Wednesday, October 2, 2024

 Vedantha panchadasi:
శక్యం జేతుం మనోరాజ్యం నిర్వికల్ప సమాధితః ౹
సుసంపాదః క్రమాత్సోఽ పి సవికల్ప సమాధినా ౹౹61౹౹

61. మనోరాజ్యము నిర్వికల్ప సమాధిచే జయింప వచ్చును. నిర్వికల్ప సమాధి కూడా మొదట ఈశ్వరధ్యాన లక్షణమగు సవికల్ప సమాధి అభ్యాసమముచే క్రమముగ సాధింపవచ్చును.

మనస్సుయొక్క స్పందన సృష్టిచైతన్యమునందలి స్పందనమే.ప్రపంచము మనస్సులో నుండును.అపరిణతమగు దృష్టి వలనను,అపరిణతమగు అవగాహనవలనను అది ఉన్నట్లు అగుపించును.అది నిజముగా
 దీర్ఘ స్వప్నము కంటె అధికముగాదు.

దీనిని అవగతము గావించుకొన్నచో అపుడు ద్వైతమంతయు అంతమొంది బ్రహ్మము,జీవుడు, మనస్సు,మాయ,కర్త,కర్మ,ప్రపంచము అన్నియు ఏకము, అద్వితీయమునగు అనంత చైతన్యమునకు పర్యాయపదములుగా కనిపించును.

మనస్సును నిర్వికల్ప సమాధిచే జయింపవచ్చును.నిర్వికల్ప సమాధి కూడా మొదట ఈశ్వరధ్యాన లక్షణమగు సవికల్ప సమాధి అభ్యాసముచే క్రమముగ సాధింపవచ్చును.

మంత్రమును జపించక కేవలం దేవతా రూపమునందు పదేపదే మనస్సును లయింపచేయుట
"దృశ్యాను విద్ధ సవికల్ప సమాధి" యని,
పదేపదే మంత్రమును జపించుచు మంత్రాది దేవత రూపమునందు లయించుట
"శబ్దాను విద్ధ సవికల్ప సమాధి"  యని

మనస్సు దృశ్యము. దృశ్యాతీతమైనది పరబ్రహ్మము.
నీవు,నీ నుండి వచ్చినదే మనస్సు.
మనో సంకల్పమే దృశ్యప్రపంచము.
కనబడు దృశ్యం సగుణం.
పరబ్రహ్మమే నిర్గుణమైన,
 తాను పరబ్రహ్మమే అను స్థితియే సహజ సమాధి.

బ్రహ్మమే బ్రహ్మమును గాంచుచున్నది.బ్రహ్మము కానిది బ్రహ్మమును కాంచ జాలదు. జగత్తును కల్పించి జగన్నామమున వ్యవహరించుటయే బ్రహ్మము యొక్క స్వభావము.

కనబడే జగత్తు సకల ప్రాణులు కనబడని పరబ్రహ్మములో నుండే వచ్చినవే.కనుక అన్ని రూపములు పరబ్రహ్మమే యని భావించి స్థితి కలిగి యుండుటయే సహజ సమాధి స్థితి.

తురియాతీతమును కూడా సహజ సమాధి అనబడును.       

No comments:

Post a Comment