*(ఎవరు రాశారో కానీ మహానుభావుడు)*
*మాతృ గర్భంలో*
*నవమాసాలు*
*కటిక చీకటిలో*
*అండము నుంచి*
*పిండంగా పెరిగింది*
*ఎన్ని సార్లు*
*మోసిన కడుపును*
*తన్నిందో*
*తాను ఎంత*
*యాతన అనుభవించిందో*
*ఎంత బాధను*
*మోసిన వారికి కలిగించిందో*
*వెలుగు చూసింది*
*బాల్యం*
*నాటి నుంచి*
*ఏవో ఆశలు*
*ఏవో కోరికలు*
*ఏవో ఆలోచనలు*
*కోరినవి తీరితే కేరింతలు*
*తీరినపుడు గుక్క తిరగని* *ఏడుపులు*
*ఎందరు గారం చేసారో*
*ఎందరు ముద్దు చేసారో*
*ఎందరు ప్రేమను పంచారో*
*ఎందరి పొత్తిళ్ళలో పెరిగానో*
*ఎందరి భుజాలపై ఎక్కాన*
*ఏవీ గుర్తు లేవు*
*అడుగులు తడబడి*
*కింద బడిన సందర్భాలు ఎన్నో*
*ఒక అడుగు అమ్మ*
*ఒక అడుగు నాన్న*
*చేయి పట్టి నడిపితే*
*ఈ లోకాన్నే జయించినంత అనందం*
*ఆటలలో అన్న*
*పాటలలో అక్క*
*చేదోడు వాదోడుగా తమ్ముడు*
*అల్లరి పట్టించటానికి చెల్లి*
*చిన్న చిన్న బహుమానాలు ఇచ్చే బంధువులు*
*గురుతు ఉండి లేనట్లుగా గడిచిపోయింది*
*అలుపెరగని ఆటలతో కౌమారం మొదలైంది*
*పగలేదో రాత్రేదో తెలియదు*
*అంతులేని ఆటలు*
*పొంతనలేని చేతలు*
*చదువుకోసం నిదురలేని రాత్రులు*
*స్నేహం కోసం త్యాగం చేసిన సాయంత్రాలు*
*బతుకు బాటకోసం వెతుకులాట*
*ఆశలు ఎన్నో*
*ఆశయాలు ఎన్నో*
*సాధించాలనే తపన ఎంతో*
*అంతులేని ఆలోచనలను*
*అదుపులేని ఆవేశాన్ని*
*అర్ధంకాని భవిత*
*అర్ధంతరంగా వచ్చిన బాధ్యతలు*
*కమ్మేశాయి*
*ఎన్నో కలలు*
*ఎన్నో రంగులు*
*కలలకు*
*వాస్తవాన్ని పరిచయం చేసే జీవితం ఆరంభం*
*ఆవేశానికి*
*అనుభవం నేర్పించిన పాఠాలు కొన్ని గుణపాఠాలు కొన్ని*
*మోయలేని భారమైన*
*మోయాయవలసిన* *బాధ్యతలతో*
*రక్తాన్ని చెమటని*
*కన్నీటి తెరలుగా మర్చి*
*కనురెప్పల మాటున దాచి*
*చిరునవ్వులుగా మలచి*
*కొండంత భారాన్ని పిడికెడు గుండెలో*
*దాచుకొని*
*పడుతూ లేస్తూ సాగిన జీవన పయనం*
*ఏ చిత్రంలోనూ చూపలేని*
*సన్నివేశాలతో*
*ఏ నాటకంలోని ఊహించలేని*
*మలుపులతో*
*సాగిన జీవన పోరాటంలో*
*శక్తి యుక్తులు ఉడిగి*
*వయో భారంతో*
*మరొకరి సేవలు* *చేయించుకోవటం*
*బాధాకరంగా పరిణమించి*
*నా అనుకున్న వారు*
*పరాయివారుగా మారితే*
*అక్కున చేర్చుకున్న అందరు*
*అందనంత దూరంలో ఉంచితే*
*కన్న వారి పలకరింపులు మాయమైతే*
*ఎన్నో జ్ఞాపకాలను*
*ఎన్నో అనుభవాలను*
*ఎన్నో ఆక్రోశాలను*
*ఎన్నో ఆవేదనలను భరించిన*
*గుండె ఆగింది*
*ఈ లోకం వదిలి*
*బూడిదని మిగిల్చింది*
*మళ్ళీ మనిషి జన్మ వద్దని*
*ఆ మహాదేవుని*
*పాదాలను కన్నీటితో*
*అభిషేకిద్దామని*
*తనువు విడిచి వెల్లింది*
*బంధాలకు*
*అనుబంధాలకు*
*పిలుపులకు*
*తలపులు*
*అందనంత దూరంగా*
No comments:
Post a Comment