🕉️ ఓం నమః శివాయ 🕉️
🙏 శివాయ గురవే నమః 🙏
*🌹మనలో ఉన్న ఆత్మలింగానికి అభిషేకం🌹
*శివ లింగానికి మీరు అభిషేకం చేసి ఉండొచ్చు , కానీ ఆత్మ లింగానికి అభిషేకం చేశారా?*
*అన్ని లింగాల కంటే ఆత్మలింగం శక్తివంతమైనది. అటువంటి ఆత్మ లింగానికి ప్రతిరోజూ అభిషేకం చేసే గొప్ప అవకాశాన్ని ఈశ్వరుడు మనకు ఇచ్చాడు..ఆ ఆత్మ లింగం ఎక్కడ ఉంది అంటే మన రొమ్ము మధ్య భాగంలో మనం స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకుని ఆ నీటిని పైనుండి రొమ్ము మధ్య భాగంలో పడేటట్లు పోయాలి అలా పోసేటప్పుడు..*
*''ఓం ఆత్మ లింగాయ నమః'' లేదా ''ఓం నమః శివాయ'' అని మనస్సులో స్మరణ చేయండి అంతే, మనం ఆత్మ లింగానికి అభిషేకం చేసినట్లు అవుతుంది.. ఇలా ప్రతి రోజూ మీరు స్నానం చేసేటప్పుడు అభిషేకం చేయండి.. మీ మనసు పవిత్రం అవుతుంది..మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది..*
*ఓం నమః శివాయ*
*అన్ని సంపదల కన్నా ఆత్మ సంపద మిన్న. డబ్బు బంగారం ఇళ్ళు పొలాలు వీటి అన్నిటి కన్నా జ్ఞాన సంపద అంటే ఆత్మ సంపద గొప్పది మహాగొప్పది. ఎందుకంటే మనం ఉన్నా లేకున్నా మనతో పాటు వచ్చేది ఆత్మ సంపద. అంటే జ్ఞాన సంపద. అది ఎంతకీ తరగనిది. ఎంత కావాలంటే అంత పెంచుకొగలిగేది ఆత్మ సంపద.*
*దీనికి ఎలాంటి పన్నులు ఉండవు. దొంగల భయం కానీ నిప్పుభయం కానీ నీరు భయంకానీ ఉండదు కూడా. అటువంటి ఆత్మ సంపదకు ఖర్చు లేదు . శ్రమ అసలేలేదు. నియమాలు అవసరం ఉండవు. అంతటి గొప్పదైన ఆత్మ సంపదకు చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని. అదే శ్వాస మీద ధ్యాస.*
*గొప్ప గొప్ప వారి పుస్తకాలు చదివి అందులోని సారాంశం గ్రహించి గమనించి ఆచరిస్తే చాలు. ఇది ఎవరైనా చేయవచ్చు. ఎక్కడైనా చేయవచ్చు. ఎప్పుడైనా చేయవచ్చు. లాభాలే లాభాలు. పాపాలు పోతాయి. సమస్యలు రావు. రోగాలు ఉండవు. కావున ఆత్మ జ్ఞాన సంపద కన్నా పవిత్రమైనది ఏది ఈ సృష్టిలో లేదు. మరి ఈరోజే మొదలెడదామా! ఇప్పుడే ఇక్కడే ఈ రోజే!..*
🙏🌹🌴🪔🌴🌹🙏
ఓం త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్ ఉర్వారుకమివ బన్ధనాత్ మృత్యోర్ముక్షీ యమామృతాత్
🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏
No comments:
Post a Comment