వర్చువల్ ప్రపంచం పిలుస్తోంది:- ఓ విద్యార్థి- హెడ్సెట్ లో, ఫిజిక్స్ కెమిస్ట్రీ పాఠాలను కళ్లకు కట్టినట్లు వినవచ్చు. ఓ పెద్దాయన- కూర్చున్న చోటు నుంచే, ప్రఖ్యాత మ్యూజియం లోని అపురూప దృశ్యాలు తిలకించవచ్చు. ఓ గృహిణి- తన కిచెన్ నుంచే, పాకశాస్త్ర నిపుణుల పాఠాలు వింటూ గరిట తిప్పవచ్చు... ఇదేదో మాయా కాదు తంత్రం కాదు వర్చువల్ ప్రపంచం సృష్టించిన ప్రతిసృష్టి. VR( వర్చువల్ రియాలిటీ), AR( ఆగ్మెంటెడ్ రియాలిటీ) మరియు AI( ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్) వంటి అత్యాధునిక పరిజ్ఞానాల ద్వారా సృష్టించబడిన ప్రతిసృష్టే వర్చువల్ ప్రపంచం... వర్చువల్ అనగా ఒక ప్రదేశానికి వెళ్లడం, వ్యక్తులను వ్యక్తిగతంగా కలవడం,బదులుగా ఇంటర్నెట్ ఉపయోగించి సదరు ప్రదేశాలను చూడగలగడం, వ్యక్తులతో సంభాషించడం జరుగుతుంది. వర్చువల్ రియాలిటీ అంటే కంప్యూటర్ సృష్టించిన పర్యావరణ ప్రపంచం, ఇది వాస్తవమైనదిగా, కనిపించే దృశ్యాలు మరియు వస్తువులతో, వీక్షకులు తమ పరిసరాల్లో లీనమైపోయినట్లు భావించేలా చేస్తుంది. పర్యావరణ దృశ్యాలు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అని పిలువబడే పరికరం ద్వారా గ్రహించబడుతుంది...... స్మార్ట్ ఫోన్ సెట్లలో ఏఆర్ కిట్ మరియు కోర్ వంటి సాప్ట్వేర్ ను పొందు పరుస్తూ స్మార్ట్ ఫోన్ లోనే భౌతిక ప్రపంచాన్ని డిజిటల్ రూపంలో ఇమిడ్చే యాప్ లను అభివృద్ధి చేయడం వల్ల విదేశీ భాషను సొంత భాషలోకి అనువాదం చేసుకోవచ్చు, కొత్త ఫర్నిచర్ కొనేముందు, కుర్చీలు, సోఫాలు, పడకలను ఎలా అమర్చుకోవచ్చో AR ఏప్ లో వీక్షించవచ్చు. AR మరియు VR సాయంతో స్మార్ట్ ఫోన్లు సహాయంతో కావాల్సిన దృశ్యాలను తిలకించి పులకించే సదవకాశం సామాన్యులకు కూడా దక్కడం గమనార్హం. కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయం లో పాఠశాలలు మూతపడ్డ సందర్భంలో ఏఆర్ సాంకేతిక ద్వారా
విద్యాబోధనకు ఎంతగానో తోడ్పాటు అందించడం గమనార్హం. 2030 నాటికి అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఏఆర్, విఆర్ సాంకేతికతను తమ వ్యాపార ప్రణాళికల్లో అంతర్భాగం చేయనున్నాయని PWC ( Price Waterhouse Coopers) సంస్థ అంచనా. సమీప భవిష్యత్తులో AR,VR మరియు AI పరిజ్ఞానాలు దైనందిన మానవ కార్యకలాపాల్లో విడదీయరాని భాగంగా మారిపోనున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడిసి) అంచనా ప్రకారం 2030 నాటికి ఏటా 3 కోట్ల AR మరియు VR సాధనాలు అమ్ముడయ్యే అవకాశం ఉంది.మొబైల్ ఫోన్లను అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు తయారుచేస్తుండగా, AR,VR సెట్ల తయారీని ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అతి కొన్ని సంస్థలు మాత్రమే చేపట్టాయి... ప్రస్తుతం AR మరియు VR సెట్ల పరిజ్ఞానాలు అత్యంత ఖరీదైనవి కావున సగటు వినియోగదారుడికి వెంటనే అందుబాటులోకి రావడం కష్టమే. భవిష్యత్తు లో వీటి ధర తగ్గి, వినియోగ సౌలభ్యం పెరిగితే స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ను AR మరియు VR సెట్లు మార్కెట్ తప్పకుండా అధికమిస్తుంది......... పోలిన రామకృష్ణ భగవాన్.... రాజమండ్రి.
No comments:
Post a Comment