Tuesday, November 26, 2024

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *శ్రీ రామః శరణం సమస్త జగతాం రామం వినా కా గతీ రామేణ ,ప్రతి హాన్యతే కలిమలం రామాయ కార్యం నమః !రామాత్ త్రస్యతి కాలభీమభుజగో రామస్య స్వరం వశే రామే భక్తిర ఖండితా భవతు మే రామ త్వమేవాశ్రయః*
❤️ *భావం:~ఈ సమస్త జగత్తుకి శ్రీ రాముడే శరణ్యుడు . ఇహ పర లాభములకి మనకు రాముడే గతి . శ్రీరాముని స్మరణవల్లనే కలిదోషములన్నియునశించును.సమస్త కార్యములును సిద్దించుటకై ఆయనకు నమస్కరింతును.భయంకరమైన కాలసర్పము శ్రీరామునికి భీతిల్లును. సమస్తజగత్తు శ్రీరాముడి ఆధీనములోనే ఉండును . శ్రీరామునియందే నా అచంచలమైన భక్తి కుదురుకుని వుండు గాక . ఓ రామా నీవే నాకు దిక్కు*
❤️ *రామాయణం మీద ప్రీతి   ఎవరికైనా కలిగింది అంటే వాడంతవరకూ చేసిన పాపాలన్నీ నాశనమైపోయీయని అర్ధం. రామాయణం మీద ఇష్టం కలగడమే పాపధ్వంశమై పోయింది అనేదానికి గుర్తు*
💞 *పురార్జితాని పాపాని నాశమాయాంతి యస్యవై*
*రామాయణే  మహాప్రీతిః తస్యవై భవతి ధ్రువమ్*
💕 *~పరమమైన,  పరమాద్భుతమైన కావ్యం రామాయణం.పుణ్యప్రదమైనది.ఓ మహర్షులారా ! దానిని శ్రవణం చేయుదురుగాక ! దేనిని వినటం వలన సంసారచక్రంలో చచ్చుచు పుట్టుచున్ తిరిగే బాధ ఉండదో , దేనిని వినటం ద్వారా పుట్టిన తరువాత ఉండే ఆధివ్యాధి జరాది వికారాలు ఉండవో సమస్త దోషరాహిత్యంతో మానవుడు మాధవుడైపోతాడో అటువంటి రామాయణం వినాలి . ఉపాసించాలి.*
💖 *రామాయణం నామ పరం తు కావ్యం సుపుణ్యదం వై శృణుత దివిజేంద్రా:! యస్మిన్ శ్రుతే జన్మ జరాది నాశో భవత్యదోష స నరో2చ్యుత స్యాత్*
❤️ *~మిక్కిలి శ్రేష్ఠమైన కావ్యము రామాయణం. అతి ముఖ్యమైనదీ, సర్వోత్తమమైనదీ ఐన కావ్యం రామాయణం. సకలాభీష్టఫలప్రదాయినియైన కావ్యం రామాయణం. సకల లోకాలకూ తారకమైనదీ, తరింపచేసేదీ ఆదికావ్యం. సంకల్పిత అర్ధప్రదం ... ఇష్ట కామ్యార్ధ సిద్ధిదమ్ ... కోరిన కోరికలన్నిటినీ తీర్చేది . ఓహో కేవలం ఇహలోకంలో కోరికలు తీర్చుకోవడానికేనా ? కానే కాదు. విన్నవారు రామసాయుజ్యం పొందుతారు. రాముని వద్దనే ఉంటారు. పునరావృత్తిరహితం ఐన లోకాలకి వెళ్తారు.*
💓 *వరం వరేణ్యం వరదం తు కావ్యం సంతారయత్యాశు చ సర్వలోకమ్ సంకల్పితార్ధ ప్రదమాదికావ్యం శ్రుత్వా చ రామస్య పదం ప్రయాతి..!* 
💖 *సంస్కృతం మనకు రాకపోవచ్చు. 24 వేలశ్లోకాలు చూడగానే భయం వెయ్యచ్చు. ఏమీ పరవాలేదు. ఇంట్లో ఒక రామాయణ ప్రతిని పెట్టుకుని రోజూ దానిమీద ఓ పుష్పాన్నుంచి ఓ నమస్కారం పెడితే చాలు.*
💞 *రామాయణం లేని ఇల్లు ఉండకూడదు. భాగవతం శ్రీకృష్ణ స్వరూపం అయినట్టే రామాయణం రామస్వరూపం..!*
❤️ *రామః అయ్యతే ప్రాప్యతే అత్ర ఇతి రామాయణం ~అని ఒక వ్యుత్పత్తి . రాముడు ఎక్కడ దొరుకుతాడో దానికి రామాయణమని పేరు.*
💓 *రామాయణం ఎవరింట్లో ఉంటుందో వారిని కలి మాయ ఏమీ చెయ్యలేదు. వారు మానవ జన్మని పొందినందుకు కృతకృత్యులౌతారు. వారి గృహం ఓ తీర్థం.. వారు పాపాత్ములైనా సరే... సర్వపాప వినాశనం జరుగుతుంది, ఇంట్లో... రామాయణం పెట్టుకుంటే.*
💖 *త ఏవ కృతకృత్యాశ్చ న కలి ర్బాధతే హి  తాన్ కథా రామాయణస్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం హి  దుష్టానాం పాపనాశనమ్*
*~ఓ తపోధనులారా..! నరులు కొందరు పాపాలు చెయ్యడంవల్ల పాపాత్ములుగా పిలువబడతారు. ఐతే వారి పాపాలు ఎంతకాలం ఉంటాయో తెలుసునా..? శ్రద్ధగా ఓ సారి రామాయణం మొత్తం వినేవరకే. ఆపై ఇక ఏ పాపాలూ దరికిరావు*
💓 *తావత్ పాపాని దేహేస్మిన్ నివసన్తి తపోధనాః*
*యావన్న శ్రూయతే సమ్యక్ శ్రీమద్రామాయణం నరై:*
*~సనత్కుమారులు నారదుని అడుగుతున్నారు “ఎంతో బాగా చెప్పారు మీరు ఈ ఇతిహాసాన్ని గురించి. ఈ రామాయణ మాహాత్మ్యాన్ని ఇంకొంచెం విస్తారంగా చెప్పండి” అని.*
💞 *అహో విప్ర ఇదం ప్రోక్తం ఇతిహాసం చ నారద*
*రామాయణస్య మాహాత్మ్యం త్వం పునర్వద విస్తరాత్*
 *~”తప్పకుండా చెపుతాను" అంటూ కొనసాగించారు నారదులవారు. “మీరందరూ నిజంగా అదృష్టవంతులు..!ఎందుకంటే భక్తిగా శ్రీరామ మాహాత్మ్యం,  ఆయన ప్రభావం వినడానికి సిద్ధపడ్డారు కదా..! అందుకు..!! శ్రీరాముని కథని వినలేకపోవడం ఓ దురదృష్టం.” అన్నారు. ( “శ్రీస్కాంద పురాణాంతర్గత శ్రీమద్రామాయణ మాహాత్మ్యం” నుండి తీసుకోబడి నాచేత సమర్పించబడినది)*

*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*.               

No comments:

Post a Comment