Thursday, November 28, 2024

 *ఒక కిరాణా షాపువాడు ...తన షాపు కట్టేస్తూ ఉండగా...అక్కడికి ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, డబ్బునోట్లు ఉన్నాయి.*

*షాపువాడు ఆశ్చర్యపోతూనే...*
*లిస్ట్ చదివి సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికందించాడు.*

*అది అక్కడినుంచి కదిలింది.*
*షాపు వాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాపు కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు.*

*కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి, గ్రీన్ లైట్ వెలిగాక రోడ్ క్రాస్ చేసి బస్ స్టాప్ లో నిలబడింది. వస్తున్న బస్సుల నెంబర్లు అన్నీ చదివి తనకి కావలసిన బస్ రాగానే ఎక్కింది.*

*కిరాణా షాపు యజమాని ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు.*

*తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గర దిగి, ఇంటిమెట్ల మీద కిరాణా సామాను పెట్టి కాలెత్తి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నించింది.*

*అది ఎత్తుగా ఉండటం తో అందలేదు. కాళ్ళతో తలుపున కొట్టింది.*

*ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినపడలేదనుకుంట. ఎవరూ వచ్చి తలుపు తీయలేదు.*

*కుక్క ఇంటి పక్కవైపు వెళ్ళి... బెడ్ రూం కిటికీ పైకి ఎక్కింది. కిటికీ తలుపుల్ని తలతో గట్టిగా బాదసాగింది. లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తరువాత క్రిందికి గెంతి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది.*

*షాపువాడు ఈ చర్యలన్నీ నమ్మలేనంత సంబరంతో చూస్తున్నాడు.*

*అప్పుడే నిద్రలోంచి లేచి బయటకొచ్చిన*
*ఇంటియజమాని ఆ కుక్కని బూతులు తిడుతూ కాలితో తన్న సాగాడు.*

*ఆ కిరాణా వాడు చప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి*

*ఏం చేస్తున్నావయ్యా నువ్వు?*
*అసలు బుద్దుందా? ఏమైనా తెలుస్తుందా?*

*ఈ కుక్క అద్బుతమైన తెలివి తేటలు గల కుక్క. సినిమాల్లో అయితే లక్షలు సంపాదించగలదు. అసలిలాంటి తెలివైనకుక్కని ఈ ప్రపంచం లోనే చూడలేం" అన్నాడు చాలా ఉద్వేదంగా.*

*ఆ యజమాని దానికి సమాదానం ఇస్తూ..*

*"ఇది తెలివైందా???*
*ఇది బయటికి వెళ్తున్నప్పుడు...*
*ఇంటి తాళం చెవి తీసుకు వెళ్ళకుండా వెళ్ళి, తిరిగొచ్చి ,పడుకున్న నన్ను డిస్టర్బ్ చేయటం ఈ వారంలో ఇది రెండో సారి" అన్నాడు.*

"*నీతి:* 

*నీకెన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికి /మనిషికి నువ్వు నచ్చకపోతే అవి వృధా.*

*నీలో ఎన్ని మంచి గుణాలున్నా*
 *నీ భర్త గానీ, భార్య గానీ కుటుంబ సభ్యులు గానీ వాటిని గుర్తించకపోతే వృదా"..*
*(ఇంటి వాళ్ళను వదిలేయాలని కాదు)*

*అలా గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ..*
*కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చుని వుండక*

*నీ అవసరం వున్న చోట ...*
*నీ తెలివి తేటలు నీ శక్తి సామర్థ్యములు చూపించి..కీర్తిని గడించి..జీవితంలో ఎదగడం నేర్చుకోండి!*

*డబ్బు...,డాబు ఉన్న కొంతమంది మూర్ఖులు ఇప్పటికీ. వివేకవంతులైన, తెలివిగలవాళ్ళకి...(ఒకవేళ డబ్బు లేకపోతే)...ఇక్కడ కథలోని కుక్క కి (హీనభావం) ఇచ్చిన విలువనే సమాజమిస్తుంది.*

*మిత్రులారా...*
*ఇది నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవాల్సిన..ముఖ్య* *విషయం!..*
*గనుక...*
*మిగతా చుట్టూ ఉన్నవారి సేవను కూడా గుర్తించకుండా కుక్క / హీనభావంతో చూసే  మూర్ఖుల్లారా గుర్తెరగండి...ఇకనైనా కొద్దిగా మారండి!*

*మన పని మనం చేస్తూ పోదాం.... ప్రగల్భాలు... కాలయాపనలూ వద్దు...*

No comments:

Post a Comment