Wednesday, November 27, 2024

 అక్షౌహిణి : ఓ పెద్ద సేనా వాహిని. 21870 రధాలు,
అన్నే ఏనుగులు, 65160 గుర్రాలు, 10950 సైనికులు
కలిస్తే ఓ అక్షౌహిణి అవుతుంది.
ఒక రధం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, 5 గురు
సైనికులు కలిస్తే ఒక పత్తి, అలాంటి 3 పత్తులు ఓ
సేనా ముఖం, 3 సేనా ముఖాలు ఓ గుల్మం. 3 గుల్మాలు
ఓ వాహిని. 3 వాహినిలు ఒక పృతన. ఇలాంటి
ఎన్నో పృతనాలు కలిస్తే ఓ అక్షౌహిణి.
                                                            - మహాభారతం.
-------------------🕉️🕉️🕉️ సత్కథామఞ్జరి
అగ్ని కథ:——————
శ్వేతకి అను రాజు ఎన్నో
యాగాలు నిర్వహించేవాడు. అంతంలేని ఈ యజ్ఞాల
వల్ల యజ్ఞమంటపం పొగతో కమ్ముకొని పోయెను.
తర్వాత యజ్ఞం చేయడానికి మునులను కోరగా
అందుకు వారు నిరాకరించి శూద్రులను ఆహ్వానించు
కొమ్మని చెప్పిరి. దీనికి రాజు నిరశించి కైలాసమునకు
పోయి శివుని గూర్చి ఘోరతపస్సు చేయగా శివుడు
దుర్వాసుని యజ్ఞము నిర్వహించుటకు పంపెను.
దుర్వాసుడు యజ్ఞగుండము ద్వారా అగ్నిని అంతులేని
ఆహారముతో నింపుటవలన అగ్నికి అజీర్తి కలిగెను.
ఈ అజీర్తిని భరించలేక అగ్ని బ్రహ్మను ఆశ్రయించగా
ఖాండవ దహనంవల్ల అజీర్తి పోవునని తెల్చెను. అతడు
ఖాండవ దహనం చేయబోగ అందు నివసించు వారు
అడ్డగించుటయే గాక అందులో నివ సించు ఇంద్రుని
మితృడగు తక్షకుని రక్షించుటకు ఇంద్రుడు వర్షము
కురిపించు చుండెను. అప్పుడు నరనారాయణులైన
శ్రీకృష్ణార్జునులను బ్రాహ్మణ వేషమున సహాయము
కోరి వరుణుడు ప్రసాదించిన గాండీవమును అర్జును
నికి, సుదర్శన చక్రమును కృష్ణునికి ప్రసాదించెను.
ఆ తర్వాత అగ్ని ఖాండవ దహనం ప్రారంభించగా
అది కొనసాగునట్లు అర్జునుడు తన అస్త్రశస్రములతో
ఖాండవవనం పై వర్షం కురవకుండా తెరను ఏర్ప
రచి వర్షమును అద్దుకొని అగ్నిదాహం తీర్చెను. అగ్ని
శాపవిముక్తుడయ్యెను.

భృగుని శావము : భృగుమహర్షి తన భార్య పులో
మాతో ఆశ్రమమున జీవించుచు ఒక దినమున నదీ
స్నామునకు బోవుచు అగ్నిని తన ఆశ్రమమును చూచు
చుండమని కోరెను. పులోముడను రాక్షసుడు అదే
రోజున ఆశ్రమమునకు వచ్చి భృగుని భార్యను ముందు
నేను మోహించితిననియు అందువల్ల ఆమె ఎవరికి
భార్య అగునని అగ్నిని ప్రశ్నించెను. అగ్ని అసత్యము
పలుకజాలక భృగుడు హిందూధర్మ ప్రకారము
వివాహమాడలేదని చెప్పగా ఆమెను రాక్షసుడు
ఎత్తుకొని పోయెను. దారిలో ఆమె ప్రసవించగా చ్యవ
నుడు జన్మించెను. అతడే చ్యవన మహర్షి ఆ బిడ్డ
కాంతిని జూచి రాక్షసుడు మునిపల్నిని, బిడ్డను వదలి

పారిపోగా తిరిగి బిడ్డ్జతో ఆశ్రమము జేరి ఈ వృత్తాం
తమును భృగున కెరిగించెను. భృగుడు దీనికి కారణము
అగ్ని అని తలచి అగ్నిని సర్వనాశనకారుడవు కమ్మని
శపించెను. ఇందుకలిగిన అగ్ని ఎవ్వరికి కన్చించక
దాగుకొనెను. ఇందువల్ల ముల్లోకాలు ఇబ్బందుల నెదుర్శొని
బ్రహ్మకు నివేదించగా బ్రహ్మ అగ్ని దేనిని అంటిన
అది స్వచృతనొందునని శాప విమోచన మొనర్చెను.
కుమారస్వామి జననం : శివపార్వతులు శృంగార
క్రీడ సలుపుచుండగా అగ్ని తదేకముగా చూచెను.
వారి శృంగార క్రీడను భగ్నమొనర్చినందుకు పార్వతి
అగ్నిని శివుని వీర్యమును భరించమని శపించెను.
అగ్ని గర్భవతియై ఆ భారమును మోయ జాలక
దానిని గంగకు అర్పించెను. శివుని వీర్యమువల్ల
గంగకు జన్మించిన వాడే కుమారస్వామి.    

No comments:

Post a Comment