*కర్ణ విలాపం (చెవి గోల).....*
👂🏽🦻👂🏽 🦻🙏🦻 👂🏼🦻👂🏼
*నేను మీ చెవిని👂*
*మేమిద్దరము కవలలము👂👂*
*కానీ మా దురదృష్టమేమిటంటే, ఇప్పటి వరకు మేము ఒకరినొకరు చూసుకోలేదు. ఏ శాపమో తెలియదు మేము ఎడ మొహం పెడ మొహంగా అమర్చబడ్డాము.*
*మా బాధ్యత కేవలము వినడము మాత్రమే. తిట్లు, చప్పట్లు, మంచి, చెడు, అన్నీ మేమ వింటాము.*
*కానీ క్రమ క్రమంగా మమ్మల్ని వస్తువుల్ని వేలాడదీసే ఆధారాలుగా మార్చేశారు. కళ్ళ జోడు బరువును మాపై మోపుతున్నారు. సమస్య కళ్లదైతే, సావు మోత మాకేమిటి?*
*బాల్యంలో చదువుకునేటప్పుడు ఎవరికైనా మెదడు పని చేయకపోతే మాస్టరు గారు మమ్మల్నే మెలేస్తారు.*
*యవ్వనంలో పురుషులు, మహిళలు అందరూ అందమైన జూకాలు, కమ్మలు, లోలకులు మొదలైనవి చేయించుకొని మాపైన వేలాడదీస్తారు. రంద్రాలు చేయడం, రక్తాలు కారడం మాకైతే, పొగడ్తలు మాత్రము ముఖానికి.*
*ఇక అలంకరణ చూడండి.!కండ్లకు కాటుక, ముఖానికి క్రీములు పెదవులకు లిపిస్టిక్, మరి మాపై ఎందుకు వివక్ష?*
*ఎప్పుడైనా ఏ కవి అయినా ఏ శాయరీ అయినా చెవుల గురించి ప్రశంసిస్తూ పొగిడితే చెప్పండి. వారి దృష్టిలో కళ్ళు, పెదవులు, చెంపలు ఇవే సర్వస్వము.*
*కళ్లకు బాధ కలిగితే కన్నీరు కారుస్తాయి. ముక్కుకు బాధకలిగితే చీదుతుంది, నోటికి బాధ కలిగితే అబ్బో, అయ్యో అని మొత్తుకుంటుంది. మరి మాకు బాధ కలిగితే బయటకు తెలియకుండా లొలొపలే భరించాలి.*
*ఇక పోతే పెన్నులు, పెన్సిళ్లు, అగ్గి పుల్లలు, సిగరెట్లు, బీడీలు, ఇలా ఎవరికి కావలసింది వారు మా మీద దాస్తుంటారు.*
*ఇదివరకు హెడ్ ఫోన్లని మాకు మూతలు వేసేవారు, ఇప్పుడు పైత్యం పెరిగి, ఇయర్ ఫోన్లని మాలోపలికి తోసి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏమండీ ఒక్కసారి మీ ముక్కుకు నోరుకు మూతవేసి చూడండి ఎం జరుగుతుందో.*
*మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కరోనా మాయరోగం మా చావుకు వచ్చింది. ముక్కు, మూతి మూసుకోవడానికి వేసుకునే మాస్కులను కూడా మాకే తగిలిస్తున్నారు.*
*మేము చెవులమండీ, చెక్క కొయ్యలం కాదు, ఏది పడితే అది వ్రేలాడెయ్యడానికి.*
*మీకిష్టమొచ్చినట్లు కాకుండా మా పనికి మాత్రమే మమ్మల్ని వాడండి. చెవులే కదా అని చిన్న చూపు చూడకండి. మేం సంయమనం కోల్పోయామంటే మీరు కళ్ళు తిరిగి కింద పడతారు.*
*అందరికి నవ్వుల శుభసాయంకాలం*
👂🏽🦻👂🏽 🦻😁🦻 👂🏼🦻👂🏼
No comments:
Post a Comment