Wednesday, October 16, 2024

 Vedantha panchadasi:
యథా ధౌతో ఘట్టితశ్చ లాంఛితో రంజితః పటః౹
చిదంతర్యామీ సూత్రాత్మా విరాట్ చాత్మా తథేర్యతే ౹౹2౹౹

2.  చిత్రీకరించడంలో వస్త్రము,బిగువునిచ్చుట,
రేఖాచిత్రము,వర్ణచిత్రము అనే నాలుగు అవస్థలున్నవి. జగద్రచనలో కూడా అట్లె శుద్ధ బ్రహ్మము(చిత్) అంతర్యామి సూత్రాత్మ విరాట్టు అను నాలుగు అవస్థలు గలవు.

స్వతః శుభ్రోఽ త్ర ధౌతః 
స్యాద్ ఘట్టితోఽ న్నవిలేపనాత్ ౹
మష్యాకారైర్లాంఛితః స్యాద్రఙ్జతో వర్ణపూరణాత్ ౹౹3౹౹

3. వర్ణచిత్రమునకు ఆధారమైన వస్త్రము ఇతర ద్రవ్యములతో సంయోగము లేనపుడు శుభ్రముగ ఉండును.దానినే ధౌత వస్త్రమంటాము.గంజిపెట్టుట వలన అది బిగువు పొందును.అది సిరా మొదలగు వానిచే రేఖలతో లాంఛిత మగును.ఈ రేఖాచిత్రమున తగినట్లు వర్ణములు నింపుటవలన వర్ణ చిత్రము సిద్ధమగుచున్నది.

స్వతశ్చిదంతర్యామీ తు మాయావీ సూక్ష్మసృష్టితః ౹
సూత్రాత్మా స్థూలసృష్టైవ విరాడిత్యుచ్యతే పరః ౹౹4౹౹

4.మాయాకార్యమగు అపంచీకృత భూతకార్యమగు సమిష్టి సూక్ష్మశరీరమును ఉపాధిగ జేసికొని హిరణ్యగర్భుడు సూత్రాత్మ అనబడుచున్నది.అట్లే పంచీకృత భూతకార్యమగు సమిష్టి స్థూలశరీరము ఉపాధియైనపుడు విరాట్ అనబడుచున్నది.

పరము అనగా పరమాత్మ బ్రహ్మము, స్వరూపమున శుద్ధచైతన్యము.
మాయ-విరహితమైనది.
మాయా-సమన్వితమైన బ్రహ్మము
ఈశ్వరుడు అంతర్యామి అనబడుచున్నది.

ఈశ్వరుడు అందరియందు అంతర్యామియై యున్నాడు.ఆ పరమాత్మ బాహ్యమందును వ్యాపించియున్నాడు.కనుకనే అతని స్థులశరీరము సమస్త సమిష్టి ప్రపంచము,అంతరమందును ఉన్నాడు.

కనుక సూక్ష్మశరీరము సమిష్టి సూక్ష్మశరీరమగుచున్నది.
అంతరాంతరమున ఉన్నాడు.
అందుచే కారణశరీరము మాయ
(మూలా ప్రకృతి ఆయెను)
ఆ పరమాత్మ యొకడే ఆయా ఉపాధులనుబట్టి అనేకముగానున్నాడు.

కావున జీవోపాధి ఈశ్వరోపాధిదొలగి చైతన్యమే మిగులుచున్నది.ఇటుల జీవుడే పరబ్రహ్మము.ఈ విషయమును వేదాంతశాస్త్రములు చెప్పుచున్నవి.

రంగులు,రేఖాచిత్రాలు లేనప్పుడు ధౌత వస్త్రము శుభ్రముగానే యుండును.కాని వస్త్రానికి గంజి పెట్టుటవలనను‌,రంగులు చిత్రాలవలనను,శుభ్రమైన వస్త్రానికి బదులు దానిపై వున్న రంగులు చిత్రాలు మాత్రమే సత్యం అనుకో కూడదు కదా!

బురదతో గూడిన జలము చిల్లగింజ సంబంధముతో బురదపోయి శుద్ధమగుచున్నదో, ఆలాగునే జీవాత్మయు బ్రహ్మాత్మైక విజ్ఞాన విచారణచే పరిచ్ఛిన్నత్వాది రూపాజ్ఞానదోషమును తొలగగా నిరావరణ బ్రహ్మమై ప్రకాశించుచున్నది.

బ్రహ్మముతప్ప మరేమియు లేదు. కోశములుగానీ,ఇంద్రియములుగాని ఏవియు భాసించవు.అన్నియు పరబ్రహ్మములై యున్నందున బహ్యవస్తువులును ఆంతరిక వస్తువులును పరమాత్మ స్వరూపములే.

ఆత్మ పరమాత్మమైయున్నందున నిరతిశయ నిరవధికానందమును తనలోనే తాను అనుభవించుచున్నాడు.
మనోబుద్ధ్యాది సాధన లేమియు అపేక్షింప పనిలేదు.బ్రహ్మముకన్నా వేరు లేదుగదా!

ఇది సర్వవేదాంత సిద్ధాన్తము.        

No comments:

Post a Comment