుపజాయతే సంఘ సంజాయతే కామః కామ క్రోధోత్ కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి బ్రహ్మః స్మృతి బ్రహ్మశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశత్ ప్రణశ్యతి ఇది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పేటువంటి ఒక ఆర్డర్ ఓకే అంటే ఏమని చెప్తున్నారు ఒక మనిషి దుఃఖాన్ని పొందటానికి వినాశాన్ని పొందటానికి కారణం ఆలోచించడం నిరంతరం ఒకే విషయాన్ని చింతన చేయటం ద్వారా ధ్యాయతో విషయాన్ విషయాలను నిరంతరం చింతన చేయటం వల్ల మాత్రమే ఇలాంటి దుఃఖం కలుగుతుంది అని చెప్పి ఇలాంటి వినాశం ఏర్పడుతుంది అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది మనకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు విద్యా ప్రకాశనందగిరి స్వాముల వారు విద్యా ప్రకాశనందగిరి స్వాముల వారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మన ఇండియాకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారట ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ మేము బిజినెస్ చేసుకోవడానికి చిన్న కొంచెం అవకాశం కల్పిస్తే చాలు అన్నారట బిజినెస్ చేసుకోవడానికి ఇండియాలో బిజినెస్ చేసుకోవడానికి కొంచెం అవకాశం ఇస్తే చాలు అన్నారు అలా వచ్చినటువంటి వాళ్ళు బలపడి మన మీదనే దాడి చేసి మన దేశం మొత్తాన్ని ఆక్రమించుకొని మనల్ని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటిది జరిగింది అర్థమైందా వాళ్ళని వాళ్లకు కొంచెం అవకాశం ఇస్తేనే బ్రిటిష్ వాళ్ళు మొత్తం కూడా మన దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు అవునా కాదా ఆ అవకాశం ఇవ్వకపోతే వాడు మనల్ని అసలు రాడు ఇక్కడికి రాడు రాకపోవడం వల్ల వాడి ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ రావు ఇంకో ఎగ్జాంపుల్ అదే చెప్పారన్నమాట నాకు కొంచెం లోపల నిల్చోవడానికి అవకాశం ఇస్తే చాలు లోపల నాకు కొంచెం నిల్చోడానికి అవకాశం ఇస్తే చాలు తర్వాత నేనే కూర్చోగలుగుతా పడుకోవడానికి నేనే ప్లేస్ సంపాదించుకోగలను అన్నాడంట ఒకాయన అంటే కొంచెం అవకాశం ఇస్తే అది మనలను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది చిన్న కోరికే కదా అని అనుకోవద్దు చిన్న కోరికే అనేకమైనటువంటి మన యొక్క దుఃఖాలకు కారణం మీరు ఆలోచించండి ఎవరైనా గాని ఈ ప్రపంచంలో ఎప్పుడైనా దుఃఖాన్ని పొందారు అంటే ఆ దుఃఖం వెనక వాళ్లకు బలం అయినటువంటి కోరిక ఏదో ఒకటి ఉండి ఉంటుంది ఏదో ఒక బలమైన కోరిక లేకుండా దుఃఖాన్ని పొందినటువంటి మనిషి ఉండడు అర్థమైందా అమ్మ చూడండి ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్ మనకు చాలా మంది కనిపిస్తారు ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తా మీకు దుర్యోధనుడు దుర్యోధనుడు తెలుసు కదా దుర్యోధనుడికి ఒక కోరిక ఆలోచన ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆలోచన అన్నమాట చిన్నప్పటి నుంచి ఏమిటి ఆలోచన అంటే తాను రాజు కావాలి హస్తినాపురం సింహాసనాన్ని కైవసం చేసుకోవాలి ఇది దాని మీద కూర్చోవాలి దాని మీద కూర్చోవాలి ఇప్పుడు మనం పొలిటిషియన్స్ చూడండి ఎంతమంది పొలిటిషియన్స్ ఎంత కొట్టుకుంటారో కుర్చీ కోసం కొట్టుకున్న కనిపిస్తుంది సినిమాలోనే కాదు రియల్ గానే ఉంటారు కాబట్టే మనకి రియల్ గా ఉన్నోళ్ళని చూడలేము కాబట్టి సినిమాల్లో చూడటం అర్థమైందా కుర్చీ కోసం ఎలా ఆలోచిస్తారో వీళ్ళు దుర్యోధనుడు కూడా కావాలనుకున్నాడు దట్స్ ఆల్ ఎప్పుడు ఎప్పుడైతే తాను సింహాసనాన్ని అధిరోహించాలి అనేటువంటి కోరిక లోపల కలిగిందో నిరంతరం అదే చింతనలో కొనసాగించాడు దాని ఆ కోరికతో ఆ విషయంతో బంధం ఏర్పడింది బంధం కోరికగా మారింది ఆ కోరిక రాజు కావటానికి ప్రయత్నం జరిగింది అర్థమైందా రాజు కావటానికి ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే ఆ ప్రయత్నంలో ఎంత విచక్షణ రహితంగా ప్రవర్తించాడు దుర్యోధనుడు ఎంత విచక్షణ రహితంగా ప్రవర్తించాడు సొంత అన్నదమ్ములతో యుద్ధం అర్థమైందా అమ్మా తండ్రి చెప్పిన మాట వినలేదు తల్లి చెప్పిన మాట వినలేదు బంధువులు ఎవరు చెప్పినా వినలేదు భీష్ముల వారు చెప్పారు ద్రోణాచార్యుల వారు చెప్పారు ఎంతమంది ఆత్మీయ వికర్ణుడు వాళ్ళ బ్రదర్ చెప్పాడు అయినా వినలేదు సొంత బంధువులు చెప్పిన స్నేహితులు చెప్పిన గురువు చెప్పిన సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినా గాని రిజెక్ట్ చేశాడు మరి తను ఎంత విచక్షణ రహితంగా ప్రవర్తించాడు అమ్మ పాండవుల్ని చంపడం కోసం ఎంత ప్రయత్నం చేశాడు అర్థమైందా అమ్మ ఎన్ని మోసాలు చేశాడు ఎన్ని కుట్రలు పన్నాడు అసలు ద్రౌపది వస్త్రాపహరణం కోసం కూడా వెనకాడలేదంటే ఆలోచించండి అసలు ఇప్పటి కాలంలోనే అప్పటి కాలంలోనే అంత అకృత్యానికి పాల్పడ్డాడు అంటే ఎంత బుద్ధి వినాశం కలిగి ఉంటది ఎంత బుద్ధి బలాన్ని కోల్పోయి ఉంటాడు అర్థమైందా దుర్యోధనుడి యొక్క వినాశం వెనుక అతని యొక్క విషయ సంకల్పమే కారణభూతంగా ఉంది అర్థమైందా ఇంకోటి కర్ణుడు కర్ణుడు కూడా అంతే ఈ దేశంలోనే నెంబర్ వన్ విలువిద్యలో నెంబర్ వన్ అవ్వాలనుకున్నాడు దట్స్ ఆల్ ఆ ఒక్క కారణం చేత నిరంతరం అదే ధ్యాసలో ఉండటం చేత దుర్యోధనుడి పక్కన చేరి దుర్యోనుడి తోటి ఎన్ని తప్పులు తప్పులు చేయించాడు దుర్యోధనుడు చేసిన తప్పుల్లో 50% కర్ణుడిదే ఉంటది ప్రభావం అర్థమైందా అమ్మా కర్ణుడి యొక్క సలహా సూచనల తోటే దుర్యోధనుడు అంత వినాశాన్ని పొందాడు అని కూడా మనకు చెప్తారు మహాభారతంలో ఎందుకంటే అర్జునుడి కంటే నెంబర్ వన్ స్థాయిలో ఉండాలి అనేటువంటి ఒక చిన్న దురాలోచన అర్థమైందా అమ్మా అంటే ఒక మనిషి విషయాలను నిరంతరం తలంచుకోవడం చేత నిరంతరం విషయాలను చింతనం చేయటం ద్వారా మనిషి ఇలాంటి దుఃఖాన్ని పొందుతాడు ఇలాంటి వినాశాన్ని పొందుతాడు అని చెప్పారు అలాంటి సందర్భంలో ఎలా ఉంటాడు మనిషి అని చెప్పడానికి దీనిలో విద్యా ప్రకాశనందగిరి స్వాముల వారు ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పారంటే దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారట దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారు కాబట్టి కడు జాగరూకులై ఉండాలి అని చెప్పారు ఇంకో ఎగ్జాంపుల్ ఏమని చెప్తారంటే పాము గాని ఒక దొంగవాడు గాని ఇంట్లో ఇంట్లో ప్రవేశిస్తే ఇంట్లో ప్రవేశిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనలో ప్రవేశించేటువంటి ఈ యొక్క కోరిక వల్ల కూడా ఈ యొక్క కామము అనేటువంటి కోరిక వల్ల కూడా మనం అంతటి దుఃఖాన్ని పొందవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్త అని చెప్తారు ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు రావణ బ్రహ్మ అర్థమ రావణ బ్రహ్మ తెలుసు కదమ్మా ఏ ఊరు అమ్మ శ్రీలంక ఆ శ్రీలంక లంక లంక అన్న శ్రీలంక అన్నా ఒకటే ఆయన బ్రహ్మ అని ఉంటది చివరన ఆయనకి ఏమని ఉంటది తర్వాత తర్వాత పేరు మారింది కానీ ఫస్ట్ లో ఆయన పేరు రావణ బ్రహ్మ ఏమిటి రావణ బ్రహ్మ అంటే బ్రాహ్మణ వంశంలో జన్మించిండు పులస్త్య బ్రహ్మ వంశంలో జన్మించినటువంటి మహానుభావుడు కానీ చిన్న కోరిక కారణంగా అర్థమైందా అమ్మా వాళ్ళ చెల్లెలు ఉంది మీకు తెలిసే ఉంటది శూర్పణక వాళ్ళ చెల్లెల యొక్క దుశ్చేష్టల వల్ల అంటే మంచి ప్రవర్తన లేదన్నమాట చెడు ప్రవర్తన వల్ల లక్ష్మణుడు దండిస్తాడు ఆ లక్ష్మణుడు దండించడం కారణం చేత వెళ్లి వాళ్ళ బ్రదర్ తో చెప్తుంది అన్నమాట నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అంటే అప్పుడు ఆయన ఆలోచిస్తారు సీతాదేవిని తీసుకెళ్తాడు తర్వాత మనకి తెలిసింది ఎంత ఇబ్బంది పెట్టాడు అంటే అంత ఇబ్బంది పడతాడు వాడు తర్వాత అర్థమైందా అంటే రావణ బ్రహ్మ అని పిలవబడినటువంటి వాడు మహా తపస్సు సంపన్నుడు అయినటువంటి వాడు నిరంతరం కూడా శివ పూజ చేసినటువంటి పంచాక్షరీ మంత్రాన్ని అనుష్టానం చేసినటువంటి అనుష్టాన పరుడు మరి అలాంటి వాడు అసురుడు అనేటువంటి పేరుతో పిలవబడ్డాడు రాక్షసుడు అనేటువంటి పేరుతో పిలవబడ్డాడు ఎందుకంటే అతని యొక్క ప్రవర్తన శైలి విచక్షణ కోల్పోయాడు విచక్షణ కోల్పోయాడు ధర్మాన్ని కోల్పోయాడు దుఃఖాన్ని పొందాడు వినాశాన్ని పొందాడు మనం చూసుకుంటే బకాసురుడు గాని మహిషాసురుడు గాని నరకాసురుడు గాని వాళ్ళందరూ కూడా ఎలా మరణించారు అలాగే మరణించారు మనం అలాంటి దుస్థితిని పొందకుండా ఉండే విధంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది అయితే ఏం చేయాలి మనం ఏం చేయాలి అంటే మీరు కోరికలు కోరకుండా ఉండాలా ఇప్పుడు మనం ఇక్కడ ఏమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నిరంతరం నువ్వు ఏదో ఒక వస్తువును కావాలని కోరటం చేత ఇంత దుఃఖం కలుగుతుంది వినాశం కలుగుతుంది అని చెప్పారు మరి ఇప్పుడు కోరికలు లేని మనిషి ఉన్నాడా ఏ అమ్మగారు మనిషికి కోరికలు లేకుండా ఉన్నారా ఏమి లేదు ఇప్పుడు గుడికాయ ఇప్పుడు సపోజ్ గుడికి ఒక పది మంది భక్తులు వచ్చారమ్మా అనుకో అమ్మ భక్తులు గుడికి వస్తే అమ్మ ఈ ఎవరైతే ఏ కోరిక లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు రండమ్మా అని అన్నారు అనుకో అమ్మ ఎంతమంది వస్తారు అంటారు ఒక్క కోరిక కూడా లేనటువంటి వాళ్ళు భగవంతుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు కోరిక లేకుండా గుడికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకవేళ గనక మనకి పెన్ను పేపర్ ఇచ్చి కోరికలు లిస్ట్ ఇవ్వమంటే ఒకటి రెండు మూడు నాలుగు పేజీలు అన్నీ నిండుతూనే ఉంటాయి ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత నింపుతూనే ఉండవు అన్నమాట కోరిక లిస్ట్ అంత పెద్దగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు మనక అన్ని ఉండవు అనుకోండి మనకన్నీ ఉండవు అంటే చాకచక్యత ఉంటది అని చెప్తారు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటది అని చెప్తారు ఒక భగవంతుడు ఒకడు మంచి పూజ చేస్తే ప్రత్యక్షమైండు అంట భగవంతుడు ప్రత్యక్షమైండు అన్నమాట ప్రత్యక్షమైతే ఏం వరం కావాలో కోరుకో తల్లి అని అడిగిందంట ఎన్నైనా కోరుకోవచ్చా అని అడిగిందంట ఎన్నైనా కోరుకోవచ్చు అంటే ఆప్షన్ ఏం లేదమ్మా అంత నీకు మల్టిపుల్ ఛాయిస్ ఏమి లేదు సింగిల్ ఒకే ఒక్క కోరిక కోరుకోవచ్చు అని చెప్పారు ఆవిడ బాగా ఆలోచించింది ఏం కోరుకుంటే సరిపోయిద్ది చాలా ఉన్నాయి మనసులో మనసులో చాలా కోరుకోవాలని ఉంది ఇప్పుడు ఆయన ఒకటే ఇస్తా అన్నాడు ఇప్పుడు ఏది కోరుకోవాలి అన్ని ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి లోపల ఉన్నాయి కూడా ఎట్లున్నాయి అంటే ఒకటి కోరుకుంటే ఇంకొకటి ఇంకొకటి కోరుకుంటే ఇంకోటి ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి ఏం కోరుకోవాలని బాగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంది సరే ఒక రెండు నిమిషాలు టైం అయింది స్వామి వెంటనే ఆలోచించుకొని కోరుకున్నా ఒక మంచి ఒక ప్లాన్ రెడీ చేసింది ఒక కోరిక ఒకటే గాని ఆ కోరికలో ఇంకా ఇంక్లూడ్ అయి ఉండేట్టుగా తెలివి తెలివి వాడింది అన్నమాట భగవంతుని దగ్గర కోరికలు కోరుకునేటువంటి సందర్భంలో స్వామి నాకు పెద్ద మీరు ఒకటే కోరుకున్నారు అదే కోరుకుంటా నాకు 108 సంవత్సరాల వయసులో ఎంత వయసులో 108 సంవత్సరాల వయసులో సెవెంత్ ఫ్లోర్ కి నడుచుకుంటూ ఎక్కి మాకు ఉన్నటువంటి సెవెంత్ ఫ్లోర్ ఉంటది కదా సెవెంత్ ఫ్లోర్ కి నేను నడుచుకుంటూ వెళ్లి అర్థమైందా అక్కడ ఉన్నటువంటి బంగారపు ఉయ్యాలలో నేను కూర్చొని సెవెంత్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బంగారపు ఉయ్యాలలో నేను కూర్చొని మా మనవడికి వజ్రాలు పొదిగినటువంటి బంగారు గిన్నెలో పప్పు అన్నం పెట్టి నెయ్యి వేసి కలిపి తినిపించాలని కోరిక ఇక ఇంతకంటే నాకేం లేదు కోరిక ఈ ఒక్క కోరిక తీర్చు అన్నది ఈ ఒక్క కోరిక గురువు గారు అన్నది కాదన్నమాట ముందు ఫస్ట్ మాకు ఏడు అంతస్తుల బిల్డింగు కావాలి మాకు ఉన్నటువంటి ఏడు అంతస్తుల బిల్డింగు లో పైకి ఎక్కాలి కదా అంటే ఏం కావాలని కోరింది వాళ్ళకి ఏడు అంతస్తుల బిల్డింగ్ మళ్ళా 108 సంవత్సరాల వయసులో మనల్ని ఎత్తుకొని పైకి వెళ్ళాలి అంటే 108 సంవత్సరాలు వచ్చిందాక మోకాళ్ళ నొప్పి రాకూడదు నడుము నొప్పి రాకూడదు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యాన్ని కూడా కోరుకుంది అర్థమైందా అమ్మా మళ్ళా పైకి ఎక్కిన తర్వాత బంగారపు ఉయ్యాలంటే పేదోడికి ఉండదు కదా మేము ధనవంతులు అయితేనేగా బంగారపు ఉయ్యాల మేము ఉండేది మాకు అందుకని బంగారపు ఉయ్యాలు కావాలంటే ఎంత ఎన్ని కోట్లు కావాలో అవి కూడా నువ్వు ప్రొవైడ్ చేయాలి అంటే ఇల్లు కోరుకుంది ప్లాట్ కోరుకుంది ఆరోగ్యం కోరుకుంది మనవడు బాగుంది ఉండాలంటే అప్పటివరకు వంశం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని కూడా అర్థమైందా ఒక్క కోరికే గాని అంటే తెలివి ఉన్నోళ్ళు అలా కోరుకుంటారు తెలివి ఉన్నవాళ్ళు అలా కోరుకుంటారు మనకి అంత తెలివి లేదని నేను అనుకుంటున్నా అమ్మగారి లాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు నాకైతే లేదు ఓకే అయితే కోరిక ఉన్నవాళ్ళు ముందుకి రండి అంటే కోరిక వల్ల ఎంత దుఃఖం కలుగుతుంది ఇక్కడ సూచించారు మరి అలా అని చెప్పి కోరికలు లేకుండా ఉన్నాయా మనిషికి మీరు వినే ఉంటారు మనం ఎక్కడ పూజ చేసినా గాని హోమం చేసినా గాని ఎక్కడ ఏది శుభకార్యం జరిగినా గాని మనకి ఒక లిస్ట్ ఇస్తారు కోరికల లిస్టు విన్నారా చూసారా ఎప్పుడైనా కోరికల లిస్ట్ మీకు ఇచ్చారా ఎప్పుడైనా ఇవ్వలేదా మీకు ఎవరు ఇవ్వలేదా కోరికల లిస్టు ఉంటది మనకి తెలియదు అన్నమాట అది కోరికల లిస్ట్ అనే విషయం మనకి తెలియదు అన్నమాట అయ్యగారు పండిట్టు మనతోటి కంకణం కట్టించి చెప్పిస్తారన్నమాట అంటే యూనివర్సల్ గా కోరుకునేటువంటి కోరికలు లిస్ట్ అంటే చాలా మందికి ఉంటదన్నమాట కోరికలు కోరుకోవచ్చు అంటారు మరి ఏవి కోరుకోవచ్చో ఏవి కోరుకోకూడదో మాకు తెలియదు కదా ఏ పండిట్ జీ యూనివర్సల్ గా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కోరదగినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి చెప్పండి అవి చెప్పండి అంటే ప్రపంచం మొత్తానికి యూనివర్సల్ గా ఒక ఫార్మేట్ ఇచ్చారు కోరుకునేటువంటి కోరికల లిస్ట్ ఒకటి ఇచ్చారు అది మీకు తెలుసు అనుకుంటున్నా గుర్తు చేస్తా ఒకసారి మళ్ళా మళ్ళా మరోసారి గుర్తు చేస్తాం మనకి గోత్ర నామాలు చెప్పిస్తారమ్మ సంకల్పం అంటారు దీన్ని ఏమంటారు సంకల్పం గోత్ర నామాలు చెప్పిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ పేర్లు చెప్పాక ఏవం గుణ విశేషణ విశిష్టాయం అర్థమైందా అమ్మా అంటే పరమాత్మ ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మామూలుగా మిగతా అప్పుడు కాదు ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతమో సత్యనారాయణ స్వామి వ్రతమో శ్రావణ మంగళవార పూజో ఏదో ఒకటి చేసుకున్నాం విశేషమైనటువంటి రోజున రోజు కాబట్టి నేను ఇట్లా పూజ చేసుకుంటున్నా శుభతిదవ్ అయితే నేను చేసుకునే రోజున స్వామి నేను అడిగేటువంటి లిస్టు నాకు ఒక్కడికి కాదు తండ్రి మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు మా అమ్మాయి కలకత్తాలో ఉంది మా మనవడు అమెరికాలో ఉన్నాడు వాళ్ళందరూ రావటానికి కుదరదు ఇక్కడ మళ్ళా వాళ్ళ లిస్టు వేరే అని అనుకోమాకు అది కూడా ఇందులోనే ఇంక్లూడెడ్ అని నువ్వు అనుకోవాలి అది కూడా ఇందులోనే ఇంక్లూడెడ్ అనుకోవాలి మళ్ళా మా అమ్మాయికో పేరు అన్ని అవసరం లేదు సహ కుటుంబానం సహ కుటుంబానం అంటే మా మనవడు గాని మనవరాలు గాని కొడుకు గాని కోడలు గాని బిడ్డ గాని అల్లుడు గాని వాళ్ళు ఇక్కడ లేకపోయినా గాని ఇంక్లూడెడ్ అని మీరు భావించే మీరు శాంక్షన్ చేయాలి మరి ఓకే సహ కుటుంబానం క్షేమః స్థైర్యః ధైర్యః క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుహు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ముందు ఇవి శాంక్షన్ చేయండి తండ్రి ముందు ఇవి చేయాల వీటిని తర్వాత ఏమన్నా నీతి వాక్యాలు చెబితే తర్వాత చెప్పండి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇలాంటివి తర్వాత చెప్పండి ముందు ఆరోగ్యాన్ని ఆయుష్షుని క్షేమాన్ని ఇవి ప్రొవైడ్ చేయండి కొంచెం ధైర్యంగా ఉండాలి ఈ భయం లేకుండా ఉండాలి ఈయనకి ఏం భయం అమ్మ ఈయనకేం భయం ఈయనకేం 62 వచ్చినాయిగా ముసలోడు అయితానేమో అని మొఖం ముడతలు పడిద్దేమో అని రోజులు చేసుకుంటాడు ముడతలు పడకూడదు మరి అది ఎవరి చేతుల్లో ఉంటది ఏదో సినిమా చూస్తాడు ఆయనకి 73 సంవత్సరాల్లో కూడా మంచి బ్యూటీగా ఉన్నాడంట ఈయనకి 62 సంవత్సరాలకే రెండు ముడతలు పడ్డాయంట అవి పడకుండా ఉండాలంటే ఏం చేయాలని తపన ఇవన్నీ లిస్ట్ అన్నమాట అర్థమైందా సహకుటుంబానం అర్థమైందా అమ్మా సహకుటుంబాన క్షేమః అంటే నేను క్షేమంగా ఉండాలి మా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి స్థైర్యః అంటే అంటే స్థిరంగా ఉండాలి ధైర్యః అంటే ధైర్యంగా ఉండాలి తర్వాత మాకు ఎక్కడా కూడా మా ఫ్యామిలీలో నష్టం అనేటువంటిది రాకూడదు ఫెయిల్యూర్ అనేటువంటి ఫెయిల్యూవర్ అనేటువంటిది ఉండకూడదు ఏ రంగంలో బిజినెస్ అయినా గాని లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టం అయినా జాబ్ అయినా గాని వ్యవసాయం చేసిన ఎక్కడైనా ఫెయిల్యూర్ అనేటువంటిది ఉండకూడదు మా అబ్బాయికి ఫస్ట్ సీట్ రావాలా గ్రూప్స్ రాసిన గాని ఐఏఎస్ అయినా ఐపిఎస్ అయినా ఎంబిబిఎస్ అయినా ఏదైనా గాని విజయాన్ని సాధించాలి ఓకే క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆమె భయం లేకుండా చూడు తండ్రి నీ యొక్క అభయం కావాలి నీ యొక్క అభయం ఉంటే మాకు ఇంకా భయం అనేటువంటిది లేకుండా ఉంటుంది తర్వాత ఆయుహు ఆరోగ్య ఐశ్వర్య ఈ మూడు రిలేటెడ్ వర్డ్స్ మీరు బాగా గమనించండి అమ్మ ఆయుహు ఆరోగ్య ఐశ్వర్య ఒకాయనకి 102 పెట్టిండు ఏంటది ఎంత పెట్టిండ అమ్మ 102 102 పెట్టిండు మరి 102 ఆయుష్షు పెట్టిన తర్వాత ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఎండ వేసిన ప్రాబ్లం ఇచ్చిండు అనుకో ఏం ఉపయోగం కాబట్టి ఆరోగ్యం కూడా ప్రొవైడ్ చేయాల ఆయుష్షుతో పాటు ఏం చేయాల ఆరోగ్యం ఇప్పుడు ఆయుష్షు ఇచ్చిండు ఆరోగ్యం ఇచ్చిండు అప్పులు చేస్తే ఏం ఉపయోగం అప్పులు అయితే అందుకని ఐశ్వర్యం కూడా ఇవ్వాలి ఓకే అంటే ఏంటి అర్థం ఆయుష్షు ఇవ్వాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి జీవించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చాలి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి గుడికి రమ్మంటే నెలకోసారో రెండు నెలలకోసారికో వస్తా అప్పుడు మీరేదో ధర్మం అర్థం కామం మోక్షం అని ఏదో చెప్తుంటారు కదా అమ్మగారు అయ్యి ఉండటానికి ఆ రోజు వస్తా రోజు రమ్మంటే కుదరదు ఇవన్నీ ముందు ప్రొవైడ్ చేయమను షూట్ చేసినప్పుడు గుర్తొస్తుంది సార్ ఇది ఓకే ఆ ఇవన్నీ ప్రొవైడ్ చేయమని అమ్మగారికి చెప్పండి అమ్మగారు అమ్మగారు చెబుతారు అవన్నీ వస్తాయి వచ్చిన తర్వాత సత్సంగానికి రమ్మని పిలిస్తే వస్తాయి ఏందమ్మా పొద్దాకా సత్సంగానికి పోతే ఏం ఉపయోగం నడుము నొప్పులే మా కాళ్ళు నొప్పులే ఒక్కటి అర్థం కాదా విన్నది గుర్తే రాదా అమ్మ అలా ఉండకూడదు జీవితం అర్థమైందా ఇవన్నీ కూడా అమ్మ మనం అడిగినా అడగకపోయినా మనకు కర్మానుసారంగా రావలసిన సమయంలో వస్తాయి ఏవి ఎప్పుడు రావాలో అవన్నీ కూడా కూడా పరమాత్మ సమయానుకూలంగా మనకు అనుగ్రహిస్తారు ఓకే అర్థమైందా అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాను అంటే కోరికలు మరి ఉండకూడదా అంటే కోరికలు చాలా ఉన్నాయి మనకి కోరికలు చాలా ఉంటాయి మనిషి కోరిక లేనటువంటి మనిషి ఉండడు అయితే భగవద్గీతలో ఒక మంచి మాట చెప్తారు ఏడవ అధ్యాయంలో మీరు ఈసారి వీలైతే చదవండి ఒకసారి కోరికలు అంటే బంధించే కోరికలు కొన్ని బంధించని కోరికలు కొన్ని బంధించే కోరికలు కొన్ని బంధించనటువంటి కోరికలు కొన్ని అర్థమైందా దాన్ని ఏమంటారు అంటే ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్శభ ధర్మ విరుద్ధో భూతోస్మి కామోస్మి భరతర్శభ అన్నారు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు బంధ హేతువు కాదు అన్నారు అంటే మన కోరిక ఎలా ఉండాలి అంటే పరమాత్మ ఏమని చెప్తున్నారు కోరుకో నాయనా తప్పేముంది కాదు నువ్వు కోరుకునేటువంటి కోరిక ధర్మం బద్ధమై ఉండాలి ధర్మబద్ధమైనటువంటి కోరిక నిన్ను బంధించదు నీకు దుఃఖం కలిగించదు ఎలాంటి కోరిక బంధిస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే అధర్మ యుక్తమైనటువంటి కోరిక నీ యొక్క కోరికలో ధర్మం లేకపోతే ధార్మికత లేకపోతే కచ్చితంగా నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్పారు అర్థమైందా మనం కోరిక కోరుకునేటప్పుడు టెస్ట్ చేసుకోవాలి కోరిక కోరేప్పుడు టెస్ట్ చేసుకోవాలి మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం మనం ఎలాంటి స్టెబిలిటీ ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నాం మనం ఇలాంటి కోరిక కోరవచ్చా లేదా అనేటువంటిది నువ్వు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని కోరుకో కోరుకుంటే పర్వాలేదు కాకపోతే తీరకపోతే మాత్రం నువ్వు ఇబ్బంది పడకూడదు అర్థమైందా అమ్మా కోరిక కోరిన తర్వాత ఆ దేవుడు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఈ దేవుడికి శక్తి లేదు ఆ దేవుడికి శక్తి లేదు ఈ దేవుడు మంచోడు కాదు ఆ దేవుడు మంచోడు కాదు అని నువ్వు అనకూడదు అర్థమైందా అమ్మా నేను ఇంత తెలివిగల వాడిని ఇంత ధర్మాన్ని ఇంత బుద్ధిమంతుడిని ఇంత శక్తిమంతుడిని నా కోరిక నువ్వు తీర్చవా ఎవరో కోరిక తీర్చినవి అని చెప్పి అట్లా నువ్వు అనకూడదు ఎందుకంటే కోరుకో అర్హత ఉంటే ప్రొవైడ్ చేస్తారు అర్హత లేకపోతే ప్రొవైడ్ చేయరు సపోజ్ ఉదాహరణకు అమ్మ సెవెంత్ ఫెయిల్యూర్ ఒకతను సెవెంత్ ఫెయిల్యూర్ అర్థమైందా అమ్మా ఆయన ఆర్డిఓ పోస్ట్ కి అప్లై చేసిండు సెవెంత్ ఫెయిల్యూర్ అయితే ఆర్డిఓ పోస్ట్ కి అప్లై చేస్తే ఇస్తారా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని కోర్టుకి వెళ్తే ఏమంటారు అర్హత లేదు కాబట్టి నీకు ఇవ్వలేదని కొట్టి పడేస్తున్నాం అర్థమైందా అమ్మా మనం కూడా ఒక కోరిక కోరుకున్నప్పుడు శాంక్షన్ కాకపోతే ఏమనుకోవాలా మనకి అర్హత లేదు కాబట్టి శాంక్షన్ అవ్వలేదు అనుకోవాలి తప్ప నేను ఇంత గొప్పోడిని అని నువ్వు అనుకోకూడదు వాళ్ళు అంటే వాళ్ళ ఊర్లో ఏడో తరగతి దాకా చదివిన వాళ్ళు లేరు అన్నమాట అందుకే ఆయన నేను ఏడు వరకు చదివా కదా నాకు ఆర్డిఓ ఉద్యోగం రావాలనుకున్నాడు వాళ్ళందరూ కూడా ఫిఫ్త్ వరకే పని చేశారు ఓకే అర్థమైందా అమ్మా అంటే మనం ఒక కోరిక కోరుకున్నప్పుడు అది ధర్మబద్ధమై ఉండాలి అది కోర తగినటువంటి కోరిక కోరుకోవాలి ఆ కోర తగ్గని కోరిక కోరుకుంటే అది మనకు దుఃఖాన్ని కలుగుతుంది దాన్ని ఏమంటారో తెలుసా అలాంటి కోరికలను గొంతెమ్మ కోరికలు అంటారు విన్నారా అమ్మ ఎప్పుడైనా పేర్లు విన్నారా మన పెద్దోళ్ళు గొంతెమ్మ కోరికలు అంటారు అన్నమాట అంటే అంటే అవి కోరదగినటువంటివి కావు మహాత్ములను అడిగితే వాళ్ళు చెప్తారు ఓకే ఎలాంటి కోరికలు కోరుకోవచ్చు అని చెప్తున్నారు ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవచ్చు అవి కూడా మనకు అర్థమైతది అన్నమాట అది ధర్మబద్ధమైందా కాదా అని మనకు అర్థం కాకపోతే మహాత్ములను అడిగితే వాళ్ళు మనకు సలహా ఇస్తారు సూచన ఇస్తారు ఓకే ఇక్కడ సాధకుడికి ఎందుకు దుఃఖం వస్తుంది అంటే విషయాలను నిరంతరం నిరంతరం విషయ ధ్యానం చేయటం వలన దుఃఖం వస్తుంది అన్నాడు ధ్యానం చేయటం కొత్త ఏం కాదు మనిషికి ధ్యానం చేయటం కొత్త ఏం కాదు కాకపోతే ఇక్కడ ఏం ధ్యానం చేస్తున్నాడు అంటే విషయాలను ధ్యానం చేస్తున్నాడు విషయాలను ధ్యానం చేసేటువంటి మనిషి విషయాల ప్లేస్ లో భగవంతున్ని పెట్టుకుంటే విషయాలను తీసేసి భగవంతున్ని పెట్టుకున్నాడు అనుకో ఇంకెంత అద్భుతంగా ఉంటది అర్థమైందా అమ్మా తనకు బాగా లడ్డూలు ఇష్టం అనుకో లడ్డు ప్లేస్ లో ఏం పెట్టుకోవాలా భగవంతున్ని పెట్టుకోవాలి తనకి బాగా బంగారం అంటే ఇష్టం అనుకో బంగారం ప్లేస్ లో భగవంతున్ని పెట్టుకోవాలి బిర్యానీ బాగా ఇష్టం అనుకోవాలి బిర్యానీ ప్లేస్ లో భగవంతుడిని పెట్టుకోవాలి అంటే తనకు బాగా ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి విషయం యొక్క ప్లేస్ లో దాన్ని మార్చి మనం భగవంతున్ని ప్రతిష్ఠితం చేసుకుంటే అతనికి దుఃఖం కలగదు ఎందుకు కలగదు ఇప్పుడు విషయాల వల్ల దుఃఖం కలుగుతుంది అన్నారు కదా మరి భగవంతున్ని స్మరిస్తే మాత్రం భగవంతుని యొక్క ధ్యాస కలిగి ఉంటే భగవంతుని ధ్యానం చేస్తే దుఃఖం కలగదా అంటే కచ్చితంగా చెప్పదు అన్నమాట భగవంతుని ధ్యానం చేస్తే నీకు ఆనందం కలుగుతుంది తప్ప దుఃఖం కలగదు ఆనందం కలుగుతుంది తప్ప దుఃఖం కలగదు అర్థమైందా అమ్మా ఒకాయనకు కోపం వచ్చి అమ్మ ఇదేమంటే రసగుల్లు అంటారు కదా చూసారా రసగుల్లు తెలుసు కదా అమ్మ ఆ వాడి కోపం వచ్చింది రసగుల్లో తినిపించింది అన్నమాట కోపం వచ్చి రసగుల్లో తినిపిస్తే మాత్రం తీయకుండకుండా ఉంటదా చేదుగా ఉంటదా అమ్మ నువ్వు కోపంతో చేసినా గాని అది అనుభూతినే కలిగిస్తది దుఃఖాన్ని కలిగించదు ఎదుటి వాడు ఎలా ఉన్నా గాని దాని వల్ల ఆనందమే కలుగుతుంది నువ్వు ఎలాంటి పరిస్థితిలో దాన్ని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు దైవ నామస్మరణ అనేటువంటిది అర్థమైందా అమ్మా మంత్ర అనుష్టానం గాని లేకపోతే పారాయణం చేయటం గాని ప్రదక్షిణ చేయటం గాని సేవ చేయటం గాని ఎలాంటి పరిస్థితుల్లో చేసినప్పటికీ కూడా దాని వల్ల నీకు ఆనందమే కలుగుద్ది తప్ప దుఃఖం అనేటువంటిది కలిగేందుకు అవకాశమే లేదు అర్థమైందా అమ్మా అందుకే ఇక్కడ మరి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరికీ కూడా ఒక మంచి సూచన చేస్తున్నారు నాయనా ఈ ప్రపంచంలో వాళ్ళు విషయాలను చింతన చేయటం చేత దాని యందు సాంగత్యం ఏర్పడి అది కోరికగా మారి అది మన యొక్క దుఃఖానికి దారి తీస్తుంది క్రోధం ఏర్పడుతుంది బుద్ధి వినాశం కలుగుతుంది అని చెప్పారు ఏ మనిషి అయితే విషయాల యొక్క ప్లేస్ లో భగవంతుని గనుక ప్రతిష్టితం చేసి చేసుకొని నిరంతరం మంత్ర అనుష్టానం గాని లేకపోతే ఆ స్వామి యొక్క భజన గాని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆనందాన్ని పొందుతారు అని సూచించడం అనేటువంటిది చూడండమ్మా ఈ ప్రపంచంలో నేను భగవంతున్ని ఆరాధించడం చేత నాకు దుఃఖం కలిగింది అన్న మనిషి కనిపిస్తారా అర్థమైందా దైవాన్ని ఆరాధించినటువంటి వాళ్ళకి దుఃఖం కలిగింది అన్న సందర్భం ఎక్కడా లేదు ఒకవేళ చెప్పాడు అంటే వాడికి సరిగ్గా నాలెడ్జ్ రైట్ నాలెడ్జ్ లేదని అర్థం అర్థమైందా అమ్మ మీరు ఆనందం కలగాలి తప్ప దుఃఖం అనేటువంటిది కలగదు ఒకవేళ ఒకడు నాకు దుఃఖం కలిగింది అంటే వాడు చెక్ చేసుకోవాలి ఏమైనా ఫాల్ట్ వాడి దగ్గర ఉందేమో అని సపోజ్ ఒకచోట 32 మంది ఉన్నారమ్మ 32 మంది ఉంటే అందరికీ తలా ఒక మంచి లడ్డు ఇచ్చారు బందర్ లడ్డు తెప్పించారు మంచి స్పెషల్ గా తెప్పించి అందరికి ఒక లడ్డు ఇచ్చారు అందరూ తిన్నారు ఎట్లా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది ఒకడు మాత్రం చేదుగా ఉందన్నమాట ఏం లడ్డులు రా బందర్ బస్తలు బాలే చేదు ఉన్నాయి ఇప్పుడు లడ్డు చేదుగా ఉందండి వెంటనే ఆలోచించరు 31 మందికి మధురంగా ఉన్నటువంటిది ఒక్కడికే ఎందుకు చేదుగా ఉంది అని చెప్పి వెంటనే డాక్టర్ ని పిలిపి టెస్ట్ చేస్తే వాడికి జ్వరం తగిలింది అని చెప్పారు ప్రాబ్లం లడ్డులో లేదు వాళ్లే ఉంది అర్థమైందా ఇప్పుడు మార్చుకోవాల్సింది మార్చాల్సింది లడ్డుని కాదు వాడి హెల్త్ ని మార్చుకోవాలి వాళ్ళ హెల్త్ ని సెట్ చేసుకోవాలి అర్థమైందా మనకు దుఃఖం కలిగింది అంటే కారణం దైవం వల్ల కాదు అది మన దోషం మన ప్రాబ్లం తప్ప దైవానికి సంబంధించిన దోషం కాదు అది దైవం దైవం ద్వారా ఎప్పుడైనా గాని ఆనందమే కలుగుతుంది తప్ప దుఃఖం అనేటువంటిది కలగదు కాబట్టి మనందరం ఏం చేయాలి నిరంతరం దైవ నామస్మరణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి మన పూర్వీకులు అందరూ కూడా నిరంతరం దైవ ధ్యానంలో నిమగ్నమై ఉండి వాళ్ళు తరించారు అర్థమైందా అమ్మా ప్రతి సందర్భంలో దైవమే గుర్తు రావాలి మనకి ప్రతి సందర్భంలో దైవమే గుర్తు రావాలి మీరు నడుస్తూ ఉన్నారు అనుకో అమ్మా మీరు నడుస్తూ ఉంటే షాపింగ్ వెళ్తున్నారు అనుకో మీరు షాపింగ్ వెళ్తున్నా గాని మనసులో ఏమైనా ఉన్నారా భగవంతుడు ఉన్నప్పుడు ఏమనుకుంటారు నేను భగవంతుని కోసం ప్రదక్షిణ చేస్తున్నాను అనే భావనతో వెళ్ళాలి స్నానం చేస్తున్నారు భగవంతుడు లోపల ఉన్నాడు లోపల ఉన్న భగవంతుడికి అభిషేకం చేస్తున్నాను అనే ఆలోచన ఉండాలి ఏదైనా తింటున్నారు లోపల ఉన్నటువంటి భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాను అనేటువంటి భావన ఉండాలి ప్రతి సందర్భంలో పడుకునేటప్పుడు భగవంతున్ని పవళింపు సేవ భగవంతుడికి చేస్తున్నాను లేచినప్పుడు భగవంతునికి సుప్రభాతం చదువుతున్నాను అని చెప్పి మేలుకొలుపులు చదవాలి ప్రతి సందర్భంలో కూర్చున్న నిలుచున్న పడుకున్న ఏది చేస్తున్న ఏది తింటున్న ఏది వింటున్న దైవమే స్పురించాలి దైవం తప్ప మరొక ధ్యాస లేకుండా ఉండాలి ప్రతి ఒక్కడిని దైవ భావంతో ముడి పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవితం ఆనందమయంగా ఉంటుంది అర్థమైందా అమ్మా దైవాన్ని పక్కన పెట్టి దైవాన్ని పక్కన పెట్టి విషయాలను ఎవరైతే పట్టుకుంటారో ఆ విషయాలను పట్టుకున్నటువంటి వాళ్లకు దుఃఖము ప్రాప్తిస్తుంది కాబట్టి మనందరం కూడా విషయాలను విడిచిపెట్టి అవసరమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు కలిగి ఉండి దైవానుగ్రహంతో దైవ స్మరణ చేసుకుంటూ మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం అప్పుడు మనకు ఖచ్చితంగా ఆనందం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు ఓకే జై తల సద్గురు ప్రభు మహారాజ్ కు జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై గీతా మాతాకు జై పోచమ్మ అమ్మవారికి జై జై తల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మ బోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు
No comments:
Post a Comment