Friday, November 1, 2024

******మారాల్సింది_ఎవరు?* (నేటి శుక్రవారం స్పెషల్ స్టోరీ)

 *మారాల్సింది_ఎవరు?*
  (నేటి శుక్రవారం స్పెషల్ స్టోరీ)              

*ఆకలి కావడానికి ట్యాబ్లేట్ వేసుకోవాలి. అది అరగడానికి ఇంకో ట్యాబ్లేట్ వేసుకోవాలి.*

*అరిగింది బయటకు పంపడానికి కూడా ఇంకో ట్యాబ్లేట్ కావాలి.*

*ఇదీ మన జీవితం..!*

*శరీరానికి శ్రమ ఉండద్దు. కానీ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి.*

*ఎలా సాధ్యం ...??*

*ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే గుర్తుకు వచ్చింది-  పొద్దున హడావుడిలో బి.పి ట్యాబ్లేట్ వేసుకోలేదని! సిగ్నల్ పడితే ప్యారడైజ్ సర్కిల్ లో ఆగాను.*

*రోడ్డు పక్కన ఉన్న 80 ఏండ్ల పెద్దాయన ఎర్రగొడ్డు కారంతో కంచం నిండా అన్నం తిని, చుట్ట పీలుస్తూ తన్మయత్వం తో ప్రపంచాన్ని జయించినట్లు నా దిక్కు చూస్తే నా మీదా నాకే జాలి అనిపించింది.*

*బ్రేక్ ఫాస్ట్ కు ముందు, బ్రేక్ ఫాస్ట్ తరువాత, లంచ్ కు ముందు లంచ్ తరువాత, డిన్నర్ కు ముందు డిన్నర్ తరువాత అంటూ మెడికల్ షాప్ నే మింగించే డాక్టర్లు ఆ పెద్దాయన్ను చూస్తే ఏం సమాధానం చెప్తారు...?*

*చుట్టూ పొగ , కాలుష్యం, దానికి తోడు ఇరవై నాలుగు గంటలు వాహనాల రోద. అయినా వాడి ముఖంలో ఎంత ప్రశాంతత..?*
*ఎలాంటి చింతా చూద్దామన్నా వాని ముఖంలో కనిపించదే ....!*

*మరి ఎందుకు మిగితా జనాలు నిత్యం చస్తూ బ్రతుకుతున్నారు... ??*

*నాకు తెలిసి ఇప్పటి మనుషులు చావడానికి అణుబాంబులో, మారణ ఆయుధాలోఅక్కరలేదు అనుకుంటా...*
గట్టిగా కూర్చో బెట్టి కడుపునిండా అన్ని రుచులు తినిపిస్తే చాలు చచ్చి పోయేలా ఉన్నారు.*

*అందరికి ఆరోగ్యం గురించి చింతనే..*

*కాని ఆచారణలో మాత్రం అది అమలు కాదు!*
*ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం అలా ట్యూన్ చేసేసింది.*

*ఇక అంతే..!*

*జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని తెలుసు. కానీ అదే ఫుడ్ ఎగబడి మరీ తింటారు.*

*నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది అని తెలుసు..*

*కానీ నడవడానికి అస్సలు ఇష్ట పడరు.*

*ఆరోగ్యం అందరికి కావాలి. కానీ దానికి సులువైన పద్దతులే కావాలి.*

*మెడికల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినట్లే కనిపిస్తుంది.*
*కానీ దాని నిజమైన ఫలితాలు మాత్రం బయట ఎక్కడా కనిపించవు.*

*ఈ మధ్య చాలా మంది క్యాన్సర్ భారిన పడి సరియైన ట్రీట్మెంట్ లేక చనిపోతున్నారు.*
*నిజానికి క్యాన్సర్ కు ట్రీట్మెంట్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు.*
*కీమోథెరపి ఒక్కటే క్యాన్సర్ ను బాగు చేస్తుంది అని ప్రతీ పేషేంట్ కు అదే కీమోథెరపి చేస్తున్నారు.*

*కీమోథెరపి శుద్ధ దండగా అని డాక్టర్ల కు కూడా తెలుసు, కానీ దాన్ని డాక్టర్లు ఒప్పుకోరు.*

*ఎందుకంటే కీమోథెరపి ని బేస్ చేసుకొని ఒక్క అమెరికానే 2.5 ట్రిలియన్ డాలర్లు సంపాదించు కొంటుంది.*

*కీమోథెరపి వల్ల ఉపయోగం లేదు అని జనాలకు తెలిసిన వెంటనే కీమోథెరపి ద్వారా సంపాదించే అంత పెద్ద మొత్తాన్ని అమెరికా కోల్పోవలసి వస్తుంది. అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమే కాబట్టి అందుకు అమెరికా ఒప్పుకోక పోవచ్చు.*

*క్యాన్సర్ అనే జబ్బు కేవలం ధూమపానం, అల్కాహాల్ వలన వస్తుంది అని అన్ని ప్రభుత్వాలకు తెలుసు,*

*కానీ వాటిని బ్యాన్ చేసే శక్తి ఏ ప్రభుత్వానికైనా ఉందా ...??*

*అలా బ్యాన్ చేస్తే అస్సలు క్యాన్సర్ ను ఆమడదూరం లో పెట్టచ్చు. కానీ దాని వల్ల ప్రభుత్వాలకు ఎన్నో కోట్ల నష్టం. మరి తమ ఆదాయం పోగొట్టుకొనే పని ఏ ప్రభుత్వమైనా ఎందుకు చేస్తుంది..??*

*డయాబెటిక్ అనేదాన్ని భూతద్దంలో చూపించి ఇన్సులిన్ వ్యాపారం ద్వారా మల్టీ మిలియన్ల డాలర్లు సంపాదించు కొంటున్న సంస్థలు కోకొల్లలు.*

*చక్కర వ్యాది అనేది అస్సలు అంత పెద్ద జబ్బే కాదు అనే దమ్ము ఎవరికి ఉంది...??*

*మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచించు కోవాలి.*
*ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు.*

*మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, సరియైన రీతిలో వ్యాయామం చెయ్యడం, మంచి ఆహారం తీసుకోవడం ఒక్కటే ... ఇప్పుడు మన ముందు ఉన్న ఒకే ఒక్క కర్తవ్యం!*

*మన ఆరోగ్యం మన చేతుల్లోనే ....*.   
 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి
ప్రవచనాల నుండి..
         *శతక నీతి*
                
```
మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే... ఆయన పుట్టుకతో చెడ్డవాడు కాడు. కుంతీదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన వాడు. నిజానికి పాండవులు యుద్ధంలో గెలుస్తారని ముందే తెలిసున్నవాడు.

కుఱుసభలో రాయబారం ముగించుకుని శ్రీకృష్ణపరమాత్మ తిరిగి వెడుతూ కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు. 

అప్పుడు కర్ణుడు –“ధర్మరాజు నిజంగా ధర్మం ఎరిగినవాడు. దాన్ని పాటించేవాడు. ధర్మం అంతా పాండవులవైపే ఉంది. అందుకే సాక్షాత్‌ భగవంతుడవయిన నువ్వు ఆ పక్షాన ఉన్నావు. వారు గెలిచి తీరుతారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడవుతాడు. దుర్యోధనాదులందరూ కూడా యుద్ధభూమిలో మడిసిపోతారు. ఎవరూ మిగలరు. కానీ దుర్యోధనుడిని నమ్మి ఇంతకాలం ఉండి అతడిని విడిచిపెట్టి రాలేను.  నాకు కూడా మరణమే శరణ్యం. నేను కూడా అక్కడ మరణించాల్సిందే!”అన్నాడు.

అంటే – పాండవుల పక్షాన ధర్మం ఉందనీ, వారు గెలుస్తారని, వారి చేతిలో కౌరవులు మరణిస్తారని, తాను కూడా అక్కడే చనిపోతానని కర్ణుడికి ముందే తెలుసు.

ఇన్ని తెలిసిన యోధానుయోధుడయిన కర్ణుడు జీవితాంతం తప్పులు చేస్తూ, ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది?  దుర్యోధనుడు పరమ క్రూరుడు. దుర్మార్గుడు.

బద్దెనగారే  మరొక పద్యంలో...``` *“తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వశ్చికమునకున్‌ తలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము..”* అంటారు.```
ఖలుడు అంటే దుర్మార్గుడు.

అటువంటి వాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి?  అదే ధర్మరాజు పక్కన ఉంటే ...మంచి పనులు చేస్తూ ఉంటాడు.. అప్పడు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అటువంటి మంచి పనులు చేయడానికి లేదా కలిసి పాలు పంచుకొనే అవకాశం దొరుకుతుంది.  అలా చేస్తే ధర్మరాజు కూడా సంతోషిస్తూ ఉంటాడు.

దుర్యోధనుడితో కలిసి ఉన్నందుకు అతని మెప్పుకోసం కర్ణుడు చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు. చిట్టచివరకు ఏమయ్యాడు ...యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు.

అలాగే మనిషి ఎంత మంచివాడైనా, ఎంత చదువు చదువుకొన్నవాడయినా, ఎన్ని ఉత్తమ గుణాలు కలిగిఉన్నా... ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మాత్రం ఉన్న పేరుప్రతిష్ఠలు కూడా నశించిపోతాయి.

సన్మార్గంలో ఉన్న వ్యక్తి దుర్మార్గులతో చేరితే... నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అలాగే ఉంటుందని సుమతీ శతకకారుడు బద్దెనచెబుతూ...”```         
*కొంచెపు నరు సంగతిచే                      నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్‌ గించిత్తు నల్లి కుట్టిన                        మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ”.*   అంటున్నారు.```

శవం మీద ఉన్న పూలదండనే కాదు, కింద జారిపడినా దాన్ని ఎవరూ తీసుకుని వాడుకోరు సరికదా... అసలు వేలితో ముట్టుకోరు. కర్రతో పక్కకు నెట్టేస్తారు.

అదే దేవుడి మెడలో పడిన పూలదండ... మరుసటి రోజువరకు ఉన్నా, వాడిపోయినా.. కళ్ళకద్దుకుని తీసుకుని తలమీద పెట్టుకుంటారు, కొప్పుల్లో తురుముకుంటారు. పూలదండ తనంత తానుగా చేసిన మంచీ లేదు, చెడూ లేదు. శవంతో చేరితే గౌరవాన్ని పోగొట్టుకుంది, భగవంతుడి మెడను అలంకరిస్తే పవిత్ర ప్రసాదమయింది.

ఎవరితో కలిసున్నామన్న దాన్నిబట్టి గౌరవమయినా, ఛీత్కారమయినా ఉంటుంది.

ఇనుప ఊచ ఎంత గట్టిగా ఉంటుంది!!!  అగ్నితో చేరితే మెత్తబడి ఇంటికి కిటీకీ ఊచవుతుంది, నీటితో చేరితే తుప్పుపట్టి నేలరాలిపోతుంది.

అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలా చేస్తే మనం పాడయిపోవడమే కాదు, మనచుట్టూ ఉన్నవారిని కూడా భ్రష్టుపట్టించే ప్రమాదం ఉంటుందని తెలుసుకుని జీవితంలో  ప్రతి క్షణం  ఆచితూచి అడుగేస్తుండాలి.   
 *భగవంతుడు మనల్ని బుజ్జగిస్తూ, లాలిస్తూ   అహాన్ని వదలివేయమని బోధిస్తున్నాడు.*

*పసివానివలె నిష్కపటంగా, సూటిగా ఉండటం మంచి పద్ధతి.*

*మహానుభావులందరిలో       ఈ సరళత్వం, సూటిదనం కనిపిస్తుంది.                          ఇది భగవంతుని కృప వలన కలుగుతుంది.* 

*ఎల్లప్పుడూ సరియైన త్రోవలో ప్రయాణించడమే మంచిది. గణాంకాలు, విశ్లేషణలు మనస్సుని అయోమయంలో  పడవేస్తాయి.*

*మనలో పవిత్రభావనలు ఉన్నప్పుడు నిష్కపటంగా, పసిబిడ్డవలె, నిస్వార్థంగా వ్యవహరిస్తాం.*
అలాగే,
*ఒక సాధారణ వ్యక్తి తన అహాన్ని బాహాటంగా ప్రదర్శిస్తాడు.* 

*మహాత్ములైనవారు భగవంతుని ఆదేశాలను తాము నెరవేరుస్తున్నామనే భావనతో కర్తృత్వాన్ని వదలి వ్యవహరిస్తారు.*

జీవితంలో ఉన్నత విషయాలను నేర్చుకునేందుకు ఉత్సుకతను చూపాలి. ఆధ్యాత్మికతను స్వభావంగా మార్చుకునే కృషిని సల్పాలి.

ఈ విధంగా చేయడం ద్వారా మనలోని భయాలు, బాధలు, నిస్పృహలు కొంత వరకు తగ్గుముఖం పడతాయి.

ఒక సాధారణ వ్యక్తిలో ద్వంద్వాలైన మంచి చెడులు, సుఖదుఃఖాలు మనస్సులో సదా తిరుగాడుతూ ఉంటాయి.
అయితే దాని వలన ప్రయోజనం లేదు.

జీవనం ఒక లయలో సాగుతుందని గ్రహించగలిగినప్పుడే స్థిర్తత్వం ఏర్పడుతుంది.  అప్పుడే ‘అహం’ వలన బాధలు తొలగి సమతుల్యత ఏర్పడుతుంది.    
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

5. కేవలాఘో భవతి కేవలాదీ

తన కోసం (తాను)మాత్రమే ఆరగించేవాడు కేవలం పాపాత్ముడే అవుతున్నాడు (ఋగ్వేదం)

కేవలం తన పొట్ట నింపుకొనేవాడు, తన కోసం మాత్రమే ధనాన్ని దాచుకొనేవాడు,
పరధనాలను అనుభవించేవాడు పాపాలు స్వీకరిస్తున్నట్లేనని వేదవచనం.
స్వార్థం పనికిరాదని భారతీయ హృదయం.
-
ఈ సృష్టిలో మనం అనుభవించే సంపద అనేక ప్రాకృతిక శక్తుల నుండి,సమాజం నుండి పొందుతున్నాం. కాబట్టి దీనిని మనం మాత్రమే అనుభవించడం తగదు. పంచుకొని స్వీకరించాలి. ఇంత సమసమాజ భావన, సామ్యవాదం ఇంకెక్కడ లభిస్తుంది?

సృష్టిలో మానవులే కాక, ఇతర ప్రాకృతిక జగత్తు కూడా మన పోషణకి హేతువవుతోంది. కనుక వాటి ఋణం తీర్చుకోకుండా మనం మాత్రమే తినడం
స్వార్థం, కృతఘ్నత అనిపించుకుంటుంది.
సమస్త వస్తుసముదాయం ఈశ్వరునిదే. ఈశ్వరుని ద్వారా నియంత్రించ బడుతోంది.మనిషికి ఎంత అవసరమో, సత్కర్మ ద్వారా ఎంత సంపాదించాడో - అది మాత్రమే అతడు అనుభవించాలి. దానికి మించిన అధికమంతా ఇతరులదే.

తన సంపదని ఈశ్వరునికి సమర్పించి భుజించాలి. అదే యజ్ఞం. 1.దేవయజ్ఞం,
2. పితృయజ్ఞం, 3. ఋషియజ్ఞం, 4. మనుష్యయజ్ఞం, 5. భూతయజ్ఞం -అని యజ్ఞం అయిదు విధాలు. 

దేవతలకూ, పితృదేవతలకూ, ఋషులకూ, సాటి మనుష్యులకు,ఇతర స్థావర జంగమాది జీవకోటికీ తగిన విధంగా కృతజ్ఞత ప్రకటించాలి - అని మన ఆర్ష సంప్రదాయం.

'యజ్ఞ శిష్టాశినః' ఆ

యజ్ఞము చేయగా మిగిలిన దానిని తినాలి. దానిని ''అమృతం' అంటారు. అందుకే ఈశ్వరునకు నివేదించి అన్నాన్ని తినడం అనే
సంప్రదాయం మనకి ఉంది. అలా కాకుండా తినడం మహాపాపమే.

భగవదర్పణం చేసిన వస్తువు పునీతమవుతుంది. ఆ భగవద్భావనచే పవిత్రమైనbదానిని భుజించడం వల్ల చిత్తశుద్ధి, శరీరం శుద్ధి - తద్వారా ఉత్తమబుద్ధి... క్రమంగ శుభమయమైన జీవనం సంప్రాప్తిస్తుంది.

‘భుంజతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్'

'తనకోసం వండుకునేవాడు పాపాన్నే తింటున్నాడు' -అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముని వచనం.

ఈశ్వరునికి నివేదించడం, సాటి మనుష్యులకు అందజేయడం, ఇతర జంతుకోటిని తృప్తిపరచడం.... వీటి వల్ల 'ఆహారశుద్ధి', 'చిత్తశుద్ధి' లభిస్తాయి.

 'శ్రీమత్ భాగవతం'లో వ్యాసమహర్షి ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు.

యావత్ బ్రియేత్ జఠరం
తావత్ స్వత్వం హి దేహినామ్
అధికం యోభిమన్యేత
యస్తేనో దండమర్హతి ||

“తన అవసరానికి మించిన దానిని ఆశించే వాడు, సేకరించేవాడు 'దొంగ' అనిపించుకుంటాడు. అతడు శిక్షార్హుడు" - అని భావం. 'కడుపు నిండడానికి ఎంత
అవసరమో అది మాత్రమే నీది. అది కూడా ఈశ్వరనివేదితం చేసి ఆరగించాలి'.

సంపదంతా కొంతమంది దగ్గరే నిలవ ఉండడం అనేది వేదం అంగీకరించదు.పోషణకి, భవిష్యత్లో జాగ్రత్తకి అవసరమైన ధనమే ఉండాలి. మిగిలింది పూర్తిగా ప్రపంచానిదే. పంచి బ్రతకడం - అనే సిద్ధాంతమే ఆర్షమతం.

యజ్ఞమయమైన ఆర్ష సంప్రదాయాలు సర్వకాలాలకీ, సర్వ మానవాళికీ శాశ్వతమైన, శ్రేయస్కరమైన జీవన విధానాలు.
 .                *కలము*
.               ********

         కలము గీయు గీతలందె
          పదిలము ఏ చరితలైన.
          రామాయణ భారతాది
         గ్రంథములన్నవియె కదా !

       కలమను హలముననె కదా
         కవిత చరిత లనెడి పంట
         ఫలములై యిల విరిసెను
             మానసిక ప్రసన్నతకై.

     సురల మునుల జనుల కథలు
          ఇల నెలాంటి చరితలైన
         కలం లిఖించు చరితలందె .   
       పదిలమయ్యి తెలియును గద.             
.             
          కలము గీయు గీతలందె
          పదిలము ఏ చరితలైన.
          రామాయణ భారతాది
         గ్రంథములన్నవియె కదా !

       కలమను హలముననె కదా
         కవిత చరిత లనెడి పంట
         ఫలములై యిల విరిసెను
             మానసిక ప్రసన్నతకై.

     సురల మనుల జనుల కథలు
         ఇలనెలాంటి చరితలైన
      కలము లిఖించు రచనలందె
     పదిలమయ్యి తెలియును గద.

     కలము విలువ తెలుసునొక్క
        అక్షరాస్య చదువరులకె.
        వ్రాస్తుండెడి మనుషులకే.
         రచయితలుద్యోగులకే !

      ఎంత ఘనత యీ కలముది !
        మంతనలాడించు మనను !
        చదువరులను చేసి మనను
        తెలివినెంతొ పెంచును గద !

            ఆలోచన మనదియైన
            ఆక్షరములలో లిఖించి
          పదిలపరచి ఉంచును గద
          అక్షయముగ శాశ్వతముగ.

            ఎందరొ సత్కీర్తి పొంది
          అమరులైరి చదువరులూ.
       ఘనమగు విషయములనెన్నొ
           ఎఱుకజేసి పదిలపరచి.

          చదువరులై యిల వెలిగిన 
           వారెందరొ కలము వలనె.
              ఈ కలమే లేకున్నచొ
          చదువరులేమయెడి వారొ ?!

            కలము వలననే ఎందరొ
            చదువరులై రచయితలై
            వెలిగి కీర్తి పొందిరి గద !
           సద్భావన పథము నందు.

              కలమే లేకున్నచొ  కా -
             గితమునకూ విలువేదీ ?!
            కలమును చేపడితెనె గద
             ఏమైన మనము వ్రాసేదీ !

           ఇదిరా యీ కలము యొక్క
               సార్థకతా సౌజన్యత !
              ఎంత చెప్పినా తక్కువె
           కలము విలువ ప్రాధాన్యత !

               ******************
 రచన :---- రుద్ర మాణిక్యం. (కవి రత్న)
    రిటైర్డ్ టీచర్.  జగిత్యాల. (జిల్లా)
  **********************************

హరే కృష్ణ అంటే ఏంటి?

🚩🚩🚩🚩
*ఆరుద్ర పూజ స్టోర్స్*
రామాలయం దగ్గర తుర్కయంజల్, *మరియు* మన్నెగూడ చౌరస్తా 
*7780548487*
🚩🚩🚩🚩
*హరే కృష్ణ అంటే ఏంటి?*
                  
*మనం తరుచూ భగవంతుడియొక్క ఈ నామాన్ని వింటూ ఉంటాం. హరే కృష్ణ అంటే కేవలం ఎదో ఒక మతం వాళ్ళకో, ఒక సంస్థకో, కొంతమంది భక్తులకో సంబంధించినది కాదు. కలియుగంలో సమస్త మానవాళిని ఉద్దరించేసే భగవానుడియొక్క దివ్య మంత్రం.*

*ఇద్దరు భక్తులు కలిసినపుడు ఒకరినొకరు ‘హరే కృష్ణ’ అంటూ పిలుచుకుంటూ ఉండటం సాధారణంగా చూస్తూ ఉంటాం. అసలు హరే కృష్ణ అంటే ఏంటో ఒకసారి చూద్దాం…*

*’హరి’ అంటే తేలికైన అర్ధం ఏంటంటే ఎటువంటి పాపములనైనా, ఎటువంటి దోషములనైనా హరించగలిగినవాడు,* 

 *’కృష్ణ’ అంటే భగవంతుడు, సర్వ జగన్నియామకుడు. ‘క్రిష్’ అంటే అనిర్వచనీయమైన ఆనందం (మోక్షం), అటువంటి మోక్షాన్ని ప్రసాదింపగలవాడు కాబట్టి ఆయన్ని ‘కృష్ణ’ అంటారు.* 

*సృష్టిలో కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. కానీ ‘పంచమహా పాతకాలు’ అంటే బ్రాహ్మణ హత్య, బంగారం దొంగతనం చెయ్యటం, మందు తాగడంలాంటి మహా పాతకాలులాంటి వాటికి ప్రాయశ్చిత్త కర్మలు లేవు.* 

*యోగి అయినా, జ్ఞాని అయినా, ఎంతటి గొప్పవారైనా ఆ ప్రారబ్ధ కర్మలు మాత్రం అనుభవించవలసిందే.*

*సృష్టిమొత్తం మీద అలా పోగొట్టగల నామం ఏదైనా ఉంది అంటే అది కేవలం ‘కృష్ణ’ నామం మాత్రమే,  కృష్ణ కథలు మాత్రమే! అందుకే ప్రత్యేకంగా భాగవతాన్ని తీసుకొనివచ్చారు వ్యాసులవారు.* 

*కలియుగంలో కేవలం ‘భాగవతం’ చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన, కృష్ణ నామం స్మరించినంత మాత్రాన పంచ మహాపాతకాలే కాదు సమస్త పాపరాశి ధ్వంసమై కృష్ణలోకమైన మోక్షాన్ని చేరుకుంటారు.*

*చాలామంది భక్తులు రోజుకి కొన్ని వేలసార్లు కృష్ణ నామం పారాయణం చేస్తూ ఉంటారు. జననమరణ చక్రం అనే సంసార సముద్రంలో నావ వంటిది ‘హరే కృష్ణ’ నామం.* 

*"కోట్లజన్మల తర్వాత ఏ ఒక్కడో మాయాపూరితమైన జగత్తుని వదిలి నన్నే స్మరించుకుంటూ నాకు దాసుడవుతున్నాడు. అటువంటి వాడియొక్క యోగక్షేమాలు నేనే వహిస్తున్నాను” అని భగవద్గితలో(7.19) కృష్ణుడు మనకి అభయం ఇచ్చారు.*

*అలా ఆ పరాత్పరుడియొక్క ‘హరేకృష్ణ’ నామాన్ని ప్రతిరోజు స్మరించుకోవడం మన జన్మజన్మాంతరంగా కలిగిన అదృష్టం.* 

*అందునా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ‘సోషల్ మీడియా’ ద్వారా ఆధ్యాత్మిక గ్రూపులలో ప్రతిరోజూ కృష్ణ నామాన్ని స్మరించుకోవటం, కృష్ణుని  చిత్రపటాలని చూడటం కూడా ఆధ్యాత్మికతలో, భక్తిలో ఒక భాగమే. ప్రతిరోజు క్రింద ఉన్న కృష్ణ మంత్రాన్ని  స్మరించుకోవడం ఉత్తమం.*

*హరే కృష్ణ హరే కృష్ణ*
*కృష్ణ కృష్ణ హరే హరే*
*హరే రామ హరే రామ*
*రామ రామ హరే హరే* (108 సార్లు)

*కర్మఫలితంగా ఎటువంటి ఆపదలు మనల్ని, మనకుటుంబ సభ్యులను  భాదించకుండా ఉండాలని, కృష్ణపరమాత్మ మనల్ని అనుగ్రహించాలని ఆయన పాదపద్మములను నమస్కరిస్తూ.

*కథ కంచికి మనం ఇంటికి*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🚩🚩🚩🚩
*గంపా.రామారావుMA,B.ED*
*Diploma in వాస్తు జ్యోతిష్యం 
*స్మార్త పురోహితులు*
రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి 
*బ్రాహ్మణ సేవా సమితి*
 *ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినది* 
ఇలాచెప్పడానికి చాలా ధైర్యం మరియు విశ్వాసంకూడా కావాలి!*
 
  *వారి మాటలలో ఇలా*

  *ఇస్లామిక్ షరియా చట్టాన్ని కోరుకునే ముస్లింలు,* వారు బుధవారం నాటికి షరియా దేశాలకు వెళ్లిపోవచ్చు. ఎందుకంటే, భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేకదేశాలు ఆయాదేశ మతోన్మాదముస్లింలను తీవ్రవాదులుగా భావిస్తున్నాయి.*
  * రాష్ట్రంలోని ప్రతి మసీదుపై విచారణ జరుగుతుంది, ఆ విచారణలో ముస్లింలు
మాకుసహకరించాలి.  ..*
  కానీ మేము
ఏమిచేస్తున్నామో, అది భారతదేశప్రజల ప్రయోజనాల కోసమేచేస్తున్నామని నేను భారతప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఇస్తున్నాను.
  *మేము ఇక్కడ హిందీ మాట్లాడతాము ఐతేఉర్దూ మరియు అరబిక్ కాదు .. కాబట్టి మీరు ఈ దేశంలో జీవించాలనుకుంటే మీరు హిందీ మరియు సంస్కృతం నేర్చుకోవాలి.*

  * భారతదేశంలో మేము శ్రీరాముడు మరియు కృష్ణుడిని దేవుడు మరియు దేవతలుగా భావిస్తాము, మేము సర్వేజనా సుఖినోభవంతు అన్న అత్యున్నత భావనలతో కూడుకున్న.. సర్వమానవాళి శ్రేయస్సును మరియు సౌభ్రాతృత్వాన్ని కోరుకునే..** మానవజాతి సౌలభ్య, ఆర్థిక, రోగ్య,ఆనంద అవసరాలైన.., సంస్కృతి, సాంప్రదాయం,వైద్యము,వివేకం, విచక్షణ,విజ్ఞానము మరియు ఆధ్యాత్మికాలతో సమ్మిళితమై సంపూర్ణత్వాన్ని సంతరించుకున్న
మాసనాతన ధర్మాన్నిమాత్రమే నమ్ముతాము, మానవ మనుగడకు హానికలిగించే ఏ పిచ్చిమతాన్నినమ్మము, అలాగని మేము మతత్వంతో ఉన్నామని దీనిఅర్థంకాదు!  ఇక్కడ మనకు దేవుడు మరియు గ్రంథాల చరిత్ర ఉంది  ప్రతిచోటా ఆధారాలు ఉన్నాయి!* వాటిపై మాకు పూర్తివిశ్వాసం కూడాఉంది. ఇందులో రెండోమాట లేదు.

  * దీనికి మీకు అభ్యంతరం ఉంటే, ఇప్పుడే మీరు భారతదేశాన్ని విడిచిపెట్టి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు.*
  *భారతదేశం మన మాతృభూమి,*
  *మనభూమి, మరియు మాకు నాగరికత ఉంది. అని పూర్తి విశ్వాసంతో ఉన్న వారు మాత్రమే ఇక్కడ ఉండవచ్చు.

  మేము మీ మతాన్ని విశ్వసించము, కానీమేము మీ సెంటిమెంట్‌ను గౌరవిస్తాము!

  * కాబట్టి మీరు నమాజ్ చేయాలనుకుంటే శబ్ధ కాలుష్యం చేస్తూ ఆఫీసులో, పాఠశాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో నమాజ్‌ను అస్సలు చేయవద్దు! * * మీ ఇళ్లలో లేదా మసీదులో ప్రశాంతంగా నమాజ్‌ని అందించండి.  తద్వారా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.*

  * * మన జెండాతో, మన జాతీయ గీతంతో,
మా మతంతో లేదా మాజీవన విధానంతో మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే, ఇప్పుడే ఇండియాను వదిలి ప్రపంచంలో మీరుకోరుకున్న దేశానికి వెళ్ళండి.

  లేదా ఇక్కడి విశ్వాసాలను పూర్తిగా నమ్మి సంపూర్ణ సమాజ మరియు దేశరక్షణ సహాయకారిగా సహజీవనం గడపగలిగితే ఇక్కడే ఉంటూ రాముడిలా జీవించండి-*

  

   *భారత్ మాతా కి జై*
 *కార్తీక వనభోజనాల విశిష్ఠత*

*వనభోజనం*

*'వనము’ అంటే అనేక వృక్షముల సముదాయము. ముఖ్యంగా రావి, మఱ్ఱి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస, ఇత్యాది వృక్షాలతో.., తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ, మొక్కలతో., రకరకాల పూల మొక్కలతో కూడివుండాలి. దాహము వేస్తే దప్పిక తీర్చడానికి ఓ సెలయేరు ఉండాలి. ఇవి ఉన్నచోట జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, చిలుకలు మొదలైన సాదు ప్రాణులు తప్పకుండా ఉంటాయి. దానినే ‘వనము’ అంటారు గానీ..., అడవిని ‘వనము’ అనరు. ‘వనము’ అంటే, వసించడానికి అనువైన ప్రదేశము అన్నమాట. వేటకు, క్రూరత్వానికి తావులేనిది ‘వనము’.*

*అట్టి వనము దేవతా స్వరూపము. ఎందుకంటే... పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు.., దేవతలకూ, మహర్షులకూ ప్రతిరూపాలు. ప్రశాంతతకు, పవిత్రతకు ఆలవాలమైన తపోభూమి. నిర్భయంగా విహరించడానికి అనువైన ప్రదేశము. అట్టి వనాలను యేడాదికి ఒక్కసారైనా., ప్రత్యేకించి కార్తీకమాసంలో దర్శించండి అని మన పూర్వులు నియమం పెట్టారు. అందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆనందకరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏమిటంటే...*

*కార్తీకమాసం నాటికి... వానలు ముగిసి, వెన్నెల రాత్రులు ప్రారంభమౌతాయి. చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణంతో మనసుకు ఆనందాన్ని., ఆహ్లాదాన్ని కలిగించే మాసం... ఈ కార్తీకమాసం.*
*ఆధ్యాత్మికపరంగా., శివ,కేశవులకు ప్రీతికరమైనది ఈ కార్తీకమాసం. అందుచేత శివ, కేశవ భక్తులు ఒకచోట చేరి, ఐకమత్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించే మాసం... ఈ కార్తీకమాసం. పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు, చెట్లు పచ్చగాచిగిర్చి, పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపజేసే మాసం... ఈ కార్తీకమాసం.* 

*పుణ్యప్రదమైన ఈ కార్తీకమాసంలో ‘వనవిహారం చేసిరండి’ అంటే ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే... ఆకలేస్తే... అక్కడ  వండి, వార్చి పెట్టేవారెవరు? అందుకే ‘వనభోజనాలు’ ఏర్పాటు చేసారు మన పెద్దలు. ‘దేవుడి మీద భక్తా? ప్రసాదం మీద భక్తా?’ అంటే... పైకి అనక పోయినా...‘ప్రసాదం మీదే భక్తి’ అనే రకం మనవాళ్ళు. కనీసం భోజనంమీద భక్తితోనైనా వనవిహారానికి వచ్చేవారున్నారు. స్వార్ధంలో పరమార్ధం అంటే ఇదే.*

*ఇక వనభోజనం అంటే... కేవలం తిని, తిరగడమే కాదు. దానికో పద్ధతి, నియమం ఉంది. కాలకృత్యాలు, స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత... అందరు బంధు, మిత్రులు, పరిచయస్తులు, ఇరుగు, పొరుగు కలిసి, జాతి, మత, కుల వివక్షత లేకుండా.., వీలయితే ఒకే వాహనంలోగానీ., లేదా రెండు వాహనాలలోగానీ వారు ఎంచుకున్న వనానికి సూర్యోదయానికి పూర్వమే చేరుకోవాలి. ముందుగా ఓ వటవృక్షం క్రింద ఇష్టదేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో చక్కగా అలంకరించాలి. ఆనందం పంచుకోవాలంటే వంటవాళ్ళను తీసుకెళ్ళ కూడదు. మగవారు పాటలు పాడుతూ కూరలు తరుతూంటే... ఆడవారు చీరకొంగులు నడుముచుట్టి., అందరూ తలోరకం వంట వండుతూంటే... ఉన్న ఆనందమే వేరు. పిల్లలంతా కలిసి చేసే అల్లరిలోని మజాయే వేరు. చాటుమాటు కన్నెచూపుల, కుర్రచూపుల కలయికలోని ఖుషీయే వేరు. కొత్తజంటల గుసగుసల తమాషాల వాడే వేరు. అనుభవంతో తలపండిన పెద్దల ఛలోక్తుల చురకల వేడే వేరు. ఇన్నిరకాల ఆనందాల మధ్య., ఆచారాలకూ, నియమాలకూ అంత ప్రాధన్యత లేదు. అన్ని రకాల సాంప్రదాయాలకూ., సంస్కృతులకూ సమాన వేదిక ఇధి.*

*సామూహికంగా కలసి చేసిన శాకాహార వంట పూర్తి అయిన తర్వాత., ఆ వండిన పదార్థాలను పూజాస్ధలానికి చేర్చి..,అందరూ కలిసి దేవతారాధన చేసి., నివేదన సమర్పించి, ఆ ప్రసాదాన్ని అందరూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటూంటే., ‘అబ్బ...సామూహిక సహజీవనంలో ఇంత రుచి ఉందా!’ అని అనిపించక మానదు. అమ్మయ్య.. సమిష్టి భోజనాలయ్యాయి. మరి తిన్నది అరగాలి కదా! ఇక ఆటపాటలదే ప్రముఖస్థానం. అంతరించిపోతున్న ప్రాచీన సాంప్రదాయ ఆటలకు సమాన వేదిక ఈ ‘వనభోజనాలు’. ఈ ఆట పాటల్లోనే కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు కలుగుతాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కార్తీకంలో కలిసిన ఈ కొత్తసంబంధం..బంధుత్వంగా మారడానికి., మాఘ, ఫాల్గుణాల ముహూర్తాలు మనకోసం మనముందే ఉన్నాయి.*
🌺🌺🌺 🙏🕉️🙏 🌺🌺🌺
 *(ఎవరు రాశారో కానీ మహానుభావుడు)*

*మాతృ గర్భంలో* 
*నవమాసాలు*
*కటిక చీకటిలో* 
*అండము నుంచి* 
*పిండంగా పెరిగింది*
*ఎన్ని సార్లు* 
*మోసిన కడుపును* 
*తన్నిందో*
*తాను ఎంత* 
*యాతన అనుభవించిందో* 
*ఎంత బాధను*
*మోసిన వారికి కలిగించిందో* 

*వెలుగు చూసింది*
*బాల్యం*
*నాటి నుంచి*
*ఏవో ఆశలు*
*ఏవో కోరికలు*
*ఏవో ఆలోచనలు*
*కోరినవి తీరితే కేరింతలు*
*తీరినపుడు గుక్క తిరగని* *ఏడుపులు*
*ఎందరు గారం చేసారో*
*ఎందరు ముద్దు చేసారో* 
*ఎందరు ప్రేమను పంచారో*
*ఎందరి పొత్తిళ్ళలో పెరిగానో* 
*ఎందరి భుజాలపై ఎక్కాన*
*ఏవీ గుర్తు లేవు*

*అడుగులు తడబడి* 
*కింద బడిన సందర్భాలు ఎన్నో* 
*ఒక అడుగు అమ్మ*
*ఒక అడుగు నాన్న*
*చేయి పట్టి నడిపితే*
*ఈ లోకాన్నే జయించినంత అనందం*
*ఆటలలో అన్న*
*పాటలలో అక్క*
*చేదోడు వాదోడుగా తమ్ముడు* 
*అల్లరి పట్టించటానికి చెల్లి* 
*చిన్న చిన్న బహుమానాలు ఇచ్చే బంధువులు*
*గురుతు ఉండి లేనట్లుగా గడిచిపోయింది* 

*అలుపెరగని ఆటలతో కౌమారం మొదలైంది*
*పగలేదో రాత్రేదో తెలియదు*
*అంతులేని ఆటలు* 
*పొంతనలేని చేతలు* 
*చదువుకోసం నిదురలేని రాత్రులు* 
*స్నేహం కోసం త్యాగం చేసిన సాయంత్రాలు* 
*బతుకు బాటకోసం వెతుకులాట* 
*ఆశలు ఎన్నో* 
*ఆశయాలు ఎన్నో* 
*సాధించాలనే తపన ఎంతో*
*అంతులేని ఆలోచనలను*
*అదుపులేని ఆవేశాన్ని* 
*అర్ధంకాని భవిత* 
*అర్ధంతరంగా వచ్చిన బాధ్యతలు*
*కమ్మేశాయి*

*ఎన్నో కలలు*
*ఎన్నో రంగులు* 
*కలలకు*
*వాస్తవాన్ని పరిచయం చేసే జీవితం ఆరంభం*
*ఆవేశానికి* 
*అనుభవం నేర్పించిన పాఠాలు కొన్ని గుణపాఠాలు కొన్ని* 
*మోయలేని భారమైన*
*మోయాయవలసిన* *బాధ్యతలతో* 
*రక్తాన్ని చెమటని* 
*కన్నీటి తెరలుగా మర్చి*
*కనురెప్పల మాటున దాచి* 
*చిరునవ్వులుగా మలచి* 
*కొండంత భారాన్ని పిడికెడు గుండెలో* 
*దాచుకొని* 
*పడుతూ లేస్తూ సాగిన జీవన పయనం*
*ఏ చిత్రంలోనూ చూపలేని* 
*సన్నివేశాలతో*
*ఏ నాటకంలోని ఊహించలేని* 
*మలుపులతో* 
*సాగిన జీవన పోరాటంలో*
*శక్తి యుక్తులు ఉడిగి*
*వయో భారంతో* 
*మరొకరి సేవలు* *చేయించుకోవటం* 
*బాధాకరంగా పరిణమించి*
*నా అనుకున్న వారు* 
*పరాయివారుగా మారితే* 
*అక్కున చేర్చుకున్న అందరు*
*అందనంత దూరంలో ఉంచితే*
*కన్న వారి పలకరింపులు మాయమైతే*
*ఎన్నో జ్ఞాపకాలను*
*ఎన్నో అనుభవాలను*
*ఎన్నో ఆక్రోశాలను*
*ఎన్నో ఆవేదనలను భరించిన* 
*గుండె ఆగింది*
*ఈ లోకం వదిలి*
*బూడిదని మిగిల్చింది* 
*మళ్ళీ మనిషి జన్మ వద్దని*
*ఆ మహాదేవుని*
*పాదాలను కన్నీటితో*
*అభిషేకిద్దామని*
*తనువు విడిచి వెల్లింది*
*బంధాలకు* 
*అనుబంధాలకు*
*పిలుపులకు*
*తలపులు*
*అందనంత దూరంగా*