🌼🌿🌼🌿🌼🌿
*దేవుడు దేవుడు అంటారు, దైవానికి అంత ప్రత్యేకత ఎందుకివ్వాలి???...*
భగవంతుడు, ఆకారంలో వస్తాడు, కానీ నిరాకారుడు.
అటువంటి భగవంతుని అనేక రకములుగా ఆరాధిస్తున్నాము, కానీ, అందరికీ అనుకూలమైన స్థితిలో లేడు కదా!!!...
అట్టి దైవాన్ని మనం విశ్వసించి, ఆరాధించి, అనేకమైన విధాలుగా ఆనందాన్నందుకుంటున్నాము!!!....
దైవము నందున్న చైతన్య మే సర్వజీవుల యందు కూడా ఉంటుంది.
ఎంతో మంది గురువులు, యోగులు, ఋషులు వున్నారు, కదా !!!
వారికి కాకుండా దైవత్వానికే ఎందుకు ప్రత్యేకత ఇవ్వాలి?
అని ఈరోజుల్లో అందరికీ సందేహము కలగవచ్చు!!...
బల్బులన్నీ సమానంగానే గోచరించినప్పటికీ వాటిలోని ఫిలమెంటులలో వ్యత్యాసం ఉంటుంది...
ఒకటి 40 w , మరొకటి 60 W
అదే రీతిగా మరొకటి 100 W గా ఉండవచ్చు.
వీరందరిలో ఉన్న సంకల్పములు, వికల్పాలు యందు భేదముంటున్నది...
కానీ భగవంతుని యందు వున్న ఫిలమెంటు కొలకట్ట లేనిది, దాని శక్తి అపారమైనది, పవిత్ర మైనది , అనంత మైనది, అందుకే దైవ శక్తి ఉన్నతమైనది ... ఎందుకంటే వీరందరినీ సృష్టించినది ఆయనే కాబట్టి...
ఇట్టి దైవశక్తి మానవాకారంలో ఉన్న దైవము నందు అధికంగా ఉంటుంది...
అందువల్లనే దైవానికి ప్రత్యేకత ఇవ్వవలసి వుంది....
సామాన్య మానవులలో అహంకార, మమకారములు ఎక్కువగా ఉండుటచేత , ప్రకృతి శక్తులన్నీ తనవి గా భావిస్తుoటాడు...
అందుకే ఈ దివ్య తత్వానికి దూరంగా ఉంటారు...
అందుకే దివ్యత్వానికి ప్రత్యేకత ఇవ్వాలి...
అది కేవలం అనుభవించిన వారికి మాత్రమే అర్థం అవుతుంది...
🙏సమస్త లోకా సుఖినోభవంతు
No comments:
Post a Comment